For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

మదర్ థెరిసా 109వ జయంతి వార్షికోత్సవం : ఆమె గురించి కొన్ని ఆసక్తికర విషయాలు..

ఈమె సేవలను అందరికంటే ముందుగానే గుర్తించిన భారత ప్రభుత్వం 1962లోనే ఆమెకు పద్మశ్రీ అవార్డును అందించింది. అనంతరం ఆమెకు మన భారతదేశ అత్యున్నత పురస్కారాలైన 1972లో "అంతర్జాతీయ అవగాహనకు గాను జవహార్ లాల్ నెహ్ర

|

"ప్రార్థించే పెదవుల కన్నా సాయం చేసే చేతులు మిన్న" అన్న నినాదంతోనే విశ్వానికే మాతృమూర్తిగా పేరు గాంచారు మదర్ థెరిసా. మానవత్వానికి మించిన దైవం ఉండదని చాటిచెప్పిన గొప్ప మహిళ మదర్ థెరిసా. అల్బేనియా దేశానికి చెందిన రోమన్ కాథలిక్ సన్యాసిని అయిన ఆమె భారతదేశానికి వచ్చి విశిష్టమైన సేవలు అందించారు. ఆమె సేవలను గుర్తించిన భారత ప్రభుత్వం ఆమెకు మన దేశ అత్యున్నతమైన అవార్డులను ఇచ్చి గౌరవించింది. అలాగే గొప్ప విశ్వమాత యొక్క 109వ జయంతి వార్షికోత్సవం అయిన ఈరోజు ఆమె గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలను తెలుసుకుందాం.

1910లో మాసిదోనియాలో అల్బేనియా నికోల్, డ్రానా దంపతులకు మదర్ థెరిసా జన్మించారు. తన 18 సంవత్సరాల వయసులోనే ఐర్లాండ్ దేశానికి వెళ్లారు. అనంతరం భారతదేశానికి వచ్చారు. మన దేశంలోనే ఎక్కువ కాలం జీవించడంతో ఆమెకు 1951లో మన దేశ పౌరసత్వం లభించింది. విదేశాల్లో పుట్టి పెరిగిన ఆమె మన దేశంలోని ప్రసిద్ధ నగరం కోల్ కత్తాలో స్థిరపడింది. అనారోగ్యంతో బాధపడుతున్న వారిని చేరదీసి అక్కున చేర్చుకుంది. తల్లిదండ్రుల రోగాలు తమకెక్కడ తగులుతాయో అని కుటుంబసభ్యులు రోడ్డున పడేసిన అభాగ్యులకు ఆమె ఆరాధ్య దేవతగా మారారు. ఆమె పుణ్యమా అని చాలా మంది కోలుకున్నారు. కొందరికి బతికే అవకాశం లేదని తెలిసి, చివరి రోజుల్లో మదర్ థెరిసా సపర్యలతో ఆ బాధల్ని సైతం మరచిపోయారు మరికొందరు అభాగ్యులు.

Mother Teresas 109th Birth Anniversary

వాటికన్ సిటీ తమ మరణం తర్వాత కొన్ని అద్భుతాలను చేసే వారిని "'సెయింట్"గా ప్రకటిస్తుంది. సెయింట్ అవ్వాలంటే కనీసం రెండు అద్భుతాలైనా జరగాలి. అప్పుడే వారు దేవత స్థానాన్ని పొందుతారు. బెంగాలీలో నివాసముంటున్న ఓ గిరిజన మహిళ కణతితో బాధపడుతుండేది. ఈ సందర్భంగా ఆమెకు ఎవరో థెరిసాకు సంబంధించిన లాకెట్ వేసుకోమన్నారు. అది వేసుకున్న కొద్ది రోజులకే కణతి మాయమైపోయింది. థెరిసాకు చేసిన ప్రార్థనల వల్లే తనకు కణతి పూర్తిగా నయమైపోయిందని చెప్పినా చాలా మంది నమ్మలేదు. స్కాన్ చేసి చూస్తే నిజంగానే ఆ కణతి లేదు. ఇంకోసారి బ్రెజిల్ కు చెందిన ఓ వ్యక్తి మెదడుకు సంబంధించిన వ్యాధితో బాధపడుతున్న సమయంలోనూ థెరిసా తన దివ్యశక్తితో నయం చేయడాన్ని అద్భుతంగా గుర్తించి మదర్ థెరిసాను సెయింట్ గా గుర్తించినట్టు వాటికన్ సిటీ ప్రకటించింది.

ప్రాణాంతక వ్యాధులతో బాధపడుతున్న వారి సంరక్షణ కోసం ఆశ్రమాలు, హెచ్ ఐవి, ఎయిడ్స్ వంటి రోగులకు, కుష్టు, క్షయ వ్యాధిగ్రస్తులకు ఆవాసాలు, ఆహార కేంద్రాలు, పాఠశాలలను సైతం ఏర్పాటు చేశారు. ఈమె సేవలను అందరికంటే ముందుగానే గుర్తించిన భారత ప్రభుత్వం 1962లోనే ఆమెకు పద్మశ్రీ అవార్డును అందించింది. అనంతరం ఆమెకు మన భారతదేశ అత్యున్నత పురస్కారాలైన 1972లో "అంతర్జాతీయ అవగాహనకు గాను జవహార్ లాల్ నెహ్రూ అవార్డు" 1980లో ఏకంగా "భారతరత్న" అవార్డును సైతం మదర్ థెరిసా అందుకున్నారు. వీటితో పాటు 1979లో ఆమె నోబెల్ బహుమతి కూడా లభించింది.

అనంతరం 1997, సెప్టెంబర్ 5వ తేదీన మదర్ థెరిసా (87) ఏళ్ల వయసులో గుండెపోటు కారణంగా ఆమె మరణించారు. ఆమె చనిపోయే నాటికి మదర్ థెరిసా మిషనరీస్ ఆఫ్ ఛారిటీ 4,000 సన్యాసినులు, 300 మంది అనుబంధ సోదర సభ్యులు, లక్ష మందికి పైగా సాధారణ కార్యకర్తలతో పాటు 123 దేశాలలో 610 శాఖలుగా ఉన్నట్లు గణాంకాల ద్వారా తెలుస్తోంది.

అనంతరం 2003లో అప్పటి పోప్ జాన్ పాల్ "పరమ పావని"గా బీటిఫికేషన్ చేశారు. రోమన్ క్యాథలిక్ లలో సెయింట్ గా ప్రకటించడానికి ముందు సదరు వ్యక్తిని బీటిఫికేషన్ చేస్తారు. అంటే పవిత్ర మూర్తిగా గుర్తిస్తారు. ఈ విషయం తెలుసుకున్న అప్పటి పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ మిషనరీస్ ఆఫ్ చారిటీకి అభినందనలు తెలిపారు. అంతేకాదు మదర్ థెరిసాను 2016లో "మహిమన్విత మహిళ"గా సైతం గుర్తించారు.

English summary

Mother Teresa's 109th Birth Anniversary: Interesting Facts About The Missionary

They have also set up shelters, food centers and schools for patients with leprosy, tuberculosis, tuberculosis, as well as hospitals for the care of people with life-threatening diseases. She was awarded the Padma Shri award in 1962 by the Government of India. She was later awarded Mother India Teresa in 1980 with the India's highest award, the "Jawaharlal Nehru Award for International Awareness" and the "Bharat Ratna" in 1980.
Desktop Bottom Promotion