For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఏ విష‌యాలు అన్‌హ్యాపీగా ఉండ‌టానికి కార‌ణ‌మ‌వుతాయి ?

By Nutheti
|

జీవితం అంటే సుఖ‌దుఖాల స‌మ్మేళ‌నం. అందుకే ప్ర‌తి మ‌నిషి ఆనందం, సంతోషంతోనే జీవితాన్ని గ‌డ‌ప‌లేడు. ప్ర‌తి ఒక్క‌రూ అసంతృప్తి, ఆవేశం, కోపం ఎదుర్కోవాల్సి వ‌స్తుంది. ఇలాంటి భావాల‌న్నీ జీవితంపై తీవ్ర ప్ర‌భావాన్ని చూపుతాయి. వీటితో ఎక్కువ‌కాలం బాధ‌ప‌డితే.. చాలా ప్ర‌మాదం.

ఆఫీస్ లో ఉన్నప్పుడు మంచి మూడ్&ఎనర్జినిచ్చే ఫుడ్స్ ఆఫీస్ లో ఉన్నప్పుడు మంచి మూడ్&ఎనర్జినిచ్చే ఫుడ్స్

ప్ర‌తి ఒక్క‌రు జీవితంలోని ప్ర‌తి అడుగులోనూ, ప్ర‌తి స్టేజ్ లోనూ ఆనందంగా జీవించాల‌నే కోరుకుంటాడు. అయితే కొంత‌మంది నెగ‌టివ్ ఆలోచ‌న‌ల‌తో అసంతృప్తి ఫీల‌వుతుంటారు. అన‌వ‌సర విష‌యాల‌కు చాలా బాధ‌ప‌డుతూ, చింతిస్తూ ఉంటారు. చిన్న‌పిల్ల‌ల విష‌యంలో ఎవ‌రూ న‌వ్వ‌మ‌ని, ఏడ‌మ‌ని నేర్పించ‌రు. కానీ స‌మ‌యానికి త‌గ్గ‌ట్టు అవ‌స‌రాన్ని బ‌ట్టి భావోద్వేగాలు వెలువ‌డుతూ ఉంటాయి.

సంతోషంగా ఉండ‌టాన్ని మ‌నుషుల‌కు ఎవ‌రూ నేర్పిన విష‌యం కాదు. అసంతృప్తిగా ఉన్న వ్య‌క్తులు కేవ‌లం ఏడ‌వ‌డం, చింతించ‌డాన్ని అల‌వ‌రుకుంటారు. కానీ అన్ హ్యాపీగా ఉండ‌టానికి కార‌ణ‌మ‌య్యే ప‌నులు చేయ‌క‌పోవ‌డం మంచిది. దీనివ‌ల్ల ఎప్పుడూ సంతోషంగా ఉండ‌వ‌చ్చు. ఇలా అన్ హ్యాపీగా ఉండే వ్య‌క్తులు ఎందుకు, ఎలాంటి ప‌రిస్థితుల్లో అసంతృప్తిగా ఉంటారో తెలుసుకుందాం. ఎలాంటి ఫీలింగ్ కైనా మ‌నుషులే కార‌ణం. మ‌నుషుల‌ను అసంతృప్తికి గురిచేసే అంశాలేంటో తెలుసుకుందాం..

నో కాంప్ర‌మైజ్

నో కాంప్ర‌మైజ్

అన్ హ్యాపీగా ఉండేవాళ్లు ఏ విష‌యంలోనూ కాంప్ర‌మైజ్ కారు. స‌మ‌యాన్ని బ‌ట్టి స‌ర్దుకుపోవ‌డం వీళ్ల‌కు చాలా క‌ష్ట‌మైన ప‌ని. జీవితం ఐస్ క్రీంలా చాలా స్మూత్ గానూ ఉంటుంది.. అదే స‌మ‌యంలో కొబ్బ‌రికాయంత హార్డ్ గానూ ఉంటుంది. రెండింటినీ బ్యాలెన్స్ చేసుకుంటూ జీవితం గ‌డ‌పాలి. ఈ విష‌యాన్ని ఎవ‌రైతే న‌మ్మ‌లేక‌పోతారో వాళ్లు జీవితంలో హ్యాపీగా ఉండ‌లేరు. ఎప్పుడూ నిరుత్సాహంగా, అసంతృప్తితో గ‌డుపుతూ ఉంటారు. జీవితంలో వ‌చ్చే క‌ష్టాల‌ను కూడా ఎంజాయ్ చేయ‌డం అల‌వ‌రచుకోవాలి.

చిన్న చిన్న ఆనందాలు

చిన్న చిన్న ఆనందాలు

జీవితంలో చిన్న చిన్న ఆనందాలు ఉన్న‌ప్పుడే జీవితం హ్యాపీగా ఉంటుంది. కొంతైనా స‌మ‌యాన్ని వేస్త్ చేయడం కామ‌న్, కంప‌ల్స‌రీ. కానీ అన్ హ్యాపీగా ఉండేవాళ్లు కొంత‌స‌మ‌యాన్ని కూడా వేస్ట్ చేయ‌కూడ‌ద‌ని భావిస్తారు. స‌ర‌దాగా గ‌డ‌ప‌డం, పిల్ల‌ల‌తో ఎంజాయ్ చేయ‌డం, ఫ్రెండ్స్ తో స‌మ‌యాన్ని వేస్ట్ చేయ‌డం వ‌ల్ల మ‌రింత ఆనందాన్ని పొంద‌వ‌చ్చు. మాన‌సికోత్సాహాన్ని పొంద‌వ‌చ్చు.

ఎక్కువ‌గా ఆలోచించ‌డం, నెగ‌టివ్ ఫీలింగ్స్

ఎక్కువ‌గా ఆలోచించ‌డం, నెగ‌టివ్ ఫీలింగ్స్

ఏదైనా స‌మ‌స్య వ‌చ్చిన‌ప్పుడు దాన్ని ప‌రిష్కారం వెత‌క‌డం మానేసి.. నెగ‌టివ్ గా ఎక్కువ‌గా ఆలోచిస్తూ ఉంటారు. స‌మ‌స్య ప‌రిష్కారం గురించి ఆలోచించ‌డం మానేసి ఎక్కువ‌గా ఆలోచించ‌డం వ‌ల్ల డిప్రెష‌న్ కి గుర‌య్యే అవ‌కాశాలున్నాయి.

కంప్లైంట్స్

కంప్లైంట్స్

ఆన్ హ్యాపీ మ‌నుషులు ప్ర‌తి విష‌యానికి ఫీల‌వుతుంటారు. ఎక్కువ ఎండ‌గా ఉన్నా, ఎక్కువ వ‌ర్షం ఉన్నా, ఎక్కువ గాలి ఉన్నా.. త‌ట్టుకోలేరు. చిరాకు ప‌డుతూ ఉంటారు. మ‌న‌చేతుల్లో లేని విష‌య‌మైనా ఎక్కువ‌గా బాధ‌ప‌డతారు. అది ప్ర‌కృతి వైప‌రిత్య‌మ‌ని అర్థం చేసుకోవ‌డంలో విఫ‌ల‌మ‌వుతారు. ఇత‌రుల‌కు దూరంగా ఉంటూ అన‌వ‌స‌ర విష‌యాల‌ను ఆలోచిస్తూ ఉంటారు.

రియాక్ష‌న్

రియాక్ష‌న్

సంతోషం క‌లిగినా, బాధ క‌లిగినా.. చాలా హ‌ఠాత్తుగా, ఉన్న‌ట్టుండి రియాక్ట్ అవుతారు. ప‌రిస్థితిని అర్థం చేసుకోవ‌డానికి, ఆలోచించ‌డానికి కూడా స‌మ‌యం తీసుకోరు. ఎలాంటి విష‌యానికైనా ఆలోచించి స్పందిస్తారు సంతోషంగా ఉండే వ్య‌క్తులు.

ఇత‌రుల‌ను విమ‌ర్శించ‌డం

ఇత‌రుల‌ను విమ‌ర్శించ‌డం

అసంతృప్తిగా ఉండేవాళ్లు తాము చేసే త‌ప్పుల‌ను అస్స‌లు ఒప్పుకోరు. ఇత‌రుల‌ని నిందిస్తూ ఉంటారు. త‌మ త‌ప్పుల‌ను ఇత‌రుల‌పై నెట్టేయ‌డం, ఇత‌రుల‌ను అన‌వ‌స‌ర విష‌యాల‌కు విమ‌ర్శించ‌డానికి ఇష్ట‌ప‌డ‌తారు.

అసూయ‌

అసూయ‌

ఇత‌రుల విజ‌యాన్ని అసంతృప్తిగా ఉండేవాళ్లు భ‌రించ‌లేరు. ఇత‌రుల‌ను చూసి అసూయ‌కు లోన‌వుతారు. ఎదుటివాళ్ల ఆనందాన్ని త‌ట్టుకోలేరు, ఓర్చుకోలేరు. విజ‌యం సాధిస్తున్న వాళ్ల‌ను ఇన్పిరేష‌న్ గా తీసుకోవ‌డం మానేసి.. వాళ్ల స‌మ‌యాన్ని వృధా చేయడానికి ప్ర‌య‌త్నిస్తుంటారు. త‌మ గురించి ఆలోచించి.. స‌మ‌స్య‌ల ప‌రిష్కారానికి ఎద‌గ‌డానికి ప్ర‌య‌త్నిస్తే.. చాలా సంతోషంగా ఉంటారు.

విన‌డం కంటే మాట్లాడ‌టానికే ఎక్కువ ప్రాధాన్య‌త‌

విన‌డం కంటే మాట్లాడ‌టానికే ఎక్కువ ప్రాధాన్య‌త‌

అసంతృప్తిగా ఉండేవాళ్లు ఫ్లేక్సిబుల్ గా ఉండ‌రు. వాళ్లు అనుకున్న‌దే, ఆలోచించిన‌దే క‌రెక్ట్ అని ఫీల‌వుతారు. దీనివ‌ల్ల డిప్రెష‌న్ కి లోన‌వుతారు. త‌మ ప్ర‌పంచాన్ని నెగ‌టివ్ థాట్స్ తోనే నింపేసుకుంటారు. వాళ్లు ఎప్పుడు త‌ప్పు చేయ‌మ‌ని భావిస్తారు. ఎదుటివాళ్ల ఆలోచ‌న‌లు, ఐడియాల‌ను తిర‌స్క‌రించ‌డం వీళ్ల‌కు అల‌వాటుగా మారుతుంది.

English summary

Things That Make A Person Unhappy in telugu

We all feel low and down at times but quickly the positive aspect of our brain comes to our rescue. This is the proof that a person can't live with unhappiness, regrets, anger and envy for a long period of time. These factors can be devastating and can act as a slow poison in our lives.
Story first published: Monday, November 16, 2015, 13:36 [IST]
Desktop Bottom Promotion