For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

మనుషులను వణికించే భయంకరమైనవి అంశాలు..

By Swathi
|

మనుషులకు ఉన్న లక్షణాల్లో భయం ఒకటని చెప్పవచ్చు. చాలా మందికి చాలా విషయాల్లో భయం ఉంటుంది. అసలు ఈ భయం అంటే ఏంటి ? రాబోయే బాధకరమైన విషయానికి, జరగబోయే దానికి, దయ్యాలకు, డేంజర్ అని ఫీలయ్యే వాటిని ఎమోనల్ గా వ్యక్తపరిచే ఉద్వేగాన్నే భయం అంటారని ఆక్స్ ఫర్డ్ యూనివర్సిటీ వివరించింది. ఆందోళన కారణంగా మనకు తెలియకుండానే మనలో వచ్చే ఫీలింగే భయం.

దహన సంస్కారాలకు మహిళలను ఎందుకు నిషేధించారు ?

భయం ప్రతి ఒక్కరికీ ఉంటుంది. అది దేనిపై అనేది వాళ్ల అనుభవాన్ని బట్టి ఉంటుంది. నమ్మకం, పరిస్థితులు, మతంపై ఉన్న నమ్మకం, ఇంకా ఇతర కారణాల వల్ల భయం మనుషుల్లో కలుగుతుంది. ఇవన్నీ కాకుండా.. చాలా కామన్ గా మనుషులను ఎక్కువగా భయపెట్టే విషయాలున్నాయి. మనుషులను అత్యంత భయానికి గురిచేసే.. ఆశ్చర్యకర విషయాలేంటో ఇప్పుడు చూద్దాం..

ఎగరడానికి

ఎగరడానికి

ఇది చాలా భయంకరమైన విషయం. చిన్నప్పుడు ఊయల ఊగేటప్పుడు.. కాస్త పైకి వెళ్లగానే వామ్మో అని కేకలు పెడతాం. అలాగే విమానం, హెలీకాప్టర్, ఫ్లైట్ ఎందులో ఎగరాలన్నా మనుషులకు భయమే. దీన్ని ఏరోఫోబియా అంటారు. ఇలా గాల్లో ఎగరడానికి చాలామంది అత్యంత భయాందోళకు గురవుతారు.

కుక్కలు

కుక్కలు

కుక్కలు జంతు ప్రేమికులకు మంచి స్నేహితులు. కానీ.. చాలా మందికి కుక్కలు అంటే ఎక్కడలేని భయం కూడా. ఇది సాధారణంగా చిన్నప్పటి నుంచి మొదలవుతుంది. ఎందుకుంటే.. చిన్నప్పుడు కుక్కలు వెంబడించడం, కొరకడం వంటివి చూసిన, స్వయంగా అనుభవం ఉన్నా.. కుక్కలు ఎక్కడ మనమీద ఎటాక్ చేస్తాయో అని చాలా మంది భయపడుతూ ఉంటారు. కుక్కలకు భయపడటాన్ని సైనోఫోబియా అంటారు.

స్పైడర్స్

స్పైడర్స్

స్పైడర్స్ ఇంట్లో కనిపించాయంటే.. క్యార్ మని కేక పెట్టాల్సిందే. వాటికి ఉండే ఎక్కువ కాళ్లు. అవి కూడా చాలా పదునుగా ఉండటం వల్ల సాలెగూళ్లకు చాలామంది భయపడతారు. అలాగే యూకేలో ఉండే చాలా స్పైడర్స్ విషపూరితమైనవట. ఇలా సాలెపురుగులకు భయపడటాన్ని అరాక్నోఫోబియా అని పిలుస్తారు. ఈ ఫోబియాతో మిలియన్ల మంది ఉన్నారట.

ఎలుకలు

ఎలుకలు

ఎలుకలకు కూడా మనుషులు అత్యంత ఎక్కువగా భయపడతారు. ఈ ఎలుకలకు భయపడటాన్ని ముసోఫోబియా అని పిలుస్తారు. గతంలో ఎప్పుడైనా ఎలుకలు తమకు తాకడం, కొరకడం వంటివి చేయడం వల్ల ఈ ఫోబియా వస్తుంది. ఈ ఫోబియాతో బాధపడేవాళ్లు.. ఎక్కడైనా ఎలుకను చూసినా, టీవీల్లో చూసినా, ఇంట్లో అవి తిరుగుతున్నా.. చాలా భయపడతారు.

మరణం

మరణం

మరణం గురించి భయపడని వాళ్లు ఉండరంటే అతిశయోక్తి కాదు. జీవితంలో ఎన్నో చూడాలని, ఇంకెన్నో కోరికల కారణంగా.. చాలా వరకు మనుషులంతా మరణానికి భయపడుతూనే ఉంటారు. కొంతమందికి చావుకి భయపడితే.. మరికొందరు తమకి మరణం ఎలా వస్తుందో అన్న భయంతో ఉంటారు. ఇలా మరణానికి భయపడటాన్ని ఫుల్ డౌన్ ఫోబియా అంటారు. లేదా థనటోఫోబియా, నెక్రోఫోబియా అని పిలుస్తారు.

ఎత్తు

ఎత్తు

ఎత్తుపై ఉండటానికి చాలా మంది భయపడతారు. చాలా ఎత్తులో నిలబడి కిందకు చూడాలన్నా, ఒకవేళ ఎత్తైన ప్రాంతంలో ఏ రక్షణ లేనప్పుడు మరింత భయాందోళనకు గురవుతారు. హైట్స్ లో నిలబడి ఏదైనా ప్రదేశాన్ని చూడటానికి ఆసక్తి చూపినా.. ఎక్కడ పడిపోతామో అన్న భయం ఎక్కువగా ఉంటుంది.

చీకటి

చీకటి

చాలామంది చీకటి అంటే భయపడతారు. ముఖ్యంగా చీకట్లో నిద్రపోవాలంటే.. భయపడుతుంటారు. కానీ ఇది వాస్తవానికి చీకటి గురించి భయం కాదు.. చీకటిలో వచ్చే ఊహలకు, ఆలోచనలకు ఎక్కువగా భయపడతారు. చాలామంది చీకట్లో నిద్రపోవాలంటే.. వణికిపోతారు. చాలామంది చీకట్లో దయ్యాలు ఉంటాయని భయపడతారు. ఇలా చీకటి అంటే భయపడటాన్ని లైగోఫోబియా అని పిలుస్తారు.

ఉరుములు, తుఫాను

ఉరుములు, తుఫాను

ఆకాశంలో ఉన్నట్టుండి వచ్చే ఉరుములు, మెరుపులకు ఉలిక్కిపడుతూ ఉంటాం. ఇది మనుషులు, జంతువులు అందరూ భయపడతారు. ఈ భయాన్ని ఆస్ర్టాఫోబియా అనిపిలుస్తారు. చాలామంది చిన్నపిల్లలు ఉరుములకు భయపడతారు. అలాగే పెద్దవాళ్లకు కూడా వణుకే.

బ్లడ్

బ్లడ్

బ్లడ్ ని చూడగానే భయపడటాన్ని బ్లడ్ ఫోబియా లేదా హెమటోఫోబియా అంటారు. ఇది చాలా కామన్ గా చూస్తుంటాం. వాళ్ల బ్లడ్ చూసుకున్నా, ఇతరుల బ్లడ్ చూసినా.. చాలా మంది ఆందోళనకు గురవుతారు. ఇంకొంతమంది జంతువుల రక్తం చూసినా భయానికి గురవుతారు.

పాములు

పాములు

పాము ఇది చాలా డేంజర్ జంతువు. 10 డెడ్లీలిస్ట్ యానిమల్స్ లో పాము కూడా ఒకటి. పాములకు భయపడటం చాలా కామన్ ఫోబియా. మనకు హానికలుగజేసేది అంటే.. ఎవరు భయపడరు చెప్పండి. అందుకు మనుషులు అత్యంత భయపడే వాటిలో పాము మొదటి ప్లేస్ లో ఉంది.

English summary

10 Most Fearable Things for Human

10 Most Fearable Things for Human. What are the 10 most fearable things in our world. Why we have fear of them – what is fear? The Concise Oxford Dictionary defines fear as: A painful emotion caused by impending danger or evil.
Story first published: Monday, February 1, 2016, 15:01 [IST]
Desktop Bottom Promotion