For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఏ రోజు ఏ రంగు డ్రెస్ వేసుకుంటే.. అదృష్టం కలిసిసొస్తుంది ?

By Swathi
|

కలర్స్ మూడ్ ఫిల్టర్స్. నిజమే.. దీనివెనక కొన్ని సైంటిఫిక్ రీజన్స్ కూడా ఉన్నాయి. కలర్స్ మన మెదడుపై ప్రభావం చూపుతాయని.. సైన్స్ చెబుతోంది. అన్ని కలర్స్ కి అర్థాలున్నాయి. అలాగే.. మన మూడ్ పై ప్రభావం చూపుతాయి. అలాగే మూడ్, పర్సనాలిటీపైనా కలర్స్ ప్రభావం ఉంటుంది.

2016లో ఏ రాశి వాళ్లకు ఏ కలర్ అదృష్టం తీసుకొస్తుంది ?

వారంలో ఒక్కో రోజుకి ఒక్కో కలర్ ప్రత్యేకం. ఒక రోజు ఒక కలర్ ధరించడం వల్ల.. మనకు కొంతైనా మంచి జరుగుతుంది. ఇక్కడ కొన్ని కలర్స్ వారాన్ని బట్టి.. ధరించాలి. ఏ రోజు ఏ రంగు దుస్తులు ధరించడం వల్ల మీ మైండ్, మూడ్, లక్ అన్నీ కలిసొస్తాయో చూద్దాం..

ఆదివారం

ఆదివారం

సండే రెడ్ లేదా ఆరంజ్ షేడ్స్ ధరించాలి. ఆదివారం సూర్యుడికి సంకేతం. కాబట్టి.. ఎరుపు, నారింజ రంగు దుస్తులు ధరిస్తే.. మీకు అదృష్టం కలిసొస్తుంది.

సోమవారం

సోమవారం

సోమవారంను చందమామ పాలిస్తాడు. అలాగే శివుడికి ప్రత్యేకం. కాబట్టి.. శివుడికి ప్రత్యేకమైన రంగు నీలం. అందుకే సోమవారం.. నీలిరంగు లేదా సిల్వర్ లేదా లైట్ గ్రే కలర్ దుస్తులు ధరించాలి.

మంగళవారం

మంగళవారం

మంగళవారం.. మార్స్ కి ప్రత్యేకం. కాబట్టి మంగళకరమైన మంగళవారం.. ఆరంజ్ లేదా రెడ్ లేదా పింక్ కలర్ షేడ్స్ దుస్తులు ధరించడం వల్ల ఆ రోజు మీకు లక్కీగా మారిపోతుంది.

బుధవారం

బుధవారం

బుధవారంను మెర్క్యురీ పాలిస్తుంది. ఆ రోజు గ్రీన్ కలర్ దుస్తులు ధరించడం వల్ల.. మీరు చేసే పనుల్లో సక్సెస్ అవడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయి.

గురువారం

గురువారం

గురువారం జూపిటర్ పాలిస్తుంది. ఈ గ్రహం దేవుళ్లందరికీ.. గురువుగా చెబుతారు. కాబట్టి గురువారం పసుపు వర్ణం దుస్తులు ధరిస్తే.. ఆ రోజంతా మీకు పాజిటివ్ గా ఉంటుంది. సంపద పొందుతారు.

శుక్రవారం

శుక్రవారం

శుక్రవారాన్ని వీనస్ పాలిస్తుంది. శుక్రవారం.. సీ గ్రీన్, బ్లూ, వైట్ దుస్తులు ధరించడం వల్ల మీకు ఆ రోజు అదృష్టంగా మారిపోతుంది.

శనివారం

శనివారం

శనివారం శనిగ్రహం పాలిస్తుంది. కాబట్టి శనివారం నలుపు, బ్లూ, ఇండిగో, గ్రే కలర్ డ్రెస్ లు వేసుకోవడం వల్ల.. ఒత్తిడి తగ్గిపోయి, నెగటివిటీ మీ దరిచేరకుండా ఉంటాయి. అదృష్టం మీ వెంటే వస్తుంది.

English summary

7 Ways to Boost Your Luck By Wearing Colours on Different Days

7 Ways to Boost Your Luck By Wearing Colours on Different Days. Colors are real mood lifters, there are certain scientific reasons behind the way colors work for our brains.
Story first published: Thursday, August 18, 2016, 16:49 [IST]
Desktop Bottom Promotion