For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

అటల్ బిహారీ వాజ్ పేయి తొలి వర్ధంతి వార్షికోత్సవం : ఆయన గురించి కొన్ని వాస్తవాలు

|

మాజీ ప్రధాని, దివంగత నేత, భారతరత్న అటల్ బిహారీ వాజ్ పేయి తొలి వర్థంతి సందర్భంగా శుక్రవారం రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ ప్రధాని నరేంద్రమోడీ, బిజెపి శ్రేణులు ఆయనకు ఘన నివాళులు అర్పించారు. వాజ్ పేయీ కూతురు నమితా భట్టాచార్యతో పాటు ఆయన మనవరాలు నిహారిక కూడా శ్రద్ధాంజలి ఘటించారు. వారితో పాటు కేంద్ర హోం మంత్రి అమిత్ షా, బిజెపి జాతీయ అధ్యక్షులు జెపీ నడ్డా తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

Atal Bihari Vajpayee

బిజెపి వ్యవస్థాపక సభ్యుల్లో ఒకరైన భారతరత్న వాజ్ పేయీ గత ఏడాది ఆగస్టు 16న అనారోగ్యంతో తుదిశ్వాస విడిచారు. తన పార్టీలో చేరినప్పటి నుండి పార్టీ నిర్మాణంలో ఆయన పోషించిన పాత్ర మరువలేనిది. ఆయన 1998 నుండి 2004 వరకు భారత ప్రధానమంత్రిగా సేవలందించారు. ఆయన జయంతి డిసెంబర్ 25వ తేదీన సుపరిపాలన దినోత్సవంగా కేంద్రం ప్రకటించింది.

Atal Bihari Vajpayee

భారత దేశ రాజకీయ చరిత్రలోనే అటల్ బిహారీ వాజ్ పేయి రెండు సీట్ల పార్టీని అధికార పార్టీగా మలచిన అపర చాణుక్యుడు. రాజకీయాల్లో తనకంటూ ప్రత్యేక స్థానాన్ని పదిలంగా సుస్థిరపరచుకున్న నేత. ప్రతిపక్షాల విమర్శలకు అంతే స్థాయిలో సమాధానాలు వారి చేతే శభాష్ అనిపించుకునేవారు. దాయాది దేశం పాకిస్థాన్ తో యుద్ధ వాతావరణం సమయంలో తనదైన శైలిలో మాటల తూటాలు వదిలారు. పాకిస్థాన్ దేశంలో ఓ ప్రముఖ నేత రెండు చేతులు కలిస్తేనే చప్పట్లు వస్తాయి. ఒక చేత్తో ఏమి చేయలేరని అంటే అందుకు వాజ్ పేయి బదులిస్తూ రెండు చేతులు కలిస్తే చప్పట్లు వస్తాయనేది నిజమే కానీ ఒక చేత్తో కనీసం చిటికెలైనా వేయొచ్చని ధీటుగా బదులిచ్చారు.

Atal Bihari Vajpayee

అటల్ బిహారీ ప్రస్థానం..

వాజ్ పేయీ మధ్యప్రదేశ్ రాష్ట్రం గ్వాలియర్లో 1924 డిసెంబర్ 25వ తేదీన క్రిష్ణదేవి, క్రిష్ణబిహారీ వాజ్ పేయీలకు జన్మించారు. ఆయన తండ్రి ప్రధానోపాధ్యాయులు. దీంతో వాజ్ పేయీ ప్రాథమిక విద్య అంతా గ్వాలియర్ లోని సరస్వతి శిశు మందిరంలోనే సాగింది. అనంతరం అక్కడే విక్టోరియా కళాశాలలో గ్రాడ్యుయేట్ పట్టా పొందారు. అనంతరం కాన్పూర్ వెళ్లిన ఆయన ఎంఏ పొలిటికల్ సైన్స్ చేశారు. 1939లో ఆర్ ఎస్ ఎస్ లో చేరారు. 1944 నుండి ఆర్ ఎస్ ఎస్ లో పూర్తి స్థాయి కార్యకర్తగా ఎదిగారు. ఆర్య సమాజ్ కు 1944లో జనరల్ సెక్రటరీగా పనిచేసిన ఆయన విభజన అల్లర్లు కారణంగా విద్యకు మధ్యలోనే స్వస్తి చెప్పారు. అనంతరం ఉత్తరప్రదేశ్ లోని కొన్ని పత్రికల్లో పనిచేశారు. 1975 ఇందిరాగాంధీ ఎమర్జెన్సీ టైమ్ లో వాజ్ పేయీ కొందరు ప్రతిపక్ష నేతలతో కలిసి జైలుకు కూడా వెళ్లి వచ్చారు.

Atal Bihari Vajpayee

బిజెపి అగ్రనేత అద్వానీతో కలిసి 1980లో ఏప్రిల్ 6వ తేదీన బిజెపిని స్థాపించారు. అప్పుడు తొలి అధ్యక్షుడిగా ఆయనే ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. తొలి రోజుల్లో రెండు సీట్లకే పరిమితం అయిన 1996 సాధారణ ఎన్నికలు వచ్చేసరికి ప్రభుత్వం ఏర్పాటు చేసే స్థాయికి తీసుకెళ్లిన ఘనత వాజ్ పేయీ, అద్వానీలదే. అప్పట్లో తొలిసారిగా కాంగ్రెసేత ప్రధానమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు.

Atal Bihari Vajpayee

అనేక నాటకీయ పరిణామాల మధ్య 1999 సంవత్సరంలో ముచ్చటగా మూడోసారి ప్రధాని పీఠాన్ని కైవశం చేసుకున్నారు. 2000లో ఆయన ఎన్నో ప్రతిష్టాత్మక సంస్కరణలు తీసుకొచ్చారు. వాటి ఫలాలే నేడు మనం అనుభవిస్తున్నాం. అవి దేశానికి ఎంతగానో మేలు చేశాయి.ఆయన హయాంలో ఇండియా సక్సెస్ గ్రోత్ ఎంతగానో మెరుగుపడింది.

Atal Bihari Vajpayee

ఇలా ఆయన గురించి చెప్పుకుంటూ పోతే చెప్పాల్సింది చాలానే ఉంటుంది. ఆయన గురించి ఒక్క మాటలో చెప్పాలంటే అందరినీ నవ్వించడంలో ఆయనకు ఆయనే సాటి. ప్రసంగాల మధ్యలో కవితల్ని కలగలపి అందరితో ఔరా అనిపించుకోవడంలో ఆయనకు ఎవరూ లేరు పోటీ.. ఆయన వాగ్ధాటిని చూసిన అప్పటి ప్రధాని నెహ్రు ఓ సందర్భంలో భవిష్యత్తులో అటల్ జీ ప్రధాని అవుతారని జోస్యం చెప్పారట.

Atal Bihari Vajpayee

వాజ్ పేయి తమకున్న అభిమానాన్ని బిజెపి తమదైన శైలిలో చాటుకుంది. ఆయన పుట్టినరోజును సుపరిపాలన దినోత్సవంగా ప్రకటించింది మోడీ ప్రభుత్వం. ఆయన చేసిన సేవలను గుర్తించి 2015లో భారత రత్న అవార్డుతో సత్కరించింది. ఆయన మధ్య లేకపోయినా ఆయన ఆశయాలు ఇప్పటికే మన మధ్య సజీవంగానే ఉన్నాయి.

Atal Bihari Vajpayee

English summary

On Atal Bihari Vajpayee’s 1st Death Anniversary: Inspirational Quotes And Lesser Known Facts

Atal Bihari Vajpayee is the only two-party party in the political history of India. A leader who has cemented himself to be a specialist in politics. The cousin left the country in his own style during the war with Pakistan.Applause comes only when a leading leader meets both hands. It is true that what can be done with one hand means that it is possible to clap two hands together while Vajpayee replied, but with one hand, at least a little bit.
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Boldsky sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Boldsky website. However, you can change your cookie settings at any time. Learn more