For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

Puneeth Rajkumar death:కన్నడ పవర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్ ఇక లేరు...

కన్నడ నటుడు పునీత్ రాజ్ కుమార్ గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం.

|

ప్రముఖ కన్నడ నటుడు పునీత్ రాజ్ కుమార్(46) శుక్రవారం(29.10.2021)న అకస్మాత్తుగా కన్నుమూశారు. ఈరోజు ఉదయాన్నే జిమ్ లో వర్కౌట్లు చేస్తుండగా అకస్మాత్తుగా హార్ట్ పెయిన్ రావడంతో ఒక్కసారిగా కుప్పకూలిపోయారు.

Puneeth Rajkumar death; Interesting Facts about Kannada Actor in Telugu

దీంతో ఆయన్ను వెంటనే బెంగళూరులోని విక్రమ్ ఆసుప్రతికి తీసుకెళ్లారు. అయితే చికిత్స తీసుకుంటున్న సమయంలోనే పునీత్ రాజ్ కుమార్ తుది శ్వాస విడిచినట్లు వైద్యులు, అక్కడి అధికారులు వెల్లడించారు.

Puneeth Rajkumar death; Interesting Facts about Kannada Actor in Telugu

ఈ హీరో మరణ వార్త విన్న సినీ పరిశ్రమలో విషాదఛాయలు అలముకున్నాయి. కర్నాటక సీఎం బసవరాజ్ బొమ్మై వెంటనే ఆసుపత్రికి వెళ్లారు. రాష్ట్రవ్యాప్తంగా సినిమా హాళ్లను మూసివేయాలని ఆదేశించారు. ఈ విషయం తెలుసుకున్న అభిమానులు, ప్రముఖులు సోషల్ మీడియా వేదికగా తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు. వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నారు. ఈ సందర్భంగా పునీత్ రాజ్ కుమార్ గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాల గురించి తెలుసుకుందాం...

పునీత్ సేవలు మరువలేనివి..

పునీత్ రాజ్ కుమార్ 45 పాఠశాలల్లో సుమారు 1800 మంది విద్యార్థులకు ఉచిత విద్యను అందిస్తున్నారు. 26 అనాధశ్రమాలకు ప్రతి నెలా విరాళం ఇచ్చేవారు. 19 గోశాలలను మెయింటెయిన్ చేసేవారు. 16 వయసు పైబడిన వారి కోసం ఆశ్రమాలకు ఆర్థిక సాయం చేసేవారు. చివరకు తాను చనిపోయిన తర్వాత కూడా తన కళ్లను సైతం దానం చేసేశాడు. తన కళ్లతో ఈ ప్రపంచాన్ని చూస్తూ.. మనతో పునీత్ రాజ్ కుమార్ సజీవంగా ఉంటారని ఆశిద్దాం..

తన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిద్దాం..

చిన్న వయసులోనే..

చిన్న వయసులోనే..

కన్నడ కంఠీరవ రాజ్ కుమార్ దంపతులకు మూడో కుమారునిగా 1975వ సంవత్సరంలో మార్చి 17వ తేదీన పునీత్ రాజ్ కుమార్ జన్మించారు. ఈ హీరోను కన్నడ సినీ ఇండస్ట్రీలో అందరూ అప్పు అని, పవర్ స్టార్ అని పిలుచుకుంటూ ఉంటారు. ఈ కన్నడ పవర్ స్టార్ చిన్న వయసులోనే అంటే ఐదేళ్లప్పుడే.. సినిమా రంగంలో ప్రవేశించారు. ఈయన తన తొలి సినిమాను తండ్రి రాజ్ కుమార్ తో కలిసి నటించారు.

తెలుగుతోనూ అనుబంధం..

తెలుగుతోనూ అనుబంధం..

ఈ కన్నడ పవర్ స్టార్ కు తెలుగు సినీ పరిశ్రమతో మంచి అనుబంధమే ఉంది. ఈయన చేస్తున్న ఓ సినిమాకు మన యంగ్ టైగర్ ఎన్టీఆర్ ‘గెలవే గెలవే' అనే ఓ అద్భుతమైన పాటను కూడా పాడారు. అలాగే ఇటీవలి కాలంలోనే అమెజాన్ ‘యువ రత్న' పేరిట ఓ డబ్బింగ్ సినిమాలో సైతం పునీత్ అందరినీ అలరించారు.

శోకసంద్రంలో సినీ లోకం..

శోకసంద్రంలో సినీ లోకం..

కన్నడ పవర్ స్టార్ పునీత్ కుమార్ ఇక లేడన్న వార్త తెలుసుకున్న సినీ లోకం శోక సంద్రంలో మునిగిపోయింది. తమ అభిమాన నటుడి మరణ వార్త విన్న అభిమానులు, ప్రముఖులు పెద్దఎత్తున ఆసుపత్రికి చేరుకుంటున్నారు. పునీత్ హార్ట్ ఎటాక్ అనే విషయం తెలుసుకున్న వెంటనే కర్నాటక ముఖ్యమంత్రి బసవరాజు బొమ్మై వెంటనే ఆసుపత్రికి వెళ్లారు.

29 సినిమాల్లో..

29 సినిమాల్లో..

బాలనటుడిగా వెండితెరకు పరిచయమైన పునీత్ రాజ్ కుమార్ ఇప్పటివరకు సుమారు 29 సినిమాల్లో నటించారు. పునీత్ చిన్నప్పుడు దాదాపు 14 సినిమాల్లో నటించారు. 2002 సంవత్సరంలో ‘అప్పు'(తెలుగులో ఇడియట్)తో హీరోగా పరిచయం అయ్యారు. ఆ తర్వాత వరుస విజయాలతో దూసుకెళ్లారు.

మాస్ హీరోగా..

మాస్ హీరోగా..

కన్నడ పవర్ స్టార్ గా పేరు తెచ్చుకున్న పునీత్ అనతి కాలంలోనే మాస్ హీరోగా మాంచి క్రేజ్ సంపాదించుకున్నారు. ఈయన కేవలం నటుడిగానే కాదు.. మంచి డ్యాన్సర్ గాను పేరు సంపాదించాడు. కేవలం హీరోగా మాత్రమే కాకుండా... నిర్మాతగా మారి కొన్ని సినిమాలను కూడా రూపొందించారు. బుల్లితెరలోని కొన్ని కార్యక్రమాలకు హోస్ట్ గా వ్యవహరించారు. పవర్ స్టార్ మరణంతో కర్నాటకలో హై అలర్ట్ ప్రకటించారు. ఈయన మరణంతో కర్నాటకలో రెండు రోజుల పాటు థియేటర్లు మూసివేయాలని కర్నాటక ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.

English summary

Puneeth Rajkumar death; Interesting Facts about Kannada Actor in Telugu

Here we are talking about the Puneeth Rajkumar death;Interesting Facts about kannada actor in Telugu. Have a look
Desktop Bottom Promotion