For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

పదునైన ఆలోచనలిచ్చే బ్రెయిన్ సీక్రెట్స్

By Nutheti
|

మెదడు శరీరంలో చాలా ముఖ్యమైన భాగమని అందరికీ తెలుసు. మనల్ని ఆలోచించడానికి, ఫీలవ్వడానికి, వ్యక్తీకరించడానికి మెదడు బాధ్యత వహిస్తుంది. మెంటల్ హెల్త్ బాగునప్పుడు మనం అన్ని పనులు చేసుకోగలుగుతాం. శ్వాస పీల్చుకునే దగ్గర్నుంచి.. ఆలోచనల వరకు అన్నిటికీ మెదడే ప్రధానం. అయితే ఇలాంటివే కాకుండా.. మరికొన్ని ఆశ్చర్యకర అంశాలు మెదడులో దాగున్నాయి.

READ MORE: చురకైన మెదడుకు మేత ఈ టాప్ 30 ఆహారాలే...

పదునైన ఆలోచనలతో.. ఎప్పటికప్పుడు అవసరానికి తగ్గట్టు స్పందించే మెదడు గురించి మనకు తెలియని విషయాలు చాలానే ఉన్నాయి. ప్రతి అవయవాన్ని ఉత్తేజ పరిచే మెదడు గురించి తెలుసుకోవాల్సిన ఆసక్తికర అంశాలున్నాయి.

మెదడే మాస్టర్

మెదడే మాస్టర్

శరీరంలో ప్రధాన భాగమైన మెదడు.. మనుషుల కదలికల బాధ్యత నెరవేరుస్తుంది. ఆలోచనాశక్తిని, భావవ్యక్తీరణను, శ్వాస తీసుకునే సత్తాను మెదడు ద్వారానే పొందుతాం. వ్యక్తిత్వాన్ని మెరుగుపరుచుకోవడానికి కూడా మెదడు సహాయపడుతుంది.

భవిష్యత్ ని అంచనా వేసే శక్తి

భవిష్యత్ ని అంచనా వేసే శక్తి

మిడ్ బ్రెయిన్ డొపామెయిన్ సిస్టమ్ ( MDS) సిగ్నల్స్ ని మెదడుకు చేరవేస్తుంటుంది. అంతర్ దృష్టి అని మనం భావించేది ఇదే. కాబట్టి ముందుగానే జరగబోయే విషయాన్ని అంచనా వేసే శక్తి మెదడుకు ఉంటుంది.

టీనేజర్స్ బ్రెయిన్

టీనేజర్స్ బ్రెయిన్

మీకు తెలుసా.. టీనేజర్స్ బ్రెయిన్ పూర్తీగా తయారయి ఉండదు. ఐదేళ్ల నుంచి అభివృద్ధి చెందుతూ వచ్చే మెదడు.. టీనేజ్ కి వచ్చినా.. ఇంకా పూర్తీగా అభివృద్ధి చెందదు. కాబట్టి వీళ్లు డెసిషన్ మేకింగ్ లో కాస్త నిదానంగా ఉంటారు. 17 ఏళ్ల వయసు వచ్చే వరకు మెదడు మల్టీ టాస్కింగ్ చేయలేదు. బ్రెయిన్ పూర్తీగా ఏర్పడకపోవడం వల్ల టీనేజర్స్ స్వతహాగా కంటే.. ఇతరుల నుంచే ఎక్కువ నేర్చుకోగలుగుతారు.

నిద్రపోయేటప్పుడు యాక్టివ్ గా బ్రెయిన్

నిద్రపోయేటప్పుడు యాక్టివ్ గా బ్రెయిన్

రాత్రిపూట కంటి నిండా నిద్రపోవాలని ప్రతి ఒక్కరూ సూచిస్తూ ఉంటారు. అది ఎందుకనేది చామందికి తెలియదు. బ్రెయిన్ పనితీరు సక్రమంగా ఉండాలంటే రాత్రి నిద్ర సరిగా ఉండాలి. రోజంతా మెదడు చాలా పనులు చేసి ఉంటుంది. వాటన్నింటినీ గుర్తుపెట్టుకోవాల్సి అవసరముంటుంది. పగటిపూట చేసిన పనులన్నింటినీ గుర్తుపెట్టుకోవడానికి రాత్రి నిద్ర మెదడుకు చాలా అవసరం. కాబట్టి నిద్రపోయేటప్పుడు మెదడు యాక్టివ్ గా ఉంటుంది. మీటింగ్స్, ఈవెంట్స్ అన్నీ గుర్తుంచుకోవడం నిద్రపోయే సమయంలోనే మెదడు చేస్తుంది కాబట్టి కలలు వస్తాయని సైంటిస్ట్ లు నమ్ముతారు.

ఆడవాళ్ల కంటే మగవాళ్ల మెదడు

ఆడవాళ్ల కంటే మగవాళ్ల మెదడు

నిజమే ఆడవాళ్ల కంటే మగవాళ్లు 10 శాతం ఎక్కువగా బ్రెయిన్ ఉపయోగిస్తారట. మగవాళ్ల కంటే ఆడవాళ్ల మెదడు చిన్నగా ఉంటుంది. కానీ మెదడులో నరాలు, కార్టెక్స్ ఆడవాళ్ల మెదడులోనే ఎక్కువగా ఉంటాయి. కాబట్టి ఆడవాళ్లు ఎక్కువ కష్టపడి పనిచేయగలుగుతారు. ఆలోచనా శక్తి, త్వరగా గుర్తించే సత్తా, ల్యాంగ్వేజ్ స్కిల్స్ ఆడవాళ్లలో ఎక్కువగా ఉంటాయి. అయితే లాజికల్ గా ఆలోచించే గుణం మగవాళ్లలోనే ఎక్కువగా ఉంటుంది.

ఎక్కువ శక్తిని మెదడు వినియోగిస్తుంది

ఎక్కువ శక్తిని మెదడు వినియోగిస్తుంది

శరీరం ద్వారా ఉత్పత్తయ్యే శక్తిలో 20 శాతం మెదడే వినియోగించుకుంటుంది. ఈ ఎనర్జీ ద్వారా మెమరీ, సెన్స్ నెర్వస్ సిస్టమ్ లు పనిచేస్తాయి. ఒకవేళ ఈ శక్తి అందకపోతే.. అనారోగ్య సమస్యలు, స్ట్రోక్ కి దారితీస్తాయి.

ఒక్కొక్కరికి ఒక్కో సైజులో బ్రెయిన్

ఒక్కొక్కరికి ఒక్కో సైజులో బ్రెయిన్

ఆశ్చర్యంగా ఉన్నా నిజమే. ఒక్కొక్కరికి ఒక్కో సైజులో బ్రెయిన్ ఉంటుంది. పెద్ద తలలు ఉండే వాళ్ల మెదడు పెద్దగా ఉంటుంది. వాళ్ల ఐక్యూ పవర్, టాలెంట్ కూడా చిన్న తల ఉన్న వాళ్ల కంటే ఎక్కువగా ఉంటుంది. ఉదాహరణకు ఐన్ స్టీన్ మెదడు.. ఇతర సైంటిస్ట్ ల కంటే పెద్దగా ఉంటుంది. ఉంగ్ యాంగ్ ది కూడా పెద్ద మెదడే. ఎందుకంటే.. 8నెలల వయసులోనే ఆల్ జీబ్రా, రెండేళ్లకే నాలుగు భాషలు, 15 ఏళ్లకే గ్రాడ్యుయేషన్ చేశారు.

మెదడుకి నొప్పి ఉండదు

మెదడుకి నొప్పి ఉండదు

సెన్సార్ ఆర్గాన్స్ అయిన కళ్లు, చర్మం, నాలుకకు వార్నింగ్ సిగ్నల్స్ అందజేస్తుంది బ్రెయిన్. కానీ... మెదడుకి మాత్రం ఎలాంటి నొప్పి కలుగదు.

మెదడులో కణాల సంఖ్య

మెదడులో కణాల సంఖ్య

మెదడులో వంద బిలియన్ కణాలుంటాయి. నరాలలో ఉండే కణాలు సమాచారాన్ని ఎలక్ట్రికల్ సిగ్నల్స్ ద్వారా కండరాలకు చేరవేస్తాయి. ఆలోచించినప్పుడు, మాట్లాడినప్పుడు, నవ్వినప్పుడు, కదిలినప్పుడు వెంటనే సమాచారం అందజేయడానికి ఈ కణాలు ఉపయోగపడతాయి. గంటకు 150 మైళ్ల సమాచారాన్ని ఈ కణాలు మెదడుకి అందిస్తాయి.

మెదడుపై ముడతలు

మెదడుపై ముడతలు

మెదడుపై ఉండే ముడతలు స్మార్ట్ గా ఆలోచించడానికి సహకరిస్తాయి. వీటివల్ల ఎక్కువ సమాచారం మెదడులో నిక్షిప్తం చేసుకోగలుగుతాం. మనం కొత్త కొత్త అంశాలు నేర్చుకున్నప్పుడల్లా.. మెదడుపై ముడతలు పెరుగుతాయి. దానివల్ల తెలివిగా ఆలోచించే శక్తి పెరుగుతుంది.

English summary

Facts about the Human Brain in telugu

Most people know that our Brain is the most essential part of our body. It is responsible for our ability to think, express, feel, etc., as well as our ability to breathe.
Story first published: Monday, November 2, 2015, 14:52 [IST]
Desktop Bottom Promotion