For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

అక్కడ మరణిస్తే ఏ జీవి శరీరం అయినా చెక్కు చెదరకుండా ఉంటుందా? నిజమేనంటున్న శాస్త్రవేత్తలు..

|

మన వీరబ్రహ్మం గారు చెప్పిన కాలజ్ఞానం ప్రకారం ఈ ప్రపంచంలో ఎన్నెన్నో వింతలు జరుగుతున్నాయి. ఇప్పటికే ఎన్నో వింతలు, విశేషాలను చూశాం. అయితే ఈ విషయం గురంచి వీరబ్రహ్మం గారు ఎక్కడ చెప్పినట్టు ఎలాంటి దాఖలాలు లేవు. ఎవరైనా మనిషి మరణించినా లేదా ఏదైనా జంతువు కాలం చెల్లినా ఆ మృతదేహాలు కొన్ని రోజులు లేదా కొన్ని నెలలు, మహా అయితే సంవత్సరాల వరకు చెక్కు చెదరకుండా ఉంటాయి.

కానీ ఓ కుక్క పిల్ల మరణించిన తర్వాత 18 వేల సంవత్సరాల వరకు ఆ జీవి శరీరం చెక్కుచెదరకుండా ఇప్పటికీ అలాగే ఉంది. ఈ విచిత్రమైన విషయాన్ని ఇటీవలే శాస్త్రవేత్తలు కనుగొన్నారు. అయితే కుక్క అని కొందరు అంటుంటే, మరికొందరు కాదు తోడేలు అని వాదిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈ జీవికి సంబంధించి పూర్తి వివరాలను ఈ స్టోరీలో తెలుసుకుందాం...

మంచుతో కప్పబడి..

దీన్ని కుక్కపిల్లగా తేల్చిన కొందరు పరిశోధకులు, ఇది చనిపోయినప్పుడు రెండు నెలల కన్నా తక్కువ వయసు కలిగి ఉందని నిర్ధారించారు. ఈ కుక్క పిల్ల ఏ విధంగా చనిపోయిందో అనే కారణాలు మాత్రం కనిపెట్టలేకపోయారు. ఈ కుక్క పిల్ల శరీరం పూర్తిగా మంచుతో కప్పబడి ఉండటంతో దాని మూతి, మీసాలు, వెంట్రుకలు అన్నీ సజీవంగా ఉన్నాయని చెబుతున్నారు.

కుక్క లేదా తోడేలా?

కుక్క లేదా తోడేలా?

PC : Curtosy

ఈ జీవిని పరిపూర్ణంగా పరిశీలించిన శాస్త్రవేత్తలు ఇది కుక్క లేదా తోడేలా అన్న విషయాన్ని కచ్చితంగా కనిపెట్టలేకపోయారు. ఇది తోడేలు పిల్ల లేదా కుక్క అనే విషయాన్ని నిర్ధారించడానికి దీనిక సంబంధించిన నమూనాలను స్వీడిష్ సెంటర్ ఫర్ పాలియోజెనెటిక్స్ (సిపిజి)కు పంపారు. స్వీడన్ శాస్త్రవేత్తల వివరాల మేరకు ఈ జంతువుకు 18,000 సంవత్సరాల వయస్సు ఉన్నట్లు నిర్ధారణకు వచ్చారు. అయితే అది కుక్క లేదా తోడేలా అన్న విషయాన్ని కనిపెట్టలేకపోయారు. కానీ ప్రస్తుతానికి దీనిని కుక్కగానే పరిగణనలోకి తీసుకున్నారు.

డోగోర్

డోగోర్

PC : Curtosy

ఈ జంతువుకు డోగోర్ అని పెట్టారు. ఇది రష్యాలోని ఈశాన్యంలోని ఇండిగిర్కా నది సమీపంలో ఘనీభవించిన భూమి గడ్డ లోపల ఖననం చేయబడిన మగ కుక్క పిల్లగా శాస్త్రవేత్తలు చెబుతున్నారు. దీని యొక్క పూర్తి శరీరం, మందపాటి జుట్టు, మూతి మరియు మీసాలు, వెంట్రుకలు కూడా శాశ్వత మంచు ద్వారా భద్రపరచబడ్డాయి.

పురాతన కుక్క..

పురాతన కుక్క..

PC : Curtosy

ఈ కుక్క చనిపోయే సమయానికి రెండు నెలల కన్నా తక్కువ వయసు ఉందని శాస్త్రవేత్తలు ఊహించారు. కానీ మరణానికి మాత్రం సరైన కారణాన్ని ఇంకా కనుక్కోలేదు. 18 వేల సంవత్సరాల నుండి సంపూర్ణంగా సంరక్షించబడిన ఈ కుక్క అతి పురాతనమైనది అని నిర్ధారణకు వచ్చారు.

ఎంతో పాతదో తెలీదు..

ఎంతో పాతదో తెలీదు..

PC : Curtosy

స్వీడన్ కు చెందిన లవ్ డాలన్ మరియు అతని సహోద్యోగి డేవ్ స్టాంటన్లు దీన్ని తొలిసారిగా ధ్రువీకరించారు. వీరు ఇంకా ఏమి చెబుతున్నారంటే దీనిని మేము కనుక్కోవడానికి ముందే ఇది అద్భుతంగా సంరక్షించబడింది. అయితే అది ఎంత పాతదో తెలియదు. దానిని మాత్రం శాశ్వత మంచులో కనుగొన్నారని వారు వివరించారు. అయితే అక్కడ కొన్ని వందల సంవత్సరాల లేదా కొన్ని దశాబ్దాలు మాత్రమే ఉన్న విషయాలు అక్కడ స్తంభింపజేస్తాయి అని వారు తెలిపారు.

అనేకమైన అపొహలు..

అనేకమైన అపొహలు..

దాన్ని కనిపెట్టినందుకు ఆ శాస్త్రవేత్తలు సంతోషం వ్యక్తం చేశారు. కాని రేడియో కార్బన్ డేటెడ్ వరకు ఆరోగ్యకరమైన అపొహలను కలిగి ఉన్నారు. దీనికి 18 వేల సంవత్సరాల వయస్సు ఉందని ఫలితాలు వచ్చినప్పుడు ఇది సహజంగా అద్భుతమైందని భావించారు. అలాగే ఆసక్తికరమైన కాలవ్యవధి వల్ల ఇక్కడ తోడేళ్లు మరియు కుక్కలు రెండింటినీ జన్యుపరంగా చాలా విషయాలు జరుగుతున్నట్లు నిర్ధారణకు వచ్చారు.

సొరంగంలో..

సొరంగంలో..

రష్యాలోని ఈశాన్య ప్రాంతంలోని సైబీరియా యొక్క మారుమూల ప్రాంతంలో, మంచు ప్రాంతంలో తుఫాను వచ్చే చట తవ్విన సొరంగంలో ఈ కుక్క పిల్లను కనిపెట్టినట్టు శాస్త్రవేత్తలు చెప్పారు. ఈ ఆవిష్కరణ గురించి తాము ఎంతో సంతోషంగా ఉన్నట్లు తెలిపారు. దీనిని స్వీడన్లో దాని పక్కటెముకలపై అధ్యయనం చేస్తున్నారు.

ట్విట్టర్లో ఇలా..

ట్విట్టర్లో ఇలా..

‘‘జినోమ్ విశ్లేషణలు ఇది మగ కుక్క పిల్లగా చూపుతోంది. కాబట్టి రష్యన్ సహోద్యోగులకు పేరు పెట్టమని అడగగా.. ఆ విధంగా కుక్క పిల్లకు డోగోర్ అని పేరు పెట్టారు. డోగోర్ అంటే అర్థం స్నేహితుడు. ఇది యాకుటియన్ పదం. ఇది చాలా సరైనది అనిపిస్తుంది‘‘.

English summary

Oldest dog in the world : 18,000 year old puppy found frozen in ice could be the Oldest Confirmed dog'in History

The scientists said their first round of results on the genome couldn't determine clearly if it was a dog or wolf. But they are confident the final results will be out soon.
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Boldsky sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Boldsky website. However, you can change your cookie settings at any time. Learn more