For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఏ రాశి అబ్బాయితో మ్యారేజ్ లైఫ్ సంతోషంగా ఉంటుంది ?

By Nutheti
|

మ్యారేజ్ లైఫ్ ఎలా ఉంటుంది ? మీ కాబోయే భర్త ఎలా ఉంటాడు ? వివాహ జీవితానికి ఎంత విలువ ఇస్తారు ? మిమ్మల్ని ఎలా చూసుకుంటారు ? మీ నుంచి ఏం కోరుకుంటారు ? ఇలాంటి ప్రశ్నలు పెళ్లి చేసుకోబోయే ప్రతి ఒక్కరిని సతమతపెడుతుంటాయి. అయితే పెళ్లయిన మహిళలు కూడా మీ భర్త అభిరుచులు, అభిప్రాయాలు ఎలా ఉన్నాయి, ఎలా ప్రవర్తిస్తున్నారో తెలుసుకోవాలి ఆరాటపడుతుంటారు.

మీ భర్త లేదా మీకు కాబోయే శ్రీ వారు మ్యారేజ్ లైఫ్ ని ఎలా డిజైన్ చేస్తారు ? కొంతమందికి సర్దుకుపోయే తత్వం ఉంటుంది. మరికొంత మందికి ట్రెడిషనల్ లైఫ్ ఇష్టం. ఇంకొందరికి సెంటిమెంట్లు ఎక్కువగా ఉంటాయి. మరికొందరు మోడ్రన్ లైఫ్ స్టైల్ ఇష్టపడతారు. కొంతమంది కుటుంబ సభ్యులకు వ్యతిరేఖంగా బిహేవ్ చేస్తుంటారు. ఇలా రకరకాల అభిరుచులు ఉన్నవాళ్లు ఉంటారు.

zodiac

మీ వివాహ జీవితం ఆనందంగా ఉంటుందా లేదా అన్నది మగవాళ్ల రాశిని బట్టి తెలుసుకోవచ్చు. ఏ రాశి వాళ్లు ఎలా మెలుగుతారో తెలుసుకుంటే.. మీకో క్లారిటీ వచ్చేస్తుంది కదా. మీ భాగస్వామి రాశి ఏదో తెలుసుకోండి.. వాళ్ల బిహేవియర్ ఎలా ఉంటుందో ముందుగానే అర్థం చేసుకోండి. ఏ రాశి వాళ్లతో మ్యారేజ్ లైఫ్ మీరు కోరుకున్నట్టు ఉంటుందో చెక్ చేసుకోండి. ఇంకెదుకు ఆలస్యం ఏ రాశి అబ్బాయి వివాహ జీవితానికి ఎలాంటి ప్రిఫరెన్స్ ఇస్తారు.. ఎలాంటి భార్య కావాలని కోరుకుంటారో ఇప్పుడే తెలుసుకోండి.

మేషరాశి

మేషరాశి

మేషరాశి అబ్బాయిలు చాలా బాధ్యతగా వ్యవహరిస్తారు. వివాహ జీవితంపై త్వరగా నిర్ణయం తీసుకుంటారు. బాధ్యతల నుంచి తప్పకోవాలని భావించరు.. డామినేట్ చేయడానికి ఇష్టపడతారు. స్మార్ట్ గా, అందంగా ఉన్న భార్యలు రావాలని కోరుకుంటారు. ఫ్రీడమ్ ఇచ్చే భాగస్వాములు కావాలనుకుంటారు.

MOST READ:నోటి దుర్వాసనను నివారించడం కోసం పాటించవలసిన చిట్కాలు !

వృషభ రాశి

వృషభ రాశి

వృషభ రాశి అబ్బాయిలు భార్యా, పిల్లలపై ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటారు. కుంటుంబానికి మంచి జీవితం ఇవ్వడం కోసం ఎప్పుడు కష్టపడుతుంటారు. మంచి గుణవంతులు. వివాహ జీవితంలో శారీరక ఆనందం పొందలేకపోతే.. మోసానికి గురయ్యే అవకాశముంది.

మిధున రాశి

మిధున రాశి

వివాహ జీవితానికి మిధున రాశి వ్యక్తి.. ఆదర్శ భాగస్వామిగా సరిపోరు. అహంకారం లేని భార్య వస్తే ఇతనితో జీవితం చాలా అందంగా, ఆసక్తిగా, రిలాక్స్ గా ఉంటుంది. తన భార్యకు ఫుల్ ఫ్రీడమ్ ఇస్తారు. ఆమె ఏది కోరుకుంటే అది చేసేలా స్వేచ్ఛనిస్తారు. మిధున రాశి అబ్బాయిలు చాలా అందంగా... సరసప్రియులుగా ఉంటారు.

కర్కాటక రాశి

కర్కాటక రాశి

కర్కాటక రాశి వ్యక్తి.. చాలా సంప్రదాయంగా, ఫ్యామిలీకి అంకితభావంతో ఉంటారు. వీళ్లు ఆదర్శ భాగస్వామిగా ఉంటారు. కర్కాటక రాశి అబ్బాయిలు మంచి భర్తలుగా ఉంటారు.. ఇంట్లో ఎక్కువ టైం గడపటానికి ఇష్టపడతారు.

సింహ రాశి

సింహ రాశి

తన భార్యకు మొదటి ప్రాధాన్యత ఇవ్వడానికి ఇష్టపడతారు సింహరాశి వాళ్లు. కుటుంబంలో ప్రతి ఒక్కరు తన అధికారంలో ఉండాలని కోరుకుంటారు. అయితే తండ్రిగా మాత్రం కఠినంగా వ్యవహరించరు. ఎందుకంటే.. తనకు తానే బాలుడిలా ఫీలవుతూ ఉంటాడు. తన భార్య చాలా అందమైన.. పొందికైనదిగా ఉండాలని కోరుకుంటాడు.

MOST READ:జుట్టు సంరక్షణకి కరివేపాకులతో ఐదు ఇంటి చిట్కాలు

కన్యా రాశి

కన్యా రాశి

చాలా నమ్మకమైన భర్త కన్యారాశి వ్యక్తి. వీళ్ల స్వభావం బావుంటుంది. స్వాధీనతా భావం వీళ్లకు ఉండదు. వీళ్లు కన్యారాశి అమ్మాయిలకే బాగా మ్యాచ్ అవుతారు. కొన్ని సందర్భాల్లో సంప్రదాయాలను విశ్వసిస్తారు.. కన్యారాశి వ్యక్తి రొమాన్స్ కాస్త దూరంగా ఉంటారు.

తులా రాశి

తులా రాశి

తులా రాశి అబ్బాయిలు వివాహ జీవితానికి అంత విలువ ఇవ్వలేరు. వీళ్లు సర్దుకుపోవడానికి సమయం పడుతుంది. తన అందం గురించి భార్య పట్టించుకోవడం వల్ల ఆకర్షణీయంగా కనిపిస్తారు. తులారాశి వ్యక్తి ప్రేమపంచుతారు. కానీ చాలా అరుదుగా ద్రోహం చేసే అవకాశాలున్నాయి.

వృశ్చిక రాశి

వృశ్చిక రాశి

వృశ్చిక రాశి వ్యక్తి చాలా స్వాధీనతా భావం కలిగి ఉంటాడు. స్వార్థంగా వ్యవహరిస్తారు. వీళ్ల నుంచి సంతోషకరమైన వివాహ జీవితం పొందడం చాలా కష్టం. తనపై ఎప్పటికప్పు ప్రేమని వ్యక్తపరిచే భార్య వస్తే.. అసహ్యకరమైన పరిస్థితులకు దూరంగా ఉండవచ్చు. డామినేట్ చేసే మహిళలను వీళ్లు ఇష్టపడరు.

ధనస్సు రాశి

ధనస్సు రాశి

ధనస్సు రాశి వ్యక్తి సాహసికుడు. వీళ్ల భార్య అనర్గళంగా మాట్లాడగలగాలి, ఫన్ క్రియేట్ చేయాలి.. భర్త లేని సమయాల్లో ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కోగలిగేలా ఉండాలని కోరుకుంటారు. స్వార్థంగా వ్యవహరించే భార్యను తట్టుకోలేరు.

మకర రాశి

మకర రాశి

కెరీర్ కి అంకితభావంతో వ్యవహరిస్తారు మకర రాశి అబ్బాయిలు. వివాహం చాలా లేటుగా ఉంటుంది. ఇతని వచ్చే భార్యకు చాలా మంచి జీవితం ఉంటుంది.

కుంభరాశి

కుంభరాశి

కుంభరాశి అబ్బాయిలు పెళ్లికి ఆదర్శప్రాయులు కారు. వీళ్ల వైవాహిక జీవితంలో చాలా మార్పులుంటాయి. ఒకరితో పెళ్లైనా.. మరో అమ్మాయి అందంగా.. ఆకర్షణీయంగా అనిపిస్తే.. మరో పెళ్లి చేసుకుంటారు. ఈజీగా ఒక భార్యను వదిలేసి.. మరో పెళ్లికి రెడీ అవుతారు.

మీన రాశి

మీన రాశి

వివాహ జీవితానికి మీన రాశి వాళ్లు సరిగ్గా సరిపోతారు. భార్య కోరికలు తీర్చడానికి చాలా ఇష్టపడతారు. కుటుంబంతో ఎక్కువ సమయం గడపటానికి ఇష్టపడతారు.

MOST READ:శాఖాహారం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

English summary

What Zodiac Sign Men Better for Marriage in telugu

Your zodiac sign can reveal whether you can be happy in marriage.
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Boldsky sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Boldsky website. However, you can change your cookie settings at any time. Learn more