For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

National Doctor's Day 2021:కరోనాపై పోరులో గెలిచిన డాక్టర్ల గురించి తెలుసుకుందామా...

|

డాక్టర్ కరోనా ఫైటర్..
డాక్టర్ కోవిద్ విన్నర్..
డాక్టర్ అంటే రోగానికి డర్..
డాక్టర్ దగ్గరికి వెళ్తే రోగాలన్నీ బే హుజుర్..
డాక్టర్ తో మనకు కేర్..
ఏ వ్యాధి గురించైనా చెప్పే బ్రౌజర్..
ఒక్క మాటలో చెప్పాలంటే ఈ భూమి మీద నిజమైన హీరో ఒక్క డాక్టర్..

ఈ భూమి మీద ప్రతి ఒక్క రంగానికి ఓ సమయం.. సందర్భం అనేది కచ్చితంగా ఉంటుంది. ప్రతి ఒక్కరు తమ పని వేళల్లో పనిని హాయిగా పని చేసుకుంటారు. కానీ కొందరికి మాత్రం సమయం అనేది ప్రత్యేకంగా ఏమీ ఉండదు.

అలాంటి వాటిలో వైద్య రంగం ముందంజలో ఉంటుంది. మనకు ఏ చిన్న ఆరోగ్య సమస్య వచ్చినా వెంటనే డాక్టర్ దగ్గరికి వెళ్తాం. అలాంటి సమయంలో డాక్టర్స్ మన రోగాలను వారు కచ్చితంగా నయం చేస్తారు. అయితే వైద్యులు మన ప్రాణాల్ని నిలబెట్టడమే కాదు.. అంతకన్నా ఎక్కువ పనే చేస్తారు.

ముందుగా రోగి యొక్క మానసిక స్థితిని బట్టి, మన ప్రవర్తనకు తగ్గట్టు వ్యవహరిస్తారు. మనకు ఎలాంటి బాధ కలగకుండా మనకు చికిత్స అందించేందుకు శతవిధాలా ప్రయత్నిస్తారు. మనం వ్యాధి నుండి త్వరగా కోలుకునేలా చేస్తారు. ఒకవేళ మనం వ్యాధి నుండి బయటపడలేని స్థితిలో ఉంటే, మిగిలిన జీవితాన్ని హాయిగా గడిపేందుకు వారి వంతు ప్రయత్నం చేస్తారు. అలాంటి వైద్యులందరికీ మనం డాక్టర్స్ డే రోజున ధన్యవాదాలు తెలుపుకుందాం... ఈ సందర్భంగా జాతీయ వైద్యుల దినోత్సవం జరుపుకోవడం వెనుక ఉన్న ముఖ్య ఉద్దేశ్యం ఏంటి.. డాక్టర్స్ డే హిస్టరీ, ప్రాముఖ్యత గురించి ఇప్పుడు తెలుసుకుందాం...

National Doctor's Day 2021: డాక్టర్స్ డే ఎందుకు జరుపుకుంటారో తెలుసా...National Doctor's Day 2021: డాక్టర్స్ డే ఎందుకు జరుపుకుంటారో తెలుసా...

దేవుడితో సమానంగా..

దేవుడితో సమానంగా..

మన దేశంలో వైద్యులను దేవుడితో సమానంగా భావిస్తారు. తల్లిదండ్రులు మనకు జన్మనిస్తే.. డాక్టర్లు మనకు పునర్జన్మను ఇస్తారు. ప్రస్తుతం కరోనా మహమ్మారి ప్రపంచాన్ని అతలాకుతలం చేస్తుంటే.. ఆ కరోనా భూతాన్ని తరిమికొట్టేందుకు వైద్యులే ముందుండి పోరాటం చేస్తున్నారు. కొందరు ఇదే సమయంలో ప్రాణాలర్పించారు.

చిరునవ్వుతో..

చిరునవ్వుతో..

మనల్ని కరోనా బారి నుండి కాపాడటానికి తమ ప్రాణాలను అడ్డుగా పెట్టి.. తాము అనారోగ్యం బారిన పడతామని తెలిసినా.. మనకు వైద్యం అందించి.. మాస్కుల వెనుక ముఖం వాడిపోతున్నా.. పిపిఇ కిట్లతో శరీరమంతా ఉక్కపోస్తున్నా.. తమ పని పట్ల అంకితభావంతో కరోనా రోగులకు వైద్యం అందించి చిరునవ్వుతో ఇంటికి పంపుతున్నారు.

నేషనల్ డాక్టర్స్ డే చరిత్ర..

నేషనల్ డాక్టర్స్ డే చరిత్ర..

పశ్చిమ బెంగాల్ కు చెందిన మాజీ ముఖ్యమంత్రి, డాక్టర్ బిధన్ చంద్ర రాయ్ జ్ణాపకార్థం జులై 1వ తేదీన జాతీయ వైద్యుల దినోత్సవం(National Doctor's Day)గా జరుపుకోవాలని, 1991 సంవత్సరంలో కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఆయన ఒక గొప్ప వైద్యుడు, విద్యావేత్త మరియు స్వాతంత్ర్య ఉద్యమంలో పాల్గొన్న సమరయోధుడు. శాసనోల్లంఘన ఉద్యమంలో కూడా ఆయన కీలక పాత్ర పోషించారు. ఆయనను ప్రతి స్మరించేందుకు గుర్తుగా, జాతీయ వైద్యుల దినోత్సవంగా పాటించాలని ఆ రాష్ట్ర ప్రభుత్వం కేంద్రాన్ని కోరింది.

National Doctors Day 2021 : కరోనా వారియర్స్ ను ఈ కోట్స్ తో విష్ చేద్దాం...National Doctors Day 2021 : కరోనా వారియర్స్ ను ఈ కోట్స్ తో విష్ చేద్దాం...

‘మన్ కీ బాత్’లో మోడీ..

‘మన్ కీ బాత్’లో మోడీ..

అప్పటి నుండి ప్రతి ఏటా జులై 1వ తేదీన జాతీయ వైద్యుల దినోత్సవంగా పాటిస్తారు. నేషనల్ డాక్టర్స్ డే థీమ్.. ఈ నేషనల్ డాక్టర్స్ డే దినోత్సవాన్ని అంతర్జాతీయ వైద్య సంఘం(IMA) నిర్వహిస్తుంది. ప్రతి సంవత్సరం జాతీయ వైద్యుల దినోత్సవం ఒక థీమ్ ను నిర్ణయించుకుంటుంది. గత ఏడాది ‘COVID-19' మరణాలను తగ్గించండి. కోవిద్-19 కు సంబంధించిన థీమ్ ను నిర్ణయించారు. గత సంవత్సరం ‘వైద్యులు మరియు క్లినికల్ సంస్థలపై హింసను జీరో టాలరెన్స్'గా నిర్ణయించారు. ఈ ఏడాది ‘మన్ కీ బాత్' కార్యక్రమంలో ప్రధానమంత్రి మోడీ కరోనా మహమ్మరి సమయంలో వైద్యులు మరియు కరోనా యోధులు చేసిన క్రుషిని కొనియాడారు. కోవిద్-19 ఎదుర్కొంటున్న సవాళ్లకు భారతదేశం లొంగలేదని నిర్ధారించిన వైద్యులకు దేశం తన నివాళులు అర్పించాలని ఆయన కోరారు. ఈ నేపథ్యంలో జులై 1వ తేదీన మధ్యాహ్నం 3 గంటలకు డాక్టర్లనుద్దేశించి మాట్లాడనున్నారు.

నేషనల్ డాక్టర్స్ డే ప్రాముఖ్యత..

నేషనల్ డాక్టర్స్ డే ప్రాముఖ్యత..

సమాజంలో వైద్యుల సహకారాన్ని గుర్తించడం మరియు వారికి గౌరవం ఇవ్వడం ప్రస్తుతం మన ముందు ఉన్న లక్ష్యం. దీని వల్ల వైద్యులు మరియు ఇతర ఆరోగ్య సంరక్షణ కార్యకర్తలు క్లిష్ట పరిస్థితుల్లో పోరాటానికి ప్రోత్సాహం లభిస్తుంది. వైద్య నిపుణులు తమ బాధ్యతలను అంకితభావంతో నెరవేర్చడానికి ప్రోత్సాహం లభిస్తుంది. ఈ రోజున ప్రజలలో వైద్యులపై మరింత అవగాహన పెంచడానికి అనేక కార్యక్రమాలు నిర్వహిస్తారు. ఈరోజు చాలా చోట్ల ఉచిత వైద్య శిబిరాలు కూడా నిర్వహించబడతాయి. ఈ ఏడాది కరోనా రెండు, మూడో దశలు ఉండటం వల్ల, ఈరోజు ప్రతి ఏటా ఉండే కార్యక్రమాలు ఉండకపోవచ్చు. అయితే డాక్టర్స్ డే సందర్భంగా వర్చువల్ సమావేశాలు నిర్వహించబడతాయి.

English summary

National Doctor's Day 2021: Know Date, History and Significance in Telugu

Here we are talking about the National Doctor's Day 2021: Know date, history and significance in Telugu. Read on
Story first published: Thursday, July 1, 2021, 7:00 [IST]