For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

World Rose Day 2021:రోజ్ డేకు, క్యాన్సర్ రోగులకు ఉన్న సంబంధమేంటో తెలుసా...

రోజ్ డే థీమ్, చరిత్ర మరియు ప్రాముఖ్యత గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

|

సాధారణంగా 'రోజ్ డే' అనగానే మనలో చాలా మందికి ఫిబ్రవరి మాసమే గుర్తొస్తుంది. ఎందుకంటే వాలెంటైన్స్ వీక్ లో భాగంగా హ్యాపీ రోజ్ డేను జరుపుకుంటారు.

World Rose Day 2021: Know the History, Theme and Significance

ఈరోజున తమకిష్టమైన వారికి, తమ ప్రియమైన వారికి గులాబీ పూలు ఇచ్చి వేడుకలను జరుపుకుంటారు. అయితే చాలా మందికి ప్రపంచ గులాబీ దినోత్సవం గురించి చాలా మందికి తెలియదు. ఈరోజు క్యాన్సర్ రోగులకు అంకితం చేయబడింది. ప్రతి సంవత్సరం సెప్టెంబర్ 22వ తేదీన 'ప్రపంచ గులాబీ దినోత్సవం' జరుపుకుంటారు.

World Rose Day 2021: Know the History, Theme and Significance

ఈ దినోత్సవాన్ని క్యాన్సర్ రోగుల సంక్షేమం మరియు వారి బాధను పంచుకోవడానికి చిన్న ప్రయత్నంగా , వారికి ఈరోజున గులాబీలు ఇవ్వడం ద్వారా వారిని సంతోషంగా ఉంచేందుకు ప్రతి ఏటా ఈ దినోత్సవాన్ని జరుపుకుంటారు. ఈ సందర్భంగా 'వరల్డ్ రోజ్ డే' థీమ్ ఏంటి? దీని యొక్క చరిత్ర మరియు ప్రాముఖ్యత గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

రోజ్ డే చరిత్ర..

రోజ్ డే చరిత్ర..

ప్రతి సంవత్సరం సెప్టెంబర్ 22వ తేదీన మెలిండా రోజ్, కెనడా జ్ణాపకార్థం గులాబీ దినోత్సవాన్ని జరుపుకుంటారు. ఆమె క్యాన్సర్ బారిన పడినప్పటికీ, తను ఎంతో ధైర్యంగా మరియు శక్తి సామర్థ్యాలతో సుమారు ఆరు నెలల పాటు జీవించింది. ఈ ఆరు నెలల్లో తను క్యాన్సర్ ను ఓడించాలనే ఆశను అస్సలు వదులుకోలేదు.

2021 రోజ్ డే థీమ్..

2021 రోజ్ డే థీమ్..

తను క్యాన్సర్ రోగంతో బాధపడుతున్నప్పటికీ, క్యాన్సర్ రోగులతో సంతోషంగా గడిపారు. వారి జీవితంలో కొంత సంతోషాన్ని తీసుకురావడానికి చిన్న ప్రయత్నం చేశారు. తన వంతు ప్రయత్నంగా అందరికీ ప్రేరణనిచ్చే కవితలు, సందేశాలు, ఇ-మెయిల్ చేశారు. అందుకే ఆమె మరణించిన సెప్టెంబర్ 22వ తేదీన తన జ్ణాపకార్థం వరల్డ్ రోజ్ డే జరుపుకుంటారు. 2021లో వరల్డ్ రోజ్ డే థీమ్ ఏంటంటే.. ‘ఐ యామ్ అండ్ ఐ విల్'.

ఉత్సాహం కోసం..

ఉత్సాహం కోసం..

ప్రపంచ వ్యాప్తంగా ఎవరైతే క్యాన్సర్ వ్యాధితో పోరాడుతుంటారో.. వారిలో ఆశ మరియు ఉత్సాహాన్ని వ్యాప్తి చేసేందుకు ఈరోజు అంకితం చేయబడింది. ఎందుకంటే దాదాపు అన్ని క్యాన్సర్ చికిత్సలలో శారీరక నొప్పి ఎక్కువగా ఉంటుంది. కాబట్టి క్యాన్సర్ రోగులను సంతోషంగా ఉంచడం అనేది చాలా ముఖ్యం. ఈరోజును జరుపుకోవడం యొక్క ముఖ్య ఉద్దేశ్యం క్యాన్సర్ తో పోరాడే వ్యక్తులు సంతోషంగా జీవించడానికి మరియు వారి జీవితంలో ఆనందం కలిగించడానికి ప్రేరేపించడం, ప్రతి ఒక్కరికీ క్యాన్సర్ పై అవగాహన కల్పించడం. అందుకే ‘వరల్డ్ రోజ్ డే' రోజున క్యాన్సర్ వంటి ప్రాణాంతక వ్యాధితో పోరాడే శక్తిని అందించడానికి క్యాన్సర్ రోగులకు గులాబీని ఇస్తారు.

జీవితం ఇంకా ఉందని..

జీవితం ఇంకా ఉందని..

ఈరోజున గులాబీ పూలు ఇవ్వడం ద్వారా జీవితం అప్పుడే అయిపోలేదని.. ఇంకా జీవితం చాలా ఉందని సందేశం ఇవ్వబడింది. వరల్డ్ రోజ్ డే సందర్భంగా వారిలో ధైర్యాన్ని నింపే ప్రయత్నం చేశారు.

FAQ's
  • ప్రపంచ గులాబీ దినోత్సవాన్ని ఎప్పుడు జరుపుకుంటారు?

    ప్రపంచ వ్యాప్తంగా ప్రపంచ గులాబీ దినోత్సవాన్ని ప్రతి సంవత్సరం సెప్టెంబర్ 22వ తేదీన జరుపుకుంటారు. ఈరోజున క్యాన్సర్ రోగుల్లో ధైర్యం మరియు ఉత్సాహం నింపేందుకు ప్రయత్నిస్తారు.

English summary

World Rose Day 2021: Know the History, Theme and Significance

Here we are talking about the world rose day 2021: know the history, theme and significance. Have a look
Desktop Bottom Promotion