కలియుగాంతంలో మనుషుల ప్రవర్తన, అలవాట్లు ఎలా ఉంటాయి ?

Written By: Nutheti
Subscribe to Boldsky

భాగవతం, పోతులూరి వీరభ్రహ్మేంద్ర స్వామి చరిత్ర ప్రకారం కలియుంగం అంతం అవుతుందని వింటూ ఉంటాం. కలియుగాంతం గురించి కొన్ని సినిమాలు వచ్చాయి. కొన్ని కథలు, పురాణ గాధలు ఎన్నో ఉన్నాయి. ఈ యుగం అంతమైతే.. భూమ్మీద మనుషుల మనుగడ ఉండదని వివరిస్తుంది. అయితే ప్రపంచంలోని కొన్ని దేశాలు ఇప్పటికే అంతమయ్యాయని చెబుతూ ఉంటారు.

READ MORE: రామాయణం, మహాభారతం- రెండింటిలోనూ కనిపించే ఒకే పాత్రలు

అయితే వీరభ్రహ్మేంద్ర స్వామి కాలజ్ఞానం ప్రకారం ఇప్పటికే కొన్ని సంకేతాలు కలియుగాంతాన్ని సూచిస్తున్నాయని పెద్దలు చెబుతూ ఉంటారు. కలియుగం అంతరించే సమయం దగ్గర్లోనే ఉందని.. జరుగుతున్న పరిణామాలే అందుకు కారణమని వివరిస్తున్నారు. అయితే కలియుగాంతాన్ని హెచ్చరించే ఆశ్చర్యకర సంకేతాలు.. కలియుగాంతంలో చోటు చేసుకునే పరిణామాలు ఎలా ఉంటాయని కొన్ని అధ్యయనాలు ఇలా వివరిస్తున్నాయి..

కలియుగం అంతానికి హెచ్చరిక సంకేతాలివే ?

కలియుగం అంతానికి హెచ్చరిక సంకేతాలివే ?

మనుషుల తీరులో చాలా మార్పులు కనిపిస్తాయి. మనుషులకు మతం, యదార్థం, సహనం, శుభ్రత, దయ, ఆయుష్షు, శారీరక శక్తి, జ్ఞాపకశక్తి వంటివన్నీ రోజురోజుకీ తగ్గిపోతాయి. ఇవన్నీ కలియుగాంతాన్ని సూచించే పరిణామాలే.

కలియుగం అంతానికి హెచ్చరిక సంకేతాలివే ?

కలియుగం అంతానికి హెచ్చరిక సంకేతాలివే ?

కలియుగంలో సంపదకే ఎక్కువ ప్రాధాన్యత ఉంటుంది. సత్ ప్రవర్తన, మంచి గుణాలకంటే సంపదకే ఎక్కువ విలువనిస్తారు. సంపన్నులే న్యాయం, చట్టాన్ని నడిపిస్తారు.

కలియుగం అంతానికి హెచ్చరిక సంకేతాలివే ?

కలియుగం అంతానికి హెచ్చరిక సంకేతాలివే ?

స్త్రీ, పురుషులు కలిసి జీవించేది కేవలం మిడిమిడి ఆకర్షణతోనే. ఎలాంటి ప్రేమానురాగాలు వాళ్ల మధ్య ఉండవు.

కలియుగం అంతానికి హెచ్చరిక సంకేతాలివే ?

కలియుగం అంతానికి హెచ్చరిక సంకేతాలివే ?

వ్యాపారాల్లో అన్యాయం రాజ్యమేలుతుంది. టాలెంట్ కి, సాహసాలకు, తెలివితేటలకు విలువ ఉండదు. వ్యాపారంలో విజయం కేవలం వంచనతోనే సాధ్యమవుతుంది.

కలియుగం అంతానికి హెచ్చరిక సంకేతాలివే ?

కలియుగం అంతానికి హెచ్చరిక సంకేతాలివే ?

మెడలో జెంజం ఆధారంగా బ్రహ్మణుడని.. మగవాళ్లను గుర్తించే పరిస్థితి వస్తుంది. ఎందుకంటే.. బ్రాహ్మణులకు ఉండాల్సిన లక్షణాలు, నియమాలు వాళ్లు పాటించడంలో విఫలమవుతారు.

కలియుగం అంతానికి హెచ్చరిక సంకేతాలివే ?

కలియుగం అంతానికి హెచ్చరిక సంకేతాలివే ?

ఆధ్యాత్మిక స్థానాల్లో చాలా మార్పులు చోటుచేసుకుంటాయి. భక్తులు ఒక భక్తిమార్గం నుంచి మరొక వైపు మారుతూ ఉంటారు. గారడి విద్యలో బాగా నైపుణ్యం ఉన్న వాళ్లనే ప్రజలు ఎక్కువగా నమ్ముతారు, విలువనిస్తారు.

కలియుగం అంతానికి హెచ్చరిక సంకేతాలివే ?

కలియుగం అంతానికి హెచ్చరిక సంకేతాలివే ?

డబ్బు లేని వాళ్లను హీనంగా చూస్తారు. కపటనాటకంతో ప్రవర్తించే వాళ్లనే ధర్మాత్ములుగా భావిస్తారు. కేవలం మాట ఒప్పందంతోనే పెళ్లిళ్లు కుదురుతాయి.

కలియుగం అంతానికి హెచ్చరిక సంకేతాలివే ?

కలియుగం అంతానికి హెచ్చరిక సంకేతాలివే ?

అందం అంటే ముఖ వర్చస్సు, హావభావాలు, శరీరాకృతి. కానీ.. కలియుగాంతంలో ఇవేవీ అందానికి సంకేతాలు కాదు. కేవలం హెయిర్ స్టైల్ ని బట్టే అందాన్ని వర్ణిస్తారు.

కలియుగం అంతానికి హెచ్చరిక సంకేతాలివే ?

కలియుగం అంతానికి హెచ్చరిక సంకేతాలివే ?

జీవితంలో ఎలాంటి లక్ష్యం ఉండదు. కేవలం కడుపునింపుకోవడమే ప్రధానంగా భావిస్తారు. ధైర్యవంతులనే నమ్మకస్తులుగా అంగీకరిస్తారు. కుటుంబ బాధ్యతలు తీసుకునే వ్యక్తిని మాత్రమే మనిషిగా చూస్తారు.

కలియుగం అంతానికి హెచ్చరిక సంకేతాలివే ?

కలియుగం అంతానికి హెచ్చరిక సంకేతాలివే ?

మతానికి విలువ లేకుండా పోతుంది. మతంలో పాటించాల్సిన నియమాలను నిర్లక్ష్యం చేస్తారు. సమాజంలో కీర్తి ప్రతిష్టలు పొందడానికి మత సిద్ధాంతాలను అనుసరిస్తారు.

కలియుగం అంతానికి హెచ్చరిక సంకేతాలివే ?

కలియుగం అంతానికి హెచ్చరిక సంకేతాలివే ?

ఈ భూమ్మీద అవినీతిపరులదే హవా కొనసాగుతుంది. అవినీతిపరులు సంఖ్య వినూత్నరీతిలో పెరిగిపోతుంది. అడ్డగోలుగా అక్రమంగా.. డబ్బులు సంపాదించే వాళ్ల సంఖ్య పెరుగుతుంది.

కలియుగం అంతానికి హెచ్చరిక సంకేతాలివే ?

కలియుగం అంతానికి హెచ్చరిక సంకేతాలివే ?

రాజకీయాల తీరుతెన్నులు పూర్తీగా మారిపోతాయి. కలియుగాంతాన్ని సూచించే వాటిలో రాజకీయల్లో మార్పులు ప్రధానంగా చెప్పవచ్చు. సామాజికంగా ఎవరు శక్తివంతులుగా ఉంటారో వాళ్లే రాజకీయాల్లో రాణిస్తారు.

కలియుగం అంతానికి హెచ్చరిక సంకేతాలివే ?

కలియుగం అంతానికి హెచ్చరిక సంకేతాలివే ?

కరువు, అధిక పన్నుల భారం తీవ్రంగా బాధపెడతాయి. ఆకులు, మాంసం, తేనె, పండ్లు, పూలు, గింజలు తినడం అలవాటు చేసుకోవాల్సి వస్తుంది. కరువు కాటకాలతో అల్లాడిపోవాల్సి వస్తుంది.

కలియుగం అంతానికి హెచ్చరిక సంకేతాలివే ?

కలియుగం అంతానికి హెచ్చరిక సంకేతాలివే ?

ప్రజలు ఎక్కువగా చలి, గాలి, వేడి, వర్షం, మంచుతో ఇబ్బందిపడతారు. కలహాలు, ఆకలి, దప్పిక, అనారోగ్య సమస్యలు, తీవ్ర ఆందోళనతో.. బాధపడతారు.

కలియుగం అంతానికి హెచ్చరిక సంకేతాలివే ?

కలియుగం అంతానికి హెచ్చరిక సంకేతాలివే ?

కలియుగం అంతం అయ్యే సమయానికి మానవ సమాజంలో వేదాలను పూర్తీగా మర్చిపోతారు. నాస్తికులుగా మారిపోతారు. హింస, అపద్దాలు పెరిగిపోతాయి.

కలియుగం అంతానికి హెచ్చరిక సంకేతాలివే ?

కలియుగం అంతానికి హెచ్చరిక సంకేతాలివే ?

దేవతాస్వరూపంగా భావించే ఆవులను విచక్షణారహితంగా చూస్తారు. దేవుడిగా పూజించే ఆవులనే చంపేస్థితి దిగజారుతారు. క్రూరంగా చంపుకుని తినే స్థాయికి కలియుగాంతంలో పరిస్థితులు మారుతాయి.

English summary

signs that Kaliyuga is coming to an end in telugu

The signs of Kali-Yuga described in Srimad-Bhagavatam are already prevalent in many countries of the world and have gradually spread to other places engulfed by impiety and materialism.
Story first published: Thursday, November 12, 2015, 13:00 [IST]
Please Wait while comments are loading...
Subscribe Newsletter