For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

  శోభనానికి వధువు పాలు తీసుకెళ్లడం వెనక సైంటిఫిక్ రీజన్స్ ఏంటి ?

  |

  ప్రతి ఒక్కరి జీవితంలో పెళ్లి చాలా పవిత్రమైనది. ఇద్దరు మనుషులు, రెండు మనసులు కలిసి.. ఒకటిగా జీవితాంతం గడపడానికి పెళ్లి ప్రధానం. ఇండియాలో పెళ్లి అయిన తర్వాత ఫస్ట్ నైట్ కి చాలా ప్రాధాన్యమిస్తారు. వెడ్డింగ్ నైట్, ఫస్ట్ నైట్, శోభనం అని పిలుస్తారు. భార్యాభర్తలిద్దరూ.. ఒక్కటై, ఇద్దరి మధ్య శారీరక సంబంధాన్ని మొదటిసారి పంచుకునే తొలిరేయి ఫస్ట్ నైట్.

  పెళ్లి అయిన తర్వాత నాలుగోరోజు రాత్రి సాధారణంగా వెడ్డింగ్ నైట్ నిర్వహిస్తారు. ఈ వెడ్డింగ్ నైట్ చాలా సంప్రదయాలు కలిగి ఉంటుంది. పడకగదిని రకరకాల పూలతో అందంగా అలంకరిస్తారు. అగరబత్తీలు, స్వీట్స్, పండ్లు పెట్టి.. బెడ్ రూమ్ ని చాలా ఆకర్షణీయంగా, సువాసనాబరితంగా అలంకరించడం ఆనవాయితీ.

  wedding night

  అలాగే పెళ్లికొడుకుకి పెళ్లికూతురు పాల గ్లాసు తీసుకెళ్లి ఇవ్వడమనేది చాలా కాలం నుంచి వస్తున్న సంప్రదాయం. శోభనం రోజు పాలు తీసుకెళ్లడం అనేది చాలా కీలకపాత్ర పోషిస్తుంది. ఎందుకనే విషయం చాలా మందికి తెలియదు. ఇక్కడ శోభనం రాత్రి మిల్క్ ఇవ్వడానికే ఎందుకు ప్రాధాన్యత ఇస్తారు... దాని వెనక ఉన్న ఫ్యాక్ట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం..

  MOST READ:శృంగారం గురించి సైకాలజిస్ట్ లు ఇచ్చే 9 ముఖ్యమైన చిట్కాలు మీకు సహాయపడవచ్చు!

  నమ్మకం

  నమ్మకం

  హిందువుల సంప్రదాయం చాలా ఏళ్ల క్రితానికి ముందే మొదలైంది. హిందు వివాహంలో.. పెళ్లికూతురు పెళ్లికొడుకుకి.. మొదటి రాత్రి పాలు తీసుకెళ్లి ఇవ్వడం.. ముఖ్యమైన ఆచారం. పాలగ్లాసు తీసుకెళ్లే సంప్రదాయం సినిమాలు, టీవీ సీరియల్స్ లో ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది.

  హార్మోన్ లెవెల్స్ పెరగడానికి

  హార్మోన్ లెవెల్స్ పెరగడానికి

  పాలల్లో ప్రొటీన్స్ ఎక్కువగా ఉంటాయి. ఇందులో ఉండే ఎమినో యాసిడ్ శరీరానికి శక్తినిస్తుంది. అందుకే శోభనం రోజు రాత్రి పాలు తీసుకోవడం వల్ల టెస్టోస్టెరాన్, ఈస్ర్టోజెన్ హార్మోన్లకు మంచిది. అలాగే బాదం, పాలు కలవడం వల్ల ప్రొటీన్స్ ఎక్కువగా ఉంటాయి. దీనివల్ల లైంగిక సంబంధం మెరుగ్గా ఉంటుంది. అలాగే హార్మోన్ లెవెల్స్ పెరుగుతాయి.

  ఇమ్యునిటీ, జీర్ణవ్యవస్థ

  ఇమ్యునిటీ, జీర్ణవ్యవస్థ

  పాలు మెమరీ, ఇమ్యునిటీ, జీర్ణశక్తి పెగరడానికి తోడ్పడతాయి. రాత్రిపూట వీటిని తీసుకోవడం వల్ల మంచి ఫలితం ఉంటుంది.

  పునరుత్పత్తి కణాలు

  పునరుత్పత్తి కణాలు

  వాతం, పిత్తం వంటి వాటిని బ్యాలెన్స్ చేయడానికి పాలు సహాయపడతాయి. పునరుత్పత్తి కణాల శక్తిని కూడా పెంచడంలో తోడ్పడతాయి.

  MOST READ:పొట్టిగా ఉన్నవారికి శుభవార్త: పొడవు పెరగడానికి సహాయపడే సీక్రెట్ ఫుడ్స్ ...

  లైంగికంగా యాక్టివ్ నెస్

  లైంగికంగా యాక్టివ్ నెస్

  సెక్సువల్ గా మగవాళ్లు యాక్టివ్ గా ఉండటానికి పాలు తోడ్పడతాయి. కాబట్టి మగవాళ్లు రోజు పాలు తీసుకోవడం వల్ల లిబిడో, స్పెర్మ్ కౌంట్, మొటిలిటీ పెరుగుతుంది.

  రీహైడ్రేషన్

  రీహైడ్రేషన్

  శరీరానికి పాలు చక్కటి రీహైడ్రేషన్ ఫ్లూయిడ్. ప్రతి ఒక్కరూ కనీసం 6 గ్లాసుల రసాలు తీసుకోవాలి. బాదాం కలిపిన పాలు తీసుకోవడం వల్ల లిబిడో స్థాయి పెరగడానికి సహాయపడుతుంది.

  రిలాక్సేషన్

  రిలాక్సేషన్

  కొత్తగా పెళ్లైన జంట మొదటిసారి ఒకరినొకరు అర్థం చేసుకోవడానికి, మాట్లాడుకోవడానికి వెడ్డింగ్ నైట్ సరైన సమయం. తొలిసారి కలవడం వల్ల ఆందోళనకు గురవుతారు. పెళ్లికి ముందు ఇద్దరూ ఒంటరిగా గడిపిన క్షణాలు ఉండవు. కాబట్టి ఇద్దరు కాస్త ఇబ్బంది పడతారు. కాబట్టి వాళ్లిద్దరి మధ్య అనుకూలంగా, రిలాక్సింగ్ గా ఉండటానికి పాలు సహకరిస్తాయి. అలాగే ఇవి హ్యాపీ హార్మోన్స్ రిలీజ్ చేస్తాయి. దీనివల్ల ఇద్దరు సంతోషంగా ఉంటారని శోభనం రోజు రాత్రి పాల గ్లాసునే ఎంచుకున్నారు.

  ఎనర్జీ

  ఎనర్జీ

  తాజా పాలలో కార్బోహైడ్రేట్స్ ఉంటాయి. ఇవి శరీర కణాలకు శక్తిని అందిస్తాయి. తక్షణ శక్తిని కార్బోహైడ్రేట్స్ ద్వారానే పొందగలుగుతారు కాబట్టి మొదటి రాత్రి పాలనే ఇస్తారు.

  మూడ్

  మూడ్

  పాలు తీసుకోవడం వల్ల మెటబాలిజం సరిగా ఉంటుంది. అలాగే విటమిన్ డి అందుతుంది. అలసట, ఒత్తిడిని దూరంగా ఉంచడానికి పాలు సహాయపడతాయి. అందుకే వెడ్డింగ్ నైట్ పాలకే ఇంపార్టెన్స్ ఇస్తారు.

  MOST READ:అరచేతి సైజు మీ శక్తి సామర్థ్యాలకు ప్రతిరూపం ! అదెలా ??

  టిష్యూస్

  టిష్యూస్

  కేవలం సాధారణ మిల్క్ ఇవ్వడం వల్ల ఎలాంటి ప్రయోజనం ఉండదు. అందుకే పాలల్లోకి కొద్దిగా బాదం పలుకులు, మిరియాల పొడి కలిపి గ్లాసు పాలు ఇవ్వడం వల్ల టిష్యూస్ కి మంచిది. అలాగే తేనె కూడా కలపడం వల్ల కామవాంఛ పెరుగుతుంది.

  రక్తప్రసరణ

  రక్తప్రసరణ

  పాలు తాగితే రక్తప్రసరణ సజావుగా సాగి దంపతుల్లో నూతనోత్తేజం వస్తుంది.

  చల్లగా ఉంచడానికి

  చల్లగా ఉంచడానికి

  సాధారణంగా ఆడ, మగ శరీరాలు కలిసినప్పుడు అధిక స్థాయిలో వేడి పుడుతుంది. శోభనం రాత్రి వధూవరుల కలయిక వల్ల వారి శరీర ఉష్టోగ్రతలు అమాంతం

  పెరిగిపోతాయి.పాలు ఆ వేడిని తగ్గిస్తాయి.

  English summary

  Top 12 facts behind serving of milk on wedding night

  A Hindu wedding, one of the most sacred of rites, incorporates many of these timeless rituals and customs. And one such tradition is that of serving the newly-weds with a glass of milk on their wedding night. Facts that relates the importance of milk on Wedding night.
  We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Boldsky sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Boldsky website. However, you can change your cookie settings at any time. Learn more