For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

Women Money Habits: మహిళల ఈ అలవాట్లతో ఉన్నదంతా పోయి బికారీ కావాల్సిందే!

మహిళల ఆర్థిక అలవాట్లు వారిని తీవ్రంగా నష్టపరుస్తాయని చెబుతున్నారు. ఆ అలవాట్లు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం.

|

ఈకాలంలో మహిళలు ఆర్థికంగా అన్ని రంగాల్లో ముందున్నారు. ఉద్యోగం చేసే మహిళలు ఆర్థికంగా ఎవరిపైనా ఆధారపడాల్సిన అవసరం లేదు. ఆర్థికంగా తనపై తాను ఆధారపడిన స్త్రీ తనదైన రీతిలో జీవితాన్ని గడపాలని కోరుకుంటుంది. అయితే డబ్బు సంపాదించడం తెలిసిన ప్రతి ఒక్కరికీ ఆ డబ్బును దాచుకోవడం, దానిని పెట్టుబడిగా మార్చడం కూడా తెలియాలని అంటారు ఆర్థిక నిపుణులు.

Money habits of women that make you poor know in Telugu

డబ్బు అలవాట్లు వ్యక్తిగత ఫైనాన్స్ లో కీలకమైన అంశం. ఈ అలవాట్లు ఆర్థిక శ్రేయస్సుపై తీవ్రమైన ప్రభావాన్ని చూపుతాయి. మహిళలైనా, పురుషులైనా మంచి డబ్బు అలవాట్లు కలిగి ఉండాలి. లేకపోతే చేతిలో చిల్లిగవ్వ లేకుండా అవుతుందని సూచిస్తున్నారు నిపుణులు. ముఖ్యంగా మహిళల ఆర్థిక అలవాట్లు వారిని తీవ్రంగా నష్టపరుస్తాయని చెబుతున్నారు. ఆ అలవాట్లు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం.

ఇతరులకు ప్రాధాన్యతనివ్వడం:

ఇతరులకు ప్రాధాన్యతనివ్వడం:

ఆర్థిక ఇబ్బందులకు దారితీసే స్త్రీలలో ఒక సాధారణ అలవాటు ఉంటుంది. అదేమిటంటే.. వారు సొంత ఆర్థిక శ్రేయస్సు గురించి కాకుండా ఇతరుల అవసరాలకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు. వివాహం అయిన మహిళ తాను సంపాదించిన డబ్బును తన భర్త కోసం, పిల్లల కోసం ఎక్కువగా ఖర్చు పెడుతుంది. వారి అవసరాల కంటే తనకేదీ ఎక్కువ కాదని అనుకుంటుంది. అలా తన సొంత అవసరాలను విస్మరించడంతో పాటు పొదుపు కూడా చేయదు. అది భవిష్యత్తులు ఇబ్బందులు తెచ్చి పెట్టవచ్చు.

శక్తికి మించిన ఖర్చులు:

శక్తికి మించిన ఖర్చులు:

ఆర్థిక అస్థిరతకు దారితీసే మరో అలవాటు శక్తికి మించి జీవించడం. చాలా మంది మహిళలు సామాజిక అంచనాలకు అనుగుణంగా బతకాలని భావిస్తారు. బట్టలు, సౌందర్య ఉత్పత్తులు, నగలు, ఇతర వస్తువులు వారి తాహతుకు మించినవైనా సరే వారు కొనేస్తుంటారు. అవి చేతిలో ఉన్న డబ్బులన్నీ అయిపోవడానికి కారణం అవుతాయి లేదంటే అప్పులు చేయాల్సిన పరిస్థితి వస్తుంది.

పూర్తిగా తెలుసుకోకుండా పెట్టే పెట్టుబడులు:

పూర్తిగా తెలుసుకోకుండా పెట్టే పెట్టుబడులు:

డబ్బుకు సంబంధించిన ఏ పని అయినా ఒకటికి రెండు సార్లు ఆలోచించి చేయాలని సూచిస్తుంటారు నిపుణులు. పెట్టుబడుల విషయానికి వస్తే ఇది సరిగ్గా సరిపోతుంది. పెట్టుబడి పెట్టాలన్న ఉద్దేశం మంచిదే అయినా దానికి తగ్గ బ్యాగ్రౌండ్ వర్క్ చేయాలని మర్చిపోవద్దు. మీరెక్కడ పెట్టుబడి పెడుతున్నారు, ఎంత కాలంలో మీ డబ్బు మీకు తిరిగి వస్తుంది, దాని కోసం ఎంత కష్టపడాలి లాంటి విషయాలు ముందే తెలుసుకోవాలి. స్టాక్ మార్కెట్ లాంటి వాటిల్లో పెట్టుబడి పెట్టే ముందు వాటి గురించి పూర్తిగా తెలుసుకోవాలి. లేదంటే చేతిలో చిల్లి గవ్వ కూడా మిగలదు.

ఈ చెడు ఆర్థిక అలవాట్లను నివారించడానికి మహిళలు తమ సొంత ఆర్థిక శ్రేయస్సుకు ప్రాధాన్యత ఇవ్వాలి. వారి భవిష్యత్తు కోసం ఒక ప్రణాళికను రూపొందించుకోవాలి. ఇందులో వాస్తవిక బడ్జెట్ లను సెట్ చేయడం, పదవీ విరమణ కోసం ఆదా చేయడం, ఆస్తుల యొక్క విభిన్న పోర్ట్‌ఫోలియోలో పెట్టుబడి పెట్టడం వంటివి ఉంటాయి. అలాగే మహిళలు తమ వ్యక్తిగత ఫైనాన్స్ గురించి అవగాహన పెంచుకోవాలి. అవసరమైనప్పుడు ఆర్థిక నిపుణుల సలహా తీసుకోవాలి.

English summary

Money habits of women that make you poor know in Telugu

read this to know Money habits of women that make you poor know in Telugu
Story first published:Friday, February 3, 2023, 3:00 [IST]
Desktop Bottom Promotion