For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఫేస్ బుక్ నుంచి ఇప్పటికిప్పుడే డిలీట్ చేయాల్సిన విషయాలు

By Swathi
|

ఫేస్ బుక్ అంటే ఇప్పుడు చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్లకు తెలిసిన చాలా ఎట్రాక్టివ్ సోషల్ మీడియా. లైఫ్ లో ఏ చిన్న సంఘటనా జరిగినా, బాధ కలిగినా, సంతోషం కలిగినా, ట్రిప్ కి వెళ్లినా, అకేషన్ కి వెళ్లినా.. వాళ్ల ఫీలింగ్ ని షేర్ చేసుకునే అద్భుతమైన వేదిక ఫేస్ బుక్.

ఫేస్‌బుక్‌లో మీ ఫ్రెండ్స్ లిస్ట్ నుంచి తొలగించాల్సిన వ్యక్తులుఫేస్‌బుక్‌లో మీ ఫ్రెండ్స్ లిస్ట్ నుంచి తొలగించాల్సిన వ్యక్తులు

ఫేస్ బుక్ ఏదైనా పర్సనల్ విషయాలు షేర్ చేసుకున్నప్పుడు.. ప్రైవసీ గురించి భయపడతారు. అలా మీరు కూడా భయపడుతుంటే.. ఈ ఆర్టికల్ మీకోసమే. ఇటీవల ఫేస్ బుక్ లో అడ్వర్టైజ్ మెంట్స్ ఎక్కువగా కనిపిస్తుంటాయి. అలాంటి వాటి ద్వారానే హ్యాకింగ్ జరిగే అవకాశం ఉంటుంది.

ఆలుమగల మధ్య మనస్పర్ధలకు వాట్సాప్ ఎలా కారణమవుతోంది.. ??

1.49 బిలియన్ యుజర్స్ ఫేస్ బుక్ లో ఉన్నాయి. ఏదైనా చాలా బాధపెట్టే న్యూస్ ని కూడా.. ఫేస్ బుక్ ద్వారా చాలా వేగంగా స్ప్రెడ్ చేసే సత్తా ఉంది. అయితే.. మన పర్సనల్ విషయాలు కూడా ఇంతే వేగంగా.. ఇతరుల చేతుల్లోకి పడ్డాయంటే.. అంతే సంగతులు. కాబట్టి.. ఫేస్ బుక్ ఉపయోగించే వాళ్లు.. ఇప్పటికిప్పుడే డిలీజ్ చేయాల్సిన కొన్ని విషయాలు..

ఫోన్ నెంబర్

ఫోన్ నెంబర్

ఫేస్ బుక్ పేజ్ లో మీ మొబైల్ నెంబర్ పెట్టకండి. ఒకవేళ మీరు నెంబర్ యాడ్ చేసి.. దాన్ని హైడ్ లో పెట్టినా కూడా.. అది అందరికీ తెలిసిపోతుంది. కాబట్టి నెంబర్ పెట్టకపోవడమే మంచిది. ఒకవేళ మీ ప్రొఫైల్ లో నెంబర్ ఉంటే డిలీట్ చేయండి.

బర్త్ డే

బర్త్ డే

బర్త్ డే డీటెయిల్స్ ద్వారా కూడా.. మీ పర్సనల్ డీటెయిల్స్ పసిగట్టేయగలుగుతారు. బ్యాంక్ అకౌంట్ లాంటివి తెలుసుకునే అవకాశం ఉంది. కాబట్టి ఫేస్ బుక్ లో మీ బర్త్ డే డీటెయిల్స్ ఇవ్వకండి. ఒకవేళ ఉంటే.. డిలీట్ చేసేయండి. లేదంటే.. మీరు మనీ మిస్ అయ్యే ఛాన్స్ ఉంది.

రియల్ ఫ్రెండ్స్

రియల్ ఫ్రెండ్స్

మనుషులు ఒకేసారి.. 150 రిలేషన్స్ ని మెయింటెయిన్ చేయగలరని.. ఓ ప్రముఖ సైకాలజీ ప్రొఫెసర్ వివరించాడు. అయితే.. ఎవరు ఎలాంటి వాళ్లు, తమ రియల్ ఫ్రెండ్స్ ని మాత్రమే.. ఫేస్ బుక్ అకౌంట్ చేర్చుకోవాలని సూచిస్తున్నారు. నమ్మకం ఉన్నవాళ్లనే.. తమ అకౌంట్ లో చేర్చుకోవాలి.

రిలేషన్ షిప్ స్టేటస్

రిలేషన్ షిప్ స్టేటస్

చాలామంది.. ఎంగేజ్ మెంట్ అయినా, మ్యారేజ్ అయినా.. వెంటనే రిలేషన్ షిప్ ని మార్చేస్తుంటారు. ఇలాంటి ఫోటోలు.. వెడ్డింగ్ డ్రెస్, వెన్యూస్ ని ప్రమోట్ చేసే వాళ్లు ఉపయోగించే అవకాశం ఉంది. కాబట్టి బీ కేర్ ఫుల్.

క్రెడిట్ కార్డ్ డీటెయిల్స్

క్రెడిట్ కార్డ్ డీటెయిల్స్

ఫేస్ బుక్ లో క్రెడిట్ కార్డ్ డీటెయిల్స్ వివరించాల్సిన అవసరం ఏమాత్రం లేదు. ఇది ఎప్పటికీ మంచి ఐడియా కాదు.

బాస్

బాస్

మీ బాస్ ని ఫేస్ బుక్ అకౌంట్ కలిగి ఉంటే.. అంతే సంగతలు. లేట్ నైట్ పార్టీలు, ఇంట్రాక్షన్స్, స్టేటస్ లు, మీరు షేర్ చేసే ఫన్నీ ఐడియాలు చూసి.. మీపై ఇంప్రెషన్ పోయే అవకాశం ఉంటుంది. ఇలాంటివి చాలా ఇబ్బందికరంగా మారవచ్చు.

లొకేషన్

లొకేషన్

మీ గురించి ఎప్పుడైతే ట్యాగ్ చేస్తుంటారో.. అప్పుడు.. మీ లొకేషన్ ఇవ్వకపోవడం మంచిది. లేదంటే.. దీనిద్వారా చాలా ఇన్ఫర్మేషన్ పాస్ అవుతుంది. కాబట్టి ఎప్పుడూ లొకేషన్ ఇవ్వకండి.

హాలిడేకి వెళ్తున్నప్పుడు

హాలిడేకి వెళ్తున్నప్పుడు

హాలిడేకి లేదా ట్రిప్ కి వెళ్లినప్పుడు.. ఫోటోలను ఫేస్ బుక్ లో ట్యాగ్ చేయకండి. ఇంటికి తిరిగి వచ్చాక కావాలంటే.. వాటిని అప్ లోడ్ చేయడం మంచిది.

పిల్లల ఫోటోలు

పిల్లల ఫోటోలు

ఫేస్ బుక్ లో చాలామంది తమ పిల్లల ఫోటోలను షేర్ చేస్తూ ఉంటారు. ఇలా షేర్ చేయడం వల్ల మీ ఫ్రెండ్, వాళ్ల ఫ్రెండ్స్ చూస్తారు. ఇలా మీ పిల్లల ఫోటోలు వ్యాపిస్తాయి. ఇది ఎంతవరకు సేఫో మీరే ఆలోచించండి.

పిల్లల స్కూల్ డీటెయిల్స్

పిల్లల స్కూల్ డీటెయిల్స్

పిల్లలు స్కూల్ కి వెళ్తున్నారు అన్న విషయం చెబితే ఫర్వాలేదు. వాళ్లు.. ఎక్కడికి వెళ్తున్నారు, ఏ స్కూల్ కి వెళ్తున్నారు, ఏ టైమింగ్స్ లో వెళ్తున్నారు అన్న విషయం ఫేస్ బుక్ షేర్ చేయడం ఏమాత్రం సేఫ్ కాదు. దీనివల్ల మీ పిల్లల డీటెయిల్స్ ద్వారా వాళ్లకు హాని కలిగించి, మిమ్మల్ని బ్లాక్ మెయిల్ చేసే అవకాశమూ ఉంది.

ఫేస్ బుక్ లో లొకేషన్ సెట్టింగ్స్

ఫేస్ బుక్ లో లొకేషన్ సెట్టింగ్స్

స్మార్ట్ ఫోన్లు రావడం వల్ల ఒకరకంగా హెల్ప్ ఫుల్ గా ఉన్నప్పటికి.. కొన్ని సందర్భాల్లో అవి కొంపముంచేస్తున్నాయి. ఆండ్రాయిడ్, ఐఫోన్లను ఉపయోగించే వాళ్లు ఫేస్ బుక్ వాడేటప్పుడు లొకేషన్ ఆన్ చేయడం చాలామందికి అలవాటుగా ఉంటుంది. ఇలా లొకేషన్ సెట్టింగ్స్ ని ఆఫ్ చేసుకోవడం మంచిది.

English summary

11 things you have to delete from your Facebook profile

11 things you have to delete from your Facebook profile. Facebook 's latest announcement has left many confused and worried about their privacy - if you're one of them here's what you should do.
Desktop Bottom Promotion