For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

తలైవా 69 బర్త్ డే స్పెషల్ : రజనీ దారి ఎప్పటికీ రహదారే...

ఆయనది పేద కుటుంబం కావడం వల్ల చిన్ననాటి నుండే ఆయన కూలి పనులు చేయాల్సి వచ్చింది. ఆ తర్వాత ప్రాథమిక విద్యను బెంగళూరులో పూర్తి చేశాడు.

|

రజనీకాంత్ నిజ జీవితంలో నల్లని రూపంలో ఉండే ఆయనను చూసి అప్పట్లో ఇతను హీరో ఏంటి అనుకున్నారు. ఎందుకంటే అప్పటివరకు అతనంటే ఎవ్వరికి తెలియదు. అందరిలాగానే ఇతను కూడా తిరుగు ముఖం పడతారని అనుకున్నారు.

Rajanikant

అయితే అందరూ ఊహించినట్టు కాకుండా అతను తమిళ చిత్ర పరిశ్రమకే తలైవాగా మారిపోయాడు. తొలి సినిమాతోనే తన సత్తా ఏంటో చాటుకున్నాడు. అప్పటి నుండి ఇప్పటి వరకు కలెక్షన్ల సునామీని క్రియేట్ చేస్తూనే ఉన్నాడు. డిసెంబర్ 12వ తేదీన ఆయన పుట్టినరోజు సందర్భంగా ఆయన గురించి ఆసక్తికరమైన విశేషాలను తెలుసుకుందాం...

రజనీ అసలు పేరు శివాజీ...

రజనీ అసలు పేరు శివాజీ...

రజనీకాంత్ అసలు పేరు శివాజీరావ్. ఆయన పూర్వీకులది మహారాష్ట్ర. 1950 డిసెంబర్ 12వ తేదీన రామోజీరావు గైక్వాడ్, రామాబాయి దంపతులకు బెంగళూరులో జన్మించారు. ఆయన ఐదేళ్ల వయసులోనే తల్లిని పోగొట్టుకున్నారు.

చిన్నప్పుడు కూలీ పనులు..

చిన్నప్పుడు కూలీ పనులు..

ఆయనది పేద కుటుంబం కావడం వల్ల చిన్ననాటి నుండే ఆయన కూలి పనులు చేయాల్సి వచ్చింది. ఆ తర్వాత ప్రాథమిక విద్యను బెంగళూరులో పూర్తి చేశాడు.

అనేక ఉద్యోగాలు..

అనేక ఉద్యోగాలు..

బెంగళూరులో 16 ఏళ్ల వరకు చదువుకున్న శివాజీ ఆ తర్వాత ఉద్యోగ అన్వేషణ మొదలు పెట్టారు. 1966-73 వరకు బెంగళూరు, మద్రాసు నగరాలలో అనేక చోట్ల రకరకాల ఉద్యోగాలు చేశారు. చివరకు బస్సు కండక్టర్ గా ఉద్యోగంలో చేరారు.

రజనీ జీవితంలో మలుపు..

రజనీ జీవితంలో మలుపు..

రజనీకాంత్ జీవితంలో మలుపు తిరిగిన సంఘటన ఏదైనా ఉంది అంటే అది బస్సు కండక్టర్ గా ఉద్యోగం చేస్తున్న సమయమే. కండక్టర్ గా డ్యూటీ చేరిన తర్వాత టికెట్లను అందరి కంటే భిన్నంగా ఇచ్చేవారు. బస్సు ప్రయాణికులతో ఎంత కిక్కిరిసిపోయినా అందరికీ 10 నిమిషాల్లో టికెట్లు కట్ చేసి ఇచ్చేవారు. అదీ కూడా స్టైల్ గా.

స్నేహితుడి సలహా..

స్నేహితుడి సలహా..

బాల్యంలో శివాజీ ఎన్ని కష్టాలు ఎదుర్కొన్నప్పటికీ నాటకాలను వేస్తూ ఉండేవాడు. తనలోని కళాకారుడిని అప్పుడప్పుడు బయట వస్తుండేవాడు. వేసిన ప్రతి నాటకంలోనూ ఆయనకంటూ ఓ ప్రత్యేక శైలి ఉండేది. అలా ఒకరోజు ఓ నాటకంలో ‘దుర్యోధనుడి‘ వేషం వేయాల్సి వచ్చింది. అప్పటికే ఆ వేషం చాలామంది వేసి ఉన్నా అతనిలాగా ఎవరూ హావాభావాలు పలికించలేదు. అప్పుడే తన స్నేహితుడు రాజ్ బహదూర్ ‘నీలో ఒక మంచి నటుడు దాగి ఉన్నాడు. నువ్వు ఇక్కడే ఉంటే ఆ నటుడు మిస్సైపోతాడు‘ అంటూ వెన్నుతట్టి డబ్బులిచ్చి మరీ చెన్నైకు పంపాడు.

రహదారిలో దూసుకెళ్లారు..

రహదారిలో దూసుకెళ్లారు..

అప్పుడే తన జీవితానికి రహదారి వేసుకోవాలని రజనీకాంత్ నిర్ణయించుకున్నారు. ఎవరికి అర్థం కాని రహదారిని తన కోసం ఏర్పాటు చేసుకున్నారు. అప్పటినుండే రజనీకాంత్ పట్టిందల్లా బంగారంలా మారిపోయింది.

అపజయాలు ఎదురైనా..

అపజయాలు ఎదురైనా..

తన జీవితంలో తనకు అపజయాలు ఎదురైనా గెలుపు కోసం చాలా ఓపికగా వేచి చూసేవాడు. అలా తన కెరీర్ లో అంచెలంచెలుగా గుర్తింపు తెచ్చుకుంటూ వెళ్లాడు. ఏకంగా సూపర్ స్టార్ గా మారాడు. బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ రాజాగా మారాడు. ఇప్పటికీ అలుపెరగని పోరాటం చేస్తూనే ఉన్నాడు.

ఆధ్యాత్మిక భావన...

ఆధ్యాత్మిక భావన...

రజనీకాంత్ కు ఆధ్యాత్మిక భావన ఎక్కువ. అందుకే ప్రతి సంవత్సరం హిమాలయాలకు వెళ్తూ ఉంటాడు. బాబాజీపై తనకు ఉన్న భక్తి భావాన్ని కూడా బాబా సినిమా ద్వారా చాటుకున్నారు.

బిచ్చగాడు అనుకుని..

బిచ్చగాడు అనుకుని..

రజనీ కాంత్ కు నిజ జీవితంలో ఓసారి అనుకోని ఒక సంఘటన ఎదురైంది. ఆయన బెంగళూరులోని ఓ గుడిలో దేవుడిని దర్శించుకుని ఒంటరిగా కూర్చుని ఉన్న సమయంలో అతని అవతారం చూసి ఓ మహిళ పది రూపాయలు చేతిలో పెట్టింది. ఆ తర్వాత రజనీ కారు ఎక్కుతున్న సన్నివేశం చూసి ఆమె అప్పుడు రజనీకాంత్ ను గుర్తుపట్టి క్షమించమని అడిగిందట. ‘తను స్టార్ కాకపోతే, తనకు మేకప్ లేకపోతే నేనేంటో ఆ సంఘటన నాకు గుర్తు చేస్తూనే ఉంటుంది. అందుకే పైపై మెరుగులకు నేను ప్రాధాన్యత ఇవ్వను‘ అంటూ ఉంటాడు రజనీ.

జన్మదిన శుభాకాంక్షలు..

జన్మదిన శుభాకాంక్షలు..

రజనీకాంత్ ఇప్పటివరకు తన జీవితంలో ఎన్నో ఎత్తుపల్లాలను అనుభవించారు. ఎంతో స్టార్ డమ్ సంపాదించుకున్న ఆయన ఇప్పటికీ ఎంతో సింపుల్ గా ఉంటారు. శివాజీ తాను ఏమైతే అనుకున్నాడో అవన్నీ తన జీవితంలో సాధించాడు. ఈ సందర్భంగా ఆయన ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలని కోరుకుంటూ తెలుగు బోల్డ్ స్కై తరపున సూపర్ స్టార్ రజనీకాంత్ కు పుట్టిన రోజు శుభాకాంక్షలు..

English summary

Rajanikant Birthday Special : Intersting Facts about Rajani

Here we talking about interesting facts about super star rajanikant. Read on
Desktop Bottom Promotion