For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఇండియా గొప్పతనాన్ని వివరించే ఆసక్తికర విషయాలు

By Nutheti
|

ఇండియా అంటే.. ఇండియన్స్ చాలా చులకన భావం ఉంది. యూఎస్ఏ, యూకే వంటి దేశాలు చాలా రిచ్ గా ఉన్నాయని, హై టెక్నాలజీతో దూసుకుపోతున్నాయని.. ఇండియన్స్ భావిస్తారు. ఇతర దేశస్తులు చాలా ఎడ్యుకేటెడ్ పీపుల్స్ అని నమ్ముతారు. అలాగే విదేశాల గురించి ఎక్కువ నాలెడ్జ్ గెయిన్ చేశారు మన ఇండియన్స్. కానీ అదే ఇండియా గురించి చిన్న క్వశ్చన్ అడిగినా నిట్టూరుస్తారు. కానీ భారతదేశం శక్తి, సామర్థ్యాలను మాత్రం గ్రహించడం లేదు. ఎప్పుడు సొంత దేశాన్ని తక్కువ అంచనా వేయడం అలవాటుగా మారింది.

కానీ భారతదేశ ప్రఖ్యాతిని ప్రపంచానికి చాటిచెప్పిన ఎందరో మహనీయులు మన దేశంలో ఉన్నారని మర్చిపోకూడదు. జీరోని కనిపెట్టి ఆర్యభట్ట నుంచి అనేక మంది గొప్పగొప్ప వ్యక్తులు మన ఇండియన్సే. మన దేశం గొప్పతనం గురించి తెలిపే.. చాలామందికి తెలియని, ఆశ్చర్యం కలిగించే ఫ్యాక్ట్స్ ఉన్నాయి. ఇండియన్స్ కంపల్సరీ తెలుసుకోవాల్సినవి. ఇంకెందుకు ఆలస్యం మన ఇండియాపై గౌరవం రెట్టింపయ్యే.. ఫ్యాక్ట్స్ ఇప్పుడు తెలుసుకుందాం..

కుంభమేళా

కుంభమేళా

ఇండియాలో జరిగే అతిపెద్ద వేడుక కుంభమేళా. 12 ఏళ్లకు ఒకసారి నిర్వహించే పండుగిది. ప్రపంచంలో ఎక్కువ మంది మనుషులు కలిసే ఈవెంట్ కుంభమేళా. భారతదేశంలో తప్ప మరెక్కడా.. ఇంతమంది మనుషులు ఒకేసారి కలవరు. ఈ పండుగలో బిలియన్ సంఖ్యలో మనుషులు పాల్గొంటారు.

పోస్టల్ సర్వీస్

పోస్టల్ సర్వీస్

భారతదేశంలో అతిపెద్ద పోస్టల్ సర్వీస్ ఉంది. చిన్న చిన్న మారుమూల గ్రామాల నుంచి పెద్ద పెద్ద సిటీలు, టౌన్లకు కూడా పోస్టల్ సర్వీస్ అందుబాటులో ఉంది. కాశ్మీర్ లో కూడా పోస్టాఫీస్ ప్రారంభించారు.

పాల ఉత్పత్తి

పాల ఉత్పత్తి

ఇండియాలో ఎక్కువ జనాభా వ్యవసాయ రంగంపై ఆధారపడి ఉంది. అలాగే.. పాల ఉత్పత్తి కూడా ప్రపంచంలోనే ఎక్కువగా మనదేశంలో జరుగుతుంది. అందుకే.. ప్రపంచాన్ని లీడ్ చేస్తున్నాం.

పోలింగ్

పోలింగ్

2004 తర్వాత ప్రతిసారి ఎన్నికల సమయం నుంచి ఒక్కొక్కరికి మాత్రమే ఓటు హక్కును కల్పించారు. పోలింగ్ బూత్ ఒకసారి ఒకరికి మాత్రమే అనుమతి కల్పించారు.

డైమండ్

డైమండ్

అందరూ క్రేజీగా భావించే డైమండ్ ముందు ఇండియాలోనే లభించింది. గుంటూరు, క్రిష్ణా జిల్లాల మధ్య ఉన్న క్రిష్ణా నదిలో మొదటి వజ్రం బయటపడింది. మన ఇండియాలో మొదలై.. ఇప్పుడు అన్ని ప్రాంతాల్లో క్రేజ్ సంపాదించింది డైమండ్.

పోలో క్లబ్

పోలో క్లబ్

అతి పురాతన పోలో క్లబ్ ఇండియాలోనే ఉంది. ప్రపంచంలోనే ఓల్డెస్ట్ పోలో క్లబ్ కోల్ కతాలో ఉంది.

చెస్ ఇన్వెంటర్

చెస్ ఇన్వెంటర్

మెదడుకు పనిచెప్పే చెస్ ఎక్కడో కాదు.. ఇండియాలోనే పుట్టింది. చతురంగ అనే సంస్కృత పదం నుంచి చెస్ అనే పదం వచ్చింది. చతురంగ అంటే.. నలుగురు అని అర్థం. ఆర్మీలో ఉండే ఏనుగు, గుర్రం, సిపాయిలు, రథం అని అర్థం.

స్కెలిటన్స్ లేక్

స్కెలిటన్స్ లేక్

ఇండియా, చైనా బార్డర్ లో ఉన్న సరస్సులో నీళ్లు తగ్గిపోయాయి. నీళ్లు ఇంకిపోవడంతో.. స్కెలిటన్స్ బయటపడ్డాయి. అవి 1200 ఏళ్ల క్రితానివని.. అంచనా వేస్తున్నారు.

ఎక్కువ మంది శాఖాహారులు

ఎక్కువ మంది శాఖాహారులు

ఇండియాలో 20 నుంచి 40 శాతం మంది వెజిటేరియన్సే ఉన్నారు. ప్రపంచంలోనే ఎక్కువ మంది శాఖాహారులు కలిగిన దేశం ఇండియా. మన దేశంలో జంతుప్రేమికులు ఎక్కువనడంలో అతిశయోక్తిలేదు.

ఆర్మీ

ఆర్మీ

ప్రపంచంలోనే మూడో అతిపెద్ద ఆర్మీ కలిగిన దేశం ఇండియా. మొదటి రెండు అమెరికా, చైనా. మనకు అతిపెద్ద ఆర్మీ వ్యవస్థ ఉంది.

హిందూ క్యాలెండర్ లో ఆరు రుతువులు

హిందూ క్యాలెండర్ లో ఆరు రుతువులు

భారతీయ హిందూ క్యాలెండర్ ప్రకారం ఆరుకాలాలున్నాయి. అవి గ్రీష్మ, హేమంత, శిశిర రుతువు, శరత్ రుతువు, వసంత రుతువు, వర్ష రుతువు. ఈ కాలాలు చాలా అమేజింగ్ గా అనిపిస్తాయి.

కబడ్డీ

కబడ్డీ

వరల్డ్ కబడ్డీ లీగ్ లో ఇండియాదే ఎప్పుడే చాంపియన్ షిప్. మెన్, ఉమెన్ రెండు క్యాటగిరీల్లోనూ.. ఇండియన్స్ దే కబడ్డీ లీగ్ హవా కొనసాగుతోంది.

ఇంగ్లీష్ మాట్లాడేవాళ్లు

ఇంగ్లీష్ మాట్లాడేవాళ్లు

ఇండియాలో చాలామందికి ABCD తెలియని వాళ్లు కూడా ఉన్నారు. కానీ.. అమెరికా తర్వాత ఇంగ్లీష్ మాట్లాడే దేశం మన ఇండియానే. అంటే ఇంగ్లీష్ ఎక్కువగా మాట్లాడే దేశాల్లో ఇండియాది సెకండ్ ప్లేస్.

చంద్రుడిపై నీళ్లు

చంద్రుడిపై నీళ్లు

2009 సెప్టెంబర్ లో ఇస్రో చంద్రుడిపై నీటిని గుర్తించింది. చంద్రుడిపై నీటిని కనిపెట్టిన ఘనత ఇండియాకే దక్కింది.

ట్విన్ టౌన్

ట్విన్ టౌన్

కేరళలోని మళప్పురం జిల్లాలో ఉన్న కోడిన్షి అనే చిన్న గ్రామం ట్విన్ టౌన్ గా పాపులర్ అయింది. ఇది ఇండియాలోనే అతిపెద్ద ట్విన్ టౌన్ ప్లేస్ ఇది.

English summary

15 Interesting Facts About India

India, a place on the earth, is the eyes of adore for it. We the Indians always talk about USA, UK, like countries that are rich and diverse and have the best latest technologies to rule the limelight of today’s world.
Story first published: Tuesday, December 22, 2015, 11:47 [IST]
Desktop Bottom Promotion