For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

Bappi Lahiri Passes away:బప్పీ లహరీ ‘గోల్డ్ మ్యాన్’గా ఎందుకు మారాడు? తను ధరించిన తొలి బంగారు లాకెట్ ఏదంటే?

బప్పి లహరీ ఎక్కువ బంగారాన్ని ఎందుకని ధరించేవాడో, అందుకు గల కారణాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం.

|

మన భారతదేశ సంగీతాన్ని కొత్త పుంతలు తొక్కించిన వారిలో బప్పీ లహరీ పేరు ప్రముఖంగా వినిపిస్తుంది. సంగీతానికి వెస్ట్రన్ కల్చర్ సొబగులు అద్ది.. సరికొత్త డిస్కో పాటలను రూపొందించిన ఘనత మాత్రం బప్పీ లహరీకే దక్కుతుంది.

Reasons Why Bappi Lahiri Used To Wear So Much Gold in telugu

కొన్ని దశాబ్దాల పాటు బప్పీ లహరీ మ్యూజిక్ లవర్స్ తన పాటలతో మైమరిపించేశారు. తన పాటలు ఇప్పటికీ డిస్కోల్లో, సినిమాల్లో రిమిక్స్ అవుతూ అలరిస్తూనే ఉంటాయి. అంతేకాదు 'షరాబి', 'డిస్కో డ్యాన్సర్' వంటి ఎన్నో అద్భుతమైన ఆల్బమ్ లను అందించి కోట్లాది మంది అభిమానులను సంపాదించుకున్నారు.

Reasons Why Bappi Lahiri Used To Wear So Much Gold in telugu

ఈ సందర్భంగా తను ఎందుకని ఎల్లప్పుడూ ఎక్కువ బంగారం వేసుకుని కనిపించేవాడు.. అందుకు గల కారణాలేంటి.. అనే ఆసక్తికరమైన విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం...

Nidhi Agarwal: కుర్రకారు చూపు తిప్పుకోనివ్వని అందాల 'నిధి'అదిరేటి డ్రస్సులపై మీరూ ఓ లుక్కేయండి...Nidhi Agarwal: కుర్రకారు చూపు తిప్పుకోనివ్వని అందాల 'నిధి'అదిరేటి డ్రస్సులపై మీరూ ఓ లుక్కేయండి...

ఆకస్మిక మరణం..

ఆకస్మిక మరణం..

బాలీవుడ్ సింగర్, మ్యూజిక్ కంపోజర్ బప్పీ లహరీ(69) అకస్మాత్తుగా కన్నుమూశారు. ఆయన ఆరోగ్యం అకస్మాత్తుగా క్షీణించడంతో ఫిబ్రవరి 15వ తేదీన మంగళవారం రాత్రి ముంబైలోని బ్రీచ్ క్యాండీ ఆసుపత్రిలో చేరారు. ఆ తర్వాత కొద్ది సేపటికే కోట్లాది మంది నిరాశ చెందేలా లహరీ ఈ లోకానికి వీడ్కోలు పలికిన విషాద వార్త బయటికొచ్చింది. బి-టౌన్లో బప్పీని లెహ్రీస్ బప్పీ అని కూడా పిలుస్తారు.

బంగారం ఎక్కువగా..

బంగారం ఎక్కువగా..

బప్పీ లహరీ బంగారాన్ని ఎందుకని ఎక్కువగా ధరించేవారనే విషయాన్ని ఓ ఇంటర్యూలో చెప్పారు. తనకు హాలీవుడ్ సింగర్ ఎల్విస్ ప్రెస్లీ అంటే ఎంతో ఇష్టమని.. తను ఎల్లప్పుడూ మెడలో బంగారం గొలుసు ధరించేవాడని.. అందుకే తాను కూడా ప్రెస్లీ స్టైల్ ను ఫాలో అయినట్లు వివరించారు. ఆ తర్వాత బప్పీ లహరీ కూడా మెడలో ఎల్లప్పుడూ ధగధగ మెరిసే బంగారాన్ని ధరించడం ప్రారంభించాడు. అప్పటి నుండి తనను లహరీ గోల్డ్ మ్యాన్ అని పిలిచేవారు. ఓ నివేదిక ప్రకారం, తను రోజుకు కనీసం ఏడెనిమిది గంటలు బంగారాన్ని ధరించేవారట.

గ్లోయింగ్ స్కిన్ పొందడానికి కలబంద మరియు కొబ్బరి నూనె ఎలా సహాయపడతాయో మీకు తెలుసా?గ్లోయింగ్ స్కిన్ పొందడానికి కలబంద మరియు కొబ్బరి నూనె ఎలా సహాయపడతాయో మీకు తెలుసా?

తొలిసారిగా బంగారం ఎప్పుడంటే..

తొలిసారిగా బంగారం ఎప్పుడంటే..

బప్పి లహరీ బంగారాన్ని కేవలం ఫ్యాషన్ కోసమే కాదు.. లక్కీ కోసం కూడా ధరించేవారట. బంగారం వల్ల తనకు లక్కీ కలిసి వస్తుందని నమ్మాడు. అది ధరించడం వల్ల తాను మరింత రాణించగలుగుతున్నట్లు పలు సందర్భాల్లో చెప్పారు. తను తొలిసారి హరే క్రిష్ణ హరే రామ బంగారపు లాకెట్ ధరించాడు. తన తొలి లాకెట్ ఆయన తల్లి ధరించారు. మరో ఇంటర్వ్యూలో ఇలా అన్నారు. తాను బంగారం ధరించడం ప్రారంభించినప్పటి నుండి తన పాటలు పెద్ద హిట్ అవ్వడం ప్రారంభమయ్యిందట. బప్పీ లహరీ డిస్కో డ్యాన్సర్, హిమ్మత్ వాలా, నమక్ హలాల్ వంటి సినిమాలతో పాటు ఇంకా ఎన్నో హిట్ పాటలు పాడారు.

గోల్డ్ టీ సెట్..

గోల్డ్ టీ సెట్..

బప్పీ లహరీకి నిద్రపోవడం అంటే కూడా చాలా ఇష్టం. అందుకే తన భార్య ధనత్రయోదశి రోజున బంగారంతో చేసిన టీ సెట్ ను బప్పీకి బహుమతిగా ఇచ్చారట. ఎందుకంటే తన వద్ద అప్పటికే చాలా రకాల బంగారం ఆభరణాలు ఉన్నందున, ఆమె బంగారపు టీ సెట్ గిఫ్టుగా ఇచ్చారట. అలా తన భార్య బంగారపు టీ సెట్ ను, అదీ ధన త్రయోదశి రోజున తీసుకురావడాన్ని చాలా శుభప్రదంగా భావించి సంతోషించారట.

మైఖేల్ జాక్సన్ మెచ్చుకున్నారట..

మైఖేల్ జాక్సన్ మెచ్చుకున్నారట..

ఒకసారి బప్పీ లహరీ మైఖేల్ జాక్సన్ తన బంగారపు గొలుసులను మెచ్చుకున్నారని మరో ఇంటర్వ్యూలో చెప్పారు. మైఖేల్ జాక్సన్ తో తన తొలి సమావేశం ముంబైలో జరిగిందని వివరించారు. మైఖేల్ తన వద్దకు వచ్చినప్పుడు అతని కళ్లు తన గణపతి గొలుసుపై పడ్డాయని చెప్పారు. అతను ‘ఓ మై గాడ్ ఫెంటాస్టిక్' అని మెచ్చుకున్నారట. నీ పేరు ఏంటి? మీ చైన్ చాలా అద్భుతంగా ఉంది. ఆ తర్వతే మ్యూజిక్ కంపోజింగ్ గురించి అడిగారట. అప్పుడు తాను ‘డిస్కో డ్యాన్సర్' చేశానని చెప్పారట. అప్పుడు మైఖేల్ జాక్సన్ కూడా మీ పాటల్లో ‘జిమ్మీ జిమ్మీ' అంటే నాకు చాలా ఇష్టమని చెప్పారట.

FAQ's
  • ప్రముఖ సంగీత దర్శకులు బప్పీ లహరీ ఎప్పుడు మరణించారు?

    బాలీవుడ్ సింగర్, మ్యూజిక్ కంపోజర్ బప్పీ లహరీ(69) అకస్మాత్తుగా కన్నుమూశారు. ఆయన ఆరోగ్యం అకస్మాత్తుగా క్షీణించడంతో ఫిబ్రవరి 15వ తేదీన మంగళవారం రాత్రి ముంబైలోని బ్రీచ్ క్యాండీ ఆసుపత్రిలో చేరారు. ఆ తర్వాత కొద్ది సేపటికే కోట్లాది మంది నిరాశ చెందేలా లహరీ ఈ లోకానికి వీడ్కోలు పలికిన విషాద వార్త బయటికొచ్చింది.

  • బప్పీ లహరీ ‘గోల్డ్ మ్యాన్’గా ఎందుకు మారాడు?

    బప్పీ లహరీ బంగారాన్ని ఎందుకని ఎక్కువగా ధరించేవారనే విషయాన్ని ఓ ఇంటర్యూలో చెప్పారు. తనకు హాలీవుడ్ సింగర్ ఎల్విస్ ప్రెస్లీ అంటే ఎంతో ఇష్టమని.. తను ఎల్లప్పుడూ మెడలో బంగారం గొలుసు ధరించేవాడని.. అందుకే తాను కూడా ప్రెస్లీ స్టైల్ ను ఫాలో అయినట్లు వివరించారు. ఆ తర్వాత బప్పీ లహరీ కూడా మెడలో ఎల్లప్పుడూ ధగధగ మెరిసే బంగారాన్ని ధరించడం ప్రారంభించాడు. అప్పటి నుండి తనను లహరీ గోల్డ్ మ్యాన్ అని పిలిచేవారు.

Read more about: insync life gold reasons facts
English summary

Reasons Why Bappi Lahiri Used To Wear So Much Gold in telugu

Bappi Lahiri Passes away: The musician was also renowned for his love of gold jewellery. Know Reasons Why Bappi Lahiri Used To Wear So Much Gold in telugu.
Story first published:Wednesday, February 16, 2022, 17:10 [IST]
Desktop Bottom Promotion