For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

పండిట్ జవహార్ లాల్ నెహ్రూ గురించి ఆసక్తికరమైన విషయాలను తెలుసుకోండి..

నెహ్రూ 15 ఏళ్ల వయసులోనే ఉన్నత విద్యను అభ్యసించేందుకు నెహ్రూ ఇంగ్లండ్ దేశానికి వెళ్లారు. అక్కడి కేంబ్రిడ్జ్ యూనివర్సిటీలో చదివారు.

|

పండిట్ జవహార్ లాల్ నెహ్రూ మన భారతదేశానికి తొలి ప్రధానమంత్రి అని చాలా మందికి తెలుసు. పండిట్ నెహ్రూ ప్రధానమంత్రిగా నిరంతరాయంగా పని చేసినప్పటికీ, పిల్లలపై మాత్రం ప్రత్యేక ప్రేమ, అనురాగాలను చూపేవారు. ఆయనకు పిల్లలపై ఉన్న అభిమానం కారణంగా ఆయన పుట్టినతేదీ నవంబర్ 14వ తేదీన ప్రతి సంవత్సరం బాలల దినోత్సవాన్ని జరుపుకుంటారు.

Jawaharlal Nehru

అయితే పిల్లలంటే నెహ్రూకు అంత ప్రేమ ఎందుకు? పండిట్ నెహ్రూ ఇంకా ఏమేమి ఇష్టపడేవారు? ఆయన జైలుకు వెళ్లిన సమయంలో ఏమి చేసేవారు? అనే ఆసక్తికరమైన విషయాలన్నింటినీ ఈ స్టోరీలో తెలుసుకుందాం.

నెహ్రూ గురించి మీకు తెలియని నిజాలు..

నెహ్రూ గురించి మీకు తెలియని నిజాలు..

పండిట్ జవహార్ లాల్ నెహ్రూ ఉత్తరప్రదేశ్ లోని అలహాబాద్ లో 1889 నవంబర్ 14వ తేదీన జన్మించారు. ఆయన ప్రాథమిక విద్య అంతా అంతా అక్కడే ఇంటి దగ్గరే ప్రైవేటు ఉపాధ్యాయుల వద్దే సాగింది.

2) నెహ్రూ విద్యాభ్యాసం..

2) నెహ్రూ విద్యాభ్యాసం..

నెహ్రూ 15 ఏళ్ల వయసులోనే ఉన్నత విద్యను అభ్యసించేందుకు నెహ్రూ ఇంగ్లండ్ దేశానికి వెళ్లారు. అక్కడి కేంబ్రిడ్జ్ యూనివర్సిటీలో చదివారు. అనంతరం ఇన్నర్ టెంపుల్ అనే ప్రఖ్యాత పేరు గల న్యాయ విద్యా సంస్థలో చేరి న్యాయశాస్త్రాన్ని అభ్యసించారు. విద్యార్థిగా ఉన్న దశలోనే నెహ్రూ బ్రిటీష్ వారి పాలనను వ్యతిరేకించాడు. అదే సమయంలో ఆనాడు విదేశీయుల పాలను వ్యతిరేకంగా జరుగుతున్న షిన్ ఫెయిన్ ఉద్యమాన్ని ఆసక్తితో గమనించారు.

1912లో స్వదేశానికి..

1912లో స్వదేశానికి..

విదేశాలలో విద్యాభ్యాసం ముగించుకుని నెహ్రూ స్వదేశానికి తిరిగి వచ్చారు. అనంతరం వెంటనే ఆయన స్వాతంత్య్ర ఉద్యమంలో పాల్గొన్నారు. అదే ఏడాది బీహార్ లోని బంకీ పూర్లో జరిగిన భారత జాతీయ కాంగ్రెస్ మహాసభలకు ప్రతినిధిగా నెహ్రూ హాజరయ్యారు. 1916లో తొలిసారి గాంధీని కలిశారు. 1920లో ఆయన ఉత్తరప్రదేశ్ లో మొట్టమొదటిసారి రైతుల తరపున ర్యాలీ నిర్వహించారు.

రెండు సార్లు జైలుకు..

రెండు సార్లు జైలుకు..

అనంతరం సహాయ నిరాకరణ ఉద్యమంలో భాగంగా నెహ్రూ 1920-22 మధ్య కాలంలో రెండుసార్లు జైలుకు వెళ్లారు. ఆ సమయంలోనే చాలా మంది స్వాతంత్య్ర సమరయోధులను, ఔత్సాహిక రచయితలను కలుసుకున్నారు.

నెహ్రూ జాకెట్ లో ఎల్లప్పుడు గులాబీ..

నెహ్రూ జాకెట్ లో ఎల్లప్పుడు గులాబీ..

ప్రస్తుత రాజకీయ నాయకులకు ఇష్టమైన వస్త్రధారణను కనిపెట్టిన మొదటి వ్యక్తి కూడా పండిట్ నెహ్రూనే. స్వాతంత్య్రానికి పూర్వం చాలా మంది రాజకీయ నాయకులు తెల్లటి వస్త్రాలను మాత్రమే ధరించేవారు. ఈ సంప్రదాయం కాస్త నెహ్రూ వచ్చాక మారిపోయింది. అలాగే నెహ్రూ ఎప్పుడైనా ఏ వస్త్రాలు ధరించినా తన జాకెట్ లో గులాబీ మొగ్గను ఉంచుకునే వాడు.

11 సార్లు నోబెల్ బహుమతికి ఎంపికైనా..

11 సార్లు నోబెల్ బహుమతికి ఎంపికైనా..

అందరికీ నెహ్రూ అంటే మన దేశానికి తొలి ప్రధానమంత్రిగానే తెలుసు. కానీ నెహ్రూ కూడా గాంధీలాగే మంచి పేరును సంపాదించారు. 1950 నుండి 1955 మధ్య కాలంలో ఆయన 11 సార్లు నోబెల్ బహుమతికి ఎంపికయ్యారు. కానీ ఒక్కసారి కూడా ఆయనకు నోబెల్ బహుమతి రాకపోవడం గమనార్హం.

నెహ్రూ ధూమపాన ప్రేమికుడు..

నెహ్రూ ధూమపాన ప్రేమికుడు..

నెహ్రూ ధూమపాన ప్రేమికుడు. ఆయన 555 అనే బ్రాండ్ సిగరెట్ ను కాల్చేవారు. ఒకసారి నెహ్రూ భోపాల్‌ను సందర్శించినప్పుడు, అతను తనతో సిగరెట్లు తీసుకెళ్లడం మర్చిపోయాడు. అతని బ్రాండ్ సిగరెట్లు భోపాల్ మార్కెట్లో ఎక్కడా కనిపించలేదు. తన సిగరెట్‌కు ఇష్టమైన బ్రాండ్‌ను తీసుకురావడానికి నెహ్రూ భోపాల్ నుంచి ఇండోర్‌కు ఫ్లైట్ పంపాడు. కొన్ని ప్యాక్ సిగరెట్లను విమానాశ్రయానికి పంపిన తరువాత విమానం తిరిగి వచ్చింది. సిగరెట్ ఆరోగ్యానికి హానికరం అయినప్పటికీ ఆయన ధూమపానాన్ని అమితంగా ఇష్టపడేవారు.

దేశంపై లోతైన పరిశీలన..

దేశంపై లోతైన పరిశీలన..

పండిట్ నెహ్రూ భారతదేశం గురించి లోతైన పరిశీలన చేశారు. అది ఆయన రచించిన ‘‘డిస్కవరీ ఆఫ్ ఇండియా‘‘లో చూడవచ్చు. నెహ్రూ పండితుల వారసత్వం అయిన కాశ్మీరీ పండిట్ల కుటుంబానికి చెందినవారు. ఆయన రచించిన "భారత్ ఏక్ ఖోజ్" నిర్మించబడింది. ప్రదర్శన / చిత్రం చరిత్రపూర్వ కాలం నుండి భారతదేశం యొక్క స్వాతంత్ర్యం వరకు భారతదేశ మొత్తం చరిత్రను వివరిస్తుంది.

జైలు నుండే ఉత్తరాలు..

జైలు నుండే ఉత్తరాలు..

స్వాతంత్ర్య పోరాటంలో భాగంగా నెహ్రూ జైల్లో ఉన్నప్పుడు తన కుమార్తె ఇందిరకు ఎన్నో ఉత్తరాలు రాశారు. స్వతహాగా రచయిత అయిన పండిట్ నెహ్రూ తన కుమార్తెకు రాసిన ఉత్తరాల్లో ఎన్నో గొప్ప విషయాలను చెప్పేవారు. పిల్లలు ఎలా ఉండాలి? పిల్లలకు ఎలాంటి విషయాలు నేర్పాలి? వారు ఎలాంటి విషయాలను నేర్చుకోవాలి? సమాజంలో మంచి, చెడులను ఎలా గ్రహించాలి? సమస్యలను ఎలా అధిగమించాలి తదితర విషయాలను కూలంకషంగా వివరించేవారు.

నెహ్రూ స్ఫూర్తితోనే..

నెహ్రూ స్ఫూర్తితోనే..

పండిట్ నెహ్రూ నింపిన స్ఫూర్తి, ధైర్యంతోనే ఇందిర ‘ఉక్కు మహిళ‘గా రూపొందారు. ప్రధానమంత్రిగా ఆమె పలు సాహసోపేతమైన నిర్ణయాలు తీసుకొని దేశాన్ని ముందుకు నడిపారు. తన కూతురు ఇందిరకు నెహ్రూ రాసిన ఉత్తరాలు ప్రస్తుత జనరేషనుకు పాఠాలుగా మారాయి. ఆయన చెప్పిన ఎన్నో మంచి మాటలు మనం ఎప్పటికీ ఆచరించదగినవే..

అలీన విధానంలో నెహ్రూ కీలక పాత్ర..

అలీన విధానంలో నెహ్రూ కీలక పాత్ర..

మన దేశానికి స్వాతంత్య్రం కోసం పోరాడిన వారిలో గాంధీజీ తర్వాత రెండో ప్రముఖ నాయకుడిగా జవహార్ లాల్ నెహ్రూ అవతరించారు. తొలి ప్రధానమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత విదేశాంగ విధానంలో సోషలిజం వైపు మొగ్గు చూపి రష్యాతో మైత్రికి ప్రాధాన్యత ఇచ్చారు. చైనాతో పంచశీల ఒప్పందం.. అలీన విధానం ప్రతిపాదించిన త్రిమూర్తులలో నెహ్రూ ఒకరుగా ప్రసిద్ధి చెందారు. అంతేకాదు పంచవర్ష ప్రణాళికలను ప్రారంభించి దేశం ఆర్థికంగా ముందుకు వెళ్లేందుకు ఎంతగానో దోహదం చేశారు.

నెహ్రూ దార్శనికత..

నెహ్రూ దార్శనికత..

ప్రధానమంత్రిగా నెహ్రూ అనుసరించిన విధానాలు మన దేశం ఆర్థికంగా బలపడటానికి పునాదులు వేశాయి. నెహ్రూ దార్శనికత, ముందుచూపు వల్లే ఇవి సాధ్యమయ్యాయి.

నెహ్రూ గ్రంథాలు..

నెహ్రూ గ్రంథాలు..

స్వతహాగా రచయిత అయిన పండిట్ నెహ్రు తన రచనలతో జాతీయ ఉద్యమంలో కీలక పాత్ర పోషించారు. ఆయన మన దేశానికి స్వాతంత్య్రం కోసం పలు సార్లు జైలుకు వెళ్లారు. అదే సమయంలోనే అక్కడ ఉన్నప్పుడే ‘గ్లింప్సెస్ ఆఫ్ వరల్డ్ హిస్టరీ, ‘ది డిస్కవరీ ఆఫ్ ఇండియా‘ గ్రంథాలను రచించారు. అలాగే తన ఆత్మకథను కూడా రాశారు. ‘‘టువార్డ్స్ ఇండిపెండెన్స్‘‘ పేరుతో నెహ్రూ రచించిన పుస్తకం 1936లో అమెరికాలో ప్రచురితమైంది.

గుండెపోటుతో మరణం..

గుండెపోటుతో మరణం..

పండిట్ నెహ్రూ 1964లో మే 27వ తేదీన గుండెపోటుతో మరణించారు. ఆయన అంత్యక్రియలకు 1.5మిలియన్ల మంది హాజరయ్యారు. గాంధీజీ అంత్యక్రియల తర్వాత నెహ్రూ అంత్యక్రియలకు అత్యధిక సంఖ్యలో ప్రజలు తరలివచ్చారు.

English summary

Unknown Facts about Jawaharlal Nehru

Here we talking about unknown facts about jawaharlal nehru. Read on
Desktop Bottom Promotion