For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

Tokyo Olympics : మరికొద్ది రోజుల్లో ఒలింపిక్స్.. వంద మందికి పైగా పాల్గొననున్న భారత క్రీడాకారులు...

టోక్యో ఒలింపిక్స్ 2020లో పాల్గొనబోయే భారతీయ క్రీడాకాలరులెవరో చూసెద్దాం రండి.

|

ప్రపంచవ్యాప్తంగా కరోనా కారణంగా గతేడాది టోక్యో జరగాల్సిన ఒలింపిక్స్ వాయిదా పడ్డాయి. అయితే మరికొద్ది రోజుల్లో ఈ మెగా ఈవెంట్ ప్రారంభం కాబోతోంది. 2021 జులై 23 నుండి ఆగస్టు ఎనిమిదో తేదీ వరకు ఈ మెగా టోర్నీ జరగనుంది. ఈసారి జరిగే టోక్యో ఒలింపిక్స్ లో భారతదేశం నుండి దాదాపు వంద మందికి పైగా అంటే 119 మంది ఆటగాళ్లు పాల్గొననున్నారు.

Tokyo Olympics List Of All Indian Players Qualified For The Event

తాజాగా ప్రధాని మోడీ కూడా వీరితో వర్చువల్ సమావేశమయ్యారు. ఆటగాళ్లలో స్ఫూర్తి నింపారు. ప్రముఖ క్రీడాకారులతో ప్రత్యేకంగా మాట్లాడారు. ఒలింపిక్స్ ప్రారంభోత్సవంలో భారత టీమ్ కు లెజెండరీ బాక్సర్ ఎంసి మేరీ కోమ్, హాకీ జట్టు కెప్టెన్ మన్ ప్రీత్ సింగ్ నాయకత్వం వహించనున్నారు. వీరితో పాటు భారత ఒలింపిక్ సంఘం అధ్యక్షుడు కూడా ఈ ఒలింపిక్స్ కు వెళ్లనున్నట్లు స్వయంగా ప్రకటించారు. ఒలింపిక్స్ కు వెళ్లనున్న అతి పెద్ద భారత జట్టు ఇదే కావడం విశేషం. వీరిలో 67 మంది అబ్బాయిలు, 52 మంది మహిళా క్రీడాకారులు ఉన్నట్లు నరిందర్ బాత్రా స్పష్టం చేశారు. ఈ సందర్భంగా మన దేశం నుండి కచ్చితంగా మెడల్స్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఎవరికీ ఉన్నాయి.. ఏ విభాగంలో ఉన్నాయనే వివరాలను తెలుసుకుందాం...

Sirisha Bandla:అంతరిక్ష యానాన్ని అలవోకగా పూర్తి చేసిన తెలుగమ్మాయి శిరీష...Sirisha Bandla:అంతరిక్ష యానాన్ని అలవోకగా పూర్తి చేసిన తెలుగమ్మాయి శిరీష...

కుస్తీ..

కుస్తీ..

ఈ విభాగంలో ఏడు మంది పాల్గొంటున్నారు. వారి వివరాలు ఇలా ఉన్నాయి.

సీమా బిస్లా (50 కిలోలు)

వినేష్ ఫోగాట్ (53 కిలోలు)

అన్షు మాలిక్ (57 కిలోలు)

సోనమ్ మాలిక్ (62 కిలోలు)

రవి కుమార్ దహియా (57 కిలోలు)

బజరంగ్ పునియా (65 కిలోలు)

దీపక్ పునియా (86 కిలోలు)

షూటింగ్..

షూటింగ్..

ఈ విభాగంలో ఈసారి అధిక మంది పాల్గొననున్నారు. వారి వివరాలు ఇలా ఉన్నాయి.

మహిళల ఎయిర్ రైఫిల్ విభాగంలో అంజుమ్ మౌద్గిల్, అపుర్వి చందేల్ -10మీటర్లు

పురుషుల ఎయిర్ రైఫిల్ విభాగంలో దివ్యన్ష్ సింగ్ పన్వర్, దీపక్ కుమార్ - 10 మీటర్లు

మహిళల ఎయిర్ పిస్టల్ విభాగంలో మను భాకర్, యశ్విని సింగ్ దేస్వాల్ - 10 మీటర్లు

పురుషుల ఎయిర్ పిస్టల్ విభాగంలో సౌరభ్ చౌదరి, అభిషేక్ వర్మ - 10 మీటర్లు

మహిళల పిస్టల్ విభాగంలో రాహి సర్నోబాట్, ఎలవెనిన్ వలరివన్ - 25 మీటర్లు

మహిళల రైఫిల్ విభాగంలో తేజస్వినీ సావంత్ - 50 మీటర్లు

పురుషుల రైఫిల్ విభాగంలో సంజీవ్ రాజ్ పుత్, ప్రతాప్ సింగ్ తోమర్ - 50 మీటర్లు

వీరితో పాటు అంగద్ వీర్ సింగ్ బజ్వా, మైరాజ్ అహ్మద్ ఖాన్ లు పాల్గొననున్నారు.

హాకీ..

హాకీ..

భారతదేశం తరపున పురుషులు, మహిళా హాకీ క్రీడాకారులందరూ పాల్గొననున్నారు.

బ్యాడ్మింటన్..

బ్యాడ్మింటన్..

బ్యాడ్మింటన్ మహిళల సింగిల్స్ విభాగంలో పివి సింధు భారతదేశం నుండి ప్రాతినిధ్యం వహించనున్నారు. ఈ తెలుగు క్రీడాకారిణి ఇప్పటికే ఓసారి పతకం సాధించింది. ఇప్పుడు ఈమెపై అంచనాలు భారీగానే ఉన్నాయి. ఇక పురుషుల విభాగంలో బి.సాయి ప్రణీత్ పాల్గొననున్నాడు.

పురుషుల డబుల్స్ విభాగంలో సాత్విక్ రాజ్ రాంకీరెడ్డి మరియు చిరాగ్ శెట్టి పాల్గొననున్నారు.

విలు విద్య..

విలు విద్య..

ఈ విభాగంలో అతను దాస్, తరుణ్ దీప్ రాయ్, ప్రవీణ్ జాదవి పురుషుల విభాగంలో పాల్గొననున్నారు. ఇక మహిళా విభాగంలో దీపికా కుమారి ఒక్కరే పాల్గొంటున్నారు.

బాక్సింగ్..

బాక్సింగ్..

ఈ విభాగంలో మహిళల తరపున ఎంసి మేరీకోమ్ (51 కిలోలు), సిమ్రాంజిత్ కౌర్ (60 కిలోలు), లోవ్లినా బోర్గో హైన్ (69 కిలోలు), పూజా రాణి (75 కిలోలు) పాల్గొననుండగా.. పురుషుల విభాగంలో అమిత్ పంగల్ (52 కిలోలు), మనీష్ కౌశిక్ (63 కిలోలు), వికాస్ క్రిషన్ (69 కిలోలు), అశిష్ కుమార్ (75 కిలోలు), సతీష్ కుమార్ (91 కిలోలు)

వెయిట్ లిఫ్టింగ్..

వెయిట్ లిఫ్టింగ్..

ఈ విభాగంలో మహిళల తరపున మీరాబాయి చాను ఒక్కరే పాల్గొంటున్నారు.

ఇతర క్రీడలు..

ఇతర క్రీడలు..

అవినాష్ పురుషుల విభాగంలో 3 వేల మీటర్ల స్టీపుల్ చేస్..

మురళి శ్రీ శంకర్ పురుషుల విభాగంలో లాంగ్ జంప్..

ఎంపి జబరీ - 400 మీటర్లు..

నీరజ్ చోప్రా, శివపాల్ సింగ్ జావెలిన్ త్రో

తాజిందర్ పాల్ సింగ్ టూర్ - షాట్ పుట్

అన్నూ రాణి- జావెలిన్ త్రోయర్

ద్యుతి చంద్ - మహిళల 100, 200 మీటర్ల పరుగు పందెంలో

కెటి ఇర్ఫాన్, సందీప్ కుమార్, రాహుల్ రోహిల్లా 20 కిలోమీటర్ల రేసులో, భావ్నా జాట్ ప్రియాంక గోస్వామి మహిళల 20 కిలోమీటర్లు

400 మీటర్ల విభాగంలో, పురుషులు మహిళా క్రీడాకారులు పాల్గొననున్నారు.

హార్స్ రేస్..

హార్స్ రేస్..

ఈ విభాగంలో ఫవాద్ మీర్జా ఒక్కరే పాల్గొననున్నారు.

ఫెన్సింగ్

ఫెన్సింగ్

భవానీ దేవి ఒక్కరే ఈ విభాగంలో పాల్గొంటారు.

గోల్ఫ్..

గోల్ఫ్..

ఈ విభాగంలో అనిర్సన్ లాహిరి, ఉదయన్ మానే, అదితి అశోక్

జిమ్నాస్టిక్..

జిమ్నాస్టిక్..

ప్రణతి నాయక్ ఈ విభాగంలో పాల్గొంటారు.

జూడో

జూడో

సుశీలా దేవి లిక్మాబమ్

రోయింగ్..

రోయింగ్..

అర్జున్ జాట్ మరియు అరవింద్ సింగ్ టీమ్

సెయిలింగ్..

సెయిలింగ్..

నేత్రా కుమనన్, లేజర్ రేడియల్

విష్ణు శరవణన్, లేజర్ స్టాండర్డ్స్

కె.సి.గణపతి, వరుణ్ ఠక్కర్

స్విమ్మింగ్..

స్విమ్మింగ్..

పురుషుల విభాగంలో సజన్ ప్రకాష్ - 200 మీటర్లు

శ్రీహరి నటరాజా - 100 మీటర్లు బ్యాక్ స్ట్రోక్

మహిళల విభాగంలో మన్హ పటేల్ - 100 మీటర్లు

టేబుల్ టెన్నిస్..

టేబుల్ టెన్నిస్..

పురుషుల విభాగంలో శరత్ కమల్, సత్యన్ జ్ణానశేఖరన్

మహిళల విభాగంలో సుతీర్త్ ముఖర్జీ, మణిక బాత్రా

మిక్స్ డబుల్స్ విభాగంలో శరత్ కమల్ మరియు మణిక బాగ్రా

టెన్నిస్..

టెన్నిస్..

ఉమెన్స్ డబుల్స్ లో సానియా మీర్జా - అంకితా రైనా

English summary

Tokyo Olympics List Of All Indian Players Qualified For The Event

Here is the full list of all Indian players qualified for the Tokyo Olympics 2020. Have a look
Story first published:Thursday, July 15, 2021, 18:22 [IST]
Desktop Bottom Promotion