For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఫ్రెండ్షిప్ డే గురించి కొన్ని ఆశ్చర్యకరమైన వాస్తవాలు....

|

అంతర్జాతీయ స్నేహితుల దినోత్సవంను ప్రతి సంవత్సరం ఆగస్టు మొదటి ఆదివారం జరుపుకుంటారు. ఈ రోజున ప్రజలు తమ స్నేహితులపై ఉన్న తమ ప్రేమను వ్యక్తపరచడానికి తమ స్నేహితులతో గడుపుతారు. ఈ సందర్భంగా పువ్వులు, కార్డులు, మణికట్టు బ్యాండ్లు వంటి ఫ్రెండ్షిప్ డే బహుమతులు ఇచ్చిపుచ్చుకుంటారు, ఇది ఒక ప్రముఖ సాంప్రదాయం.

1935 లో యునైటెడ్ స్టేట్స్ కాంగ్రెస్ ఆగస్టు మొదటి ఆదివారంను జాతీయ స్నేహితుల రోజు గా ప్రకటించింది. అప్పటి నుండి జాతీయ స్నేహితుల దినోత్సవం వార్షికోత్సవ వేడుకగా మారింది. ప్రపంచవ్యాప్తంగా అనేక ఇతర దేశాలు స్నేహితులకు ఒక రోజు అంకితమిచ్చే సంప్రదాయాన్ని స్వీకరించాయి. 1997 లో యునైటెడ్ నేషన్స్ "స్నేహం" యొక్క ప్రపంచ అంబాసిడర్ "విన్నీ ది పూః". నేడు స్నేహితుల దినోత్సవాన్ని అనేక దేశాలు ఉత్సాహవంతంగా జరుపుకుంటున్నాయి.

friendshipday

ఈ సృష్టి ఉన్నంతకాలం నిలిచేది ఒక్క స్నేహమే... ఆదిదేవుళ్లు సృష్టి, స్థితి, లయకారకాలను కచ్చితంగా అమలుపరిచేది తమ స్నేహబంధంతోటే... జగన్మాతలు ముగ్గురూ స్నేహంగా ఉండబట్టే రాక్షస సంహారం గావించబడి లోకాలన్నీ శాంతించినాయి. ద్వాపరయుగంలో లేమికి నిర్వచనంగా చెప్పబడే కుచేలుడు ఇచ్చిన పిడికెడు అటుకులతో అతని స్నేహితుడైన శ్రీకృష్ణుడు అతనికి బంగారు పట్టణాన్నే బహూకరించి స్నేహం విలువను ఈ లోకానికి తెలియజేశాడు.

friendshipday

మహాభారతంలో రారాజు ధుర్యోధనుడు, మానసపుత్రుడు కర్ణుడు మధ్యనున్న స్నేహం వెలకట్టలేనిది. స్నేహితుని కోసం తన ప్రాణాలనే పణంగా పెట్టి కర్ణుడు చరిత్ర లో నిలిచిపోయాడు. రామాయణంలో కూడా శ్రీరామునికి, ఆంజనేయునికి మధ్య ఉన్న స్నేహబంధం లతలా పెనవేసుకుపోయి భక్తిబంధంగా రూపుదాల్చింది. ఇలా యుగయుగాలలో భగవంతుడు స్నేహబంధం విలువను ఏదో ఒక రూపంలో మనుషులకు సూచిస్తునే ఉన్నాడు. స్నేహబంధంతో ఇరుదేశాల మధ్య రక్తపాతాన్ని ఆపవచ్చు... కొన్ని లక్షల మంది ప్రాణాలు కాపాడ వచ్చు... దేశ ఉన్నతిని కాంక్షించవచ్చు... ఇలా చెప్పు కుంటూ పోతే స్నేహబంధం ఒక నిరంతర గంగా ప్రవాహం... దానిని అదుపు చేయడం గంగ వెల్లువను కమండలంలో పట్టివుంచి నట్లవుతుంది...

friendshipday

పార్లీ (PARLEE) అనే మనోవిశ్లేషకుడి నిర్వచనంలో చెప్పాలంటే, 'నిజమైన మిత్రుడు ఓటమిలో ఓదార్చేవాడు; మన గెలువును తనదిగా భావించి ఆనందాన్ని పంచుకునేపాడు; సమస్యల్లో ఓ కౌన్సిలర్‌గా ఉండేవాడు; ఏం చేయాలో తోచని స్థితిలో నీకండగా ఉన్నాననే ధైర్యాన్నిచ్చేపాడు'

మనిషి అవసరాల్నింటిలో సంబంధం (Affiliation) చాలా ముఖ్యమైందంటాడు సైకాలజిస్ట్‌ హెన్రీముర్రే. బాల్యం నుంచి ఎదిగే క్రమంలో యువతలో తలెత్తే మానసిక ఒత్తిళ్లకు స్నేహం అవసరం మరింత పెరుగుతుందని క్యాష్టర్‌ వరిశోధనలు నిరూపించాయి. స్నేహితులు ఒకరి నుంచి ఒకరు ఎన్నో విషయాలు నేర్చుకుంటారు. ఒకరికొకరు ఆదర్శంగా నిలిచి మానసిక వికాసానికి తోడ్పడతారు.

friendshipday

యువతరం స్నేహాల్లో మూడు దశలున్నాయని ఆడర్సన్‌ అనే మనస్తత్వపేత్త చెప్పాడు. మొదటి దశలో వ్యక్తిగత సంబరధం ఉండదు. కలిసి చేసే వనులవైనే ఆధారవడి ఉరటుంది. వదిహేను ఏళ్ల తర్వాత మొదలయ్యే రెండో దశ నమ్మకం పై ఆధారవడి ఉంటుంది. ఆపై సోషల్‌ సపోర్ట్‌, భద్రత ముఖ్య పాత్ర వహిస్తాయి.

friendshipday

స్నేహం నిరంతరం పెరిగేలా వ్రవర్తించాలి. తెంచే వ్రవర్తనలు ఉంటే గమనించుకుని మనల్ని మనం మార్చుకోపాలి.
చిన్న చిన్న విషయాలను వట్టించుకోకూడదు. స్నేహితుడు నీకు చెవ్పకుండా సినిమాకు పెళితే 'వీడు సెల్ఫిష్‌' అనుకోకూడదు.
విమర్శించి తవ్పులు సరిదద్దడం స్నేహంలో భాగమే కానీ అదపనిగా విమర్శలు చేయకూడదు.
విమర్శ మనసులో ముల్లులా గుచ్చుకోకుండా, చెవ్పే మాటలు సున్నితంగా ఉండేలా జాగ్రత్త వడాలి.
ఒక స్నేహితుడిలోని లోపాలను మరో స్నేహితుడి వద్ద వ్రస్తావించకుండా ఉంటేనే మంచిది.
మిత్రునిలోని మంచి గుణాలను కూడా వ్రకటిస్తూ ఉండడం ముఖ్యం. అలాగని నింరతరం పొగడ్తల్లో ముంచెత్తకూడదు.
స్నేహితుని మాటల్లో, వ్రవర్తనలో నిగూఢ అర్థాలున్నాయోమోననే అనుమానాన్ని దరిచేరనీయకూడదు. ఉదాహరణకు నీకు బహూకరించిన వుస్తకం విలువను బట్టి 'నేనంత ముఖ్యుడిని కాననే ఈ వుస్తకం ఇచ్చాడు' లాంటి అన్వయాలను విడనాడాలి.
స్నేహంలో నిజాయితీ, పారదర్శకత చాలా ముఖ్యం.

English summary

Friendship-Day Special: Facts About Friendship Day

Friendships make life meaningful and beautiful. Having a friend's companionship feels great. Good friends are surely strength. If you have someone to tell all your secrets and if you have someone who knows your weaknesses but still helps you, you are lucky.
Story first published: Sunday, August 2, 2015, 13:27 [IST]
Desktop Bottom Promotion