For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

లేడీస్ vs జెన్స్: ఆడవాళ్లంటే ఇలానే ఉండాలా ?

By Nutheti
|

భారతీయ స్త్రీలకు స్వతంత్రం లేదా ? వాళ్లకంటూ.. అభిరుచులు, అభిప్రాయాలు, ఇష్టాలూ ఉండవా ? ఒకరు చెప్పినట్టు వినాల్సిందేనా ? నిజమే.. ప్రపంచమంతా మారినా.. టెక్నాలజీ కొత్త పుంతలు తొక్కినా భారతీయ స్త్రీ అంటే ఇలా ఉండాలి.. అలా ఉండాలి అన్న థాట్స్ మాత్రం మారడం లేదు. మోడ్రన్ గా ఉండకూడదు.. వంట చేయడం రావాలి.. ఇలాంటి ఆలోచనలే.. ఇంకా రాజ్యమేలుతున్నాయి.

అన్ని రంగాల్లో మహిళలు దూసుకుపోతూ.. సత్తా చాటుకుంటున్నా... అబ్బాయిలు అమ్మాయిల గురించి ఆలోచించే విధానం మాత్రం మార్చుకోవడంలేదు. వాళ్లకు కావాల్సినవి వాళ్లు ఫ్రీగా పొందడానికి అవకాశం ఇవ్వడం లేదు. భారతీయ స్త్రీకి ఉండాల్సిన లక్షణాలను అబ్బాయిలు ఎలా కోరుకుంటున్నారు.. అమ్మాయిలు తమ జీవితం ఎలా ఉండాలని డిమాండ్ చేస్తున్నారో ఓ సారి చూడండి.

వంట

వంట

ఆడవాళ్లకు ఏమున్నా లేకపోయినా.. వంట వండటమనే క్వాలిఫికేషన్ మాత్రం కంపల్సరీ ఉండాలి. టేస్టీగా వంటచేస్తేనే మహిళగా గుర్తించే మగవాళ్లు ఉన్నారు.

స్వతంత్రాంగా ఉండాలి

స్వతంత్రాంగా ఉండాలి

ఆడవాళ్లు స్వతంత్రంగా బతకడం నేర్చుకోవాలి. ఎవరి సపోర్ట్ లేకపోయినా.. నేను బతకగలను అని నిరూపించుకోవాలని మహిళలు చెబుతున్నారు.

పెళ్లి

పెళ్లి

భారతీయ స్త్రీ అంటే ఖచ్చితంగా పెళ్లి చేసుకోవాలి. రెండు పదులు దాటాయంటే.. ఆమెకు పెళ్లి కంపల్సరీ.

ఖర్చు

ఖర్చు

ఆడవాళ్లు ఎక్కువ ఖర్చు చేయకూడదు. షాపింగ్ లు, మేకప్ లు, బ్యూటీపార్లర్లంటూ.. మహిళలు డబ్బులు ఖర్చు పెట్టకూడదని అబ్బాయిలు కోరుకుంటారు.

సంరక్షణ బాధ్యతలు

సంరక్షణ బాధ్యతలు

మహిళలకు సంరక్షణ బాధ్యతలు ఎక్కువగా ఉండాలి. భర్తని, పిల్లలను, ఇంటిని చక్కగా చూసుకోవాలి.

డ్రెస్సింగ్

డ్రెస్సింగ్

ఆడవాళ్లకే కండీషన్స్ ఎక్కువ. ఏది జరిగినా వాళ్లదే పొరపాటుగా భావిస్తారు చాలామంది మగవాళ్లు. అందుకే.. లైంగిక వేధింపులు జరగకూడదంటే... డ్రెస్సింగ్ బాగుండాలి, డీసెంట్ గా ఉండాలని అంటున్నారు.

ఫ్యామిలీ

ఫ్యామిలీ

ఆడవాళ్లకు సర్దుకుపోయే గుణం ఖచ్చితంగా ఉండాలి. తమ సంతోషాన్ని త్యాగం చేసైనా.. కుటుంబ సభ్యులతో సామరస్యంగా మెలగాలని మగవాళ్లు కోరుకుంటారు.

సున్నితంగా

సున్నితంగా

ఆడవాళ్లు సున్నిత మనస్తత్వులై ఉండాలి. భావోద్వేగాల కంటే సున్నిత మనస్తత్వంతో మెలగడం అలవరుకోవాలని మగవాళ్లు డిమాండ్ చేస్తున్నారు.

గౌరవం

గౌరవం

ఆడవాళ్లు తమ కుటుంబ సభ్యులను గౌరవించాలి. భర్తతో పాటు, అత్తమామలను జాగ్రత్తగా చూసుకుంటూ.. గౌరవించాలి.

తక్కువ మాట్లాడాలి

తక్కువ మాట్లాడాలి

మగవాళ్లు మహిళల్లో కోరుకునే మరో లక్షణం ఇది. ఆడవాళ్లంటే ఎక్కువ మాట్లాడతారని అందరూ భావిస్తారు. అందుకే వాళ్లు తక్కువగా మాట్లాడాలని భావిస్తారు.

వర్జినిటీ

వర్జినిటీ

పెళ్లికి ముందు ఆడవాళ్లు తమ వర్జినిటీ కోల్పోకూడదు. పెళ్లికి ముందు ఎలాంటి అఫైర్స్ ఉండకూడదని కోరుకుంటారు మగవాళ్లు.

రహస్యాలు

రహస్యాలు

మహిళలు అంటే.. ఏది దాచుకోరూ.. అంటూ కామెంట్స్ చేస్తుంటారు. అందుకే లేడీస్ రహస్యాలను ఎలా దాచుకోవాలో నేర్చుకోవాలని.. సూచిస్తున్నారు.

టీవీ

టీవీ

మహిళల నుంచి టీవీ స్వేచ్ఛ కోరుకుంటున్నారు అబ్బాయిలు. ప్రశాంతంగా క్రికెట్ చూడటానికి ఆడవాళ్లు సహకరించాలని కోరుకుంటున్నారు.

మోసం

మోసం

ఆడవాళ్లు ఎక్కువగా భావోద్వేగాలకు లోనవుతుంటారు. కాబట్టి.. అమ్మాయిలు భావోద్వేగాలతో.. అబ్బాయిలను మోసం చేయడం ఆపాలని కోరుకుంటున్నారు.

అభ్యున్నతి

అభ్యున్నతి

మరో మహిళ సక్సెస్ కి కారణమవ్వాలి. మరో స్త్రీ అభ్యున్నతి కోసం మహిళలు పనిచేయాలంటున్నారు.

అసూయ

అసూయ

ఇతర మహిళలను చూసి అసూయ పడకూడదు. అలాంటి ఆలోచనలు మానుకోవాలి.

అబ్బాయిలతో స్నేహం

అబ్బాయిలతో స్నేహం

అబ్బాయిలతో స్నేహం చేయకూడదని మహిళలు సూచిస్తున్నారు. వాళ్లతో చనువుగా మెలగరాదని.. అమ్మమ్మలు చెబుతున్నారు.

విసుగు

విసుగు

మహిళలు ఓర్పుతో ఉండాలి. దేనిపైనా విసుగు పడకుండా నెమ్మదిగా ఉండాలని అబ్బాయిలు కోరుకుంటారు.

చదువు, ఇంటి పని

చదువు, ఇంటి పని

ఆడవాళ్లకు ఇంటిపని వచ్చిండాలి. అలాగని చదువు లేకపోయితే విలువుండదు. ఒకవైపు కెరీర్ లోనూ సక్సెస్ కావాలి.. ఇంటి పనుల్లోనూ ఆరితేరాలి.

అలంకరణ

అలంకరణ

అమ్మాయిలు అలంకారప్రియులు. అద్దం ముందు ఉంటే.. ఓ పట్టాన బయటకు రారు. అందుకే అలంకరణకు తక్కువ సమయం కేటాయించాలని అబ్బాయిలు కోరుకుంటున్నారు.

ప్రేమ

ప్రేమ

ఇతరులపై అమితమైన ప్రేమ ఉండరాదు. వాళ్లకు ఎంతవరకు అర్హత ఉందో అంతవరకే ప్రేమ చూపించాలని.. కోరుకుంటున్నారు.

సమాన హక్కులు

సమాన హక్కులు

మగవాళ్లతో సమానంగా హక్కులు కావాలని.. ఆడవాళ్లు డిమాండ్ చేయడం మానేయాలని...వాళ్లతో పాటు సమానంగా జీవించాలని సూచిస్తున్నారు మగవాళ్లు.

లక్షణాలు

లక్షణాలు

ఆడవాళ్లు.. క్వాలిటీస్ లో ఇది ఒకటి. వాళ్లు.. స్త్రీ స్వభావంను కలిగి ఉండాలి. కట్టు, బొట్టుతో పాటు.. ఇతరుల పట్ట సామరస్యంగా వ్యవహరించే గుణం ఉండాలి.

స్వతంత్రం

స్వతంత్రం

మహిళలు స్వతంత్రంగా జీవించాలి. ఒకరిపై ఆధారపడకుండా.. ఇండిపెండెంట్ గా జీవించడం అలవరచుకోవాలి. ఇలాంటి క్వాలిటీస్ తో ఈ ప్రపంచాన్ని అందంగా తీర్చిదిద్దాలని.. కోరుకుంటుంటున్నారు అబ్బాయిలు, అమ్మాయిలు.

English summary

What India Thinks about women

What Should Women Do? This Is What India Thinks…
Story first published: Monday, October 19, 2015, 14:10 [IST]
Desktop Bottom Promotion