For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

Bossism: బాస్ ల మాట తీరు ఇలా ఉంటే.. పని అయినట్టే ఇక

|

Bossism: పని చేయడానికి సామర్థ్యం, నైపుణ్యం కావాలి. కానీ పని చేయించుకోవాలంటే అంతకు మించిన నైపుణ్యాలు ఉండాల్సిందే. పది మందిని ఏక తాటిపైకి తీసుకువచ్చి వారితో సంస్థకు కావాల్సిన పని చేయించుకోవాలంటే పనిలో స్కిల్ ఒక్కటే సరిపోదు. మాటలో మాధుర్యం ఉండాలి. లేకపోయినా ఉన్నట్టుగా మాట్లాడాలి. అవసరమైనప్పుడు కఠినంగా ఉంటూనే... సరైన సందర్భాల్లో మృదువుగానూ వ్యవహరించాలి. ప్రతి సారీ కఠినంగా ఉంటామంటే పని అయితే జరుగుతుంది కానీ అందులో నాణ్యత లోపించే ప్రమాదం ఉంటుంది. అలాగే ఉద్యోగికి పనిపై, సంస్థపై ఇష్టం ఉండదు. బాధ్యతగా వ్యవహరించలేరు. కాబట్టి పని చేసే చోట వాతావరణం ఆహ్లాదకరంగా, అంతే గంభీరంగా ఉండాలని అంటారు.

most demotivating things bosses say in the work place

కొందరు బాస్ లు తాము కఠినంగా ఉంటూనే పని చేయించుకుంటామని అంటూ ఉంటారు. వారు అలా ఉంటేనే పని జరుగుతుందని పొరబడుతూ ఉంటారు. కానీ అది ఎలాంటి ప్రభావం చూపుతుంది అనేది అప్పటికప్పుడు తెలిసేది కాదు. ఇది వారిపై ఎలాంటి ప్రభావం చూపకపోయినా.. ఉద్యోగులపై, సంస్థపై ప్రభావం చూపిస్తుంది. బాస్ లు ఎక్కువగా నిరుత్సాహపరిచే విషయాలు కొన్ని ఇప్పుడు తెలుసుకుందాం..

మంచి నాయకులు తమ మాటలతో అలాగే చర్యలతో ఇతరులకు ఆదర్శంగా నిలుస్తారు. వారు ప్రేక్షకులను లేదా వారి ఉద్యోగుల సమూహాన్ని ఎల్లప్పుడు ఉత్సాహ పరుస్తూ తమకు కావాల్సిన పని చేయించుకుంటారు. అయితే, కొంతమంది ఉన్నతాధికారులు అలాగే బాస్ లు ఎల్లప్పుడూ కఠినంగానే ఉంటారు. ఎంప్లాయ్ పట్ల మద్దతును స్ఫూర్తిదాయకతను కలిగి ఉండరు. వారు ఒక ఉద్యోగిని ఎప్పడూ నిరుత్సాహపరుస్తారు. అలాగే కిందికి లాగేందుకు ప్రయత్నం చేస్తూ ఉంటారు.

ఐ కెన్ అండర్ స్టాండ్ దిస్ బట్..

మీ మేనేజర్ లేదా బాస్.. మీతో మాట్లాడిన ప్రతిసారీ... 'కానీ' అనే పదాన్ని వాడుతున్నారంటే... వారు మీరు చెప్పేది వినడానికి లేదా అర్థం చేసుకోవడానికి ఇష్టపడటం లేదని అర్థం చేసుకోవాలి. మీ అభిప్రాయాన్ని అంగీకరించేందుకు రెడీగా లేరని అనుకోవాలి. ఉద్యోగి కోణం నుండి, బాస్ వారి ఆలోచనను అంగీకరించడానికి సిద్ధంగా లేరనే అర్థం. అలాగే... కానీ అనే పదానికి మీ బాస్ లేదా మేనేజర్ సరైన వివరణ ఇవ్వకపోతే అది కచ్చితంగా నిరుత్సాహపరిచేదనే భావించాలి.

ఈ పనికి 5 నిమిషాలే చాలు.. నువ్వు పూర్తి చేయి

మీ బాస్ 'ఓన్లీ' అనే పదాన్ని నొక్కి చెబుతున్నారు అంటే మీకు ఇచ్చిన పనిని ఒక నిర్దిష్ట సమయంలో పూర్తి చేయాలని భావిస్తున్నట్లు అర్థం చేసుకోవాలి. కానీ అది నిజంగా పొరబాటే. ఎందుకంటే.. నిజంగా 5 నిమిషాల్లోనే పని పూర్తి అవుతుంది అంటే.. ఆ పనిని కచ్చితంగా మీకు చెప్పి ఉండే వారు కాదు. మీకు పని పూర్తి చేయమని చెప్పారంటే.. దానికి కచ్చితంగా ఎక్కువ సమయం పడుతుందనే అర్థం.

కామ్ డౌన్..

శాంతంగా ఉండు అని మనకు ఎవరైనా చెప్పారు అంటే.. అది కొంతైనా బాధిస్తుంది. వారు మనకు గౌరవం ఇవ్వడం లేదనే ఫీలింగ్ కలుగుతుంది. ఒక ఉద్యోగిని అలా చెప్పడం ఎట్టి పరిస్థితుల్లోనూ సరైన మార్గం కాదనే చెప్పాలి. నిజమైన బాస్ ఈ పదజాలాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపయోగించరు. అందుకు బదులుగా వారు ఎంప్లాయిస్ ను అర్థం చేసుకుంటారు. వారి కోణం నుండి ఆలోచిస్తారు. తర్వాత సరైన పరిష్కార మార్గాన్ని అన్వేషిస్తారు.

ఎండ్ ఆఫ్ ది డే..

ఒక పని ఆ రోజులో పూర్తి చేయాలని బాస్ లు చెబుతూ ఉంటారు. ఇలా పదే పదే చెబుతున్నారంటే.. దాని నెగెటివ్ గానే చూడాలి. ఎందుకంటే.. వారు కొత్త సృజనాత్మక ఆలోచనలను వినడానికి కానీ, అర్థం చేసుకోవడానికి కానీ ఇష్టపడటం లేదని అర్థం. ఎదగడానికి అలాగే కొత్త విషయాలు తెలుసుకోవడానికి మరిన్ని ప్రాంతాల కోసం వెతుకుతున్న ఉద్యోగికి ఇది చాలా నిరాశ పరిచే అంశమే అవుతుంది.

బాస్ లేదా మేనేజర్ స్థానంలో ఉన్న వారు తమ కింది స్థాయి ఉద్యోగుల పట్ల కఠినంగా ఉండటం అనేది మానుకోవాలని ప్రతి ఒక్కరూ చెప్పే మాట. ఇది ఎప్పటికీ మంచి పద్ధతి కాదని అంటారు. బాస్ లకు ముఖ్యంగా సంస్థకు చెడు చేసే పనేనని అంటారు. అలాగని ఉద్యోగులతో ఎల్లప్పుడూ ఆహ్లాదంగా ఉండాల్సిన పని లేదని సూచిస్తున్నారు. కొన్ని సందర్భాల్లో గడువు ముగుస్తున్న సమయంలో తీవ్ర ఒత్తిడి ఉంటుంది. అలాంటప్పుడు కొందరిపై బాస్ లు అరుస్తూ ఉంటారు. ఇలాంటి సమయంలోనే తమను తాము కంట్రోల్ చేసుకోవాలి.

English summary

most demotivating things bosses say in the work place

Read on to know the most demotivating things bosses say in the work place
Story first published:Wednesday, July 13, 2022, 18:16 [IST]
Desktop Bottom Promotion