For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

బుజ్జాయిల గురించి తెలుసుకోవాల్సిన బుల్లి బుల్లి కబుర్లు

By Nutheti
|

ముసిముసి నవ్వులు.. మురిపించే కేరింతలు.. ముద్దులొలికే భావాలు.. ముచ్చటైన సమయం చిన్నతనం. పుట్టిన పసిపాపలో ఇలాంటి ఎన్నో ముద్దొచ్చే హావభావాలు చూస్తే.. చాలా ముచ్చటగా అనిపిస్తుంది. పసిపిల్లల బోసి నవ్వులు చూసి ఎవరైనా.. సంబరపడిపోవాల్సిందే.

READ MORE: పాపాయి బాడీ మసాజ్ కోసం టాప్ 10 ఆరోమా ఆయిల్స్

ఈ ప్రపంచంలోకి అడుగుపెట్టిన చిన్నపిల్లల గురించి తెలియని విషయాలు చాలా ఉన్నాయి. చిన్ని చిన్ని చేతులు, కాళ్లు, లాలించే కళ్లు.. ఇలా ప్రతీది సున్నితంగా.. స్మూత్ గా.. ఉంటాయి. గర్భంలో ఉన్నప్పటి నుంచి భూమ్మీద పడేవరకు ఎన్నో మార్పులు.. ఇంకెన్నో రికార్డులు. అలాంటి ఇంట్రెస్టింగ్ థింగ్స్ గురించి చర్చిద్దాం. ముద్దొచ్చే చిన్నారుల్లో దాగున్న అమేజింగ్ ఫ్యాక్ట్స్ ఏంటో చూద్దామా..

ముద్దులొలికే పాపాయిల ముచ్చట్లు

ముద్దులొలికే పాపాయిల ముచ్చట్లు

శరీర నిర్మాణంలో.. ఎముకలు చాలా ముఖ్యమైనవి. ఇవి పెద్దవాళ్లలో కంటే పిల్లల్లో ఎక్కువగా ఉంటాయి. చిన్న పిల్లల్లో 60 ఎముకలు ఎక్కువగా ఉంటాయి.

ముద్దులొలికే పాపాయిల ముచ్చట్లు

ముద్దులొలికే పాపాయిల ముచ్చట్లు

అప్పుడే పుట్టిన శిశువు శరీరంలో కేవలం ఒక కప్పు రక్తం మాత్రమే ఉంటుంది. పెరిగి పెద్దవాళ్లు అయ్యే కొద్దీ రక్తం శాతం కూడా పెరుగుతూ ఉంటుంది.

ముద్దులొలికే పాపాయిల ముచ్చట్లు

ముద్దులొలికే పాపాయిల ముచ్చట్లు

పిల్లలు వాళ్లే స్వయంగా టాయ్ లెట్ కి వెళ్లే వరకు డైపర్లు వాడుతుంటారు. అయితే ఒక్కో బుడతడికి దాదాపు 8 వేల డైపర్లు చేంజ్ చేస్తారట. ఆశ్యర్యంగా ఉన్నా ఇది నిజమే.

ముద్దులొలికే పాపాయిల ముచ్చట్లు

ముద్దులొలికే పాపాయిల ముచ్చట్లు

పుట్టేటప్పుడు పిల్లల శరీరంపై ఎక్కడా ఎలాంటి బ్యాక్టీరియా ఉండదు.

ముద్దులొలికే పాపాయిల ముచ్చట్లు

ముద్దులొలికే పాపాయిల ముచ్చట్లు

పిల్లలకు రెండేళ్ల వయసు వచ్చేవరకు.. తల్లిదండ్రులు నిద్ర చాలా మిస్ అవ్వాల్సి వస్తుంది. వాళ్లకు రెండేళ్లు వచ్చేలోపు కనీసం 6 నెలల నిద్ర కోల్పోతారు తల్లిదండ్రులు.

ముద్దులొలికే పాపాయిల ముచ్చట్లు

ముద్దులొలికే పాపాయిల ముచ్చట్లు

చిన్న పిల్లలు సాధారణంగా కలర్ ఫుల్ గా ఉన్నవాటికి ఎట్రాక్ట్ అవుతారు అనుకుంటాం. కానీ పుట్టిన కొన్ని నెలలపాటు బ్లాక్ అండ్ వైట్ కలర్స్ మాత్రమే చూడగలుగుతారు.

ముద్దులొలికే పాపాయిల ముచ్చట్లు

ముద్దులొలికే పాపాయిల ముచ్చట్లు

తల్లిపాలు.. ఇవ్వడం పిల్లలకే కాదు తల్లులకు కూడా మంచిదని.. సాధారణంగా వింటుంటాం. అయితే.. బ్రెస్ట్ ఫీడింగ్ వల్ల మరో లాభం కూడా ఉంది. బ్రెస్ట్ ఫీడింగ్ ద్వారా 22 శాతం అల్జీమర్స్ రిస్క్ నుంచి తల్లులు బయటపడవచ్చని అధ్యయనాలు చెబుతున్నాయి

ముద్దులొలికే పాపాయిల ముచ్చట్లు

ముద్దులొలికే పాపాయిల ముచ్చట్లు

అప్పుడే పుట్టిన పిల్లల్లో కన్నీళ్లు ఉండవు. వాళ్లు ఏడ్చినా సౌండ్ మాత్రమే వస్తుంది కానీ.. కన్నీళ్లు రావు. పుట్టిన మూడు వారాలు లేదంటే అంతకంటే ఎక్కువ రోజుల తర్వాత కన్నీళ్లను ఉత్పత్తి చేసుకోగలుగుతారు.

ముద్దులొలికే పాపాయిల ముచ్చట్లు

ముద్దులొలికే పాపాయిల ముచ్చట్లు

అప్పుడే పుట్టిన పిల్లలకు మోకాలి చిప్పలు ఉండవు. మోకాలి రూపంలో రూపం ఉంటుంది కానీ.. అవి ఎముకలు కాదు. ఆరునెలల వచ్చే వరకు మోకాళ్లు ఏర్పడవు.

ముద్దులొలికే పాపాయిల ముచ్చట్లు

ముద్దులొలికే పాపాయిల ముచ్చట్లు

చిన్నపిల్లలు ఆడవాళ్ల వాయిస్ నే ఇష్టపడతారు. అందుకే అమ్మలు, అమ్మల జోలపాటలకు హాయిగా నిద్రపోతారు.

ముద్దులొలికే పాపాయిల ముచ్చట్లు

ముద్దులొలికే పాపాయిల ముచ్చట్లు

పిల్లలు పుట్టినప్పుడు వాళ్ల కళ్ల సైజు.. 75శాతం పెద్దవిగా ఉంటాయి. అంటే వాళ్లకు వయసు వచ్చాక ఉండేంత పరిమాణంలో ఉంటాయి.

ముద్దులొలికే పాపాయిల ముచ్చట్లు

ముద్దులొలికే పాపాయిల ముచ్చట్లు

ఒకప్పుడు కవలు చాలా అరుదుగా పుట్టేవాళ్లు కానీ.. ఇప్పుడు అంటే 1980 నుంచి కవలల పుట్టుక 76 శాతానికి పెరిగింది.

ముద్దులొలికే పాపాయిల ముచ్చట్లు

ముద్దులొలికే పాపాయిల ముచ్చట్లు

చిన్నపిల్లల మెదడు 50 శాతం గ్లూకోజ్ ని ఉపయోగించుకుంటుంది. అందుకే పిల్లలు ఎక్కువ సమయం నిద్రపోతూ ఉంటారు.

ముద్దులొలికే పాపాయిల ముచ్చట్లు

ముద్దులొలికే పాపాయిల ముచ్చట్లు

డాక్టర్లు అంచనా వేసిన సమయానికి పుడుతున్న పిల్లలు చాలా తక్కువ. ఇది కేవలం 4 శాతం సందర్భాల్లో మాత్రమే జరుగుతోంది.

ముద్దులొలికే పాపాయిల ముచ్చట్లు

ముద్దులొలికే పాపాయిల ముచ్చట్లు

మీకు తెలుసా ? ప్రతి ఏటా ఒక మిలియన్ అబార్షన్లు అమ్మాయి వద్దనుకోవడం వల్లే జరుగుతున్నాయి.

ముద్దులొలికే పాపాయిల ముచ్చట్లు

ముద్దులొలికే పాపాయిల ముచ్చట్లు

బ్రెజిల్ లో.. తల్లిపాలను దేశమంతా సరఫరా చేస్తారట. ఎవరికైనా తల్లిపాలు సరిపోని పిల్లలకు అందించడానికి ఇలా తల్లులు పాలను దేశమంతా డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు.

ముద్దులొలికే పాపాయిల ముచ్చట్లు

ముద్దులొలికే పాపాయిల ముచ్చట్లు

ప్రెగ్నెన్సీ సమయంలో.. గురక పెట్టే మహిళలకు సరిగా ఎదగని బేబీస్ పుట్టే అవశాలు ఎక్కువగా ఉన్నాయి.

ముద్దులొలికే పాపాయిల ముచ్చట్లు

ముద్దులొలికే పాపాయిల ముచ్చట్లు

చైనాలో ప్రతి 30 సెకన్లకు ఒక బిడ్డ పుట్టుక లోపంతో పుడుతున్నారు.

ముద్దులొలికే పాపాయిల ముచ్చట్లు

ముద్దులొలికే పాపాయిల ముచ్చట్లు

పుట్టాల్సిన సమయాని కంటే ముందుగానే పుట్టిన పిల్లలు చాలా వరకు ఎడమచేతి వాటంతో ఉంటారని.. అధ్యయనాలు చెబుతున్నాయి.

ముద్దులొలికే పాపాయిల ముచ్చట్లు

ముద్దులొలికే పాపాయిల ముచ్చట్లు

పెద్దవాళ్లలో కంటే.. చిన్న పిల్లల్లో మూడు రెట్లు ఎక్కువ టేస్ట్ బడ్స్ ఉంటాయి.

ముద్దులొలికే పాపాయిల ముచ్చట్లు

ముద్దులొలికే పాపాయిల ముచ్చట్లు

పిల్లలకు సర్జరీలు చేయాల్సి వచ్చే 1985లో డాక్టర్లు.. అనస్తీషియా ఇచ్చేవాళ్లు కాదట. అయినా కూడా వాళ్లకు నొప్పి తెలియదని ఆ నాటి డాక్టర్ల నమ్మకం.

ముద్దులొలికే పాపాయిల ముచ్చట్లు

ముద్దులొలికే పాపాయిల ముచ్చట్లు

ఎప్పుడూ నిద్రపోతూ ఉండే చిన్నారులకు కలలు రావని మీకు తెలుసా ? నిజమే వాళ్లకు మూడేళ్లు వచ్చే వరకు కలలు రావని.. న్యూరో సైంటిస్ట్స్ వెల్లడించారు.

English summary

Unkown Facts About Baby: pulse in telugu

17 Weird Baby Facts You Probably Didn't Know.
Story first published: Tuesday, October 27, 2015, 12:52 [IST]
Desktop Bottom Promotion