For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

హావభావాల సమ్మేళనం భారతీయ నృత్యకళారీతులు

By Nutheti
|

ప్రకృతిలో మమేకమయ్యేలా.. మైమరిచిపోయేలా.. మధురానుభూతి కలిగించేవి భారతీయ నృత్యాలు. భారత సంప్రదాయాలు, కళలు, సంస్కృతి, శాస్త్రీయతను అందంగా.. హావభావాలతో వ్యక్తపరుస్తూ.. అనేక నృత్యరీతులున్నాయి ప్రాచుర్యం పొందాయి. వివిధ రాష్ట్రాలు, ఆయా రాష్ట్రాల సంప్రదాయాలను వివరిస్తాయి.. కల్చరల్ డ్యాన్స్ లు.

భారత సంప్రదాయంలో నృత్యాలకు చాలా ప్రాధాన్యత ఉంది. నాటకాలు, నృత్యాల ద్వారా భారతకీర్తి పెరుగుతోంది. అందుకే భారత ప్రభుత్వం సంగీత నాటక అకాడమీని ఏర్పాటు చేసి.. సాంస్కృతిక కళలను ప్రోత్సహిస్తోంది. భారతదేశంలో ఎక్కువ ప్రాముఖ్యత పొందిన నృత్యాలు.. వాటి విశేషాలు..

భరతనాట్యం, తమిళనాడు

భరతనాట్యం, తమిళనాడు

భావం, రాగం, తాళాలను వ్యక్తపరుస్తుంది భరతనాట్యం. తమిళనాడు శాస్త్రీయ నృత్య విధానం భరత నాట్యం. నృట్ట.. భావవ్యక్తీకరణ, నృత్య.. చేతులతో భావాన్ని వ్యక్తం చేయడం, నాట్య.. పాత్రను చిత్రీకరించడం ఇలా మూడు రకాల భంగిమలను ఇముడ్చుకుని ఉంటుంది భరతనాట్యం. భరతనాట్యంలో ఆభరణాలు, గజ్జెలకు ఎక్కువ ప్రాధాన్యముంటుంది.

కథక్, ఉత్తరప్రదేశ్

కథక్, ఉత్తరప్రదేశ్

ఉత్తరప్రదేశ్ నృత్యంగా పేరుపొందిన కథక్ లో హావభావాలకు అధిక ప్రాముక్యత ఉంటుంది. జైపూర్, లక్నో, బెనారస్, రైఘర్ లలో కథక్ కు శిక్షణ ఇవ్వడానికి ప్రత్యేక స్కూల్లు ఉన్నాయి. స్లో మూమెంట్ నుంచి ఫాస్ట్ కి మారుతూ.. సారాంశాన్ని వివరించడం కథక్ నృత్యం ప్రత్యేకత. ఈ డ్యాన్స్ లో దుస్తులు కూడా చాలా ఆకర్షణీయంగా ఉంటాయి.

కూచిపూడి, ఆంధ్రప్రదేశ్

కూచిపూడి, ఆంధ్రప్రదేశ్

ఆంధ్రప్రదేశ్ కి సంప్రదాయ నృత్యం కూచిపూడి. సంప్రదాయ సంగీతానికి అనుగుణంగా కూచిపూడి నృత్యం ఉంటుంది. ఆకట్టుకునే భావవ్యక్తీకరణ, ఆకర్షణీయమైన చూపులు,

భావోద్వేగాల సమ్మేళనం కూచిపూడి. ఇందులో నాట్య మేళా, నట్టువ అని రెండు రకాల నృత్యాలున్నాయి.

మణిపురి, మణిపూర్

మణిపురి, మణిపూర్

మణిపూర్ రాష్ట్రీయ నృత్యం మణిపురి. శ్రీకృష్ణుడికి ఇష్టమైన రాసలీల నృత్యరీతులతో మణిపురి ముడిపడి ఉంది. ఆకట్టుకునే వస్త్రధారణ, సంగీతం, సున్నిత భంగిమలు మణిపురి నృత్యం ప్రత్యేకతలు. డ్రమ్స్, ఫ్లూట్ ఈ డ్యాన్స్ కి ముఖ్యమైన వాయిద్యాలు.

కథాకళి లేదా మోహినాట్టం, కేరళ

కథాకళి లేదా మోహినాట్టం, కేరళ

కేరళీయుల సంప్రదాయ నృత్యం కథాకళి, మోహినాట్టం. ప్రత్యేకమైన భంగిమలు, జటిలమైన హావభావాలు, మేకప్, దుస్తులు కథాకళికి ప్రధాన ఆకర్షణీయ అంశాలు. కేవలం మహాభారతంలోని కథలనే కాదు.. బైబిల్, ఏసు క్రీస్తు వంటి రకరకాల కథలను ఆధారంగా కూడా కథాకళి, మోహినాట్టం డ్యాన్స్ చేస్తారు.

ఒడిస్సీ

ఒడిస్సీ

ఒడిస్సా శాస్త్రీయ నృత్యం ఒడిస్సీ. ఆధ్యాత్మిక అంశాలను ఈ నృత్యం వివరిస్తుంది. భావవ్యక్తీకరణ, అధునాతన, అర్థవంతంగా దైవభక్తిని వెలువరించేలా ఈ డ్యాన్స్ ఉంటుంది. తాండవ, లాస్య అన్న అంశాలు ఇముడ్చుకుని ఉంటుంది ఒడిస్సీ. శాస్త్రీయ సంగీతం, ఆభరణాలు, దుస్తులు ఈ ఒడిస్సీకి ప్రత్యేక అంశాలు.

English summary

Classical Dances of India

The various forms of dances in India vary with the different cultures present in the country. It represents the traditions, practices and religious activities of the geographic, state and ethnic regions. The sacred art forms of dance trace back to Bharat Muni’s Natya Shastra.
Story first published: Tuesday, October 13, 2015, 15:38 [IST]
Desktop Bottom Promotion