For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

వరల్డ్ ఓజోన్ డే 2020 : మనం డేంజర్ జోన్ సేఫ్ జోనులోకొచ్చామంటున్న శాస్త్రవేత్తలు...

|

ఓజోన్ పొర యొక్క విలువ తెలియక చాలా మంది 'పొర'పాట్లు చేస్తున్నారు. సూర్యుని నుంచి వచ్చే అతినీల లోహిత కిరణాలు నేరుగా మన మీద పడకుండా ఇది ఎంతగానో సహాయపడుతుంది. ఈ విషయం చాలా మందికి తెలియదు. అందుకే దీనిపై అవగాహన కల్పించేందుకు.. ఐక్యరాజ్య సమితి ఓజోన్ పరిరక్షణ కోసం ప్రపంచ దేశాలకు పిలుపునిచ్చింది. సెప్టెంబర్ 16వ తేదీన ప్రపంచ ఓజోన్ పరిరక్షణ దినంగా ప్రకటించింది.

35 సంవత్సరాల క్రితం వియన్నాలో ఐక్యరాజ్యసమితి పర్యావరణ పరిరక్షణ కార్యక్రమం(UNEP) చేపట్టింది. అప్పటి నుండి వీరు చేస్తున్న ప్రయత్నాలు ఫలించాయా? ఇప్పుడు పూర్వపు వైభవం వచ్చిందా?

ప్రతి సంవత్సరం ఓజోన్ పొర కోలుకుంటోందా? అసలు ఓజోన్ పొర చరిత్ర మరియు దాని ప్రాముఖ్యత ఏంటి.. దాన్ని మనం ఎందుకు కాపాడుకోవాలి, దాన్ని రక్షించడానికి ఎలాంటి మార్గాలను అనుసరించాలి అనే ఆసక్తికరమైన విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం...

ఓజోన్ లేకపోతే..

మనం నివసించే ప్రాంతంలో కొంచెం వేడి పెరిగితే చాలు, కాలు బయటకు పెట్టడానికి కూడా భయపడిపోతాం. భగభగమండే సూర్యుని కిరణాలు నేరుగా మనపై పడితే మనం ఏ మాత్రం తట్టుకోలేం. అలా మన మీద నేరుగా ఆ కిరణాలు పడకుండా కాపాడుతుండేది ఒక్క ఓజోన్ పొర అనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. ఇది భూమి చుట్టూ ఒక గొడుగులా ఆవరించి కవచంలా ఉండి మనల్ని కాపాడుతుంది. ఈ పొర గనుక లేకపోతే భూమి అగ్నిగుండంగా మారి ఉండేది.

ఓజోన్ పరిరక్షణకు..

ఓజోన్ పరిరక్షణకు..

ఓజోన్ పొర పరిరక్షణ కోసం ఐక్యరాజ్యసమితి 1985లో ఓ సమావేశం నిర్వహించింది. దీనికి వాటిల్లుతున్న ముప్పును గుర్తించి, దీన్ని అరికట్టాలని నిపుణులు, శాస్త్రవేత్తలందరూ నిర్ణయించారు. ఈ నేపథ్యంలో 1994 సెప్టెంబర్ 16న జరిగిన మరో సమావేశంలో ఓజోన్ పొర క్షీణతను అరికట్టేందుకు, ప్రతి ఏటా అంతర్జాతీయ ఓజోన్ పరిరక్షణ దినోత్సవంగా జరపాలని నిర్ణయించారు.

అలా కనుగొన్నారు..

అలా కనుగొన్నారు..

సూర్యుడి నుండి వచ్చే అతినీలలోహిత కిరణాలు మన మీద పడకుండా, మనల్ని కాపాడే ఓజోన్ పొరను 1930లో శాస్త్రవేత్తలు కనుగొన్నారు. ఇది భూ ఉపరితలంపై స్ట్రాటోస్పియర్ ఆవరణంలో ఓజోన్ ఉంటుంది. ఇది 25 నుండి 35 కిలోమీటర్ల ఎత్తులో ఎక్కువగా ఆవరించి ఉంటుంది. స్ట్రాటోస్పియర్ ఆవరణలో 0.6 పీపీఎం ఓజోన్ ఉంది. క్లోరోఫాం కార్బన్ ఉపయోగించడం స్ట్రాటోస్పియర్ లో వేడి పెరుగుతుంది. దీంతో ఓజోన్ పొరకు ముప్పు వాటిల్లుతోంది.

పాలపైన మీగడ వంటిది..

పాలపైన మీగడ వంటిది..

మనం చేసే ప్రతి పనిలోనూ ఓజోన్ పొరను దెబ్బతీస్తోంది. భూతాపం పెరిగినా, వర్షాలు కురవకపోయినా, అడవులు తగ్గిపోయినా, కాలుష్యం ఎక్కువగా మారినా ఓజోన్ పొరకు తీవ్ర విఘాతం కలుగుతుంది. మీకు అర్థమయ్యే భాషలో చెప్పాలంటే సింపుల్ గా పాల పైన ఉండే మీగడ వంటిదే ఈ ఓజోన్ వాయువు. ఒకవేళ ఆ పొర లేకపోతే ఆ కిరణాలు మనల్ని నేరుగా తాకేవి. మనకు అసలు ఈ భూమి మీద నూకలు అనేవే ఉండేవి కావు.

చర్మ క్యాన్సర్..

చర్మ క్యాన్సర్..

మితిమీరిన రసాయనాలు వాడటం, అధిక ఇంధనాన్ని ఉపయోగించడం, చెట్లను విపరీతంగా నరికేయడం వంటివి ఓజోన్ పొరను నాశనం చేస్తున్నాయి. ఈ పొర ఇలాగే విచ్ఛిన్న అయితే కోట్ల మంది ప్రజలు, జంతువులు, పక్షులు, చెట్లు అన్నిటిపైనా వ్యతిరేక ప్రభావం పడుతుంది. చర్మంపైనా తీవ్రమైన సూర్యకిరణాలు పడి క్యాన్సర్ వంటి రోగాలొచ్చే ప్రమాదమూ ఉంది.

కరోనా పుణ్యమా అని..

కరోనా పుణ్యమా అని..

అందరూ తిట్టుకుంటున్న కరోనా ఓజోన్ పొరకు పడిన రంధ్రాన్ని పూడుకుపోయేలా చేయడంలో మాత్రం బాగా సహాయపడింది. ప్రపంచవ్యాప్తంగా పలు దేశాల్లో విధించిన లాక్ డౌన్ కారణంగా ఆర్కిటిక్ హిమ ప్రాంతంపై ఏర్పడిన రంధ్రం.. చాలా త్వరగా పూడుకుపోయిందని శాస్త్రవేత్తలు ప్రకటించారు. కరోనా లాక్ డౌన్ వల్ల కాలుష్యం తగ్గడంతోనే ఇది తగ్గలేదని, ఉత్తరధ్రువంలో ఏర్పడిన పోలార్ వర్టెక్స్ బలహీన పడటం వల్లేనని తెలిపారు.

ఓజోన్ రక్షణ మన చేతుల్లోనే..

ఓజోన్ రక్షణ మన చేతుల్లోనే..

అపార్టుమెంట్లు, షాపింగ్ మాల్స్ నిర్మాణాల సమయంలోనే కనీసం 33 శాతం మొక్కలు, చెట్లు పెంచేందుకు స్థలం ఉండేలా నిబంధనలు తీసుకురావాలి. దీని కోసం బలమైన చట్టాలను రూపొందించాలి. మొక్కలు, చెట్లూ పెంచాలి. అడవుల నరికివేతను అడ్డుకోవాలి. మితిమీరిన ఇంధన వాడకాన్ని తగ్గించాలి. క్లోరో ఫ్లోరో కార్బన్ల వాడకాన్ని పూర్తిగా నిషేధించాలి. వీటికి ఎలాంటి మినహాయింపు ఇవ్వకూడదు. సోలార్ విద్యుత్ వాడకాన్ని పెంచి భూతాపాన్ని తగ్గించాలి. అప్పుడే ఓజోన్ పొర రక్షణకు వీలు కలుగుతుంది.

English summary

World Ozone Day 2020: Ozone Facts, Slogan And Significance In Telugu

Here we talking about the World Ozone Day 2020 : Ozone Facts, Slogans and Significance in Telugu. Read on...