For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

మీ దాంపత్యం గురించి మ్యారేజ్ డేట్ ఏం చెబుతోంది ?

By Nutheti
|

పెళ్లంటే అదో తెలియని అనుభూతి. జీవితంలో వచ్చే కొత్త సంతోషం. ఈ రోజుని తీపి జ్ఞాపకంగా గుర్తు పెట్టుకోవడానికి చాలా మంచి చాలా రకాలుగా ప్లాన్ చేసుకుంటూ ఉంటారు. విలువైన వస్తువులు కొనడం, ఇల్లు కట్టడం, భాగస్వామికి సర్ ఫ్రైజింగ్ గిఫ్ట్ ఇవ్వడం వంటివి చేస్తూ ఉంటారు. యూత్ ఎక్కువగా పెళ్లి విషయంలో చాలా ప్లానింగ్ గా ఉంటారు. డిఫరెంట్ గా ఆలోచిస్తారు.

READ MORE: మీకు నచ్చే డ్రీమ్ గర్ల్ ఏ రాశిలో ఉందో తెలుసుకోవాలనుందా ?

వ్యాలెంటైన్స్ డే రోజే పెళ్లి చేసుకోవాలని, బర్త్ డే రోజు పెళ్లి చేసుకోవాలని ఇలా రకరకాల కలలు కంటూ ఉంటారు. అయితే పెద్దవాళ్లు వాళ్ల జాతకాలను బట్టి పెళ్లి డేట్ పెట్టుకోవాలని సూచిస్తూ ఉంటారు. ఎందుకంటే ఇద్దరి మధ్య సంబంధం స్ర్టాంగ్ గా ఉండాలని ఇలాంటి పద్ధతులు పాటిస్తూ ఉంటారు. పెళ్లాయ్యాక చాలా ముఖ్యమైన నిర్ణయాలను ఇద్దరు కలిసి తీసుకోవాల్సి ఉంటుంది. వివాహ సంబంధం ఏర్పడినప్పటి నుంచి భాగస్వామి ఆలోచనలు, అభిప్రాయాలకు విలువనిస్తూ ఉండాలి. మ్యారేజ్ డేట్ ని బట్టి కూడా ఇద్దరి మధ్య సంబంధం ఆధారపడి ఉంటుంది ఆస్ర్టాలజీ చెబుతోంది.

READ MORE: పెళ్లివేడుకలో బ్రైట్ అండ్ బ్యూటిఫుల్ గా మెరిసిన సెలబ్రెటీలు

మీ పెళ్లి రోజుని అంటే.. పెళ్లి జరిగిన డేట్ ని బట్టి ఇద్దరి మధ్య రిలేషన్ షిప్ ఎలా ఉంటుంది? భవిష్యత్ ఎలా ఉంటుంది ? ఇద్దరి మధ్య అన్యోన్యత ఎలా ఉంటుందనే విషయాలు తెలుసుకోవచ్చు. ఇప్పటి వరకు రాశులను బట్టి, వాళ్ల జాతకాలను బట్టి రిలేషన్ షిప్ అంచనా వేశాం. కానీ.. ఇప్పుడు ఆశ్చర్యం కలిగించే మరో ఇంట్రెస్టింగ్ థింగ్ మ్యారేజ్ డేట్. అవును మ్యారేజ్ డేట్ ని బట్టి వివాహ బంధాన్ని తెలుసుకోవచ్చు. ఇంకెందుకు ఆలస్యం మీ పెళ్లి డేట్ మీ లవ్లీ మ్యారేజ్ లైఫ్ గురించి ఏం చెబుతుందో చెక్ చేసుకోండి.

లిబ్రా వెడ్డింగ్ ( తులారాశి )

లిబ్రా వెడ్డింగ్ ( తులారాశి )

సెప్టెంబర్ 23 నుంచి అక్టోబర్ 22 మధ్యలో మీ పెళ్లి డేట్ ఉంటే.. మీది లిబ్రా వెడ్డింగ్. మీది ఈ వెడ్డింగ్ టైమ్ అయితే మీరు చాలా ఫర్ఫెక్ట్ మ్యాచ్. రిలేషన్ షిప్ లో సంతోషం కోసం.. ఎంతదూరమైన వెళ్తారు ఈ జంట. వీళ్లిద్దరికి సర్దుకుపోయే గుణం ఉంటుంది.

స్కార్పియో వెడ్డింగ్ ( వృచ్చికము )

స్కార్పియో వెడ్డింగ్ ( వృచ్చికము )

అక్టోబర్ 23 నుంచి నవంబర్ 21 మధ్యలో పెళ్లి చేసుకున్న వాళ్లు స్కార్పియో వెడ్డింగ్ కిందకు వస్తారు. వీళ్లను సెక్సియస్ట్ కపుల్ అని చెప్పవచ్చు. మీ వైవాహిక జీవితంలో చాలా సాన్నిహిత్యంగా ఉంటారు. వీళ్లు పిల్లలు, మనవళ్లు, మనవరాళ్లు ఇలా ఎక్కువమందితో పెద్ద ఫ్యామిలీ పొందుతారు.

సాగిట్టరియస్ వెడ్డింగ్ ( ధనుస్సు )

సాగిట్టరియస్ వెడ్డింగ్ ( ధనుస్సు )

నవంబర్ 22 నుంచి డిసెంబర్ 21 మధ్య పెళ్లి చేసుకున్న వాళ్లది సాగిట్టరియస్ వెడ్డింగ్. వీళ్లు చాలా సాహసోపేతంగా ఉంటారు. సంతోషం కోసం ఏమైనా చేస్తారు. పెళ్లి రోజు వీళ్లకు ఎక్కువ సానుకూలతను చూపిస్తోంది. వీళ్ల వివాహ బంధం చాలా సంతోషం, ఫన్ తో కూడి ఉంటుంది. కుటుంబం సంతోషం కోసం ఏది చేయడానికైనా సిద్ధంగా ఉంటారు.

క్యాప్రికాన్ వెడ్డింగ్ ( మకరము )

క్యాప్రికాన్ వెడ్డింగ్ ( మకరము )

డిసెంబర్ 22 నుంచి జనవరి 19 మధ్యలో పెళ్లి చేసుకున్న వాళ్లు కాప్రికాన్ వెడ్డింగ్ కిందకు వస్తారు. ఈ జంట చాలా అధునాతనమైన, సంప్రదాయబద్దమైన ఆలోచనలు కలిగి ఉంటారు. కానీ వీళ్లకు.. కొన్ని దాపరికాలు, అసహ్యకరమైన అలవాట్లు ఉంటాయట.

అక్వేరియస్ వెడ్డింగ్ ( కుంభము )

అక్వేరియస్ వెడ్డింగ్ ( కుంభము )

జనవరి 20 నుంచి ఫిబ్రవరి 18 మధ్య పెళ్లి డేట్ ఉన్నవాళ్లది అక్వేరియస్ వెడ్డింగ్. ఈ డేట్స్ పెళ్లి చేసుకున్న జంట చాలా స్మార్ట్ గా, అందరికంటే విభిన్నంగా ఉంటారు. ఒకరిని ఒకరు బాగా అర్థం చేసుకుంటారు. ఒకరి అభిప్రాయాలను ఒకరు గౌరవించుకుంటారు.

పీసెస్ వెడ్డింగ్ ( మీనము )

పీసెస్ వెడ్డింగ్ ( మీనము )

ఫిబ్రవరి 19 నుంచి మార్చి 20 మధ్య పెళ్లి జరిగిన వాళ్లది పీసెస్ వెడ్డింగ్. వీళ్లది చాలా అందమైన రొమాంటి లైఫ్. చాలా సాఫ్ట్ గా ఉంటారు. వీళ్ల వివాహ బంధం అలా

సాగిపోతూ ఉంటుంది.

ఏరియస్ వెడ్డింగ్ ( మేషము )

ఏరియస్ వెడ్డింగ్ ( మేషము )

మార్చ్ 21 నుంచి ఏప్రిల్ 19 మధ్యలో పెళ్లి చేసుకున్న వాళ్లు ఏరియస్ వెడ్డింగ్ కిందకి వస్తారు. సాహసం కలిగిన, చాలా హార్డ్ గా ఉంటారు. ఎప్పుడూ ఒకేలా ఉండటాన్ని ఇష్టపడరు. రిలేషన్ షిప్ లో కొత్తదనం కోసం.. కొత్తగా ఆలోచిస్తూ ఉంటారు. కొత్తదనాన్ని కోరుకునే ఈ జంట యానివర్సరీల కోసం చాలా విభినమైన, ఆశ్యర్చకరమై ప్రాంతాలకు వెళ్లి ఆనందంగా గడుపుతారు.

తారస్ వెడ్డింగ్ ( వృషభము )

తారస్ వెడ్డింగ్ ( వృషభము )

ఏప్రిల్ 20 నుంచి మే 20 మధ్య పెళ్లి జరిగితే.. తారస్ వెడ్డింగ్. వీళ్లు చాలా కామ్ గా, ఒకేమాదిరిగా జీవిస్తూ.. వివాహ బంధాన్ని చాలా సెక్యూర్ గా మలచుకుంటారు. వీళ్లకు జీవితంలో మార్పులను ఇష్టపడరు. ప్రస్తుతమున్న జీవితంలో స్థిరపడిపోతారు.

జెమిని వెడ్డింగ్ ( మిథునము )

జెమిని వెడ్డింగ్ ( మిథునము )

మే 21 నుంచి జూన్ 20 మధ్య పెళ్లి డేట్ ఉన్న వాళ్లది జెమిని వెడ్డింగ్. వీళ్లు చాలా శక్తి సామర్థ్యాలను కలిగి ఉండటమే కాదు.. చాలా స్నేహశీలంగా ఉంటారు. జీవితంలో ఎదురయ్యే ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కునే గొప్ప గుణం వీళ్లకు ఉంటుంది. వీళ్లు చాలా పర్ఫెక్ట్ మ్యారేజ్ లైఫ్ పొందుతారు.

క్యాన్సర్ వెడ్డింగ్ ( కర్కాటకము )

క్యాన్సర్ వెడ్డింగ్ ( కర్కాటకము )

21 జూన్ నుంచి 22 జూలై మధ్య పెళ్లి చేసుకున్న వాళ్లది క్యాన్సర్ వెడ్డింగ్. వీళ్లకు ఎక్కువగా ఫ్యామిలీకి ఇంపార్టెన్స్ ఇస్తారు. ఎక్కువగా కుటుంబ సభ్యులతో గడపాల్సి ఉంటుంది. కాబట్టి తాము ఒంటరిగా గడపడానికి కాస్త సమయం కేటాయించడం వల్ల మీ బంధం మరింత బలపడుతుంది.

లియో వెడ్డింగ్ ( సింహము )

లియో వెడ్డింగ్ ( సింహము )

జూలై 23 నుంచి ఆగస్ట్ 22 మధ్య పెళ్లి చేసుకున్న వాళ్లు లియో వెడ్డింగ్ గా చెప్పవచ్చు. ఈ జంట చాలా కాన్ఫిడెంట్ గా, బిగ్గరగా, గర్వంగా ఉంటారు. వీళ్ల సెలబ్రేషన్ చాలా గ్రాండ్ గా ఉంటుంది. జీవితంలోని అన్ని అంశాలలో ఒకరి నుంచి ఒకరు ఎక్కువగా ఎక్స్ పెక్ట్ చేస్తుంటారు.

విగ్రో వెడ్డింగ్ ( కన్య )

విగ్రో వెడ్డింగ్ ( కన్య )

ఆగస్ట్ 21 నుంచి సెప్టెంబర్ 22 మధ్య పెళ్లి డేట్ ఉన్నవాళ్లది విగ్రో వెడ్డింగ్. వీళ్ల జీవితంగా చాలా స్మూత్ గా జరుగుతుంది. చాలా సున్నిత స్వభావం కలిగి ఉంటారు.

English summary

What your wedding date says about your marriage in telugu

What your wedding zodiac means for your big day - not to mention what it says about you as a couple, and your future together.
Story first published: Wednesday, November 18, 2015, 11:49 [IST]
Desktop Bottom Promotion