For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఇండియన్స్ పాటించే సంప్రదాయాల వెనకున్న అమేజింగ్ సైంటిఫిక్ రీజన్స్..!!

By Swathi
|

మన భారతీయ సంస్కృతి.. సంప్రదాయాలు, పద్ధతులతో నిండి ఉంటుంది. కొన్నిసార్లు ఆ సంప్రదాయాల వెనక ఉన్న అసలు కారణం తెలియక వాటిని పాటించకుండా నిర్లక్ష్యం వహిస్తాం. ఎందుకంటే.. అవన్నీ ఒట్టి మూఢనమ్మకాలే అన్ని భావన మనలో ఉండిపోయింది. మనం ఇండియన్స్ అయినందుకు గర్వపడాలి. ఎందుకంటే.. మన పూర్వీకులు మనకు చెప్పిన ప్రతి సంప్రదాయం వెనక లాజిక్ ఉంది.

ధనవంతులు కావాలంటే.. ఇంట్లో ఈ వస్తువులను ఎట్టిపరిస్థితుల్లో పెట్టుకోకూడదు..!! ధనవంతులు కావాలంటే.. ఇంట్లో ఈ వస్తువులను ఎట్టిపరిస్థితుల్లో పెట్టుకోకూడదు..!!

ఇండియన్స్ చాలా సంప్రదాయాలు పాటిస్తారు. కొన్ని తెలిసి, కొన్ని తెలియకపోయినా.. పాటిస్తూ వస్తున్నాం. కొన్ని ఫ్యాషన్ స్టేట్మెంట్ లా అనిపిస్తాయి. కొన్ని చాలా బలవంతంగా చేస్తూ ఉంటాం. అయితే.. కొన్నేళ్లుగా వస్తున్న ఈ ఆచారాలను వాళ్లు ఊరికే చెప్పలేదు. అవన్నీ మనకు ఎంతో ప్రయోజనాలను చేకూరుస్తాయి. అందుకే.. వాటిని సంప్రదాయం రూపంలో పాటించేలా అమలుచేశారు.

ఇండియన్స్ పాటించే మూఢనమ్మకాల వెనక ఉన్న అసలు సీక్రెట్స్..!!ఇండియన్స్ పాటించే మూఢనమ్మకాల వెనక ఉన్న అసలు సీక్రెట్స్..!!

ఇప్పుడు మన ఇండియన్స్ ఫాలో అయ్యే కొన్ని సంప్రదాయాలు, వాటి వెనక ఉన్న లాజిక్స్ గురించి తెలుసుకుందాం. అవన్నీ.. మిమ్మల్ని ఆశ్చర్యపరచడమే కాదు.. ఇకపై వాటిని మిస్ అవకుండా పాటించేలా మీ ఆలోచనల్ని మారుస్తాయి.

మహిళలు గాజులు ధరించే సంప్రదాయం

మహిళలు గాజులు ధరించే సంప్రదాయం

పూర్వకాలంలో మగవాళ్లు చాలా కష్టపడేవాళ్లు. శారీరకంగా చాలా పనులు చేసేవాళ్లు. కానీ.. మహిళలు కేవలం ఇంటిపనికే పరిమితం అయ్యేవాళ్లు. ఇలా.. ఎలాంటి శారీరక శ్రమ లేకుండా.. ఇంట్లోనే ఉండటం వల్ల మహిళలు ఎక్కువగా హైబ్లడ్ ప్రెజర్ సమస్యతో బాధపడేవాళ్లు.

కారణం

కారణం

కాబట్టి మహిళలు.. ఇలాంటి అనారోగ్య సమస్యలకు దూరంగా ఉండాలని భావించిన మన పూర్వీకులు.. వాళ్ల చేతులకు గాజులు వేసుకునే సంప్రదాయాన్ని తీసుకొచ్చారు. మణికట్టుపై ఉండే గాజులు శరీరాన్ని యాక్టివేట్ చేస్తాయి. గాజులు ఒకదానికొకటి రాపిడి చేయడం వల్ల.. బ్లడ్ ప్రెజర్ నార్మల్ గా ఉంటుంది. గాజుల ద్వారా చర్మానికి ఎలక్ట్రిసిటీ అందుతుంది.

పిల్లలకు చెవులు కుట్టించడం

పిల్లలకు చెవులు కుట్టించడం

చిన్నపిల్లలకు చెవులు కుట్టించే సంప్రదాయం అందరూ పాటిస్తారు. చిన్నపిల్లలకు ఏడుపు తెప్పించే ఈ సంప్రదాయం వెనక ఆక్యుపంక్చర్ ట్రీట్మెంట్ దాగుంది. అందుకే.. ఈ ఆచారాన్ని ప్రతి ఒక్కరూ పాటిస్తారు.

కారణం

కారణం

చాలా ప్రాంతాల్లో అమ్మాయిలకు, అబ్బాయిలకు ఇద్దరికీ చెవులు కుట్టిస్తారు. చెవుల బయటవైపు చాలా ఆక్యుపంక్చర్ పాయింట్స్ ఉంటాయి. ఇవి.. ఆస్తమా నయం చేయడానికి చాలా ఉపయోగపడతాయి. అందుకే .. ఈ సంప్రదాయం తీసుకొచ్చారు మన పూర్వీకులు.

రావి చెట్టు

రావి చెట్టు

హిందూ సంప్రదాయంలో రావిచెట్టుకి చాలా ప్రాముఖ్యత ఇస్తారు. చాలా పవిత్రంగా పూజిస్తారు. దీనివెనక ఆసక్తికర రహస్యం ఉంది.

కారణం

కారణం

రావిచెట్టు అన్ని చెట్ల కంటే.. ఎక్కువ ఆక్సిజన్ ని రాత్రి పూట ఉత్పత్తి చేస్తుంది. దీనివల్ల.. ఇలాంటి అరుదైన గుణం కలిగి ఉండటం వల్ల.. ఈ చెట్టుని పూజించడం వల్ల స్వచ్ఛమైన ఆక్సిజన్ గ్రహించవచ్చనే ఉద్ధేశ్యంతో.. ఈ చెట్టుకి పూజలు చేసే సంప్రదాయాన్ని మన పూర్వీకులు తీసుకొచ్చారు.

పెళ్లైన మహిళలు మట్టెలు ధరించడం

పెళ్లైన మహిళలు మట్టెలు ధరించడం

పెళ్లైన మహిళలు మట్టెలు ధరించడం మన హిందూ సంప్రదాయంలో భాగం. చాలా వరకు పెళ్లైన మహిళలంతా ఈ పద్ధతి పాటించితీరాలి. ఈ మట్టెలను కాళి రెండో వేళికి ధరిస్తారు.

కారణం

కారణం

కాలి రెండోవేళికి మట్టెలు ఎందుకు ధరిస్తారంటే.. ఈ వేలు గర్భాశయం, గుండెకు కనెక్ట్ అయి ఉంటుంది. ఈ మట్టెలు ధరించడం వల్ల రక్త ప్రసరణ సజావుగా జరిగి.. రుతుక్రమం క్రమపద్ధతిలో ఉండేలా చేస్తుంది. వెండి మట్టెలే ధరించడం వల్ల అది పోలార్ ఎనర్జీని గ్రహించి, శరీరం మొత్తానికి అందిస్తుంది.

గుళ్లో గంటలు

గుళ్లో గంటలు

గంటలు కొట్టడం వల్ల మైండ్ ని రిలాక్స్ చేసి.. ఏకాగ్రత పొందుతామని సైన్స్ చెబుతుంది. ఈ గంటలు కొట్టినప్పుడు ఉత్పత్తి అయ్యే శబ్ధం.. మెదడుకి చెందిన ఎడమ, కుడి వైపు భాగాలను ఉత్తేజపరుస్తుంది.

బ్యాక్టీరియా

బ్యాక్టీరియా

ఒకసారి గంట కొడితే ఏడు శబ్ధాలు వస్తాయట. ఇవి శరీరంలోని ఏడు చక్రాలను ఉత్తేజపరుస్తాయి. నెగటివిటీని తొలగిస్తాయి. అలాగే గంట తయారు చేయడానికి ఉపయోగించిన లోహం.. వైబ్రేషన్స్ ని ఉత్పత్తి చేస్తుంది. ఇది గాలిలోని బ్యాక్టీరియా, క్రిములను నాశనం చేస్తుంది.

నిద్రపోయేటప్పుడు ఉత్తరానికి పడుకోకపోవడం

నిద్రపోయేటప్పుడు ఉత్తరానికి పడుకోకపోవడం

భూమికి గురుత్వాకర్షణ శక్తి ఉన్నట్టే.. మనుషుల శరీరానికి కూడా ఉంటుంది. మనం నిద్రపోయేటప్పుడు ఇది రివర్స్ పొజిషన్ లో మారుతుంది. మనం నిద్రపోయేటప్పుడు శరీరంలోని గురుత్వాకర్షణ, భూమి గురుత్వాకర్షణకు పూర్తీగా అసమానంగా మారుతుంది. దీనివల్ల బీపీ సమస్యలు, గుండె సమస్యలు ఎదురవుతాయి.

కారణం

కారణం

అలాగే శరీరం కూడా కొంత ఇనుము కలిగి ఉంటుంది. ఉత్తరం వైపు తలపెట్టుకుని పడుకున్నప్పుడు.. ఐరన్ మెదడు దిశగా వెళ్లి.. తలనొప్పికి కారణమవుతుంది. అలాగే అల్జీమర్స్, ఏకాగ్రత కోల్పోవడం, మెదడు సమస్యలు ఎదురవుతాయి. అందుకే.. మనపూర్వీకులు అప్పటికే.. లాజిక్ గా ఆలోచించి.. అటువైపు తలపెట్టుకోకూడని చెప్పేవాళ్లు.

మహిళలకు సింధూరం పెట్టుకునే సంప్రదాయం

మహిళలకు సింధూరం పెట్టుకునే సంప్రదాయం

కుంకుమ పసుపు, నిమ్మ, మెర్క్యురీ మెటల్ తో తయారు చేస్తారు. దీన్ని ధరించడం వల్ల బ్లడ్ ప్రెజర్ ని కంట్రోల్ చేసి, లైంగిక సామర్థ్యాన్ని మెరుగుపరుస్తుంది. మెర్క్యురీ.. ఒత్తిడిని తొలగిస్తుంది.

నమస్కారం పెట్టే సంప్రదాయం

నమస్కారం పెట్టే సంప్రదాయం

నమస్కారం పెట్టే సంప్రదాయం వెనకా.. రహస్యం ఉంది. నమస్కారం పెట్టడానికి రెండు చేతులు జోడించడం వల్ల అరచేతులు, వేళ్ల చివర్లు కలుస్తాయి.

కారణం

కారణం

వేళ్ల చివరి భాగాలు కళ్లకి, చెవులకి, మెదడుకి ప్రెజర్ పాయింట్స్. రెండు చేతులు జోడించినప్పుడు.. మనం నమస్కరిస్తున్న వ్యక్తిని ఎక్కువకాలం గుర్తుపెట్టుకునేలా చేస్తుంది. అందుకే.. ఈ సంప్రదాయాన్ని తీసుకొచ్చారు.

గోరింటాకు పెట్టుకునే సంప్రదాయం

గోరింటాకు పెట్టుకునే సంప్రదాయం

గోరింటాకు అందంగా కనిపించడమే కాదు.. అద్భుతమైన మూలిక కూడా. గోరింటాకు ఎక్కువగా పెళ్లిళ్లలో అప్లై చేస్తారు. పెళ్లి అంటే.. చాలా హడావుడి, ఆందోళన అని మనందరికీ తెలుసు.

కారణం

కారణం

మెమందీ.. నరాలకు సాంత్వన అందించి.. శరీరానికి ఒత్తిడిని తగ్గిస్తుంది. ఆందోళనను దూరం చేయడానికి ఉపయోగపడుతుంది. తలనొప్పి, జ్వరం కూడా రాకుండా కాపాడుతుంది. చేతులు, పాదాలకు అప్లై చేయడం వల్ల.. నరాల చివర్లకు గోరింటాకు అంది.. ఒత్తిడిని దూరం చేస్తాయి.

నేలమీద కూర్చుని తినే సంప్రదాయం

నేలమీద కూర్చుని తినే సంప్రదాయం

మనం నేలపై కూర్చుని తినే అలవాటుని చిన్నప్పటి నుంచి చూస్తూ ఉన్నాం. అదికూడా కాళ్లు మడతపెట్టి.. కూర్చుంటాం. దీన్ని హాఫ్ పద్మాసన లేదా సుఖాసన అని పిలుస్తారు. ఇలా కూర్చుని తినడం వల్ల జీర్ణక్రియ సజావుగా జరుగుతుంది. శరీరానికి సాంత్వన ఇస్తుంది.

స్పైసీ ఫుడ్ తర్వాత స్వీట్స్ తినడం

స్పైసీ ఫుడ్ తర్వాత స్వీట్స్ తినడం

మనందరం ముందుగా స్పైసీ ఫుడ్ తినా.. చివరగా స్వీట్స్, డిజర్ట్స్ తీసుకుంటాం. ఎందుకు అని ఎప్పుడు ఆలోచించలేదా ? దీనివెనక సైంటిఫిక్ రీజన్ ఉంది.

కారణం

కారణం

స్వీట్స్ జీర్ణక్రియను తగ్గిస్తాయి కాబట్టి.. ముందుగా స్పైసీ ఫుడ్ తినడం వల్ల జీర్ణరసాలు, యాసిడ్స్ ని పొట్ట దాచుకుని.. తర్వాత మెరుగ్గా సాగడానికి సహాయపడుతుంది.

నదుల్లో నాణెలు పడేయడం

నదుల్లో నాణెలు పడేయడం

పూర్వకాలం డబ్బులు రాగి నాణేల రూపంలో ఉండేవి. ఇప్పుడు స్టెయిన్ లెస్ స్టీల్ తో తయారు చేస్తారు. అప్పట్టో నదుల ద్వారా మాత్రమే నీళ్లు పొందేవాళ్లు. మన పూర్వీకులు రాగి నాణేలను నదుల్లోకి విసిరేసే.. సంప్రదాన్ని పాటించేవాళ్లు.

కారణం

కారణం

రాగి నాణేలను నదుల్లోకి విసిరేయడం వల్ల.. రాగి ఎక్కువకాలం నీటిలో ఉండి.. నీటిని శుద్ధి చేస్తుంది. ఈ కారణంగా.. గుళ్లలో కూడా రాగి పాత్రలు ఉండేవి. రాగి నీటిని.. 99.9 శాతం ప్యూరిఫై చేస్తుంది.

ఉపవాసం ఉండే సంప్రదాయం

ఉపవాసం ఉండే సంప్రదాయం

ఆయుర్వేదం ప్రకారం శరీరంలోని జీర్ణవ్యవస్థలో చాలా మలినాలు పేరుకుపోయి ఉంటాయి. కాబట్టి శుభ్రంచేసే వ్యవస్థ కావాలి. దానికి ఉపవాసాన్ని క్లినింగ్ సిస్టమ్ గా మార్చారు.

కారణం

కారణం

ఎప్పుడైతే మనం ఉపవాసం ఉంటామో.. జీర్ణ వ్యవస్థ విశ్రాంతి తీసుకుంటుంది. దీనివల్ల శరీరం శుభ్రమవుతుంది. మనుషుల శరీరం 80 శాతం నీళ్లు, 20 శాతం పదార్థాలతో తయారై ఉంటుంది. మనం ఉపవాసం ఉన్నప్పుడు.. శరీరంలో యాసిడ్ కంటెంట్ తగ్గిపోయి.. శరీరం సాధారణ స్థితికి రావడానికి సహాయపడుతుంది.

అనారోగ్య సమస్యలు

అనారోగ్య సమస్యలు

ఉపవాసం డయాబెటిస్, రోగనిరోధకతకు సంబంధించిన సమస్యలు, గుండె సంబంధిత వ్యాధులు, క్యాన్సర్ రిస్క్ ని తగ్గిస్తాయి.

బొట్టు పెట్టుకునే సంప్రదాయం

బొట్టు పెట్టుకునే సంప్రదాయం

మహిళలు బొట్టు పెట్టుకునే భాగం.. ముఖ్యమైన నరం ఉంటుంది. శరీరం కోల్పోయిన ఎనర్జీ తిరిగి పొందడానికి బొట్టు సహాయపడుతుంది. అలాగే.. ఏకాగ్రతను మెరుగుపరుస్తుంది. అందుకే పూజల సమయంలో.. బొట్టు పెట్టుకుంటారు.

కారణం

కారణం

బొట్టు నుదుటిపై పెట్టుకోవడం వల్ల.. ఏకాగ్రత మెరుగుపడుతుంది. అలాగే.. రక్త ప్రసరణ చురుగ్గా సాగుతుంది.

English summary

Ancient Indian Traditions That Prove That Indians Are Logical & Not Superstitious!

Ancient Indian Traditions That Prove That Indians Are Logical & Not Superstitious! Our culture is full of rituals and customs that we sometimes do not realise are for certain reasons, Reasons that are beyond the lines of superstitions.
Desktop Bottom Promotion