For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

తాగిన మత్తులో ఇండియన్స్ మాట్లాడే 10 ఫన్నీ మాటలు..!

By Super Admin
|

భారతీయ పురుషులకీ, మద్యానికీ అవినాభావ సంబంధం ఉన్నట్లే ఉంది.1955 లో వచ్చిన దేవదాసు సినిమాలో హీరో విరహ వేదనతో మద్యానికి బానిసవుతాడు. అలాంటి సినిమాల్లో డైలాగులు ఆణి ముత్యాలనచ్చు. భగ్నప్రేమి కులకీ మద్యం పర్యాయ పదంగా మారడానికి ఆ సినిమా దోహదం చేసిందో లేదో కానీ భగ్న ప్రేమికులు చాలా మంది మద్యం తీసుకోవడానికి దేవదాసు కారణమయ్యాడని మాత్రం చెప్పచ్చు.మగవారికి పార్టీలంటే మందు మాత్రమే.

అమితాబ్ నటించిన "అమర్-అక్బర్-ఆంటోనీ" కానీ షారుఖ్ నటించిన దేవదాసు కానీ చూస్తే దానిలో వారు మద్యం తీసుకున్నప్పుడు చెప్పే డైలాగులు అద్భుతం.అలా నిషాలో చెప్పే మాటలు కొన్ని నవ్వు తెప్పించినా కొన్ని కన్నీరు పెట్టిస్తాయి.

సినిమాల్లో పుట్టి పెరిగిన భారతీయ పురుషులు మద్యం తీసుకోగానే ఒక సినిమా డైలాగ్ చెప్పడమో లేక అన్ని వివరాలతో ఒక బాధాకరమైన సంఘటనని దోస్తులతో పంచుకోవడం లేదా కనీసం ఓ పాట పాడతారు.మద్యం త్రాగినప్పుడు సౌభ్రాతృత్వం వెల్లివిరిసి గత సంఘటనలన్నీ బయటకొస్తాయి.

తాము బాగా నషాలో ఉన్నామని ఎవ్వరూ ఒప్పుకోకపోయినా వారు నషాలో ఉన్నప్పుడు మాట్లాడే మాటలని చూస్తేనే అర్ధమవుతుంది. నషాలో ఉన్న చాలా మంది మాట్లాడే మాటలు క్రింద ఇచ్చాము చూడండి. కానీ మద్యం తీసుకోగానే నషాలోకి జారిపోవడం అన్నది మనిషి మనిషికీ మారుతుంది కాబట్టి నషాలో వారు చెప్పే క్రింద ఇచ్చే మాటలు అందరూ అదే క్రమంలో చెప్పకపోయినా దాదాపు ఇవే మాట్లాడతారు.

1.మ్యూజిక్ ఆపద్దు:

1.మ్యూజిక్ ఆపద్దు:

నషాలో ఉన్నప్పుడు భావోద్వేగ పాటలు వినగానే భారతీయ పురుషులు చిన్న పిల్లలలాగ ఏడుస్తారు.తమ గతానుభవాలని పాట సాహిత్యంతో పోల్చుకుని గతానుభవాలు కూడా అచ్చం అలాగే ఉన్నాయని చెప్తారు.

2.నాకు నిషా ఎందుకు ఎక్కదు:

2.నాకు నిషా ఎందుకు ఎక్కదు:

బహూశా మీ మీద మద్యం ప్రభావం మీ మీద ఉండదేమో.మేమూ అదే అనుకుంటున్నాము.నాకు నషా ఎక్కట్లేదు అనే వాక్యం త్రాగేవారిలో ఒక ప్రత్యేక స్థానాన్ని కలిగి ఉంటుంది.మద్యం తీసుకునే ప్రతీ మగవాడు జీవితంలో ఒక్కసారైనా ఈ వాక్యాన్ని ప్రయోగించే ఉంటాడు.అసలు నిజమేమిటంటే మీకు అప్పటికే నషా ఎక్కేసి మత్తుగా ఉండి ఉంటారు కానీ మీ స్నేహితులు అది గమనించలేని స్థితిలో ఉండటంవల్ల వాళ్ళకీ తెలీదు.

3.నా మాట విను:

3.నా మాట విను:

భారతీయులకి సలహాలివ్వడమంటే సరదా.మద్య ప్రభావం ఉన్నప్పుడు కూడా వారలాగే ఉంటారు.త్రాగినప్పుడు ఇచ్చే సలహాల మోతాదు ఎక్కువగా ఉంటుంది.భారతీయ పురుషులు త్రాగినప్పుడూ మాట్లాడే మాటలని జీవిత సత్యాలన్నట్లుగా చెప్తారు.నమ్మకం కలగట్లేదా?? మీకు ఈ అనుభవం ఎదురయ్యేవరకూ వేచి చూడండి మరి.

4.ఇది పాడు లోకం:

4.ఇది పాడు లోకం:

జీవితానుభవాలు మద్యం ప్రభావంలో మరింత ప్రాముఖ్యం కలవాటిగా కనిపిస్తాయి.మద్య ప్రభావంలో భారతీయ పురుషులు నిజాలు మాట్లాడెస్తూ హాస్యాస్పదంగా మాట్లాడతారు.ఈ మద్య ప్రభావపు ప్రేలాపనలని శ్రద్ధగా వినే స్నేహితుల బృందానికి కూడా కితాబివ్వాలి.

5.అమ్మాయిలని ఎప్పుడూ నమ్మద్దు:

5.అమ్మాయిలని ఎప్పుడూ నమ్మద్దు:

త్రాగినప్పుడు మీరు చెప్పే మరొక మాట "అమ్మాయిలని నమ్మద్దు".బహూశా మీ జీవితానుభవాలతో ఆ మాట చెప్తారేమో అని మేమనుకుంటున్నాము.మందు త్రాగేటప్పుడు పురుషుల మధ్య ఇదొక హాట్ టాపిక్.

6.ఫ్లాష్ బ్యాక్స్:

6.ఫ్లాష్ బ్యాక్స్:

భారతీయ పురుషులు మద్యం త్రాగాకా ఫ్లాష్ బ్యాక్ గుర్తు చేసుకుంటారు.తమ పాత సంబంధాల గురించి నవ్వుకోవడం, ఏడవడం లేదా స్నేహితులతో పంచుకోవడం చేస్తూ ఒక్కోసారి పాటలు కూడా పాడెస్తారు.ఒక్కసారి ఈ ప్రేలాపన మొదలయ్యిందంటే వారి గర్ల్ ఫ్రెండేమో నరకం నుండోచ్చిన రాక్షసి తాను మాత్రం దేవతయినట్లే ఉంటుంది వర్ణన వింటే.ఒక్కోసారి ఈ విషయం నొక్కి వక్కాణించడనికి ఫోను కూడా చేస్తుంటారు.

7.ఒక్క రెండు పెగ్గులేసుకుని తరువాత తిండి తిందాము:

7.ఒక్క రెండు పెగ్గులేసుకుని తరువాత తిండి తిందాము:

ఇలా అనుకుంటారు కానీ ఇదెప్పటికీ జరగని పని.ఒక్క రెండు పెగ్గులు పడగానే నషాతో తిండి సంగతే గుర్తు రాదెవ్వరికీ.సిద్ధం చేసుకున్న తిండి అలాగే ఉండి పోతుంది కానీ భారతీయ పురుషులు మాత్రం మద్యాన్ని జ్యూస్ తాగినట్లుగా గట గటా త్రాగెస్తూనే ఉంటారు.త్రాగినప్పుడు చెప్పే మాటల్లో ఇదొక అధ్భుతమైన మాట.

8.నువ్వు నా భాయ్‌వి:

8.నువ్వు నా భాయ్‌వి:

భారతీయ పురుషులు త్రాగినప్పుడు క్రొత్త బంధాలని కలుపుకుంటారు.కొత్తగా కనుగొన్న సోదరుడిని కౌగలించుకుని ముద్దు పెట్టుకుని అభిమానాన్ని ప్రదర్శిస్తారు.ఎవరో తెలీని వారిని అకస్మాత్తుగా నా సోదరుడనడం చూస్తే తర్క విరుద్దంగా అనిపిస్తుంది కానీ ఆ సమయానికి అది కరక్టే అనిపిస్తుంది.

9.సిగరెట్ కేవలం మద్యం తీసుకునేటప్పుడే తాగుతాను:

9.సిగరెట్ కేవలం మద్యం తీసుకునేటప్పుడే తాగుతాను:

భారతీయ పురుషులు చాల మంది తాము కేవలం మద్యం తీసుకునేటప్పుడు మాత్రమే పొగ త్రాగుతామంటారు.అసలు ఈ మాటకి అర్ధముందా??కానీ వాళ్ళకి మాత్రం ఇది కరక్టనిపిస్తుంది.

10.ఇక్క అస్సలు త్రాగను:

10.ఇక్క అస్సలు త్రాగను:

అతిగా త్రాగేసి వాంతులు చేసుకున్నాకా తరచూ ఈ మాట వినిపిస్తుంది.ఎవ్వరిమీదైనా సరే ఒట్లు పెట్టేసి ఇక తాము ఒక్క చుక్క మద్యం ముట్టుకోపోబని చెప్తారు.నషాలో ఉన్నప్పుడు చెప్పే మాటల్లో ఇది కూడా ఒకటి అంతే.వారం తిరిగేసరికల్లా మళ్ళీ మీరే ఇదే పబ్బులో కూర్చుని మద్యంలో మునిగిపోయుంటారు. ఒక్కసారి మొదలయితే వదలనిది ఈ అలవాటు.

English summary

10 Things Indians Say After Getting Drunk

The drunk quotes from such movies are gems. Even though we aren't sure if that is what made alcohol synonymous with heartbreak, but it is evident that it did serve as an inspiration to many. And not to forget that parties for men always means booze!
Story first published:Tuesday, September 20, 2016, 17:21 [IST]
Desktop Bottom Promotion