Latest Updates
-
నోరూరించే వెల్లుల్లి పచ్చడి..పక్కా కొలతలతో ఇలా చేస్తే ఏడాది పాటు నిల్వ ఉంటది.. -
లొట్టలేసుకుంటూ తినేలా చేసే హైదరాబాద్ ఖట్టీ దాల్.. సాంబార్ కంటే రెట్టింపు రుచి.! -
ఇంట్లోనే అచ్చమైన స్వీట్ షాప్ స్టైల్ పాలకోవా..కేవలం రెండే పదార్థాలతో చేసుకోండిలా.. -
తెల్ల జుట్టుకి చెక్ పెట్టి, యవ్వన శక్తిని పెంచే ఆమ్లా మురబ్బా.. ఇలా చేస్తే ఏడాది పాటు నిల్వ.! -
అమెరికాలో బ్యాన్, భారత్ లో బెస్ట్.. ఆవ నూనె వాడటం ఆరోగ్యానికి మంచిదేనా? -
నోరూరించే కార్న్ చిల్లీ చీజ్ టోస్ట్.. పెనం మీదే నిమిషాల్లోనే ఈజీగా చేసుకోండిలా.. -
అత్యంత తీవ్రంగా, సైకోల్లా ప్రవర్తించే రాశులు ఇవే.. మీ ఫ్రెండ్స్ ఉన్నారా? -
మన్ కీ బాత్ లో ప్రధాని మోదీ ప్రస్తావించిన ఉసిరి.. నారింజ కంటే 20 రెట్లు ఎక్కువ విటమిన్ సి.. లాభాలు ఇవే! -
ఈ ఒక్కటి కలిపితే చాలు.. రోడ్ సైడ్ టమాటా గ్రేవీ రెడీ..ఇడ్లీలు లెక్కపెట్టకుండా తినేస్తారు -
బాలింతలకు డెలివరీ తర్వాత సత్తువనిచ్చి నొప్పులను తగ్గించే బలమైన లడ్డూ.!
డేంజర్: ఎట్టిపరిస్థితుల్లో పచ్చిగా తినకూడని ఆహారాలు..!
చాలా ఆహారాలను మనం ఉడికించకుండా.. పచ్చిగానే తింటుంటాం. ఎందుకంటే.. వాటిని పచ్చిగా తింటేనే ఎక్కువ ప్రయోజనాలు పొందవచ్చని భావిస్తాం. కానీ.. నిజానికి కొన్ని రకాల ఆహారాలను మాత్రం పచ్చిగా తినకూడదట. వాటిని పచ్చిగా తింటే.. మీ ఆరోగ్యాన్ని దెబ్బతీస్తాయని అధ్యయనాలు చెబుతున్నాయి.
కొన్నిరకాల ఆహార పదార్థాలను ఎట్టిపరిస్థితుల్లో పచ్చిగా తినకూడదని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఒకవేళ పచ్చిగా తింటే.. తర్వాత తర్వాత.. ఆరోగ్యానికి హాని చేస్తాయని సూచిస్తున్నారు. కొన్నింటిని పచ్చిగా తింటేనే టేస్టీగా ఉంటాయి. కానీ.. అలా తినకూడని ఆహారాల లిస్ట్ ఇప్పుడు చూద్దాం..

మొలకెత్తిన గింజలు
మొలకెత్తిన గింజల్లో సాల్మోనెల్లా అనే బ్యాక్టీరియా ఉంటుంది. ఇది ఇమ్యునిటీని దెబ్బతీస్తుంది. దీనివల్ల ఇన్ఫెక్షన్స్ ఎక్కువగా వేధిస్తాయి. కాబట్టి కొద్దిగా ఆయిల్ వేసి.. కాస్త ఫ్రై చేసుకుని మొలకెత్తిన గింజలు తీసుకోవాలని సూచిస్తున్నారు.

టమోటాలు
టమోటాలలో గ్లికోలక్కలాయిడ్స్ ఉంటాయి. ఇవి ఎసిడిటీని పెంచుతాయి. కాబట్టి సలాడ్స్ టమోటాలను చేర్చుకోవాలి అనుకుంటే.. కాస్త వేయించి తీసుకుంటే.. సైడ్ ఎఫెక్ట్స్ కి దూరంగా ఉండవచ్చు.

గ్రీన్ వెజిటబుల్స్
గ్రీన్ వెజిటబుల్స్ లో ఆక్సిలిక్ యాసిడ్ ఉంటుంది. ఇది శరీరం ఐరన్, క్యాల్షియంను గ్రహించకుండా అడ్డుకుంటుంది. కాబట్టి వీటిని కాస్త ఉడికించి తీసుకోవడం వల్ల సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా.. విటమిన్స్ పొందవచ్చు.

మష్రూమ్స్
మష్రూమ్స్ లో కార్సినోజెనిక్ ఉంటుంది. ఇది శరీరంలో హైటాక్సిన్ లెవెల్స్ కి కారణమవుతుంది. అలాగే ఇవి చాలా మాయిశ్చరైజర్ కండిషన్స్ లో మొలుస్తాయి. కాబట్టి వీటిని పచ్చిగా తినడం రిస్క్ అవుతుంది. అందుకే.. వీటిని ఉడికించి తీసుకుంటే మంచిది.

ఆల్మండ్స్
బాదాంలో సియనైడ్ ఉంటుంది. వీటిని పచ్చిగా తీసుకుంటే.. ఇన్ల్ఫమేటరీ, క్యాన్సర్ కి కారణమవుతాయి. కాబట్టి వీటిని నీళ్లలో నానబెట్టి తీసుకోవాలి. లేదా కాస్త రోస్ట్ చేసి తీసుకోవాలి.

పచ్చి పాలు
పాలల్లో బ్రూసెల్లా, లిస్టేరియా ఉంటాయి. వీటిని పచ్చిగా తీసుకోవడం చాలా హానికరం. పచ్చిగా తాగడం వల్ల డయేరియా, పొట్టనొప్పి, వాంతులు, శరీరంలో మలినాలు పెరగడానికి కారణమవుతాయి. కాబట్టి.. వీటిని మరిగించిన తర్వాతే తీసుకోవాలి.

పచ్చి గుడ్లు
పచ్చి కోడిగుడ్లలో సల్మోనెల్లా ఉంటుంది. ఇది శరీరంలో ఇన్ఫెక్షన్స్ ని పెంచుతుంది. కాబట్టి.. పచ్చిగా ఎట్టిపరిస్థితుల్లో తినకూడదు. ఉడికించి మాత్రమే తీసుకోవాలి.

జీడిపప్పు
జీడిపప్పులో ఉరుషియోలా టాక్సిన్ ఉంటుంది. వీటిని పచ్చిగా తింటే.. స్కిన్ ఎలర్జీ, పొట్టనొప్పి వస్తాయి. కాబట్టి వీటిని కాస్త రోస్ట్ చేసి తీసుకుంటే.. టేస్ట్ తోపాటు, హెల్తీ కూడా.

రాజ్మా
రాజ్మాలో లాక్టిన్ ఉంటుంది. ఇది శరీరంలో హానికర మలినాల లెవెల్ ని పెంచుతాయి. కాబట్టి వీటిని 5గంటలు నానబెట్టి ఆ తర్వాత ఉడికించి తీసుకోవాలి.

మాంసం
పచ్చి మాంసంలో సల్మోనెల్లా బ్యాక్టీరియా ఉంటుంది. దీన్ని పచ్చిగా తీసుకోవడం వల్ల డయేరియా, తలనొప్పి, జ్వరంకు కారణమవుతుంది. కాబట్టి మాంసాన్ని ఉడికించి లేదా ఫ్రై చేసి మాత్రమే తీసుకోవాలి.



Click it and Unblock the Notifications
