For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

జాతీయ చేనేత దినోత్సవం ఎందుకు జరుపుకుంటారో తెలుసా...

జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా, దీని చరిత్ర, ప్రాముఖ్యత గురించి తెలుసుకుందాం.

|

భారతదేశ సాంస్కృతిక వారసత్వానికి ప్రధానమైన చిహ్నలలో చేనేత రంగం ఒకటి. ఇది చాలా మందికి ముఖ్యమైన జీవన ఉపాధిగా నిలుస్తోంది.

National Handloom Day 2020: History, significance and celebration amid pandemic

ముఖ్యంగా ఈ చేనేత రంగంలో 70 శాతం మంది కార్మికులు లేదా అనుబంధ కార్మికులు ఉన్నారు.

National Handloom Day 2020: History, significance and celebration amid pandemic

అయితే చేనేతలు మన దేశంలో ఎప్పటికీ ఎదగలేకపోతున్నారని, నిరాశకు గురవుతున్నారని గుర్తించిన కేంద్ర ప్రభుత్వం వారికి ఆర్థికంగా ప్రోత్సాహం కల్పించేందుకు..

National Handloom Day 2020: History, significance and celebration amid pandemic

వారు సమాజానికి చేసిన సహకారాన్ని గుర్తించడానికి, ప్రతి సంవత్సరం ఆగస్టు 7వ తేదీన చేనేత వారసత్వాన్ని కాపాడటానికి, ఈ రంగంలోని కార్మికులను శక్తివంతం చేయాలనే సంకల్పంతో, వారికి ఈరోజును అంకితమిచ్చారు.

National Handloom Day 2020: History, significance and celebration amid pandemic

ఈరోజు స్వదేశీ ఉద్యమాన్ని స్మరించుకునే రోజుగా జరుపుకుంటారు. ఈ ఉద్యమం 1905లో ఇదే తేదీన ప్రారంభమైంది. ప్రస్తుత జనరేషన్ వారికి చేనేత రంగంపై అవగాహన కల్పించేందుకు కూడా ఈ దినోత్సవం ఉపయోగపడుతుందనే ఉద్దేశ్యంతో,2015లో ప్రధాని మోడీ చెన్నైలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా చేనేత రంగం యొక్క చరిత్ర మరియు ప్రాముఖ్యత గురించి తెలుసుకుందాం...

సోషల్ మీడియాలో..

సోషల్ మీడియాలో..

ఈ సంవత్సరం కరోనా కారణంగా చేనేత దినోత్సవ వేడుకలను సోషల్ మీడియా ద్వారా జరుపుకోవాలని కేంద్రం నిర్ణయించింది. కేంద్ర మంత్రులు, లెఫ్టినెంట్ గవర్నర్లు, ముఖ్యమంత్రులు, పార్లమెంటు సభ్యులతో పాటు ప్రముఖ పరిశ్రమలు తమ సోషల్ మీడియా అకౌంట్ల ద్వారా చేనేత సంఘాలకు సంఘీభావం తెలపాలని నిర్ణయించింది.

ఎగ్జిబిషన్ లేదని..

ఎగ్జిబిషన్ లేదని..

కరోనా మహమ్మారి కారణంగా చేనేత వస్త్రాల ప్రదర్శన లేదా చేనేత మేళా వంటి సాంప్రదాయ కార్యక్రమాన్ని నిర్వహించేమని కేంద్రం స్పష్టం చేసింది. అయితే చేనేత కార్మికులు నిరాశ పడొద్దని, వారు నిరుత్సాహపడకుండా, తమ ఉత్పత్తులను ఆన్ లైనులో విక్రయించే అవకాశాన్ని కల్పించాలని మంత్రిత్వ శాఖ నిర్ణయించింది.

వర్చువల్ ఫెయిర్..

వర్చువల్ ఫెయిర్..

‘ఆత్మ నిర్భర్ భారత్' పథకానికి కూడా ప్రోత్సాహాన్నిచ్చే ఒక దశలో, చేనేత ఎగుమతి ప్రమోషన్ కౌన్సిల్ వర్చువల్ ఫెయిర్ ను నిర్వహిస్తుంది. ఇందులో దేశవ్యాప్తంగా 150 మందికి పైగా చేనేత కార్మికులు పాల్గొంటారు.

ఈ తేదీలలో

ఈ తేదీలలో

ఇండియన్ టెక్స్ టైల్ స్కోరింగ్ ఫెయిర్ అని పిలువబడే వర్చువల్ ఫెయిర్ ఆగస్టు 7, 10, 11వ తేదీలలో ఓపెన్ చేయనున్నారు. ఇందులో అంతర్జాతీయ కొనుగోలుదారులు కూడా పాల్గొంటారు.

‘నా చేనేత పోర్టల్’

‘నా చేనేత పోర్టల్’

చేనేతల కోసం వర్చువల్ ఫెయిర్ ఒక్కటే కాదు.. చేనేతల మార్క్ పథకం కోసం ఒక యాప్ మరియు కొత్త వెబ్ సైట్ కూడా ప్రారంభించనున్నారు. దీనికి ‘నా చేనేత పోర్టల్'కూడా ప్రారంభించనున్నారు.

దేశానికి ప్రతీకగా చేనేత వస్త్రాలు..

దేశానికి ప్రతీకగా చేనేత వస్త్రాలు..

మన చేనేత వస్త్రాలకు దేశవ్యాప్తంగా మంచి డిమాండ్ ఉంది. చేనేత వస్త్రాలు 18వ శతాబ్దం నుండే అందుబాటులో ఉన్నాయి. ఇవి రాజకీయ మరియు దౌత్యపరమైన సంబంధాలకు కూడా బాగా ఉపయోగపడుతున్నాయి. అందులో భాగంగా 2015లో అమెరికా మాజీ అధ్యక్షుడు ఒబామా భార్య మిచెల్ ఒబామా.. 2017లో ఇవాంకా ట్రంప్ కు చేనేత వస్త్రాలనే బహుమతిగా ఇచ్చారు.

ఫ్యాషన్ షోలలో కూడా..

ఫ్యాషన్ షోలలో కూడా..

ఇంతకుముందు ఫ్యాషన్ షోలలో కేవలం విదేశీ వస్త్రాల గురించే ప్రచారం చేసేవారు. అయితే ఇప్పుడు ప్రత్యేకంగా చేనేత వస్త్రాలపై ఎక్కువ ఫోకస్ పెడుతున్నారు. ఇటీవల కాలంలో హైదరాబాద్ వంటి ప్రాంతాల్లో జరుగుతున్న ఫ్యాషన్ షోలలో నేతన్నలతో రూపొందించిన వస్త్రాల శైలిని ప్రదర్శించడం అందుకు ఉదాహరణగా చెప్పొచ్చు. ఇప్పుడు మన చేనేత కళాకారులు కూడా ఆధునిక శైలితో పోటీ పడే విధంగా ఈ షోలు ప్రోత్సాహాన్ని ఇస్తున్నాయి.

లాక్ డౌన్ ప్రభావం..

లాక్ డౌన్ ప్రభావం..

మరోవైపు కరోనా మహమ్మారి, లాక్ డౌన్ ప్రభావం చేనేత కార్మికులపైనా తీవ్రంగానే పడింది. లాక్ డౌన్ కారణంగా చేనేత కార్మికులు పూర్తిగా డీలా పడిపోయారు. లాక్ డౌన్ తర్వాత పరిస్థితులు ఎలా ఉంటాయో ఎవ్వరికీ తెలియదు.

English summary

National Handloom Day 2020: History, significance and celebration amid pandemic

Here we talking about national handloom day 2020:history, significance and celebration amid pandemic. Read on
Desktop Bottom Promotion