For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

తరుణ్ గోగోయ్ ఎవరు? తన గురించి మనం నమ్మలేని నిజాలు...

తరుణ్ గోగోయ్ ఎవరు? తన గురించి మనం నమ్మలేని నిజాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం.

|

అస్సాం రాష్ట్రానికి సుదీర్ఘకాలం ముఖ్యమంత్రిగా పని చేసిన వ్యక్తిగా తరుణ్ గోగోయ్ చరిత్రలో నిలిచారు. కాంగ్రెస్ పార్టీ నేతగా కూడా ఈయన దేశ రాజకీయాల్లో కూడా కీలకపాత్రను పోషించారు. సుమారు 50 ఏళ్ల పాటు రాజకీయ రంగంలో గడిపిన ఈయన నవంబర్ 23వ తేదీన సోమవారం నాడు గౌహతిలోని ఆసుపత్రిలో తుదిశ్వాస విడిచారు.

Who was Tarun Gogoi? Unknown facts about the Congress Veteran

అస్సాంలో కాంగ్రెస్ ను 2001 నుండి 2016 వరకు మూడు సార్లు అధికారంలో నిలబెట్టారు. అంతేకాదు మూడు సార్లు ముఖ్యమంత్రిగా.. ఆరు సార్లు పార్లమెంటు సభ్యునిగా సేవలందించారు. ఈయన కాంగ్రెస్ పార్టీ, కేంద్ర ప్రభుత్వం, అస్సాం రాష్ట్ర పరిపాలనలోనూ అనేక పదవులను అలంకరించారు. ఈ సందర్భంగా ఆయన గురించి మరిన్ని ఆసక్తికరమైన విషయాలను తెలుసుకుందాం...

తరుణ్ గోగోయ్ జననం..

తరుణ్ గోగోయ్ జననం..

అస్సాం రాష్ట్రంలోని పూర్వపు శివసాగర్ జిల్లాలోని రంగజన్ టీ ఎస్టేట్ లో చాలా జాతి అస్సామీ తాయ్-అహోమ్ కుటుంబంలో తరుణ్ గోగోయ్ 1936, ఏప్రిల్ 1వ తేదీన జన్మించారు. ఇప్పుడు దానికి అస్సాంలోని జోర్హాట్ జిల్లాగా పేరు పెట్టారు. తన తల్లిదండ్రులు పునాకోన్ అని ప్రేమగా పిలిచే గోగోయ్, టీ ఎస్టేట్ లో వైద్య నిపుణులైన డాక్టర్ కమలేశ్వర్ గోగోయ్ మరియు ‘ఉయార్ సమాహార్ కవితా సంకలనానికి ప్రసిద్ధి చెందిన తల్లి ఉషా గోగోయికి జన్మించారు.

ప్రాథమిక విద్య..

ప్రాథమిక విద్య..

తరుణ్ గోగోయ్ తన ప్రాథమిక విద్యనంతా నెంబర్ 26 రంగజన్ నిమ్నా బునియాడి విద్యాలయంలో జోర్హాట్ మదర్సా స్కూల్ కు వెళ్లడానికి ముందు నాలుగో తరగతి వరకు చదివాడు. అక్కడి నుండి జోర్హాట్ లోని ప్రభుత్వ పాఠశాలలో ఉన్నత చదువుల నిమిత్తం వెళ్లారు. అక్కడే హెఎస్ ఎల్ సిలో ఉత్తీర్ణత సాధించాడు.

డాలీ గోగోయ్ తో వివాహం..

డాలీ గోగోయ్ తో వివాహం..

హైస్కూల్ ఎడ్యుకేషన్ పూర్తయిన తర్వాత జగన్నాథ్ బరూవా కళాశాల నుండి గ్రాడ్యుయేషన్ పూర్తి చేశాడు. ఆ తర్వాత గౌహతి విశ్వవిద్యాలయం నుండి ఎల్ ఎల్ బి పూర్తి చేశాడు. ఆ తర్వాత 1972లో గౌహతి యూనివర్సిటీ నుండి జువాలజీలో పిజి పూర్తి చేసిన డాలి గోగోయ్ ను వివాహం చేసుకున్నాడు.

1971లో తొలిసారి ఎంపిగా..

1971లో తొలిసారి ఎంపిగా..

తను యూనివర్సిటీలో చదువుతున్న సమయంలోనే విద్యార్థి సంఘం నాయకుడిగా... తన రాజకీయ జీవితాన్ని ప్రారంభించారు. అలా మొట్టమొదటిసారిగా 1971లో పార్లమెంటు సభ్యునికి ఎన్నికయ్యారు. ఆ తర్వాత మొత్తం ఆరు పర్యాయాలు లోక్ సభకు ఎన్నికయ్యారు. తను మొదట జోర్హాట్ పార్లమెంటరీ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహించాడు. ఆ తర్వాత కాలియాబోర్ నుండి ఎన్నికయ్యాడు.

పలు పదవుల అలంకరణ..

పలు పదవుల అలంకరణ..

1976లో అఖిల భారత కాంగ్రెస్ కమిటీ(ఎఐసిసి) సంయుక్త కార్యదర్శిగా ఎన్నికైన తర్వాత అప్పటి ప్రధానమంత్రి ఇందిరా గాంధీ సహాయంతో జాతీయస్థాయిని సంపాదించాడు. అంతేకాదు 1986-90లో అస్సాం ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ(ఐపిసిసి) అధ్యక్షుడిగా కూడా పని చేశాడు. మాజీ ప్రధాని పివి నరసింహరావు హాయంలో కూడా కేంద్రమంత్రిగా పని చేశారు.

అస్సాం ముఖ్యమంత్రిగా..

అస్సాం ముఖ్యమంత్రిగా..

ఆ తర్వాత అస్సాం ముఖ్యమంత్రిగా శాసనసభలో అడుగుపెట్టారు. అక్కడ కూడా నాలుగు పర్యాయాలు ఎమ్మెల్యేగా గెలుపొందారు. 1996-98లో మార్గరీటా శాసనసభ నియోజకవర్గానికి, 2001లో టైటాబార్ నియోజకవర్గాలకు ప్రాతినిధ్యం వహించారు.

వరుసగా మూడుసార్లు..

వరుసగా మూడుసార్లు..

తరుణ్ గోగోయ్ 2001, 2006 మరియు 2011 సంవత్సరాల్లో వరుసగా మూడుసార్లు కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకువచ్చారు. హ్యాట్రిక్ సిఎంగా రికార్డు నెలకొల్పారు. అయితే వచ్చే ఎన్నికల్లో తాను ముఖ్యమంత్రిగా ఉండనని, కేవలం రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు సలహాదారుగా ఉంటానని ప్రకటించారు. కానీ అంతలోనే కన్నుమూశారు.

English summary

Who was Tarun Gogoi? Unknown facts about the Congress Veteran

Checkout the facts about the ex cm Tarun Gogoi. Read on,
Desktop Bottom Promotion