For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

World Book day 2020 : కరోనా కాలంలో పుస్తకాల విలువేంటో తెలిసి వస్తోంది...

నిజంగా పుస్తకాలకు అంతటి శక్తి ఉంటుందా లేదా అనే విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం...

|

ఒక మంచి పుసక్తం.. కొన్ని కోట్ల అక్షరాలను తనలో దాచుకున్న తరగని గని. ప్రతి ఒక్కరినీ పదాలతో పలకరించే నేస్తం.. కేవలం ఒకే ఒక సిరా చుక్కతో ప్రపంచాన్ని మన కళ్ల ముందు నిలబెడుతుంది.

World Book day 2020 : Unknown facts about books

అంతేకాదు వీసా, పాస్ పోర్ట్ తో పాటు పైసా ఖర్చు లేకుండా ప్రపంచాన్ని చుట్టి రావాలంటే అది కేవలం పుస్తక పఠనంతో సాధ్యమని చెబుతుంటారు మేధావులు. అంతేకాదు పుస్తక పఠనంతో మానవ మేధస్సు పెరుగుతుందని కూడా చెబుతున్నారు. అంతర్జాతీయ పుస్తక దినోత్సవం సందర్భంగా వీటి గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలను తెలుసుకుందాం....

భవిష్యత్తుకు మార్గదర్శకంగా..

భవిష్యత్తుకు మార్గదర్శకంగా..

చరిత్రను చెబుతూ వర్తమానంలో ఉండే మనకు భవిష్యత్తు గురించి గుర్తు చేస్తుంది. తప్పుల నుండి గుణపాఠాలు కూడా ఎలా నేర్చుకోవాలో చెబుతుంది పుస్తకం. అందుకే చిరిగినా చొక్కా అయినా తొడుక్కో.. కానీ ఓ మంచి పుస్తకం కొనుక్కో అన్నాడు ఓ గొప్ప మహనుభావాడు.

పుస్తకాల ప్రభావం..

పుస్తకాల ప్రభావం..

మేధావులంతా ఏదో ఒక పుస్తకం ద్వారా ప్రభావితం అయినవారే. ఆ ప్రభావంతోనే తమ జీవితంలో ఎన్నో మలుపులను, మైలురాళ్లను చేరుకున్నారు. ఎందరో కవులు, రచయితలు, జర్నలిస్టులు, కళాకారులు, ఇలా ఒక్కరేమిటి, ఓనమాలు నేర్చుకున్న వారంతా చేతుల్లో పుస్తకాలను పట్టుకున్న వారే అని మీకు తెలుసా.

స్మార్గ్ ఫోన్ కాలంలోనూ..

స్మార్గ్ ఫోన్ కాలంలోనూ..

కంప్యూటర్, స్మార్ట్ ఫోన్ కాలంలోనూ పుస్తకాల ప్రాధాన్యత ఏ మాత్రం తగ్గలేదని చెప్పుకోవచ్చు. చరిత్ర, సైన్స్, పాలిటిక్స్, పర్సనాలిటీ డెవలప్ మెంట్ ఇలా ఏ విషయమైనా సరే వాటి గురించి మనం సంపూర్ణంగా తెలుసుకోవాలంటే.. వారి చేతిలో పుస్తకం తప్పనిసరిగా ఉండాల్సిందేనని అంటున్నారు మేధావులు.

అంతర్జాలంలో అన్నీ ఉన్నా...

అంతర్జాలంలో అన్నీ ఉన్నా...

ప్రస్తుతం అంతర్జాలంలో సమస్త సమాచారం ఉన్నప్పటికీ, పుస్తకాలు చదివే వారి సంఖ్య ప్రతి సంవత్సరం పెరుగుతూనే ఉందని కొన్ని అధ్యయనాలలో తేలింది. అందుకే పలు నగరాల్లో ఎప్పుడు బుక్ ఫెయిర్ జరిగినా యువతతో పాటు అందరిలోనూ మంచి స్పందన కనపిస్తోంది.

చదివి వదిలేయకుండా...

చదివి వదిలేయకుండా...

అయితే ఎవరైనా ఏవైనా పుస్తకాలను చదివినప్పుడు.. వాటిని అలా చదివి వదిలేయకుండా.. అందులో ఉండే మంచి విషయాలను ఆచరణలో పెట్టాలి. అయితే పుస్తకాలంటే మీరు మార్కుల కోసం చదివేవి కాదు. అవి కేవలం పరీక్షల సమయంలోనే ఉపయోగపడతాయి. అవి ఆ సమయంలోనే చదవాలి. అయితే జీవితంలో ఎదురయ్యే సమస్యలను ఎలా ఎదుర్కోవాలి అనే విషయాలకు సంబంధించినవి. ప్రేరణాత్మక పుస్తకాలను చదవాలి.

ఉన్నత స్థాయిని చేరుకునేందుకు..

ఉన్నత స్థాయిని చేరుకునేందుకు..

అయితే కొన్నిరకాల పుస్తకాలను రిటైర్ అయినప్పుడు లేదా వయసు పైబడినప్పుడో, బాధ్యతలన్నీ వదిలేసినప్పుడో చదివితే ఫలితం పెద్దగా ఉండదు. యుక్త వయసులో ఉన్నప్పుడే, వీటిని చదవాలి. అంతే కాదు ఆచరణలో కూడా పెట్టాలి. అప్పుడే మీరు ఉన్నత స్థాయిని అందుకోగలరు.

కోట్ల పుస్తకాల విక్రయం..

కోట్ల పుస్తకాల విక్రయం..

కొన్ని కోట్లకు పైగా కాపీలు అమ్ముడై ఎందరో జీవితాల్లో మార్పులు తీసుకొచ్చిన కొన్ని పుస్తకాల గురించి ఇక్కడ మాట్లాడుకుందాం. ‘రిచ్ డాడీ & పూర్ డాడీ‘, ‘హౌ టు విన్ ఫ్రెండ్స్ & ఇన్ ఫ్ల్యూయెన్స్ పీపుల్(How to win friends & influence people), ‘థింక్ అండ్ గ్రో రిచ్‘ ‘ది లా ఆఫ్ అట్రాక్షన్‘ వంటి పుస్తకాలను తప్పక చదవాలని మేధావులు సూచిస్తున్నారు.

కోట్ల పుస్తకాల విక్రయం..

కోట్ల పుస్తకాల విక్రయం..

చిన్నతనం నుండే పుస్తకాలపై ఆసక్తి పెరిగేలా తల్లిదండ్రులు ఎక్కువ శ్రద్ధ చూపాలంటున్నారు మేధావులు. స్మార్ట్ ఫోన్, టివిలు, ఇంటర్నెట్ కు పిల్లలు బానిసలుగా మారకుండా చిన్ననాటి నుండే పిల్లలకు పుస్తక పఠనం అలవాటు చేస్తే వారి భవిష్యత్తుకు బంగారు బాటలు వేయొచ్చని కూడా చెబుతున్నారు మేధావులు. అంతర్జాతీయ పుస్తక దినోత్సవం సందర్భంగా ప్రతి ఒక్కరూ బుక్ రీడింగ్ పై ఆసక్తిని పెంపొందించుకుంటారని ఆశిద్దాం...

English summary

World Book day 2020 : Unknown facts about books

Here we talking about world book day 2020 : unknown facts about books. Read on
Story first published:Thursday, April 23, 2020, 15:05 [IST]
Desktop Bottom Promotion