For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

నిద్రలో వచ్చే కలలు.. రియాలిటీకి దగ్గరగా ఉంటాయా ?

By Nutheti
|

ఎప్పుడు, ఎలా, ఎందుకు, ఎవరు.. ఇలా రకరకాల ప్రశ్నలతో చిత్తుచేసేవే కళలు. ఒక్కోసారి.. ఏం కళ వచ్చిందో.. ఎందుకు వచ్చిందో కూడా అర్థం కాకుండా.. చిక్కుల్లో పడేస్తుంటాయి. డ్రీమ్స్ లో చాలా రకాలున్నాయి. ఒక్కొక్కరికి ఒక్కోలా తలుపు తడుతుంటాయి.

READ MORE : సాధారణంగా కలిగే 10 కలలు మరియు వాటి అర్థాలు

కలలు లేకుండా జీవితం ఉంటుందా అంటే కష్టమే కదా. కాబట్టి.. ప్రతి ఒక్కరి జీవితానికి కలలు కామన్. కల లేకుండా.. నిద్ర ఉండదు. అయితే మీకు ఎలాంటి కలలు వస్తున్నాయి.. అవి దేనికి సంకేతాలో తెలుసుకోండి. అంతేకాదు.. డ్రీమ్స్ లో దాగున్న ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ కూడా ఓ సారి చూసేయండి.

గుర్తుండవు

గుర్తుండవు

ప్రతి మనిషికి జీవితకాలంలో ఎన్నో కలలు వస్తుంటాయి. కానీ.. ఉదయం లేచేసరికి అవి గుర్తుండవు. గుర్తొచ్చినట్టే ఉంటాయి కానీ.. ఏది క్లారిటీ ఉండదు. కానీ నిద్రలోకి జారుకున్నామంటే మళ్లీ కలలు వస్తూనే ఉంటాయి.

ఎన్ని కలలు వస్తాయి ?

ఎన్ని కలలు వస్తాయి ?

మనుషులు దాదాపు తమ జీవితకాలంలో 25 ఏళ్లు నిద్రకు కేటాయిస్తారు. మనకు వచ్చే కలల లిస్ట్ చూస్తే విస్తు పోవాల్సిందే. ఒక్కొక్కరి జీవితకాలంలో 6 సంవత్సరాలు కలలకే సరిపోతాయి.

యాక్టీవ్ గా బ్రెయిన్

యాక్టీవ్ గా బ్రెయిన్

మనుషులు మెలకువగా ఉన్నప్పుడు రకరకాల పనులు చేస్తూ బిజీబిజీగా ఉంటారు. అయితే మెలుకువగా ఉన్నప్పటి కంటే.. నిద్రపోతున్నప్పుడు మెదడు చాలా యాక్టీవ్ గా ఉంటుంది.

రోజుకి ఎన్నిసార్లు

రోజుకి ఎన్నిసార్లు

మనుషులకు రోజుకి 3 నుంచి 7 కలలు వస్తాయట. రెండు, మూడు గంటలకొకసారి డ్రీమింగ్ లోకి వెళ్లిపోతారు.

డ్రీమ్ డిక్షనరీ

డ్రీమ్ డిక్షనరీ

డ్రీమ్ డిక్షనరీ ఇప్పుడు పుట్టుకొచ్చింది కాదు. కొన్ని వేల సంవత్సరాల క్రితం.. ఈజిఫ్టియన్లు.. డ్రీమ్ డిక్షనరీని క్రియేట్ చేశారట.

రోగులకు కలలు దూరం

రోగులకు కలలు దూరం

మీకు అనారోగ్య సమస్యలున్నాయా ? అయితే మీకు కలలు కలలుగా మిగిలినట్టే. ఎందుకంటే.. శారీరక అనారోగ్య సమస్యలతో బాధపడే వారికి కలలు రావు.

కలలు మరిచిపోవడం

కలలు మరిచిపోవడం

రాత్రి ఎన్ని కలలు వచ్చినా.. నిద్రలేచేసరికి కలల సంగతే గుర్తుండదు. ఉదయం లేచిన మొదటి నిమిషానికే 90 శాతం కల మరిచిపోయి ఉంటాం.

జెండర్ డిఫరెన్స్

జెండర్ డిఫరెన్స్

మగవాళ్లు, ఆడవాళ్లకు వచ్చే కలలలో చాలా తేడా ఉంది. మగవాళ్లు ఎక్కువగా మహిళల గురించే కలలు కంటారు. అదే ఆడవాళ్లకైతే.. మగవాళ్లు, ఆడవాళ్లు ఇద్దరి గురించి కలలు వస్తుంటాయి.

మద్యం సేవించేవాళ్లకు

మద్యం సేవించేవాళ్లకు

పొగత్రాగటం, మద్యం సేవించడం అలవాటు ఉన్నవాళ్లకు ఎక్కువగా కలలు వస్తుంటాయి. వీళ్లకు ఎక్కువగా పీడకలలు వస్తుంటాయి.

ల్యూసిడ్ డ్రీమ్స్

ల్యూసిడ్ డ్రీమ్స్

ల్యూసిడ్ డ్రీమ్స్ అంటే ఇవి చాలా గొప్పగా ఉంటాయి. వీళ్ల ఊహలు చాలా డిఫరెంట్ గా ఉంటాయి. గాల్లో తేలుతున్నట్లు, గోడలు ఎక్కుతున్నట్లు, వివిధ ప్రాంతాలకు ప్రయాణిస్తున్నట్లు కలలు ఉంటాయి. ఇలాంటి కలలు దాదాపు 30 నిమిషాలు వస్తాయి.

గురకకు కలకు సంబంధం

గురకకు కలకు సంబంధం

నిద్రలో బాగా గురకలు పెడతారా.. ? అయితే మీకు కలలు వచ్చే అవకాశమే లేదు. గురకలు కలలను తరిమేస్తాయి.

చిన్నారుల్లో కలలు

చిన్నారుల్లో కలలు

చిన్నపిల్లలకు కలలు రావు. పిల్లల వయసు కనీసం మూడేళ్లు ఉంటే తప్ప కలలు వచ్చే ఛాన్స్ లేదు.

స్లీప్ పెరాలసిస్

స్లీప్ పెరాలసిస్

స్లీప్ పెరాలసిస్ చాలా భయంకరంగా ఉంటుంది. ఇలాంటి కలల్లో దయ్యాలు తమ పక్కనే కూర్చున్నట్టు, గట్టిగా అరుస్తున్నట్లు, గదిలోనే ఎవరో తిరుగుతున్నట్టు భయపెడతాయి. ఈ కలలు చాలా భయాందోళనకు గురిచేస్తాయి.

పీడకలలు

పీడకలలు

పీడకలలు ఎక్కువగా పిల్లలకే వస్తుంటాయి. అనవరస విషయాలకు భయపడటం, హర్రర్ సినిమాలు చూడటం పిల్లలకు అలవాటుగా ఉంటుంది. కాబట్టి.. పెద్దలలో కంటే.. చిన్నపిల్లలకే ఎక్కువగా పీడకలల వస్తుంటాయి.

అంధులకు

అంధులకు

కళ్లుంటేనే కలలు కనాలని లేదు. కళ్లు లేని వాళ్లకు కూడా కలలు వస్తుంటాయి. పుట్టుకతోనే అంధులుగా జన్మించిన వాళ్లకు వినగలిగిన కలలు వస్తాయి. ఒకవేళ పెద్దవాళ్లయ్యాక అంధులై ఉంటే.. వాళ్లకు గుర్తున్న విషయాలు మాత్రమే కలలుగా వస్తాయి.

REM స్లీప్ డిజార్డర్

REM స్లీప్ డిజార్డర్

REM స్లీప్ డిజార్డర్ ఉండే వాళ్లలో కలలు వింత చేష్టలకు దారితీస్తాయి. వీళ్లు చాలా భావోద్వేగానికి గురై.. దెబ్బలు కూడా తగిలించుకుంటారు. కొన్ని సందర్భాల్లో కాళ్లు, చేతులు విరగొట్టుకుంటారు.. లేదా ఫర్నిచర్ పాడుచేస్తారు. కలలోనే ఇంటికి నిప్పు పెట్టిన సందర్భాలూ ఉన్నాయట.

డ్రీమ్స్ సింబల్స్

డ్రీమ్స్ సింబల్స్

డ్రీమ్స్ లో వచ్చే కొన్ని కలలను.. గుర్తు చేసుకోవచ్చు. దాదాపు 5 వేల సంకేతాలను తెలుసుకోవచ్చు.. గమనించవచ్చు.

పెట్స్ కి కూడా కలలు

పెట్స్ కి కూడా కలలు

కుక్కలు రోజుకి 10 నుంచి 13 గంటలు, పిల్లులు 10 నుంచి 15 గంటలు నిద్రపోతాయి. వీటికి కూడా డ్రీమ్స్ వస్తాయి. ఇవి పడుకున్నప్పుడు.. తోక, కాళ్లు ఊపుతూ ఉంటాయి. ఒక్కోసారి.. వెంబడిస్తున్నట్లు శబ్దం కూడా చేస్తాయి. అవన్నీ కలలో జరిగే విషయాలే.

చల్లటి వాతావరణంలో

చల్లటి వాతావరణంలో

మీ ఇల్లు చల్లగా ఉందంటే.. తక్కువగా కలలు వస్తాయి. గదిలో టెంపరేచర్ తక్కువగా ఉంటడం వల్ల.. హాయిగా నిద్రపడుతుంది.

కలల సాకారం

కలల సాకారం

కొంతమంది డ్రీమ్స్ ని ఫుల్ ఫిల్ చేసుకుంటారు. కొన్ని ఆవిష్కరణలు.. కలల నుంచే సాధ్యమయ్యాయి. అలా డ్రీమ్ నుంచి పుట్టుకొచ్చిందే గూగుల్.

హెచ్చరించే కలలు

హెచ్చరించే కలలు

కొంతమందికి కలలు చాలా విచిత్రంగా వస్తాయి. భవిష్యత్ లో ఏం జరగబోతుందో ఓ హెచ్చరిస్తున్నట్లు కలలు వస్తాయి.

సెక్స్ డ్రీమ్స్

సెక్స్ డ్రీమ్స్

మగవాళ్లకు ఎక్కువగా శారీరక సంబంధాలకు సంబంధించిన కలలు వస్తాయి. పలుమార్లు వాళ్లకు సెక్సువల్ డ్రీమ్స్ వస్తుంటాయి.

కలలో నడవడం

కలలో నడవడం

సినిమాల్లో కలలో నడవడం చూసి బాగా నవ్వుకుంటాం. కానీ అది రియాలిటీ కూడా. ఇది చాలా అరుదుగా కనిపించే లక్షణం. కలలో నడవడం చాలా హానికరమైన డిజార్డర్. దీనివల్ల చాలా అనర్థాలు జరుగుతున్నాయి. ఒకరు మూడో అంతస్తు నుంచి దూకితే.. మరొకరు 20 కిలోమీటర్లు డ్రైవ్ చేశాడు.

డ్రీమ్ డ్రగ్

డ్రీమ్ డ్రగ్

డ్రీమ్ డ్రగ్ అని ఒకటి ఉందని మీకు తెలుసా. నిజమే.. డ్రీమ్ డ్రగ్ కి కొంతమంది అలవాటు పడ్డారు. తమకు కలలు రావాలని.. అలాగే నిద్రపోతూ ఉంటారు పగలు కూడా. దానికోసం మందులు వాడుతారు.

తాయత్తులు

తాయత్తులు

కొంతమంది పీడకలలు రాకుండా తాయత్తులను నమ్ముతారు. ఉలెన్ దారానికి కొన్ని గుర్తులను జతచేసి వీటిని వాడుతారు. వీటిని ధరిస్తే పీడకలలు దరిచేరవని నమ్మకం.

క్రియేటివిటీ డ్రీమ్స్

క్రియేటివిటీ డ్రీమ్స్

కలలు క్రియేటివ్ ఐడియాలను కూడా ఇస్తాయి. కొన్ని సందర్భాలలో ఏదైనా సమస్య ఉంటే.. కలల ద్వారా వాటికి పరిష్కారాలు దొరుకుతాయి.

తెలిసిన వాళ్లు

తెలిసిన వాళ్లు

ఒక్కోసారి ఇంతకుముందు మనం కలిసిన వాళ్లు కలలోకి వస్తారు. ఎప్పుడైనా ఎవరినైనా చూసి.. ఎంత భయంకరంగా ఉంది అనుకుంటాం. అలాంటి వాళ్లు మళ్లీ ఎప్పుడైనా కలలో కనిపించవచ్చు.

కలర్ ఫుల్ డ్రీమ్స్

కలర్ ఫుల్ డ్రీమ్స్

చాలా తక్కువ మందికి కలర్ ఫుల్ డ్రీమ్స్ వస్తాయి. అనేకమందికి బ్లాక్ అండ్ వైట్ లోనే కలలు వస్తుంటాయి.

ప్రతికూల కలలు

ప్రతికూల కలలు

చాలా వరకు మనుషులకు వచ్చే కలలు చాలా ప్రతికూలంగా ఉంటాయి. అనుకూలంగా కంటే.. ఎక్కువగా ప్రతికూల కలలే వస్తాయి. కోపం, బాధ, భయంతో కూడిన భావోద్వేగాలే సాధారణంగా డ్రీమ్స్ లో కనిపించేవి.

సో ఇవండి కలల వెనక ఉన్న ఆసక్తికర అంశాలు. ఇంట్రెస్టింగ్ గా.. వెరైటీగా ఉన్నాయి కదూ.

English summary

Amazing Facts About Dreams

Here are some interesting dream facts that you probably didn’t know. Check out this cool information that is just the tip of the iceberg when it comes to dreams and dreaming. Dreaming is something that you can’t take for granted. Learning about your dreams has so many benefits.
Story first published: Thursday, October 15, 2015, 15:16 [IST]
Desktop Bottom Promotion