For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ప్రపంచ అవయవ దాన దినోత్సవ ప్రాముఖ్యత, వాస్తవాలు

|

ప్రస్తుత మన భారతదేశంలో చాలా మందికి రక్తదానం, నేత్రదానం గురించి మాత్రమే ఎక్కువగా తెలుసు. కానీ అతికొద్ది మందికి మాత్రమే వీటిపై సరైన అవగాహన ఉంది. వీటిని మించిన దానమే అవయవదానం. దీనిపై మన దేశంలో చాలా మందికి అవగాహన లేకపోవడం బాధాకరం. ఒకప్పుడు అన్నిదానాల కన్నా అన్నదానం మిన్న అనేవారు. కానీ ఇప్పుడు కాలం మారింది. తరం కూడా మారింది. కాబట్టి ఆ అన్నదానానికి మించిన దానం మరొకటి వచ్చింది. అదే అవయవదానం. ఇదంతా ఆధునిక వైద్యం వల్ల సాధ్యమవుతోంది. ఈ విషయం తెలుసుకున్న కొందరు ఇప్పుడిప్పుడే అవయవదానం ఇవ్వడానికి ముందుకు వస్తున్నారు. ఇది చాలా సంతోషించాల్సిన విషయం. ప్రతి ఏడాది అంతర్జాతీయ అవయవదాన దినోత్సవాన్ని ఆగస్టు 13వ తేదీన జరుపుకుంటారు. అవయవ దానం వల్ల కలిగే లాభాలేంటో.. వాటి ప్రాముఖ్యతలేంటో ఈ స్టోరీలో తెలుసుకుందాం.

తక్కువగా దాతల సంఖ్య..

తక్కువగా దాతల సంఖ్య..

మరణించిన వారి అవయవాలను దానం చేస్తే అది ప్రజలను ప్రేరేపించటానికి, ఒక వ్యక్తి జీవితంలో దాని విలువను అర్థం చేసుకునేందుకు, అవగాహన పెంచుకునేందుకు అది దోహదం చేస్తుంది. అంతేకాదు దాత యొక్క అవయవం భద్రంగా నిల్వ ఉంచబడుతుంది. ఎప్పుడైతే అత్యవసరంగా గ్రహీతకు అవసరమవుతుందో అప్పుడే అది బదిలీ చేయబడుతుంది. ఆ అవయవ మార్పిడితో ఎవ్వరైనా కొత్త జీవితాన్ని తిరిగి పొందే అవకాశముంటుంది. కానీ దురదృష్టవశాత్తు ఈ అవయవదాన ప్రక్రియకు సంబంధించి అనేక అపొహలు, గందరగోళం కారణంగా దాతల సంఖ్య తక్కువగా ఉంటోంది.

ఒక్కదాతతో 8 మంది ప్రాణాలకు రక్షణ..

ఒక్కదాతతో 8 మంది ప్రాణాలకు రక్షణ..

అవయవదానం ద్వారా ఒక్క అవయవ దాత ద్వారా ఏకంగా ఎనిమిది మంది ప్రాణాలను కాపాడొచ్చని వైద్య నిపుణులు చెబుతున్నారు. ప్రతి సంవత్సరం 5 లక్షలకు పైగా ప్రజలు వారి ముఖ్యమైన అవయవాల వైఫల్యం కారణంగా మరణిస్తున్నట్లు ఓ నివేదిక ద్వారా తెలిసింది. ఆధునిక వైద్యం ద్వారా మీరు చనిపోయిన సమయంలో మీ శరీరంలోని చాలా రకాల భాగాలు ఇతరులకు అమరిస్తే వారి ప్రాణాన్ని, జీవితాన్ని నిలబెట్టే అద్భుత అవకాశం మీకు కలుగుతుంది.

అవయవదానంపై అవగాహన తక్కువ..

అవయవదానంపై అవగాహన తక్కువ..

ఈ ఆర్గాన్ డొనేట్ పై మన భారతదేశంలో పూర్తిస్థాయిలో ప్రజలకు కనీస అవగాహన లేదు. కానీ పలు స్వచ్ఛంద సంస్థలు చేస్తున్న ప్రచారాలు కొంతమేరకు ఫలితాలను ఇస్తున్నాయి. ఇది నమ్మిన కొందరు అవయవదానానికి ఉత్సాహంగా ముందుకొస్తున్నారు. వారితో పాటు వారి కుటుంబసభ్యులను కూడా ఒప్పిస్తున్నారు. పలు ఆస్పత్రులతో ముందే ఒప్పందాలు చేయించుకుంటున్నారు.

బతికున్నప్పుడు కూడా కొన్నింటిని దానం చేయొచ్చు..

బతికున్నప్పుడు కూడా కొన్నింటిని దానం చేయొచ్చు..

కిడ్నీ, ఎముకమజ్జ, రక్తం, కాలేయంలో కొంత భాగం, ఊపిరితిత్తుల్లో కొంతభాగం, పాంక్రియాస్ లో కొంతభాగం ఇవ్వొచ్చు. అయితే ఇందులో ఎవరెవరికి ఏవేవీ సెట్ అవుతాయో వాటిని మాత్రమే వైద్యలు అమర్చడానికి నిర్ణయిస్తారు. రక్తం గురించి అందరికీ తెలిసిందే. అది వారి గ్రూపులను బట్టి ఏ వ్యక్తికి సరిపోతుందో వారికే దానం చేస్తారు. ఎముకమజ్జ, కాలేయం, ఊపిరితిత్తులు వంటివి అయితే కేవలం రక్త సంబంధీకులకు మాత్రమే పనికొస్తాయి.

సహజ మరణం చెందిన వ్యక్తిలో పనికొచ్చే అవయవాలు..

సహజ మరణం చెందిన వ్యక్తిలో పనికొచ్చే అవయవాలు..

కళ్లు, గుండె వాల్వ్ లు, చర్మం, ఎముకలు, కార్టిలాజ్, నరాలు.

అదే బ్రెయిన్ డెడ్ అయిన వ్యక్తిలో పనికొచ్చే అవయవాలు..

కిడ్నీలు, కాలేయం, ఊపిరితిత్తులు, పాంక్రియాస్, చిన్నపేగు, స్వరపేటిక, చేతులు, యుటెరస్, అండాలు, కళ్లు, చర్మం, ఎముకలు, కార్టిలాజ్, నరాలు, కాలి వేళ్లు, చేతి వేళ్లు, మధ్య చెవి ఎముకలు.

అవయవాలు అమర్చేందుకు ఎంత సమయం పడుతుందంటే..

అవయవాలు అమర్చేందుకు ఎంత సమయం పడుతుందంటే..

గుండె - ఆరు గంటలు

ఊపిరితిత్తులు - ఆరు గంటలు

కాలేయం - 12 గంటలు

పాంక్రియాస్ - 24 గంటలు

కిడ్నీ - 48 గంటలు

ఎవరెవరు అవయవదానం చేయొచ్చు?

ఎవరెవరు అవయవదానం చేయొచ్చు?

ఆరోగ్యవంతంగా ఉన్న ప్రతి ఒక్కరూ అవయవ దానాలు చేయొచ్చు. క్యాన్సర్ రోగులు సైతం కార్నియాను దానం చేయొచ్చు. ఇంకా వయస్సుల వారీగా కింది విధంగా దానం చేయొచ్చు.

వందేళ్ల వయసు ఉన్నవారు : కార్నియాలు, చర్మం

70 ఏళ్ల వరకు : కిడ్నీలు, కాలేయం

50 ఏళ్ల వరకు : గుండె, ఊపిరితిత్తులు

అవయవదానం ఎందుకు చేయాలంటే..

అవయవదానం ఎందుకు చేయాలంటే..

మన భారతదేశంలో సుమారు లక్షన్నర మంది కిడ్నీ వ్యాధితో బాధపడుతూ కిడ్నీల కోసం ఎంతో ఆశతో ఎదురుచూస్తున్నారు. ఇప్పటికీ వారిలో కేవలం 3 వేల మంది మాత్రమే కిడ్నీ దాతలు దొరుకుతున్నారు. దీంతో దాదాపు 90 శాతం మంది దాతల్లేక పాడైన అవయవాలతో చనిపోతున్నారు. ఇదొక్కటే కాదు మరో 25 వేల మంది కాలేయ మార్పిడి చేయించుకోవాల్సి ఉండగా వారికి 800 మంది మాత్రమే కాలేయ దాతలు దొరుకుతున్నారు. ఇలాంటి వారందరినీ కాపాడటం కోసం, వారి కొత్త జీవితాన్ని ఇవ్వటం కోసం మనం మన అవయవ దానాలు చేయాలి. మనం తుదిశ్వాస విడిచాకే మన శరీరం నుంచి అవయవాలు సేకరిస్తారు కాబట్టి మనం చనిపోయాక కూడా ఇతరుల జీవితాల్లో వెలుగులు నింపే సదావకాశాన్ని అవయవదానం కల్పిస్తోంది. ఇందుకోసం మీరు బతికున్నప్పుడే ఆర్గాన్ డోనర్ కింద పేరు నమోదు చేయించుకోండి.

English summary

World Organ Donation Day 2019: Date, Importance And Facts

Experts say that eight lives can be saved by a single organ donor. According to a report, over 5 lakh people die every year due to failure of their vital organs. With modern medicine, when you die, many parts of your body are implanted into others, giving you a wonderful chance to save their lives and lives.
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Boldsky sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Boldsky website. However, you can change your cookie settings at any time. Learn more