For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఎదటివాళ్ల మనస్తత్వం తెలుసుకోవడానికి ఫేస్ చూస్తే చాలు !!

By Nutheti
|

ముఖం చూసి అందంగా ఉన్నారా లేదా అని గమనిస్తాం. అలాగే.. ముక్కు, కళ్లు, పెదాలు ఇలా అన్ని రకాలుగా పరిశీలించి.. రూపురేఖలు ఎలా ఉన్నాయని చెక్ చేస్తుంటాం. అయితే ముఖంలోని లక్షణాలను బట్టి వాళ్ల అందాన్ని, ఆకర్షణనే కాదు.. వ్యక్తిత్వాన్ని కూడా పసిగట్టవచ్చని తాజా అధ్యయనాలు చెబుతున్నాయి.

READ MORE: కళ్ల ఆకారం చెప్పె ఆశ్చర్యకర అంశాలు

ఫేషియల్ ఫీచర్స్ కి, వ్యక్తిత్వానికి చాలా దగ్గరి సంబంధం ఉందని అధ్యయనాలు వివరిస్తున్నాయిఎలాంటి ముఖ ఆకారం ఎలాంటి క్యారెక్టర్ ని రివీల్ చేస్తుందో తెలుసుకోవచ్చు. అలాగే ముఖ లక్షణాలను బట్టి పర్సనాలిటీని వివరించవచ్చు. ఇలా ముఖ లక్షణాల ద్వారా క్యారెక్టర్ తెలుసుకోవడాన్ని మోర్ఫోసైకాలజీ అంటారు. ఇంకెందుకు ఆలస్యం మీ ముఖం లేదా మీ స్నేహితుల ముఖ లక్షణాలను బట్టి వ్యక్తిత్వాన్ని అంచనా వేయడానికి రెడీ అయిపోండి.

వెడల్పాటి ముఖం

వెడల్పాటి ముఖం

వైడ్ లేదా వెడల్పాటి ముఖం ఉన్న వాళ్లు ఉదారమైన, నిజాయితీతో పాటు ఓపెన్ మైండెడ్ గా ఉంటారని మోర్ఫో సైకాలజీ వివరిస్తోంది. వీళ్లు ఇతరులతో ఈజీగా కలిసిపోతారు. ప్రశాంతంగా ఉండటానికి ప్రయత్నిస్తారు.

వెడల్పాటి ముఖం - నెగటివ్స్

వెడల్పాటి ముఖం - నెగటివ్స్

ఆర్గ్యుమెంట్స్ వచ్చినప్పుడు వెడల్పు ముఖం కలిగిన వాళ్లు సైలెంట్ అయిపోతారు. దీనివల్ల కొన్ని సందర్భాల్లో వీళ్లకు సామర్థ్యం లేదన్న భావన ఇతరుల్లో కలిగిస్తారు.

పొడవాటి ముఖం

పొడవాటి ముఖం

పొడవాటి ముఖం ఉన్నవాళ్లు స్వీయ సంరక్షణ ఎక్కువగా ఆలోచిస్తారు. లీడర్ షిప్ క్యాలిటీస్ ఎక్కువగా ఉంటాయి. ఎలాంటి నిర్ణయాలైనా ఇతరుల అవసరం లేకుండా సొంతంగా తీసుకోగలుగుతారు. వీళ్లు ఏ విషయాన్నైనా చాలా డీప్ గా, వివిధ కోణాల్లో ఆలోచిస్తారు. రొమాంటిక్ లైఫ్ లో చాలా విభిన్నంగా ఉండాలని కోరుకుంటారు. ఇద్దరూ చాలా ఎమోషనల్ గా ఉంటారు.

పొడవాటి ముఖం - నెగటివ్స్

పొడవాటి ముఖం - నెగటివ్స్

పొడవు ముఖం కలిగి వాళ్లు ఎక్కువగా ఫ్రస్ర్టేషన్ కి లోనవుతుంటారు.

వెడల్పాటి కళ్లు

వెడల్పాటి కళ్లు

వెడల్పాటి కళ్లు ఉన్న వ్యక్తులు ప్రపంచాన్ని చాలా వండర్ గా ఫీలవుతూ ఉంటారు. చాలా క్యూరియస్ గా ఉంటారు. చిన్న పిల్లల మాదిరిగా చుట్టూ జరుగుతున్న విషయాలపై అత్యుత్సాహం చూపిస్తూ ఉంటారు. కొత్త విషయాలు నేర్చుకోవడాన్ని ఎక్కువగా ఇష్టపడతారు. అలాగే తెలియని వాటి గురించి ప్రశ్నలు అగిడి మరీ తెలుసుకుంటారు. ఎక్కువ ఇమాజిన్ చేసుకోవడం, ఆర్ట్ పై ఆసక్తి కనబరుస్తారు.

వెడల్పాటి కళ్లు - నెగటివ్స్

వెడల్పాటి కళ్లు - నెగటివ్స్

వీళ్లు చాలా సందర్భాల్లో అటెన్షన్ ని కోల్పోతారు. ఎమోషనల్ సపోర్ట్ కోసం ఇతరులపై ఆధారపడతారు.

చిన్న కళ్లు

చిన్న కళ్లు

చిన్న కళ్లు ఉన్న వ్యక్తులు చాలా డిఫరెంట్ గా ఉంటారు. తమ పనులు, నిర్ణయాలు ఇతరులపై ఎలాంటి ప్రభావం చూపుతాయో ముందుగానే అంచనా వేసి నిర్ణయాలు తీసుకుంటారు. వీళ్లు చాలా జాగ్రత్తగా ఆచితూచి నిర్ణయాలు తీసుకుంటారు.

చిన్న కళ్లు - వ్యతిరేఖతలు

చిన్న కళ్లు - వ్యతిరేఖతలు

త్వరగా నిర్ణయాలు తీసుకోవాల్సి వచ్చినప్పుడు వీళ్లు చాలా కష్టపడాల్సి వస్తుంది. కొన్ని సందర్భాల్లో అపద్ధాలు చెబుతారు. మోసపూరితంగా వ్యవహరిస్తారు.

పొడవు ముక్కు

పొడవు ముక్కు

మోర్ఫోసైకాలజీ ప్రకారం పొడవాటి ముక్కు ఉన్న వాళ్లు మంచి స్వభావం కలిగి ఉంటారు. హెల్తీగా ఉండటానికి ఇష్టపడతారు. అందుకే లైఫ్ స్టైల్ ని హెల్తీగా ప్లాన్ చేసుకుంటారు. వీళ్లకు చాలా ఎనర్జీ ఉంటుంది. వ్యాయామం చేయడాన్ని ఎంజాయ్ చేస్తారు. ఇంట్లో కూర్చోవడం కంటే బయటకు వెళ్లడాన్ని ఇష్టపడతారు. విభిన్న కల్చర్లను తెలుసుకోవడానికి ఆసక్తి చూపిస్తారు.

పొడవు ముక్కు - లోపాలు

పొడవు ముక్కు - లోపాలు

వీళ్లకు హెసిటేషన్ ఎక్కువ. మార్పులను ఒప్పుకోలేరు. ఒకవేళ ఆ మార్పులు మంచివే అనిపించినా కూడా ఇష్టపడరు. అంటే.. వచ్చే మంచి అవకాశాలను వదులుకుంటారు.

చిన్న ముక్కు

చిన్న ముక్కు

చిన్న ముక్కు కలిగిన వాళ్లు జాలి, సానుభూతి కలిగి ఉంటారు. ఎదుటివాళ్ల భావాలను, ఇబ్బందులను వెంటనే గ్రహిస్తారు. స్నేహితులను చేసుకోవడంలో వీళ్లు చాలా యాక్టివ్. ఇతరుల కోసం మంచి పనులు చేయడానికి ఇష్టపడతారు.

చిన్న ముక్కు - నెగటివ్స్

చిన్న ముక్కు - నెగటివ్స్

కొన్ని సందర్భాల్లో ఈ చిన్న ముక్కు కలిగిన వ్యక్తులు మోసపూరితంగా వ్యవహరిస్తారు.

నుదురు పెద్దగా ఉంటే

నుదురు పెద్దగా ఉంటే

నుదురు భాగం పెద్దగా ఉన్న వాళ్లు చాలా తెలివిగా ఉంటారు.. అలాగే చాలా కాన్ఫిడెన్స్ కలిగి ఉంటారు. ఏవైనా నిర్ణయాలు తీసుకోవాల్సి వచ్చినప్పుడు అన్ని రకాలుగా ఆలోచించిన తర్వాత నిర్ణయం తీసుకుంటారు. చాలా జాగ్రత్తగా వ్యవహరిస్తారు.

నుదురు పెద్దగా ఉన్నవాళ్లు - నెగటివ్స్

నుదురు పెద్దగా ఉన్నవాళ్లు - నెగటివ్స్

వీళ్లు చాలా భయం, బాధతో ఉంటారు. అనిశ్చితిని అస్సలు ఇష్టపడరు. మార్పులను వ్యతిరేకిస్తారు.

తక్కువ నుదుటి భాగం

తక్కువ నుదుటి భాగం

ప్రస్తుతం ఎలాంటి లైఫ్ ఉన్నా హ్యాపీగా ఉండే తత్వం వీళ్లది. వీళ్లు ఎక్కువగా ఆలోచించడాన్ని ఇష్టపడరు. ఆందోళన, భయం వీళ్లకు ఉండదు.

తక్కువ నుదుటి భాగం - నెగటివ్స్

తక్కువ నుదుటి భాగం - నెగటివ్స్

వీళ్లకు తెలివితేటలు కొంచెం తక్కువగా ఉంటాయి. దూకుడు స్వభావం కలిగి ఉంటారు. ఏదైనా పని చేసే ముందు ఆలోచించడంలో పెయిల్ అవుతారు. దీనివల్ల టార్గెట్ రీచ్ అవలేకపోతారు.

పెదాలు

పెదాలు

మోర్ఫోసైకాలజీ ప్రకారం పెదాల ఆధారంగా కూడా వ్యక్తుల స్వభావాన్ని అంచనా వేయవచ్చు. సన్నటి పెదాలు కలిగిన వాళ్లు క్రియేటివిటీ కలిగి ఉంటే, లావు పెదాలు కలిగిన వాళ్లు ఆనందం కోసం ఎదురుచూస్తుంటారు. సన్నటి పెదాలు కలిగిన వాళ్లు కళాత్మక సౌందర్యాన్ని ఇష్టపతారు. లావుగా, బొద్దుగా పెదాలు కలిగిన వాళ్లు చుట్టూ ఉన్నవాళ్లతో కంటే సొంతంగా ఎదురయ్యే అనుభవాల ద్వారా ఎక్కువ ఎంజాయ్ చేస్తారు. జీవితాన్ని ఎంజాయ్ చేయడానికి, తమ సంతోషాన్ని ఇతరులతో పంచుకోవడానికి ఎక్కువగా ఇష్టపడతారు.

English summary

What Do Your Facial Features Say About Your Personality?: How Face Reveals Your Personality: Face Can Tell About You

Some scientists believe that the shape and features of a person's face can be used to provide an evaluation of their personality.
Story first published: Tuesday, December 1, 2015, 12:57 [IST]
Desktop Bottom Promotion