For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

సినిమా థియేటర్ కు వెళ్దామనుకుంటున్నారా? అయితే ఈ విషయాలు మీకోసమే...

|

ఇప్పుడిప్పుడే కరోనా మహమ్మారి గురించి తక్కువ వార్తలు వినిపిస్తున్నాయి. కరోనా వ్యాక్సిన్ కూడా అందుబాటులోకొచ్చినట్లు తీపి కబుర్లు కూడా వచ్చేశాయి. ఈ నేపథ్యంలోనే సంక్రాంతి పండుగ సంబరాలు ముగిశాయి. కనుమ పండుగ కూడా వచ్చేసింది. ఇదే సమయంలో సినిమా థియేటర్లు కూడా పూర్తిగా తెరచుకున్నాయి. దీంతో చాలా మంది తమ అభిమాన హీరోల సినిమాలను థియేటర్లను చూడాలని ఆరాటపడుతూ ఉంటారు.

అభిమానుల అంచనాలకు తగ్గట్టే పెద్ద హీరోలు కూడా తమ సినిమాలను థియేటర్లలో విడుదల చేసేస్తున్నారు. దీంతో చాలా మంది పెద్ద పెద్ద మాల్స్ లో, సినిమా థియేటర్లలో, ఐమ్యాక్స్ వంటి పెద్ద పెద్ద స్క్రీన్లపై తమ అభిమాన హీరో, హీరోయిన్లను చూడాలని ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. మరికొంతమంది చాలా రోజుల తర్వాత థియేటర్లో సినిమా చూసే అనుభూతిని పొందాలని కోరుకుంటూ ఉంటారు. అయితే ఇలాంటి వారంతా కరోనా నివారణ జాగ్రత్తలు పాటిస్తూ వెళితే.. ఎవ్వరికీ ఎలాంటి సమస్యా ఉండదు. ఇంతకీ సినిమా థియేటర్ కు వెళ్లాక ఏమి చేయాలి.. ఏమి చేయకూడదు.. ఎలాంటి భద్రతా చర్యలు తీసుకోవాలి అనే వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం...

దూరాన్ని పాటించండి..

దూరాన్ని పాటించండి..

మీరు వెళ్లే థియేటర్లో కేవలం 50 శాతమే సీట్లను భర్తీ చేయాలని కేంద్ర ప్రభుత్వం స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. కాబట్టి సినిమా హాలులోకి వెళ్లిన ప్రతి ఒక్కరూ ఒక సీటు నుండి మరొక సీటు గ్యాప్ ఉండేలా చూసుకోండి. అలాగే టికెట్లు తీసుకునే సమయంలో.. సినిమా గేటులో నుండి వెళ్లేటప్పుడు కూడా కనీసం రెండు అడుగుల దూరం పాటించాలి.

శానిటైజర్ వాడండి..

శానిటైజర్ వాడండి..

మీరు సినిమా చూడటానికి థియేటర్ లేదా మాల్‌కు వెళ్ళినప్పుడు మీతో శానిటైజర్ తీసుకెళ్లండి. థియేటర్‌లోని ఏదైనా ప్రాంతాన్ని తాకిన వెంటనే శానిటైజర్‌తో చేతులు కడుక్కోవాలి. అలాగే మీరు కూర్చునే సీటుపై కూడా శానిటైజ్ చేశారో చూసుకోండి.

ముక్కు లేదా కళ్ళను తాకవద్దు

ముక్కు లేదా కళ్ళను తాకవద్దు

థియేటర్‌లో చాలా మంది ఉపయోగించే ప్రాంతాన్ని తాకవద్దు. శానిటైజర్ వాడకుండా ముక్కు, ముఖం లేదా కళ్ళను అస్సలు తాకకండి. వీలైనంత వరకు ముఖాన్ని తాకడం మానుకోండి. ఎందుకంటే ఇలా చేయడం వల్ల కరోనా వేగంగా వ్యాపించే అవకాశం ఎక్కువగా ఉంది. కాబట్టి పొరపాటున కూడా ఇలాంటి తప్పులు చేయకండి.

మాస్క్ ధరించండి.

మాస్క్ ధరించండి.

ప్రధానంగా థియేటర్‌కి వెళ్లేటప్పుడు మాస్కును తప్పనిసరిగా ధరించాలి. దీని వల్ల మీరు కరోనా బారిన పడకుండా ఉండేందుకు ఉపయోగపడుతుంది. థియేటర్లోకి మరియు హాలులోకి ప్రవేశించినప్పటి నుండి బయటకు వెళ్లే వరకు ఎట్టి పరిస్థితుల్లో మాస్కులను తీయకండి.

మీ స్మార్ట్ ఫోనులో

మీ స్మార్ట్ ఫోనులో

మీ స్మార్ట్ ఫోనులో ఆరోగ్య సేతు యాప్ ను డౌన్ లోడ్ చేసుకోండి. ఇదివరకే ఆ యాప్ ఉంటే దానిని అప్ డేట్ చేసుకోండి. ఎందుకంటే ఈ యాప్ లో కరోనా కేసులకు సంబంధించిన పూర్తి వివరాలు అందుబాటులో ఉండటమే కాదు.. మీ చుట్టుపక్కల ఎవరికైనా కరోనా లక్షణాలుంటే.. మిమ్మల్ని అలారమ్ ద్వారా అలర్ట్ చేస్తుంది. కాబట్టి ఈ యాప్ ను ఇన్ స్టాల్ చేసుకోవడం మాత్రం మరచిపోవద్దు.

సురక్షితమైన ఆహారం

సురక్షితమైన ఆహారం

సినిమా థియేటర్లలో ఇంటర్వెల్(విరామం) సమయంలో బయటకు వెళ్లడం సాధ్యమైనంత వరకు తగ్గించుకోండి. ఒకవేళ మీకు నిజంగా ఆకలిగా ఉంటే ఆన్ లైనులోనే ఆర్డర్ ఇవ్వండి. అలాగే మీరు తీసుకునే ఆహారాన్ని మరియు వాటర్ బాటిల్ ను జాగ్రత్తగా పరిశీలించి తీసుకోండి.

రోగలక్షణమైతే మానుకోండి

రోగలక్షణమైతే మానుకోండి

మీకు తేలికపాటి కరోనా లక్షణాలు ఉంటే, సినిమా చూడటానికి థియేటర్‌కు అస్సలు వెళ్లొద్దు. మరో మాటలో చెప్పాలంటే, తేలికపాటి లక్షణాలు ఉంటే, వెంటనే వైద్యుడిని సంప్రదించండి. దీని వల్ల మీరు త్వరగా కోలుకోవడమే కాదు.. ఇతరులకు ఇది వ్యాపించడకుండా ఉండేందుకు చాలా ఎక్కువగా సహాయపడుతుంది.

English summary

Precautionary Measures a Person Should Take While Visiting Cinema Theaters

In this article, we shares some precautions one must take while visiting a cinema hall during the pandemic. Read on...