For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

World Rhino Day 2021:ఖడ్గమృగాల గురించి ఈ ఆసక్తికరమైన విషయాలు తెలుసా?

ఖడ్గమృగాల గురించి ఆసక్తికరమైన విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం.

|

ప్రతి సంవత్సరం సెప్టెంబర్ 22వ తేదీకి ఎంతో ప్రాముఖ్యత ఉంది. ఈరోజునే క్యాన్సర్ రోగులకు ఉత్సాహాన్ని వరల్డ్ రోజ్ డే జరుపుకుంటారు. అదే సమయంలో ప్రపంచ ఖడ్గమృగాల దినోత్సవాన్ని కూడా జరుపుకుంటారు.

World Rhino Day 2021: Date, History, Theme, Significance and Interesting Facts about Rhino in Telugu

ఈరోజున ప్రపచంలోని ఖడ్గమృగాలపై ప్రజలకు అవగాహన కల్పిస్తారు. ముఖ్యంగా ఆఫ్రికా, ఆసియాలో కనిపించే వాటిని కాపాడేందుకు ఏయే చర్యలు తీసుకోవాలో సూచిస్తాయి. వీటిలో చాలా రకాలున్నాయి.. ఈ సందర్భంగా ప్రపంచ ఖడ్గమృగాల దినోత్సవం యొక్క చరిత్ర ఏంటి? దీని ప్రాముఖ్యత మరియు థీమ్ ఏంటనే ఆసక్తికరమైన విశేషాలను ఇప్పుడు తెలుసుకుందాం...

World Rose Day 2021:రోజ్ డేకు, క్యాన్సర్ రోగులకు ఉన్న సంబంధమేంటో తెలుసా...World Rose Day 2021:రోజ్ డేకు, క్యాన్సర్ రోగులకు ఉన్న సంబంధమేంటో తెలుసా...

2010 నుండి..

2010 నుండి..

ప్రపంచ ఖడ్గమృగాల దినోత్సవాన్ని 2010వ సంవత్సరం నుండి ప్రపంచ వ్యాప్తంగా జరుపుకుంటున్నారు. దక్షిణాఫ్రికాలో వరల్డ్ వైల్డ్ లైఫ్ ఫండ్ (WWF) ప్రపంచ ఖడ్గమృగాల దినోత్సవాన్ని ప్రకటించింది. 2011 సంవత్సరం నుడి ఈ దినోత్సవానికి మంచి ఆదరణ, గుర్తింపు లభించింది.

World Rhino Day 2021

World Rhino Day 2021

ఇప్పటివరకు ప్రపచం దేశాల్లో ఖడ్గమృగాల్లో ఐదు రకాలుగా ఉన్నాయని గుర్తించారు. అందులో ఆఫ్రికాకు చెందినవి నలుపు, తెలుపు రంగులో ఉంటాయి. ఆసియా ఖండంలో, ఇండోనేషియాలో ఒకటే కొమ్ముతో ఉంటాయి. ఇవి సుమత్రా, జావాలో ఎక్కువగా కనిపిస్తాయి. మన దేశంలో కూడా జావా వంటి రకమైన ఖడ్గమృగం అంటే ఒంటి కొమ్ము ఉండేవి ఎక్కువగా కనిపిస్తాయి. వీటిని సజీవంగా ఉంచేందుకు మనం ప్రయత్నం చేయాలి అనే ఈ దినోత్సవం యొక్క ఉద్దేశ్యం.

దీని వెంట్రుకలే..

దీని వెంట్రుకలే..

ఖడ్గమృగాలు ఎక్కువగా కదలలేవు. ఇవి ఎక్కడ ఉంటే అక్కడే గడ్డిని తింటూ ఉంటాయి. అయితే వీటికి తెలివి చాలా ఎక్కువగా ఉంటుంది. వీటి ముక్కు నుండి కొమ్ము పెరుగుతుంది. అందుకే వీటిని రైనోసెరెస్ అంటారు. దీనర్థం ముక్కు కొమ్ము. చూడటానికి ఏనుగు దంతలా కనిపించినా.. అది ఎముకతో జత అయ్యింది కాదు. దాని వెంట్రుకలే కొమ్ముల్లా మారతాయి. అయితే ఆ కొమ్ము చాలా బలంగా ఉంటుంది. ఇది తన కొమ్ముతో పొడిస్తే వారి ప్రాణానికి గ్యారంటీ తక్కువే.

శాఖాహారి అయినా..

శాఖాహారి అయినా..

ఈ ఖడ్గమృగాలు శాఖాహారి. ఇవి గడ్డి, మొక్కలను ఎక్కువగా తింటాయి. అయితే ఇవి ఇతర జంతువుల్ని వేటాడటం.. భయపెట్టడం.. హింసించడం వంటివి చేయవు. అయితే ఇవి చాలా బరువు ఉంటాయి. అది ఎంతంటే ఏకంగా 2,500 కిలోల బరువు వరకు పెరుగుతాయి. అంటే మనలో సుమారు 30 మంది బరువుతో సమానమని చెప్పొచ్చు. వీటి పొడవు కూడా సుమారు 1.8 మీటర్ల పొడవు ఉంటుంది.

పగటి పూట నిద్ర..

పగటి పూట నిద్ర..

ఈ జంతువులు ఎక్కువగా సూర్యాస్తమయంలో, చీకటి వేళలో ఆహారాన్ని తినడం ప్రారంభిస్తాయట. పగటిపూట ఎండ ఎక్కువగా ఉండటం వల్ల ఆ సమయంలో నిద్రకు ప్రాధాన్యత ఇస్తాయట. చల్లగా ఉండే బురద నీటిలో సేద తీరతాయి. వీటికి బురద అంటే చాలా ఇష్టమట. ఎందుకంటే వీటి చర్మం సూర్యుడి వేడిని తట్టుకోలేదు. అలాగే పురుగులు చర్మాన్ని కుట్టకుండా బురదతో కాపాడుకుంటాయట. అంతేకాదు ఇవి ఒంటరిగా ఉండేందుకు ఇష్టపడతాయట. అయితే వీటిలో వైట్ రైనోస్ మాత్రం గుంపులుగా ఉంటాయి. వీటి గుంపును crash అని పిలుస్తారు. అందులో ఆడ ఖడ్గమృగాలు, వాటి పిల్లలు కూడా కలిసి ఉంటాయట. ఇవి కూడా సరిహద్దులను పెట్టుకుని.. ఆ ప్రదేశం తమది అని సూచించేందుకు మూత్రాన్ని పోస్తాయట.

అరుదైన జీవుల్లో ఇదొకటి..

అరుదైన జీవుల్లో ఇదొకటి..

ప్రస్తుతం మన ప్రపంచంలోని అరుదైన జీవుల్లో ఈ ఖడ్గమృగాలు ఒకటి. ఇవి ప్రస్తుతానికి 29 వేలే జీవించి ఉన్నట్టు గణాంకాలు చెబుతున్నాయి. 20వ శతాబ్దంలో వీటి సంఖ్య 5 లక్షల దాకా ఉండేది. వీటి కొమ్ముల కోసం చాలా మంది వేటగాళ్లు వీటిని అక్రమంగా వేటాడటంతో వీటి సంఖ్య తగ్గిపోయింది. ఆసియా దేశాలలో ఈ కొమ్ములను రకరకాల మందుల తయారీలో వాడుతున్నారు. వీటి కొమ్ము కోసం వాటి ప్రాణం తీస్తున్నారు. తమకు రక్షణగా ఉండే కొమ్ము లేకపోవడంతో ఈ ఖడ్గమృగాలు ప్రాణాలు కోల్పోతున్నాయి.

FAQ's
  • ప్రపంచ ఖడ్గమృగాల దినోత్సవాన్ని ఎప్పుడు జరుపుకుంటారు?

    ప్రతి సంవత్సరం సెప్టెంబర్ 22వ తేదీన ప్రపంచ ఖడ్గమృగాల దినోత్సవాన్ని జరుపుకుంటారు. ఈరోజున వాటి గురించి ప్రజల్లో అవగాహన కల్పిస్తారు.

English summary

World Rhino Day 2021: Date, History, Theme, Significance and Interesting Facts about Rhino in Telugu

Here we are talking about the world rhino day 2021:date, history, theme, significance and interesting facts about rhino in Telugu. Have a look
Story first published:Wednesday, September 22, 2021, 11:37 [IST]
Desktop Bottom Promotion