For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

సుష్మాస్వరాజ్ సేవలు మరువలేనివి..

మెడికల్‌ వీసాల విషయంలో మానవీయ కోణంతో మోదీ సర్కారు పనిచేస్తోందనడానికి సుష్మా స్వరాజ్‌ పనితీరే కారణం. ఇది ప్రజల మనసులు గెలుచుకొంది. పాకిస్థాన్‌ లాహోర్‌కి చెందిన ఓ సివిల్‌ ఇంజినీర్..

|

'చాలా మంది దౌత్యవేత్తలు నిద్రపోయే సమయంలో కూడా సెల్‌ఫోన్లను స్విచాఫ్‌ చేసేవారు కాదు..' ఇది సుష్మాస్వరాజ్‌ విదేశాంగ శాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వహిస్తున్నప్పుడు సరదాగా జరిగిన ప్రచారం. ఎవరైనా సహాయం కోసం సుష్మాను సహాయం అడగడమే ఆలస్యం.. వెంటనే ఆమె సంబంధిత అధికారులతో ఫోన్ చేసి మాట్లాడేవారు. 'నేను నిద్రపోను.. మా దౌత్యవేత్తలను నిద్రపోనివ్వను..' అని ఆమె ఒక ప్రెస్‌కాన్ఫరెన్స్‌లో సరదాగా వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. సరదాగా అన్నా.. ఈ వ్యాఖ్యలు ఆమె పనితీరుకు నిదర్శనం. సుష్మాస్వరాజ్ విదేశాంగశాఖపై చెరగని ముద్రవేశారు. ఆమె తర్వాత ఆ బాధ్యతలు చేపట్టిన కేంద్రమంత్రి జయశంకర్‌ కూడా సుష్మా నెలకొల్పిన విధానాలను కొనసాగిస్తామని స్పష్టం చేశారు.

ఒకప్పుడు విదేశాంగ శాఖ అంటే వ్యూహాలు.. ప్రతి వ్యూహాలకే పరిమితమయ్యేది. ఇటువంటి శాఖను ఆమె ప్రజలకు చెంతకు చేర్చారు. 'ప్రజల పాలసీని విదేశాంగ విధానానికి అనుసంధానించడానికి కృషి చేస్తున్నాం' అని ఆమె స్వయంగా ఒక సందర్భంలో ప్రకటించారు. పాకిస్థాను నుంచి బధిర యువతి గీతను తీసుకురావడంలో.. ప్రత్యక్ష నరకం చూపించే ఓ వివాహ బంధంలో చిక్కుకున్న ఉజ్మాను రక్షించడంలో.. భర్త చేతిలో మోసపోయి దిక్కులేకుండా శరణార్థ శిబిరంలో తలదాచుకున్న గురుప్రీత్‌ను అక్కున చేర్చుకోవడంలోనూ ఆమె చూపిన చొరవ ఎప్పటికీ గుర్తుండి పోతుంది. వీరంతా భరతమాత కుమార్తెలని ఆమె చెప్పేవారు. అంతేకాదు సోషల్ మీడియాలో సైతం అత్యధిక ఫాలోయింగ్ ఉన్న నేతల్లో ఆమె ఒకరిగా నిలిచారు.

Sushma Swaraj

ప్రధాని మోడీకి రాక్‌స్టాక్‌ ఇమేజ్‌ వెనుక..
విదేశీ వ్యవహారాలను ప్రధాని నరేంద్ర మోడీ ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొన్నారు. ఈ విషయంలో మోదీ నమ్మకాన్ని వందకు వందశాతం ఆమె నిలబెట్టుకొన్నారు. న్యూయార్క్‌లోని మాడిసన్‌ స్క్వేర్‌ గార్డెన్‌ నిర్వహించిన కార్యక్రమంతో ప్రవాస భారతీయుల్లో మోదీ ఇమేజ్‌ అమాంతం పెరిగిపోయింది. ఈ కార్యక్రమం వెనుక గ్రౌండ్‌ వర్క్‌, ఆలోచన సుష్మాదే కావడం విశేషం. ప్రవాస భారతీయులను ఆమె దేశ సంపదతో పోలుస్తారు. ''ప్రవాస భారతీయులు దేశానికి అతిపెద్ద ఆస్తి. ఆర్థిక వ్యవస్థలో, దేశ ప్రతిష్ఠ, పలుకుబడిలో అత్యంత కీలకమైన వారు'' అని 2016లో జరిగిన ఒక పుస్తకావిష్కరణలో ఆమె పేర్కొన్నారు.

విజయవంతమైన విదేశాంగ విధానం..
ప్రధాని మోదీ సర్కారు హయాంలో భారత్‌ చాలా చిన్న దేశాలతో సన్నిహిత సంబంధాలను పెంచుకుంది. ఇవన్నీ ఐక్యరాజ్యసమితిలో భారత్‌కు బలమైన ఓటు బ్యాంక్‌గా పనిచేస్తాయన్న విషయాన్ని సుష్మా నేతృత్వంలోని విదేశాంగ శాఖ బలంగా నమ్మింది.

Sushma Swaraj

యెమన్‌ అంతర్యుద్ధంలో చిక్కుకున్న భారతీయులను రక్షించడంలో సుష్మా పాత్ర మరువలేనిది. తమ దేశ ప్రజలు ఎక్కడ ఉన్నా రక్షించేందుకు వాయుసేన విమానాలను సైతం వినియోగించగలమని ప్రపంచానికి తెలియజేసింది.
బంగ్లాదేశ్‌తో సరిహద్దు సమస్యలను పరిష్కరించుకోవడంలో సుష్మా నేతృత్వంలోని విదేశాంగశాఖ అశేష చొరవ చూపింది.

మోడీ సర్కారు మెడికల్‌ వీసాల విషయంలో మానవీయ కోణంతో పనిచేస్తోందనడానికి సుష్మా స్వరాజ్‌ పనితీరే కారణం. ఇది ప్రజల మనసులో చెరిగిపోని ముద్రను వేసుకుంది. పాకిస్థాన్‌ లాహోర్‌కి చెందిన ఓ సివిల్‌ ఇంజినీర్.. తమ నెలల పసికందుకి భారత్‌లో చికిత్స కోసం వీసా వచ్చేలా సాయం చేయాలని ట్విట్టర్లో కోరగా.. ఎప్పటిలాగే వెంటనే స్పందించిన సుష్మా.."నీ బిడ్డకు ఎలాంటి కష్టం రాదు"అని భరోసా ఇచ్చి ఆ పసికందు ప్రాణం కాపాడారు.

విదేశాంగ శాఖ హెడ్‌ పోస్టాఫీసుల్లో పాస్‌పోర్టు సేవా కేంద్రాలను ఏర్పాటు చేసే కార్యక్రమాన్ని సుష్మా ప్రారంభించారు. 2019 మార్చినాటికి దేశవ్యాప్తంగా 500 పాస్‌పోర్టు సేవా కేంద్రాలను ప్రారంభించారు.

మన దేశ యువతులకు రంగుల కలలు చూపించి విదేశాలకు తీసుకెళ్లి మోసం చేసే ఎన్నారైల భరతం పట్టడానికి ఉద్దేశించిన కీలక బిల్లును సుష్మా స్వరాజ్‌ రాజ్యసభలో ప్రవేశపెట్టారు.

Sushma Swaraj

గతంలో పాకిస్థాన్‌కు రాయితీపై ఎఫ్‌16 యుద్ధవిమానాలు విక్రయించకుండా విదేశాంగ శాఖ చేసిన లాబీయింగ్‌ సత్ఫలితాలను ఇచ్చింది.

పుల్వామా దాడి అనంతరం మసూద్‌ అజహర్‌ నిషేధానికి చైనాను ఒప్పించడంలో విదేశాంగ శాఖ చేసిన కృషి మరువలేనిది. ఒక దశలో సుష్మా స్వరాజే స్వయంగా రంగంలోకి దిగి చైనా నాయకులతో మాట్లాడారు. దీంతో ఆమె నేతృత్వంలోనే విదేశాంగ శాఖ విధానాలు అత్యంత విజయవంతమయ్యాయి.

English summary

Sushma Swaraj Unforgettable Social Services

In her last Twitter post, Sushma Swaraj had thanked Prime Minister Narendra Modi on the Centre's move on revoking Article 370. She had also mentioned that she was waiting to see this day in her lifetime. PM Modi condoled the death of Sushma Swaraj, amuch respected and revered leader who had won the hearts of her countrymen with her hard work and dedication.
Story first published:Wednesday, August 7, 2019, 17:29 [IST]
Desktop Bottom Promotion