For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఈ చిట్కాలను పాటించండి.. ఆఫీసులో అందరితో ఫ్రీగా మాట్లాడండి..

మనం పనిచేసే ఆఫీసులో కానీ ఇతర ఏదైనా ప్రాంతాలలో అయినా మనం చేసిన మంచి పనులకు అభినందనలు స్వీకరించడానికి ఇష్టపడతాం.

|

మీరు మీ ఆఫీసులో సహోద్యోగులతో మెల్లగా మాట్లాడలేకపోతున్నారా? మీ సహచరులలో ఎవరో ఒకరితో మాట్లాడుతున్నప్పుడు మీ చుట్టుపక్కల వారందరీ కళ్లు మీ మీదే ఉంటున్నాయా? దీంతో ఇతర సహోద్యోగులు మీతో మాట్లాడేందుకు నిరాకరిస్తున్నారా? మీరెక్కడా వచ్చి మాట్లాడతారో అని హెడ్ ఫోన్లు వాడుతున్నారా? అంటే అవుననే సమాధానామే ఎక్కువగా వినిపిస్తోంది.

అయినా మీరు మీ సహోద్యోగితో మెల్లగా మాట్లాడటం, చర్చను చిన్నగా ప్రారంభించడం అంత తేలికైన పనేమీ కాదు. కొంతమందికి ఇది హింసగా అనిపించవచ్చు. కానీ మీ కార్యాలయంలో గానీ లేదా మీరు పని చేసే ఏ ప్రాంతమైనా చిన్న చిన్న చర్చలు లేదా మాటలు చాలా అవసరం అని మీరు తెలుసుకోవాలి. ఇది మీ పని ఒత్తిడిని తగ్గించడంలో మీకు సహాయపడటమే కాకుండా మీ సహోద్యోగులతో సత్సంబంధాలను బలపరుస్తుంది. వీటి కోసం ఈరోజు మేము కొన్ని చిట్కాలను తీసుకొచ్చాము. వాటిని పాటించండి.. మీ సహోద్యోగులతో బంధాన్ని మరింత బలోపేతం చేసుకోండి..

1) సహాయం అడగడం..

1) సహాయం అడగడం..

మీరు మీ సహోద్యోగితో లేదా సహోద్యోగులతో చర్చలు ప్రారంభించేటప్పుడు మీకు సౌకర్యంగా లేకపోతే మీ సహోద్యోగుల నుండి సహాయం కోరాలి. దీని ద్వారా మీ మధ్య ఉన్న దూరం తగ్గవచ్చు. ఇలా సహాయం అడగకపోయినా మీరు మీ పని గురించి అయినా మీ సహోద్యోగులతో మాట్లాడొచ్చు. లేదా మీకు సహాయం చేసిన సహోద్యోగులతో తరువాత మీరు ధన్యవాదాలు చెప్పొచ్చు.

2) కొంత నవ్వించడం..

2) కొంత నవ్వించడం..

మీకు హాస్యాస్పదమైన నైపుణ్యం ఉంటే మీరు కొన్ని జోకులను చెప్పి సహోద్యోగులను నవ్వించడానికి ప్రయత్నించాలి. అప్పుడు వారు ఆనందిస్తే మీరు సంతోషపడతారు. దీనికి బదులు మీరు చాలా గంభీరంగా, భయంకరంగా, వర్క్ హాలిక్ గా ఉంటే ఎలాంటి ఫలితం ఉండదు. అందుకే కొంత ఫన్నీ మ్యాటర్స్ ను సహోద్యోగులతో షేర్ చేసుకోవాలి. దీని ద్వారా మీ మధ్య బంధాన్ని మరింత పెంచుకోవాలి. ఇలాంటి జోకులను ప్రతి రోజూ భోజన విరామ సమయంలో ఎక్కువగా వేయాలి.

3) చిన్న చర్చతో..

3) చిన్న చర్చతో..

మీరు పని చేసే చోట మీరు ఏమి చేస్తున్నారో లేదా మీరు ఎక్కడి నుండి వచ్చారో మీకు సంబంధం లేకుండా మీ సహోద్యోగులతో కలిసి పని చేయండి. ఇలాంటి సమయంలో మీ లక్షణాలు, మీ సహోద్యోగి లక్షణాలు లేదా అంశాలు చాలా సార్లు ఉమ్మడిగా అనిపించవచ్చు. మీరు ఒక చిన్న ప్రసంగాన్ని మీకు మరియు మీ సహోద్యోగులకు మధ్య బంధాన్ని పెంచుకోవచ్చు. 'మీరు ఎక్కడ నుండి వచ్చారు?', 'భోజనానికి మీరు ఏ రెస్టారెంట్‌ను ఇష్టపడతారు?' అని అడగడం ద్వారా మీరు ప్రారంభించవచ్చు. లేదా 'ఈ వారాంతంలో మీ ప్రణాళికలు ఏమిటి'? మీరు ఇలాంటిదే కనుగొంటే, మీరు చిన్న చర్చను సులభంగా ప్రారంభించవచ్చు.

4. అభినందనలు ఉపయోగపడతాయి..

4. అభినందనలు ఉపయోగపడతాయి..

మనం పనిచేసే ఆఫీసులో కానీ ఇతర ఏదైనా ప్రాంతాలలో అయినా మనం చేసిన మంచి పనులకు అభినందనలు స్వీకరించడానికి ఇష్టపడతాము. అయితే మీరు ఇందుకు సహాయపడిన సహోద్యోగిని కూడా అభినందించాలి. మీ సహోద్యోగులు ధరించే దుస్తులను బాగుంది అని చెప్పడం లేదా కార్యాలయానికి తీసుకొచ్చే భోజనం కోసం అయినా మీరు వారిని అభినందించవచ్చు అలా మీరు మీ సహోద్యోగిని నిజంగా అభినందించారని వారికి అనిపించేలా స్పష్టంగా చెప్పండి.

5) సరదాగా మాట్లాడండి..

5) సరదాగా మాట్లాడండి..

మీరు మీ సహోద్యోగులతో సరదాగా సంభాషణలను ప్రారంభించండి. ఉదాహరణకు మీ వారాంతపు అనుభవాలను పంచుకోండి. మీ సహోద్యోగులతో చిన్న చర్చలను ప్రారంభించడానికి ఉత్తమమైన మార్గాలలో ఇది ఒకటి. మీరు విస్తృతమైన అంశాలపై మాట్లాడటానికి మరియు ఆలోచనలను చర్చించడానికి ప్రయత్నిస్తే విషయాలు మెరుగ్గా ఉంటాయి. వారితో మంచి బంధం ఏర్పడటానికి ఇది మీకు సహాయపడుతుంది. మీరు కొన్ని సామాజిక సమస్యల గురించి మాట్లాడవచ్చు. దానిపై వారి అభిప్రాయాలను అడగవచ్చు. ఇది మీ సహోద్యోగుల దృక్పథాన్ని తెలుసుకోవడంలో మీకు సహాయపడటమే కాకుండా మీ కార్యాలయంలో కొన్ని బలమైన కనెక్షన్‌లను ఏర్పరచటంలో మీకు సహాయపడుతుంది.

6. ఇతరులపై ఆధారపడొద్దు..

6. ఇతరులపై ఆధారపడొద్దు..

మీ సహోద్యోగులతో బంధాన్ని ఏర్పరచుకోవడంలో మీరు విజయం సాధించిన తర్వాత మీరు వారి వెంటే ఉండకూడదు. ఆ కారణంగా, మానసికంగా బలహీనంగా ఉన్న మరియు నిరంతరం మద్దతు అవసరమయ్యే వారితో ఉండటానికి ఎవ్వరూ ఇష్టపడరు. అందుకే మీరు ఎవ్వరితోనూ ఎక్కువగా క్లోజ్ ఉండకండి. అలా ఉండటం వల్ల మీరు ఇతరులపై ఆధారపడాల్సి వస్తుంది. ఫలితంగా, మీ సహోద్యోగులు కొన్ని సమయాల్లో మిమ్మల్ని లైట్ తీసుకోవచ్చు..

దీనికి తోడు, మీ సహోద్యోగుల ముందు నమ్మకంగా ఉండేందుకు ప్రయత్నించండి. అన్నింటికంటే ముందు మీరు మాట్లాడటానికి ఎట్టి పరిస్థితుల్లో భయపడకుండా ఉండండి. ఎందుకంటే మీరు ఏ తప్పు చేయలేదు కాబట్టి. ఎప్పుడూ నవ్వుతూ కనిపించండి. నవ్వుతూ మాట్లాడండి. దీంతో అన్ని ఇబ్బందికరమైన పరిస్థితులు తొలగిపోతాయి.

ఈ చిట్కాలు మీ సహోద్యోగులతో చిన్నగా లేదా మెల్లగా మాట్లాడేందుకు మీకు ఉపయోగపడతాయని మేము ఆశిస్తున్నాము.

English summary

Are You Facing Difficulties In Making Small Talks With Colleagues In The Workplace? Here are the Tips

Breaking the ice and initiating a small talk is not that easy and for some people, it might seem torturous. But you must know small- talks are quite essential at your workplace. It not only helps you in relieving your work stress but also strengthens your bond with your colleagues.
Desktop Bottom Promotion