For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

చనిపోయిన తర్వాత మనిషిని కొన్ని ప్రదేశాల్లో ఏం చేస్తారో తెలుసా..?

|

మనిషి చనిపోయిన తర్వాత మనమైతే మన ఆచార సాంప్రదాయం ప్రకారం పూడ్చడమో, కాల్చడమో చేస్తాం, కానీ కొన్ని ప్రాంతాల్లో అంత్యక్రియల తంతు వింతవింతగా చేస్తారు. అదే అక్కడ అనాదిగా వస్తున్న ఆచారం.! కొన్ని దేశాలల్లో అయితే శవాలను మమ్మీలుగా అలానే ఉంచుతారు.

ఇంకొన్ని దేశాలలో మృత దేహాన్ని అంత్యక్రియలు చేసేటప్పుడు తల భాగాన్ని వేరు చేసి కేవలం మొండెం వరకే కాల్చివేస్తారు.తలను గుహల్లో రాళ్ల మధ్యలో ఉంచుతారు. చనిపోయిన శవం వృధాకాకుండా ఆకలితో ఉన్న పక్షులకు ఆహారంగా ఇచ్చే ఆచారం కూడా ఉంది. ఇలా ప్రపంచవ్యాప్తంగా మనం వినని చూడని కొన్ని అంత్యక్రియ పద్ధతుల గురించి తెలుసుకోండి.

సతి సహగమనం:

సతి సహగమనం:

సతి సహగమనం హిందుమతంలో ఇది చాలా పురాతన సంప్రదాయం. ఈ విధానంను ప్రస్తుత రోజుల్లో చాలా అరుదగా అనుసరిస్తున్నారు . భర్త చనిపోయిన తర్వాత భార్యకు ఇచ్చే ఒక రకమైనటువంటి పనిష్మెంట్ . విధవంగా ఉండటకుండా, భర్తను కాల్చే చితిలో ఆమెను కూడా తగలబెడుతారు. ఆమెతంట ఆమె చితిలో పడి కాల్చుకొనేలా భలవంతం చేస్తాచి. అందకు ప్రధాణ కారణం భర్త చనిపోయిన తర్వాత భార్యకు ఈ ప్రపంచంలో చోటు లేదాని , అతని కోసం ఆమె త్యాగం చేయాల్సిందేనన్న సంప్రదాయం మన హిందు మతంలో ఉండేది..

Image Courtesy

 ఖననం చేయడం:

ఖననం చేయడం:

మనదేశంలో చాలావరకు మతాలు చనిపొయిన మృతదేహాలను మట్టిలో పూర్చిపెట్టి సమాధులు కడతారు. వేద కాలం నుండి ఈ ఆచారాన్ని పాటిస్తున్నారు. ఇస్లాం మరియు క్రిస్టియన్ మతస్థులు ఇదే ఆచారాన్ని అంత్యక్రియలలో పాటిస్తున్నారు.

Image Courtesy

మమ్మీలు:

మమ్మీలు:

చనిపోయిన మృతదేహాలకు బట్టలుకట్టి, ఆ శవాలను కాల్చివేయకుండా, పూర్చకుండా ఒక పెట్టెలో బంధిస్తారు. ఈజిప్ట్ దేశీయులు ఈ ఆచారాన్ని ఎక్కువగా వ్యవహరిస్తారు.ఈజిప్ట్ లో ఇప్పటివరకూ 3500పైగా మమ్మీలు ఉన్నాయట. ఇలా చేయడం వల్ల ఆ మమ్మీలు ఏదో ఒకరోజు తిరిగి బ్రతుకుతారని వారి ప్రగాడ విశ్వాసం. ఈ పద్ధతి కేవలం ఒక్క ఈజిప్ట్ కె పరిమితం కాలేదు, భారత్, శ్రీలంక, చైనా, టిబెట్, థాయిలాండ్ దేశాలలో ఈ ఆచారాన్ని ఫాలో అవుతూ అంత్యక్రియలు జరుపుతున్నారు.

Image Courtesy

కొండ చివరపు అంచున ఉరితీయడం:

కొండ చివరపు అంచున ఉరితీయడం:

చైనీయుల మత ఆచారంలో చనిపోయిన ఇలా కొండ చివరన రెండు చెక్కల మధ్యన లేదా ఒక రాయికి వేలాడదీసి ఉరితీస్తారట. అలా చేయడం వలన వారు స్వర్గానికి వెళతారని వారి విశ్వాసం.

Image Courtesy

కాల్చివేయడం:

కాల్చివేయడం:

హిందూమత ఆచారం ప్రకారం మృతదేహాన్ని ఎలా అంత్యక్రియలు చేయాలనే దాన్ని అయిదు అంశాలను పరిగణలోకి తీసుకొని పూర్తిచేస్తారు. అందులో ఇలా కట్టెలపై కాల్చివేయడం ఒక పధ్ధతి. కొన్ని శతాబ్దాల నుండి ఈ ఆచారం అమలులో ఉంది.

Image Courtesy

పక్షులకు ఆహారంగా:

పక్షులకు ఆహారంగా:

ఇతర మతాల ఆచారాల ప్రకారం పూడ్చడం, దహనం లాంటివి చేయకుండా పర్సియన్ దేశస్థులు చనిపోయిన శవాలను పక్షులకు, రాబందులకు ఆహారంగా వేస్తారు. ఆ శవం వృధా కాకుండా పక్షుల ఆకలి తీర్చడానికి ఉపయోగపడుతుందని ఈ విధంగా చేస్తారట. ప్రస్తుతం ఈ పధ్ధతి అక్కడ చాలావరకు తగ్గిందనే చెప్పాలి. రాబందులు కూడా చాలా వరకూ తగ్గిపోవడంతో,,, అక్కడి శవాలను సోలార్ ప్లేట్లు శవంపై ఉంచుతున్నారు. సోలార్ ప్లేట్ల వేడికి ఆ శవాలు అలా దహనమవుతాయి.

Image Courtesy

శవాలను తినడం:

శవాలను తినడం:

న్యూగినియా మరియు బ్రెజిల్ దేశాలలో అక్కడి ప్రజలు మృతదేహాలను చాలా వింత పధ్ధతిలో అంత్యక్రియలు జరుపుతారు. ఆ చనిపోయిన శవాలను ముక్కలుగా చేసుకొని భుజిస్తారు. ప్రస్తుతం ఈ పధ్ధతి అక్కడ చాలా అరుదనే చెప్పాలి.

Image Courtesy

నదిలో/ సముద్రంలో వేయడం:

నదిలో/ సముద్రంలో వేయడం:

దక్షిణ అమెరికాలోని ఓ ప్రాంత ప్రజలు చనిపోయిన మృతదేహాలను సమృద్ధిగా పారుతున్న నదులలో లేదా సముద్రాలలో ఆ శవాలను పడేసి అంత్యక్రియలు జరుపుతారట.

Image Courtesy

 గుహల్లో ఉంచడం:

గుహల్లో ఉంచడం:

ఇరాక్, ఇజ్రాయిల్ దేశాలలో చనిపోయిన వ్యక్తులను ఊరికి చివరన గుహలలో వదిలివేసేవారట. ఆ శవాలను అలా ఉంచడానికి పెద్ద పెద్ద రాళ్ళను ఉపయోగిస్తారట.

Image Courtesy

గొంతు నులిపివేయడం:

గొంతు నులిపివేయడం:

ఒకప్పుడు మనదేశంలో భర్త చనిపోయిన తర్వాత భార్య కూడా చనిపోవాలని ఆమెను మంటల్లోకి తోసేవారు. (సతీసహగమనం). సేమ్ టు సేమ్ అలాంటి పద్ధతే దక్షిణ పసిఫిక్ లోని ఫిజి ప్రాంతంలో పాటిస్తున్నారు. ఎవరైనా తమ కుటుంబంలోని వ్యక్తి చనిపోతే, ఆ శవం ఒంటరిగా వెళ్ళకూడదట. అందుకని ఆ కుటుంబంలోని ఎవరైనా సరే ఒకరు వారితో పాటు చనిపోవాలట.వారి కుటుంబంలోని మరో వ్యక్తిని ఇలా కూర్చోబెట్టి గొంతుకు తాడు లేదా ఏదైనా బట్టను ఉపయోగించి గొంతును నులిపివేస్తారు. అలా గొంతునులిపి వేసే సమయంలో వారు ఎలాంటి బాధను అనుభవించరని, వారి ఆత్మకు శాంతి కలుగుతుందని వారి నమ్మకం.

English summary

10 Most Bizarre Funeral Traditions in the World

10 Most Bizarre Funeral Traditions in the World,This is a list of some interesting and weird rituals in which people belonging to different cultures disposed their loved ones to the God, after they have ceased to live. Some bury their loved ones while others burn them.
Desktop Bottom Promotion