For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

వాలెంటైన్స్ డే స్పెషల్ : సింగిల్ గా ఉన్నామని బాధపడకండి... ఇవి ట్రై చెయ్యండి...

|

ఫిబ్రవరి మాసం అంటేనే ప్రేమికుల నెలగా చాలా మంది భావిస్తారు. ఇదంతా ప్రేమ కాలమని.. ప్రేమలో ఉన్న వారంతా ఈ సమయంలో తమ ప్రియురాలిని లేదా ప్రియుడిని ఆకట్టుకునేందుకు ఇప్పటికే లేత గులాబీ పువ్వులను.. టెడ్డి బేర్స్ ను.. చాక్లెట్లతో పాటు ఇంకా ఎన్నెన్నో బహుమతులను ఇచ్చి తమ ప్రేమికులను ఆకట్టుకునేందుకు ప్రయత్నిస్తారు.

అయితే సింగిల్ గా ఉండే వారి పరిస్థితి ఏంటి? తమకు ఇంకా అలాంటి అదృష్టం దక్కలేదని బాధపడుతూనే ఉండాలా? కానీ సింగిల్ గా ఉండే వాళ్లు నిరాశ చెందాల్సిన అవసరం లేదు.

ఆ రోజున సింగిల్ గా ఉండే వారు ఎందుకు ఎంజాయ్ చేయకూడదు? మీరు కూడా ఆరోజంతా బాగా నిద్రపోవడం, మంచి పుస్తకాలను చదవడం.. స్నేహితులతో కలిసి సినిమాలకు వెళ్లడం వంటి సంతోషకరమైన పనులు ఎన్నో చేయవచ్చు. మీరు ఆరోజున మరింత తాజాగా అనుభూతి చెందడానికి వీటిని ట్రై చెయ్యండి...

ఎంత గొడవ పడితే.. అంత ప్రేమంట...! అప్పుడే ఆ బంధం గట్టిగా బలపడుతుందట...!

మీరే ఓ ట్రీట్ ఇవ్వండి..

మీరే ఓ ట్రీట్ ఇవ్వండి..

వాలెంటైన్స్ డే రోజున మీ భాగస్వామితో మాత్రమే డిన్నర్ కు లేదా డేట్ వెళ్లొచ్చని రూలేమీ లేదు. మంచి రెస్టారెంటుకు వెళ్లి మీకు ఇష్టమైన ఆహారం కోసం మీరు, మీ భాగస్వామి కోసం వెతకాల్సిన అవసరం కూడా లేదు. వాలెంటైన్స్ డే అంటే ప్రేమను చాటడం. కాబట్టి మీరే మీకు నచ్చిన వారికి మీ స్నేహితులకు లేదా కుటుంబసభ్యులకు ట్రీట్ ఇవ్వడం ద్వారా వారి పట్ల మీరు కొంత ప్రేమను చూపండి. ఒకవేళ మీరొక్కరే రెస్టారెంటుకు వెళ్లడానికి బోరు కొడితే.. మీరు మీకు కావాల్సిన ఆహారాన్ని ఆర్డర్ కూడా చేసుకోవచ్చు.

మీకు నచ్చిన వారితో..

మీకు నచ్చిన వారితో..

వాలెంటైన్స్ డే అనేది కేవలం జంటలకు మాత్రమే అనుకుంటే అది పెద్ద పొరపాటు. అలాంటి భ్రమలో ఉంటే, మీరు అలాంటి ఉద్దేశ్యాన్ని మార్చుకోవాల్సి ఉంటుంది. ప్రేమ అనేది అన్ని రూపాల్లో ఉంటుంది. అన్ని రూపాల్లో వస్తుంది. అందువల్ల, మీరు దీన్ని మీ కుటుంబం మరియు స్నేహితులతో కూడా కలిసి జరుపుకోవచ్చు. ల్లప్పుడూ మిమ్మల్ని ప్రేమిస్తున్న వారితో కొంత సమయం గడపండి.

కుటుంబ సభ్యులకు గిఫ్టులు..

కుటుంబ సభ్యులకు గిఫ్టులు..

మీతో అందరి కంటే ప్రేమగా ఉండేది మీ తల్లిదండ్రులు మరియు కుటుంబసభ్యులు. అందుకే వాలెంటైన్స్ డే రోజు వారికి బహుమతులు తీసుకెళ్లండి. వారిని ఆశ్చర్యపరచండి. దీంతో మీరు చాలా ప్రత్యేకంగా అనుభూతి చెందుతారు. లేదా మీరు వారిని మంచి రెస్టారెంట్ కు అయినా తీసుకెళ్లొచ్చు.

మీ పెట్స్ తో గడపండి..

మీ పెట్స్ తో గడపండి..

మనం పెంచుకునే పెట్స్ (పెంపుడు జంతువులు) కంటే నమ్మకంగా ఎవ్వరూ ఉండలేరు. కాబట్టి ఆరోజున వాటితో విలాసవంతంగా గడపండి. ఎందుకంటే మీ పెంపుడు జంతువు మీతో ఆడుకోవడానికి ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటుంది. వాటిని ఆ రోజంతా సరదాగా బయటికి తీసుకెళ్లొచ్చు. అలా చేస్తే ఆ రోజు అద్భుతంగా గడిచిపోతుంది.

మగాళ్లకు ఈ సర్వేలో మ్యాటర్ తెలిస్తే ఎగిరి గంతేస్తారు... ! ఎందుకో తెలుసా...

స్నేహితులతో సరదాగా..

స్నేహితులతో సరదాగా..

వాలెంటైన్స్ డే రోజున స్నేహితులతో సరదాగా గడపండి. ఆరోజంతా మీరు ఏదైనా మంచి రెస్టారెంటుకు వెళ్లండి. లేదా ఏదైనా కొత్త ప్రదేశానికి వెళ్లండి.

సినిమాలకు వెళ్లడం..

సినిమాలకు వెళ్లడం..

వాలెంటైన్స్ డే రోజున మీరు మీ కుటుంబ సభ్యులతో లేదా స్నేహితులతో కలిసి సినిమాలకు వెళ్లడం వంటివి చేస్తే చాలా మంచిగా ఉంటుంది.

సరదా పనులు చేయండి..

సరదా పనులు చేయండి..

వాలెంటైన్స్ డే రోజున మీ తోబుట్టువులతో సరదాగా గడపండి. మీ చిన్ననాటి రోజులను గుర్తుకు తెచ్చుకుని.. అలాంటి చోటుకు వెళ్లండి. లేదా మీరు మీ తోబుట్టువులతో కలిసి ఒక టూర్ అయినా ప్లాన్ చేయవచ్చు.

సహాయం చేయండి..

సహాయం చేయండి..

ఆ రోజున ఎవరికైనా ఏదైనా అవసరం అయితే అలాంటి వారికి మీకు చేత అయినంత సహాయం చేయండి. ఆరోజున మీరు వృద్ధులకు లేదా అనాథాశ్రమానికి వెళ్లి వారి ముఖాల్లో చిరునవ్వు కూడా తెప్పించవచ్చు.

ప్రేమ జాతకం ఫిబ్రవరి 2020 : ఈ 2 రాశుల వారు ప్రేమలో మునిగి తేలుతారట! మీ రాశి కూడా ఉందేమో చూడండి...

మీకు ఇష్టమైన రంగును..

మీకు ఇష్టమైన రంగును..

వాలెంటైన్స్ డే రోజు మీకు ఇష్టమైన రంగును ఎక్కువ సేపు చూస్తూ.. మీరు సరదాగా గడిపేయవచ్చు. ఈ వాలెంటైన్స్ డే రోజన ఒక నిర్దిష్ట ప్రదర్శనను కూడా ఎక్కువగా చూడొచ్చు.

షాపింగ్ చేయండి..

షాపింగ్ చేయండి..

మీ కోసం మీరు వాలెంటైన్స్ డే రోజున షాపింగ్ చేయొచ్చు. మీకు ఇష్టమైన పుస్తకాలు, దుస్తులు, షూతో పాటు ఇతర వాటి కోసం షాపింగ్ చేయవచ్చు. పుస్తకం చదివేటప్పుడు లేదా సినిమా చూసేటప్పుడు స్నాక్స్ వంటివి తినడం చాలా మంది ఇష్టపడతారు.

English summary

These Things Singles Can Do On Valentine's Day

If you are single and feeling low for being so around Valentines celebration, then we are here to make you feel better. We have mentioned some tips that can help you in making the best out of Valentines Day.
Story first published: Tuesday, February 11, 2020, 13:59 [IST]