For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

కలలో ఏ జంతువు కనిపిస్తే దేనికి సంకేతం..!?

|

భూమి మీద ఉన్న ప్రతి వ్యక్తి తొంభై నిముషాల నుండి రెంగు గంటల వరకు లేదా ప్రతి రాత్రి కలలో జీవిస్తుంటారు. కొన్ని సార్లు కలలు స్వాప్నికుని మనసులో ఉన్నవే ఉంటాయి. ఎప్పుడో తప్పిపోయిన స్నేహితుడు తిరిగి కలుసుకున్నట్లుగా...ఒక పార్క్ లోనో..బీచ్ లోనో ఎంతో ఇష్టంగా తిరుగుతున్నట్లుగా..లేదా లాటరీలో జాక్ పాట్ కొట్టినట్లుగా...ఉన్నట్లు ధనవంతులు అయిపోయినట్లు..విదేశాలకు ప్రయాణం చేసినట్లు...సెలబ్రెటీలతో కలిసినట్లు...ఇలా కలలు వివిధ రకాలుగా వస్తుంటాయి.

కానీ రాత్రుల్లో వచ్చే కలలు ఉదయం నిద్రలేచే సరికి గుర్తుండవు. కొందరికి మాత్రమే ఎంతో కొంత గుర్తున్నట్లు భావిస్తుంటారు. కాని కలలు ఎప్పుడు కథలుగా ఏమి ఉండవు మరియు వివిధ సంస్కృతులు మరియు నేపథ్యాల నుండి వొచ్చిన ప్రజలు కన్న కలలను నివేదించినప్పుడు ఆ పరిశోధన మరింత ఆకర్షణీయంగా ఉంటున్నది. ఇక్కడ కొన్ని సాధారణ కలలు మరియు వాటి వివరణలను పొందుపరుస్తున్నాము. కలలు కొన్ని మంచిని సూచిస్తే...మరికొన్ని చెడును సూచిస్తాయి.

కానీ రాత్రుల్లో వచ్చే కలలను బట్టి, వాటికి కొన్ని మీనింగ్స్ కూడా ఉంటాయి. పాములు కనిపించి తరిమితే చెడు జరుగుతుందని, కాటేసి, రక్తం వస్తే మంచి జరుగుతుందని భావిస్తుంటారు. అంతే కొత్త బట్టలు కనబడితే హాని అని, చనిపోయిన వారు కనబడితే మంచిదని అంటుంటారు.

వీటిలాగే కలలో జంతువులు కనబడితే ఏం జరుగుతుంది. మనకు కలలో కనిపించే ఏ జంతవు మనకు ఏం సూచిస్తుందో తెలుసుకుందాం..

జింక

జింక

కలలో జింక కనిపిస్తే మీకు ఉన్న ఉన్నత లక్ష్యాలని ఎంతో ప్రయాసతో సాధిస్తారని అర్ధం. అనుకోకుండా ఆర్ధిక పరిస్థితి మెరుగుపడటాన్ని కూడా ఇది సూచిస్తుంది. కలలో జింక చనిపోయినట్లుగా కనిపిస్తే ప్రేమ వ్యవహారాల్లో వైఫల్యం ఎదురయ్యే అవకాశం ఉంది.

పిల్లి

పిల్లి

కలలో పిల్లి కనిపిస్తే దురదృష్టమని చాలామంది నమ్ముతారు. అయితే, పిల్లుల్ని ప్రేమించే వాళ్ళు మాత్రం అది సృజనాత్మకతకు, శక్తికి చిహ్నమని భావిస్తారు. మీ కలలో తెల్లపిల్లిని చూస్తే కష్టాలు రాబోతున్నాయని, నల్లపిల్లిని చూస్తే మీరు మీమానసికసామర్ధ్యాలు ఉపయోగించటానికి భయపడుతున్నారని అర్ధం. పిల్లి మిమ్మల్ని కొరికినట్లు కల వస్తే మీరు ఎప్పుడూ ఎదుటివారినుండి తీసుకునేవారుగానే ఉంటున్నారు కానీ ఇవ్వటానికి ఇష్టపడరని అర్ధం. అంతేకాకుండా మీరు అనుకున్న విధంగా పనులు జరగనప్పుడు భయం లేదా నిరాశకు గురి అవ్వటానికి ఇది సూచన కావచ్చు. అయితే, మీరు పిల్లిని తరుముతున్నట్లు కల వస్తే, మీ అడ్డంకులను అధిగమించడానికి మీరు చేసే ప్రయత్నానికి ఇది సూచన.

ఆవు

ఆవు

మీ కలలో ఒక ఆవు కనిపిస్తే మీ విధేయతను, నిష్క్రియా స్వభావాన్ని సూచిస్తుంది. బక్కచిక్కిన ఆవు కనిపిస్తే మీ నిజజీవితంలో మీఅమ్మ మీఅవసరాలకు సరిగా స్పందించడం లేదని, ఆమె ప్రేమని మీరు కోరుకుంటున్నారని అర్ధం.

ఎద్దు

ఎద్దు

మీకలలో ఎద్దును చూస్తే, విస్తారమైన సంపద రాబోతోందని అర్ధం. ఆబోతును చూస్తే మీ కోరికలు మీ నియంత్రణలో లేవని అర్ధం.

దూడ

దూడ

కలలో దూడ కనిపిస్తే అనుభవ లేమికి సూచన. అంటే మీరు కొన్ని లక్షణాలు పెంపొందించుకుంటే కానీ జీవితంలో ఎదగలేరని అర్ధం.

ఒంటె

ఒంటె

మీ కలలో ఒంటెను చూశారంటే, మీరు మీ భుజాల మీద చాలా సమస్యలు మోస్తున్నారని, మీ ఉద్వేగాలను వ్యక్తం చేసి, మీ బరువులు వదిలించుకోకుండా, వాటిని పట్టుకొని వేళ్ళాడతున్నారని అర్ధం. ఒక రకంగా మీరు ఎంత పెద్ద భారాన్ని అయినా మోయగలరని అర్ధం. అయితే మీలో మన్నించే గుణం, మర్చిపోవటం తక్కువ.

గాడిద

గాడిద

మీ కలలో ఒక గాడిదను చూస్తే అవగాహన లేకపోవడాన్ని సూచిస్తుంది. అంతే కాక, మీకు రాబోయే అనేక చికాకులకు ఇది గుర్తు. మీ కలలో భారం మోస్తున్న గాడిదను చూస్తే, చాలా సహనంతో కష్టపడిన తర్వాత, మీరు వ్యాపారంలో, ఇంకా ప్రేమలో విజయవంతమవుతారని అర్ధం. గాడిద మొండితనానికి, ఇతరులకు లొంగని స్వభావానికి గుర్తు. గాడిద మీద నుండి పడిపోతే ప్రేమలో వైఫల్యాన్ని, గాడిద తన్నినట్లు కల వస్తే అసాంఘిక కార్యక్రమాల్లో పాల్గొంటున్నందువల్ల పట్టుబడతామనే భయాన్ని, గాడిద మీద ఊరేగుతూ, వెనుక చాలామంది అనుసరిస్తుంటే, అందర్నీ ఒప్పింపచేయగల నాయకత్వ లక్షణాన్ని సూచిస్తుంది.

గబ్బిలం

గబ్బిలం

కలలో గబ్బిలం కనిపించటం ఒక రకంగా దుశ్శకునమే. అది తెల్లగబ్బిలం అయితే కుటుంబసభ్యులలో ఒకరి మరణాన్ని, నల్లగబ్బిలం అయితే వ్యక్తిగత విపత్తుని సూచిస్తుంది. అదే పిశాచిలాంటి గబ్బిలం అయితే, మీ ఆత్మవిశ్వాసం మరియు మీ వనరులన్నీ కోల్పోవటాన్ని సూచిస్తుంది. ఇంకో రకంగా చూస్తే, గబ్బిలాలు మీ పాత అలవాట్లను మానకపోతే మీ జీవితంలో ఎలాంటి అభివృద్ధి ఉండదని సూచిస్తాయి.

మొసలి

మొసలి

మొసలి కలలో కనిపిస్తే ఏదో ఊహించని ప్రమాదం రాబోతోందని అర్ధం. మీ దగ్గర వాళ్ళలో ఎవరో మిమ్మల్ని తప్పుడు నిర్ణయాల వైపు పురిగొల్పుతున్నారని అర్ధం చేసుకోవచ్చు. మొసలి మిమ్మల్ని వెంటాడి కరిస్తే, ప్రేమ మరియు వ్యాపారాలలో పరాజయం పొందబోతున్నారని అర్ధం.

పశువులు

పశువులు

పశువులు కలలో కనిపిస్తే మీరు ప్రస్తుతమున్న పరిస్థితితో లేదా బంధాలతో జాగ్రత్తగా ఉండాలని అర్ధం. కలలో పశువులమందలను చూడటం వ్యక్తిత్వం లేకపోవడానికి సూచన.

కుక్క

కుక్క

కలలో ఒక కుక్కను చూస్తే పట్టుదలతో మీప్రత్యర్థి మీద విజయాన్ని సాధిస్తారని అర్ధం. ఈ కల మీరు ద్వంద్వార్ధాలతో ఇతరులను తీవ్రంగా వేధించడానికి సూచన కావచ్చు. కుక్క కోపంగా కేకలు వేయటం మీలోపల ఉన్న అంతర్గత సంఘర్షణను సూచిస్తుంది. మరణించిన కుక్క ఒక మంచి స్నేహితుని మరణానికి సూచన. కుక్క మరణిస్తూ ఉంటే, మీలోని మంచి ప్రవృత్తులు క్షీణించిపోవటాన్ని సూచిస్తుంది. కాలు మీద కుక్క కరవటం మీ జీవితాన్ని సమతుల్యం చేసుకునే సామర్థ్యం కోల్పోవటాన్ని, ఒక కొత్తపరిస్థితిని సమర్ధవంతంగా ఎదుర్కోలేకపోవటాన్ని సూచిస్తుంది. సంతోషంగా మొరిగే కుక్క ఇతరులతో కలిగి ఉన్న చక్కటి సామాజిక సంబంధాలకు, భయంకరంగా మొరిగే కుక్క మీ చుట్టూ ఉన్నవాళ్ళతో సరి అయిన సంబంధాలు లేకపోవటానికి గుర్తు. కుక్కను కొంటున్నట్లు కల వస్తే తోడు కోరుకుంటున్నారని, కుక్కకు కట్టు కడుతున్నట్లు కల వస్తే మీలోని లోపాలు, అలవాట్లు కప్పిపుచ్చుకోవడానికి ప్రయత్నాలు చేస్తున్నారని అర్ధం.

ఏనుగు

ఏనుగు

కలలో ఏనుగు కనిపిస్తే, మీరు ఇతరుల పట్ల ఇంకా ఎక్కువ అవగాహనతో, సహనంతో ఉండాలని అర్ధం. ఏనుగు శక్తి, బలం, మరియు తెలివికి చిహ్నం. అంతేకాక, ఇది మీలోని అంతర్ముఖ వ్యక్తిత్వానికి సూచన కావచ్చు. ఏనుగు మీద స్వారీ చేస్తున్నట్లు కల వస్తే, మీరు ఒకప్పుడు భయపడిన, మీలోని దాగబడిన అంశాలు మీ నియంత్రణలో ఉన్నాయని అర్ధం.

మేక

మేక

మేక పరిస్థితులను సరిగా అంచనా వేయలేకపోవటాన్ని, అవివేకాన్ని సూచిస్తుంది. మేకపోతు కనిపిస్తే, మీ పోటీదారులు మీవ్యాపారాలను కూల్చివేయటానికి ప్రయత్నిస్తున్నారని అర్ధం.

గుర్రం

గుర్రం

గుర్రం బలమైన భౌతిక శక్తికి సూచన. నల్ల గుర్రం హింస మరియు క్షుద్ర శక్తులకు, తెల్ల గుర్రం స్వచ్ఛత, శ్రేయస్సు అదృష్టానికి సూచన. చనిపోయిన గుర్రం ఒకప్పుడు మీకు బలం కలిగించింది ఏదో మీ జీవితంలోనుండి పోయిందని, ఇప్పుడు లేదనే దానికి సూచన. అడవి గుర్రాలమంద బాధ్యతా రాహిత్యానికి గుర్తు. గుర్రం మీద స్వారీ చేస్తూ అది మీనియంత్రణలో ఉంటే, అక్రమ మార్గాల ద్వారా విజయం సాధించడానికి ప్రయత్నిస్తారని, నియంత్రణలోలేని గుర్రం మీద స్వారీ చేస్తూ ఉంటే, మీ కోరికలు మిమ్మల్ని స్థిమితంగా ఉండనీయవని అర్ధం.

పాము

పాము

ఎక్కువమందికి కలలో కనిపించే జంతువులలో పాము కూడా ఒకటి. పాము ప్రమాదకరమైన, నిషిద్ధ లైంగికతకు ప్రతీక. కలలో పాము కాటు వేస్తే మీలో దాగబడ్డ భయాలు, ఆందోళనలు ఉన్నాయని, అవి మిమ్మల్ని బాగా భయపెడుతున్నాయని అర్ధం. ఇది మీరు నిజజీవితంలో ఎదుర్కోబోయే ప్రమాదానికి సూచన కావచ్చు. కలలో పాము తరుముతుంటే, మీరు వద్దనుకుంటున్న పరిస్థితిలోనే మీరు చిక్కుకోవాల్సి వచ్చిందని, లేక వస్తుందని అర్ధం.

పంది

పంది

పంది మురికి, అత్యాశ, స్వార్ధానికి గుర్తు. మీలో ఉన్న స్వార్ధాన్ని లేక అత్యాశను వదిలించుకుంటే కానీ విజయావకాశాలు దరి చేరవని అర్ధం.

సింహం

సింహం

సింహం బలానికి, దూకుడుకి, శక్తికి ప్రతీక. మీరు ఇతరులపై ఎక్కువ ప్రభావం చూపుతున్నారని, ఇతరులతో మంచి సంబంధాలు కొనసాగించాలంటే దీనిని నియంత్రించవలసిన అవసరం ఉందని అర్ధం. సింహం మీపై దాడి చేసినట్లు కల వస్తే, మీరు ఎన్నో అడ్డంకులను అధిగమించవలసిన అవసరం ఉందని సూచిస్తుంది.

పులి

పులి

పులి శక్తికి, వివిధ పరిస్థితులను ఎదుర్కోవటానికి కావలసిన మీ సామర్థ్యానికి, నాయకత్వ లక్షణానికి సూచన. బోనులో ఉంచబడిన పులి అణచివేయ్యబడిన భావోద్వేగాలకు, దాడి చేస్తున్న పులి, ఆ భావోద్వేగాల వల్ల కలిగే భయానికి గుర్తు.

కుందేలు

కుందేలు

కుందేలు అదృష్టానికి గుర్తు. మీ భవిష్యత్తు ప్రయత్నాలు మీకు అనుకూలంగా తిరుగుతాయని అర్ధం. తెల్ల కుందేలు నిజమైన ప్రేమకు సూచన. పచ్చిక బయళ్ళలో దూకుతూ, ఆడుకుంటున్న కుందేళ్ళు పిల్లల వలన కలగబోయే సంతోషాన్ని సూచిస్తాయి.

తాబేలు

తాబేలు

తాబేలు మీరు జీవితంలో ముందుకు పోవడానికి అవకాశాలు వెతుక్కోవలసిన అవసరాన్ని సూచిస్తుంది. మీకు ఎదగటానికి పుష్కలంగా అవకాశాలు ఉన్నాయి, కానీ దాని కోసం సరి అయిన అడుగు వేయాలని అర్ధం.

English summary

Animals in Dreams and Their Meanings

Animals in Dreams and Their Meanings,Animals in dreams can be extremely helpful in gaining insight into ourselves - into our psyche. Animal dreams deal with strong emotion and are usually indicative of "prime root" issues in our lives.
Desktop Bottom Promotion