For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

HBD RajTarun : రాజ్ తరుణ్ గురించి మనం నమ్మలేని నిజాలు...

మే 11వ తేదీ ఈ కుర్రహీరో పుట్టినరోజు సందర్భంగా కొన్ని ఆసక్తికరమైన విషయాలను తెలుసుకుందాం...

|

తెలుగు సినిమాల్లో విభిన్నమైన కథాంశాలతో తొలి మూడు సినిమాలైన 'ఉయ్యాల జంపాల' 'సినిమా చూపిస్తా మావ' 'కుమారి 21ఎఫ్'తో హ్యాట్రిక్ కొట్టిన హీరీల్లో తనకంటూ ఓ ప్రత్యేక స్థానం సంపాదించుకున్నాడు రాజ్ తరుణ్.

దీంతో తెలుగు సినీ ఇండస్ట్రీలో రాజ్ తరుణ్ ఒక్కసారిగా డిమాండ్ ఉన్న హీరోగా మారిపోయాడు. అనతికాలంలో పెద్ద స్టార్ అయ్యే టాలెంట్ ఉన్న కుర్రహీరోగా పేరు సంపాదించాడు. మాములుగా డైరెక్టర్ అవుదామని సినిమా రంగంలోకి అడుగుపెడితే, అనుకోకుండా హీరోగా అవకాశం వచ్చింది. అసలు తనకు ఈ అవకాశం ఎలా వచ్చింది? ఎందుకు వచ్చింది అనే విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం...

దీంతో తెలుగు సినీ ఇండస్ట్రీలో రాజ్ తరుణ్ ఒక్కసారిగా డిమాండ్ ఉన్న హీరోగా మారిపోయాడు. అనతికాలంలో పెద్ద స్టార్ అయ్యే టాలెంట్ ఉన్న కుర్రహీరోగా పేరు సంపాదించాడు. మాములుగా డైరెక్టర్ అవుదామని సినిమా రంగంలోకి అడుగుపెడితే, అనుకోకుండా హీరోగా అవకాశం వచ్చింది. అసలు తనకు ఈ అవకాశం ఎలా వచ్చింది? ఎందుకు వచ్చింది అనే విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం...

రాజ్ తరుణ్ బాల్యం..

రాజ్ తరుణ్ బాల్యం..

రాజ్ తరుణ్ 1992లో మే 11వ తేదీన ఆంధ్రప్రదేశ్ లోని విశాఖపట్నంలో జన్మించాడు. ఈయన తండ్రి పేరు బసవరాజు. ఈయన బ్యాంకు ఉద్యోగం చేసేవాడు. తల్లి ఇంటిదగ్గరే ఉండేవారు. వీరిద్దరికి ఏకైక సంతానం రాజ్ తరుణ్. తండ్రిది శ్రీకాకుళం. తల్లి గోదావరి. అయితే వీరు ఉద్యోగరీత్యా విశాఖపట్నంలో సెటిల్ అయ్యారు.

విద్యాభ్యాసం..

విద్యాభ్యాసం..

రాజ్ తరుణ్ తన ప్రాథమిక విద్యనంతా విశాఖపట్నంలోనే పూర్తి చేశాడు. ఇంటర్మీడియట్ పూర్తయ్యాక ఎంసెట్ రాశాడు. అందులో మంచి ర్యాంకు రావడంతో ఎంవిజిఆర్ కాలేజీలో ఇంజినీరింగ్ సీటు వచ్చింది. అయితే ఆరు నెలల మాత్రమే కాలేజీకి వెళ్లాడట.

సినిమాలంటే ఆసక్తి ఉండేది కాదట..

సినిమాలంటే ఆసక్తి ఉండేది కాదట..

రాజ్ తరుణ్ కు మొదట్లో సినిమాలంటే అస్సలు ఆసక్తి ఉండేది కాదట. అయితే తాను 8వ తరగతి చదువుతున్న సమయంలో తనకు ప్రమాదవశాత్తు కాలికి దెబ్బ తగిలిందట. దీంతో మూడు నెలల పాటు ఇంటి పరిమితమవ్వడంతో తన స్నేహితులకు చెప్పి రోజుకు మూడు సినిమాలను సిడీలు తెప్పించుకుని మరీ చూసేవాడట. అలాగే పుస్తకాలు కూడా చదివేవాడట.

కాలేజీ సమయంలో..

కాలేజీ సమయంలో..

రాజ్ తరుణ్ ఇంజినీరింగ్ చదువుతుతున్న సమయంలో ఒకసారి స్నేహితులతో కలిసి మహేష్ బాబు నటించిన ఒక్కడు సినిమాకు వెళ్లాడట. అది తనకు బాగా నచ్చడంతో మళ్లీ మళ్లీ వెళ్లి చూసేవాడట. అప్పటి నుండి మహేష్ బాబుకు వీరాభిమానిగా మారిపోయారట.

డైరెక్టర్ అవుదామనుకుని..

డైరెక్టర్ అవుదామనుకుని..

ఆ తర్వాత తానే డైరెక్టర్ అవుదామనుకుని, తానే స్వయంగా కథలు రాసుకుని, తన మిత్రుడు సుభాష్ తో కలిసి షార్ట్ ఫిల్ములు తీసేవాడట. వాటిని యూట్యూబ్ లో పెట్టడంతో వాటికి విపరీతమైన స్పందన వచ్చింది.

కెమెరా గిఫ్ట్..

కెమెరా గిఫ్ట్..

ఆ వీడియోలను తన తండ్రికి చూపించగా ఆయన రాజ్ తరుణ్ ను మెచ్చుకుని, అప్పటి డైరెక్టర్ మంచి కెమెరా గిఫ్ట్ గా ఇచ్చారట. అప్పటి నుండి పూర్తిస్థాయి షార్ట్ ఫిల్మ్ డైరెక్టర్ గా మారిపోయాడట రాజ్ తరుణ్. ఎప్పుడూ సినిమాలు చూడటం, పుస్తకాలను చదవడం చేసేవాడట. అలా చాలా సినిమాలకు తానే డైలాగ్స్, కథలు రాసుకుని తానే నటించాడు.

మొదట్లో చాలా కష్టాలు..

మొదట్లో చాలా కష్టాలు..

అలా సినిమా డైరెక్టర్ అవుదామనే ఆశతో హైదరాబాద్ లో అడుగుపెట్టిన రాజ్ తరుణ్ కు తొలి ఆరునెలల పాటు అడుగడుగునా అవమానాలు ఎదురయ్యేవట. ఎన్ని ఆడిషన్లకు వెళ్లినా, ఎన్ని షార్ట్ ఫిల్మ్ లు చూపించినా నిరాశే ఎదురయ్యేదట. కొన్నిరోజులైతే మరీ దారుణంగా ఎక్కడ పెట్రోల్ బంకుల వద్ద పడుకునేవారట. కొన్నిసార్లు పస్తులు కూడా ఉండేవాడట. దీంతో పార్ట్ టైమ్ జాబ్ చేస్తూ తన ఖర్చులు తనే చూసుకునేవాడట.

అనుకోకుండా హీరోగా..

అనుకోకుండా హీరోగా..

ఎట్టకేలకు అసిస్టెంట్ డైరెక్టర్ గా ఒకసారి అవకాశం వచ్చినప్పటికీ, నిర్మాత అప్పుడు కొన్ని సమస్యల్లో ఉండేవారట. అయితే అతను ఆర్థిక సమస్యల నుండి గట్టెక్కడంతో రాజ్ తరుణ్ ని మరోసారి పిలిపించి సినిమా చేద్దామని చెప్పాడట. అయితే వారి సినిమాకు హీరో కోసం ఎన్ని ఆడిషన్లు నిర్వహించినా, ఎవ్వరు సెట్ అవ్వలేదట. దీంతో ఆ నిర్మాత రాజ్ తరుణ్ నే హీరోగా చేయమన్నాడట. అలా ‘ఉయ్యాల జంపాల‘లో తనకు హీరోగా అవకాశం వచ్చింది.

ప్రేక్షకుల ప్రశంసలు..

ప్రేక్షకుల ప్రశంసలు..

తన తొలి సినిమాలోనే ప్రేక్షకుల ప్రశంసలు అందుకున్న రాజ్ తరుణ్ తర్వాత వరుసగా ‘సినిమా చూపిస్తా మావ‘, కుమారి 21ఎఫ్ సినిమాలో నటించి వరుసగా హ్యాట్రిక్ హిట్లు కొట్టాడు. దీంతో రాజ్ తరుణ్ కు కొద్ది రోజుల్లోనే మంచి గుర్తింపు వచ్చింది. అలా డైరెక్టర్ అవుదామని సినిమా ఇండస్ట్రీకి వచ్చి హీరోగా మంచి పేరు సంపాదించుకున్నాడు.

English summary

Unknown facts about Actor Raj Tarun

Here we talking about unknown facts about actor raj tarun. Read on
Story first published:Monday, May 11, 2020, 18:07 [IST]
Desktop Bottom Promotion