For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

పక్కింటి కుర్రాడిలా కనిపించే ఇస్మార్ట్ రామ్ గురించి మనం నమ్మలేని నిజాలు...

|

రామ్ పోతినేని అనే కంటే ఇస్మార్ట్ రామ్ లేదా ఇస్మార్ట్ శంకర్ అంటే అందరూ టక్కున గుర్తు పట్టేస్తారు. అంతేకాదు ఎనర్జీకి మారుపేరుగా రామ్ అని చెప్పడంలో ఎలాంటి శక్తి అతిశయోక్తి అవసరం లేదు.

ఎందుకంటే తెలుగు వెండి తెరపై అతని హుషారు చూస్తే ఎవ్వరికైనా ఇట్టే హుషారు వచ్చేస్తుంది. అంతేకాదు ఉత్సాహం అతని నటనను చూస్తే ఉప్పొంగిపోతుంది. మైనర్ గా ఉన్నప్పుడే హీరోగా నటించి తన టాలెంట్ ఏంటో నిరూపించుకున్నాడు.

'రాము'డు మంచి బాలుడు అనే దానిని 'రామ్'డు ఎనర్జీటిక్ వీరుడు అని కొత్త కూడా చెప్పొచ్చు. అంతలా అతని నటన ఉంటుంది. అలాంటి రామ్ ని చూస్తే ఒక్కోసారి మన పక్కింటి కుర్రాడిలా అనిపిస్తాడు. ఒక్కోసారి రామ్ లా మనం ఉంటే ఎంత బాగుంటుందో అనిపించేంతలా చేస్తాడు.

అలాంటి రామ్ లో చురుకుదనం, నటనలో అతని వేగం, టైమింగ్ ఎవ్వరికైనా నచ్చేస్తాయి. మొత్తానికి ఈతరం యువతకు అతను ఓ రోల్ మోడల్ లా కనిపిస్తుంటాడు. అలాంటి రామ్ పుట్టినరోజు ఈరోజు(మే 15). ఈ సందర్భంగా తన గురించి కొన్ని ఆసక్తికరమైన విశేషాలను తెలుసుకుందాం...

రామ్ బాల్యం..

రామ్ బాల్యం..

1988వ సంత్సరం మే 15వ తేదీన పోతినేని మురళీమోహన్, పద్మశ్రీ దంపతులకు హైదరాబాద్ లో జన్మించాడు. ఈయన షేర్ మార్కెట్ లో పని చేస్తారు. హైదరాబాదులోనే మూడేళ్లు ఉండి, ఆ తర్వాత విజయవాడకు ప్రాథమిక విద్య కోసం వెళ్లాడు. ఆ తర్వాత చెన్నైకు వెళ్లి చదువుకున్నాడు.

చదువుకునే రోజుల్లోనే..

చదువుకునే రోజుల్లోనే..

రామ్ చిన్ననాటి నుండి హీరో కావాలని కలలు కనేవాడంట. అలా స్కూల్ లో ఓ రోజు టీచర్ అందరినీ పెద్దయ్యాక ఏమవుతారని అడిగితే వారంతా డాక్టర్, ఇంజనీర్, సైంటిస్ట్ అవుతామని చెబితే, రామ్ మాత్రం ఆరేళ్ల వయసులోనే హీరో అవుతానని చెప్పాడట.

స్పోర్ట్స్ లోనూ యాక్టివ్ గా..

స్పోర్ట్స్ లోనూ యాక్టివ్ గా..

రామ్ చిన్ననాటి బాగా చదువుకునే వాడట. ప్రతి తరగతిలోనూ 100 మార్కులకు గాను సుమారు 90కి పైగా మార్కులు తెచ్చుకునేవాడట. అయితే ఆ ప్రోగ్రెస్ కార్డును ఇంట్లో చూపించేవాడు కాదట. ఒకవేళ ఇంట్లో అవి చూసి ఎప్పుడూ చదువుకోమని చెబుతారేమోనని అది చూపించేవాడు కాదట. ఒక్కోసారి తను రాసే పరీక్షలో ప్రశ్నలకు జవాబులు తెలిసిన కేవలం 70 నుండి 80 మార్కులు వచ్చే వాటికే సమాధానాలు రాసేవాడట. అంతేకాదు స్పోర్ట్స్ లోనూ యాక్టివ్ గా పాల్గొనేవాడట.

సెలవుల సమయంలో..

సెలవుల సమయంలో..

అంతేకాదు ఆరో తరగతి పూర్తయిన వెంటనే వేసవి సెలవుల సమయంలో తమిళంలోనే ఓ షార్ట్ ఫిల్మ్ లో కూడా నటించాడట. అందులో మాదక ద్రవ్యాలకు బానిసగా ఉండే పాత్ర అది కూడా 16 ఏళ్ల వయసు ఉండేది. అందులో అద్భుతంగా నటించాడట. కానీ అప్పటికీ రామ్ వయసు కేవలం 11 ఏళ్లే..

ఇంటర్నేషనల్ అవార్డు..

ఇంటర్నేషనల్ అవార్డు..

తను నటించిన ఆ షార్ట్ ఫిల్మ్ ను 60 దేశాలు పాల్గొన్న ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ లో ప్రదర్శించగా, అందులో రామ్ నటనకు ఇంటర్నేషనల్ అవార్డు దక్కింది. ఈ షార్ట్ ఫిల్మ్ తర్వాతే తనకు నేరుగా సినిమాల్లో అవకాశం వచ్చిందట.

టెన్త్ పూర్తయిన వెంటనే..

టెన్త్ పూర్తయిన వెంటనే..

అయితే రామ్ పదో తరగతి పూర్తి చేసిన వెంటనే వైవిఎస్ చౌదరి కంట్లో పడ్డాడట. తను రాసుకున్న కథకు ఈ రామ్ సరిగ్గా సరిపోతాడని అనుకుని, ఆ విషయం రామ్ కు చెప్పి ఒప్పించాడట. అయితే తన తల్లిదండ్రులు గురించిన అడిగినప్పుడు, తన పెదనాన్న ప్రముఖ నిర్మాత స్రవంతి కిశోర్ అని చెప్పాడట.

దేవదాసుతో ఎంట్రీ..

దేవదాసుతో ఎంట్రీ..

అయితే ఆ డైరెక్టర్ వెంటనే స్రవంతి కిశోర్ ను కలిసి తాను రాసుకున్న కథకు రామ్ సరిగ్గా సరిపోతాడని చెబితే, అప్పుడు తను మాత్రం రామ్ ఇంకా చిన్నపిల్లాడే కదా ఏమి చేస్తాడులే అంటే, వైవిఎస్ చౌదరి మాత్రం పట్టుబట్టి మరీ ఆయనను ఒప్పించారట.

తొలి సినిమాతోనే..

తొలి సినిమాతోనే..

దేవదాసుతో తెలుగు వెండి తెరపై ప్రస్థానాన్ని ప్రారంభించిన రామ్ తన తొలి సినిమాలోనే నటనతో పాటు డ్యాన్సులతోనూ అదరగొట్టేశాడు. ఆ తర్వాత జగడం సినిమాలో నటింటి మాస్ లుక్ కూడా సంపాదించుకున్నాడు. అయితే అది ఫెయిల్ అయినా మరో మంచి సినిమాతో వచ్చి తెలుగు ప్రేక్షకులను అలరించాడు.

కథల ఎంపిక విషయంలో..

కథల ఎంపిక విషయంలో..

అయితే ఒకప్పుడు కథల ఎంపిక విషయంలో కొంత గందరగోళంలో ఉన్న రామ్, ప్రస్తుతం తన తీరును పూర్తిగా మార్చుకున్నారు. ప్రస్తుతం కొత్త తరహా కథలకు పెద్ద పీట వేస్తున్నాడు. అవి కూడా బాగా కలిసొస్తున్నాయి. ఈ నేపథ్యంలో ‘ఇస్మార్ట్ శంకర్‘ పూర్తిగా భిన్నమైన సినిమాను చేశాడు. అది ఎంతలా సూపర్ హిట్ అయ్యిందో అందరికీ తెలిసిందే. ఇలాంటి కొత్త చిత్రాలతో మరింతగా ప్రేక్షకులను అలరించాలని బోల్డ్ స్కై తెలుగు కోరుకుంటోంది. హ్యాపీ బర్త్ డే టు రామ్.

English summary

Unknown Facts about Actor Ram Pothineni

Here we talking about unknown facts about actor ram pothineni. Read on.
Story first published: Friday, May 15, 2020, 16:32 [IST]
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Boldsky sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Boldsky website. However, you can change your cookie settings at any time. Learn more