For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

Ramakrishna Jayanti:రామక్రిష్ణ పరమహంస గురించి మనం నమ్మలేని నిజాలు...!

|

రామక్రిష్ణ పరమహంస అసాధారణ ప్రతిభావంతుడు. ఈ భూమి మీద పుట్టిన సకల జీవులకు సేవ చేయడానికి ఆయన ఎక్కువ ఆసక్తి చూపేవాడు. ఈయన కాళిమాతకు వీరభక్తుకుని ఉండేవారు.

ఈయన ద్రుష్టిలో కాళిమాత దేవత కాదు.. సజీవ సత్యం. తన ముందు కాళి మాత నాట్యమాడేదని.. తన చేతులతోనే భోజనం చేయడమే కాదు.. రామక్రిష్ణ ఎప్పుడు పిలిస్తే.. అప్పుడే వచ్చేదని చరిత్ర ద్వారా తెలుస్తోంది. రామక్రిష్ణుల వారి చైతన్యం ఎంతటిదంటే.. ఆయన ఏ రూపం కోరుకుంటే ఆ రూపం ఆయనకు నిజంగా కనిపించేదట.

ఈయన కాలంలో హిందూ మతాన్ని పునరుద్ధరించడంలో కీలక పాత్ర పోషించాడు. అంతటి గొప్ప వ్యక్తి జయంతి ఉత్సవాలు మార్చి 15వ తేదీ దేశవ్యాప్తంగా ఘనంగా జరగనున్నాయి. ఈ సందర్భంగా ఆయన గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలను తెలుసుకుందాం...

స్వామి రామకృష్ణ పరమహంస, ఆధ్యాత్మికంగా ప్రేరణ కలిగించే స్టోరీ

రామక్రిష్ణ జననం..

రామక్రిష్ణ జననం..

రామక్రిష్ణ పరమహంస పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలోని హుగ్లీ జిల్లా కమర్పుకుర్ అనే గ్రామంలోో చంద్రమణి దేవి, ఖుదిరామ్ చటోపాధ్యాయ దంపతులకు 1836వ సంవత్సరంలో జన్మించారు. తన చిన్న నాటి పేరు గదధర్. ఈయన భార్య పేరు శారదమోని దేవి. ఈయన గురువు పేరు తోటపురి. ఈయన విద్యాభ్యాసం అద్వైత వేదాంత, యూనివర్సల్ టాలరెన్స్ లో సాగింది.

కాళి మాత భక్తుడు..

కాళి మాత భక్తుడు..

రామక్రిష్ణ పరమహంస తన చిన్న నాటి నుండే కాళిమాతను అమితంగా ఆరాధించేవాడు. విష్ణువు యొక్క ఆధునిక అవతారం అమ్మవారని నమ్మేవారు. కానీ ఆ విషయం గురించి బయటికి ఎక్కువగా చెప్పలేదు. బెంగాల్ రాష్ట్రంలో హిందూ మతం యొక్క పునరుజ్జీవనంలో ఆయన కీలక పాత్ర పోషించాడు.

ఉపన్యాసాలంటే ఇష్టం..

ఉపన్యాసాలంటే ఇష్టం..

రామక్రిష్ణ ప్రారంభ రోజుల నుండి అధికారిక విద్య మరియు ప్రాపంచిక వ్యవహారాలను తిరస్కరించారు. అయితే తను బాగా పాడేందుకు మరియు చిత్రాల విషయంలో మంచి ప్రావీణ్యత సంపాదించాడు. అలాగే తనకు ఉపన్యాసాలు చేయాలంటే చాలా ఇష్టం. ఇలా తను ఆరేళ్ల వయసులోనే ఆధ్యాత్మిక మనోభావాలల తరచుగా కనిపించేవాడు. తన తల్లి చెప్పే జానపథ కథలంటే కూడా బాగా ఇష్టపడేవాడు. తన తండ్రి మరణం తర్వాత రామక్రిష్ణ అన్నయ్య రామ్ కుమార్ దక్షిణాశ్వర ఆలయంలో పూజారిగా చేరారు.

రామక్రిష్ణ లైఫ్..

రామక్రిష్ణ లైఫ్..

దక్షిణేశ్వర్ ఆలయాన్ని కలకత్తాలోని జాన్సజార్, రాణి రష్మోని గౌరవనీయ పరోపకారి రాణిని స్థాపించారు. దక్షిణేశ్వర్ కాళి ఆలయంలో రామక్రిష్ణ పూజారిగా చేరాడు. 23 ఏళ్ల వయసులోనే ఏదేళ్ల శారదమోని ముఖోపాధ్యాయను పెళ్లి చేసుకున్నాడు. ఆ తర్వాత తనను దక్షిణేశ్వర్ వద్దకు చేర్చాడు.

తోటపురి గురువు.

తోటపురి గురువు.

ఓ రోజు హుగ్లీ నది సమీపంలో వెళ్తున్న రామక్రిష్ణ తోటపురి అనే ప్రాంతంలో సన్యాసి మాటలకు బాగా ప్రేరేపితుడయ్యాడు. ఈ సమయంలోనే తోటపురి అనే గురువు రామక్రిష్ణను అద్వైత వేదాంతంలో దీక్ష చేపట్టేలా చేశాడు. ఇలా రామక్రిష్ణ తోటపురి వద్ద దీక్షను సుమారు ఆరు నెలల పాటు కొనసాగించారని చెబుతుంటారు స్థానికులు.

స్వామి వివేకానంద ఆకర్షణ..

స్వామి వివేకానంద ఆకర్షణ..

ఓ సమయంలో బెంగాల్ రాష్ట్రంలో ఆధ్యాత్మిక సంక్షోభం మరియు మానవాతా వాదం యొక్క తీవ్రమైన పతనానికి గురైంది. ఇలాంటి సమయంలో బోధన నాస్తికుడు స్వామి వివేకానందను స్వామి రామక్రిష్ణ పరమహంస మాటలు ఆకర్షించాయి. రామక్రిష్ణ ఈ భూమి మీద పుట్టిన ప్రతి జీవి పవిత్రమని నమ్ముతారు. ఇక ఆడ, మగ అనే తేడాలు అవసరం లేదంటాడు. ప్రతి మనిషిలో భగవంతుడు ఉంటాడని, మానవుని పట్ల దయ చూపడం అంటే, దేవుడి పట్ల దయ చూపడం, ఎందుకంటే ప్రతి మనిషిలో దేవుడు ఉంటాడని చెబుతారు. అప్పటి నుండి ఆయన రామక్రిష్ణ మిషన్లో చేరి.. ఆయనకు ప్రియ శిష్యుడిగా మారిపోయాడు. దీని ప్రధాన కార్యాలయం బేలూర్ రామక్రిష్ణ ఆశ్రమంలో ఉంది.

English summary

Ramakrishna Jayanti : Interesting facts about Ramakrishna Paramahansa in telugu

Here we are talking about Ramakrishna Jayanti : Interesting facts about Ramakrishna Paramahansa in telugu. Read on