For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

బ్రాల విషయంలో ఎట్టి పరిస్థితిలోనూ స్త్రీలు చెయ్యకూడని పొరపాట్లు..!

By Lekhaka
|

బట్టల విషయంలో ఆడవాళ్ళం చాలా శ్రద్ధ తీసుకుంటాము కానీ అదే శ్రద్ధ లోపల ధరించే బ్రా విషయంలో తీసుకుంటామా??అవును సాధారణంగా బ్రా విషయంలో స్త్రీలు చేసే పొరపాట్ల గురించే ఈరోజు ఆర్టికిల్. మీ వార్డ్‌రోబ్‌లో ఉన్న అన్ని బట్టలలోకెల్లా ఎక్కువసేపు మిమ్మల్ని అంటిపెట్టుకుని ఉండేవి బ్రాలే.

బ్రా ఎంచుకోవడం దగ్గరనుండీ దానిని బీరువాలో భద్రపరచడం వరకూ మనం చాలా తప్పులు చేస్తుంటాము.అసలు ఎలాంటి బ్రా ఎంచుకోవాలి, కొనుక్కున్న వాటిని ఎలా భద్రపరచాలి ఇవన్నీ మనకి కష్టమైన విషయాలుగా తోస్తాయి.సరైన బ్రా ఎంచుకోవడమే కాదు దానిని ధరించడం కూడా ముఖ్యమే.బ్రా విషయంలో అమ్మాయిలు ఏ తప్పులు చెయ్యకూడదో ఇది చదివి తెలుసుకోండి.

బ్రా ఎంపిక:

బ్రా ఎంపిక:

కప్ సైజుని బట్టి చాల మంది స్త్రీలు బ్రా ఎంపిక చేసుకుంటారు కానీ ఇది చాలా పొరపాటు.న్యూమరికల్ బ్రాండ్ సైజుని బట్టి బ్రా ఎంపిక చేసుకోవాలి ఎందుకంటే కప్ సైజులు బ్రాండ్ సైజుతో ముడిపడి ఉంటాయి.కప్ సైజుని బట్టి ఎంచుకోవడం సరైన్ ఎంపిక ఎందుకు కాదన్నామంటే కొన్ని బ్రాండ్లలో మీకు కప్పు సైజు "డీ" ఉండచ్చు కొన్నింటిలో "ఈ" కప్పు సైజు సరిపోతుంది.

చిన్న సైజు బ్రా:

చిన్న సైజు బ్రా:

చిన్న బ్రాని ధరించడం వల్ల తమ వక్షోజాలు నొక్కి పెట్టబడతాయని అందువల్ల చూడటానికి బాగుంటుందనీ చాలా మంది స్త్రీలు భావిస్తారు. కానీ చిన్న బ్రా ధరించడంవల్ల వక్షోజాలు సాగిపోయి వాటి ఆకారం కూడా దెబ్బ తింటుంది.

బ్రా తయారీకి వాడిన బట్ట సరైనది కాకపోవడం:

బ్రా తయారీకి వాడిన బట్ట సరైనది కాకపోవడం:

లేసులు, సాటీన్, సింథటీక్ బ్రాలు చొఓడటానికి సెక్సీగా ఉంటాయని మీరు అనుకోవచ్చు కానీ ఇవన్నీ ఏదో ఒక్క రాత్రి పార్టీకోసం ఇలాంటి బ్రాలు బాగుంటాయి.కానీ మీ చర్మం హాయిగా గాలి పీల్చుకోవాలంటే కాటన్ బ్రాయే మంచిది.ఈరోజుల్లో కాటన్‌లోనే రకరకాల రంగులు,ప్రింట్లలో బ్రాలు లభ్యమవుతున్నాయి.

పాత బ్రా ఉపయోగించడం:

పాత బ్రా ఉపయోగించడం:

పాత బ్రా మీ శరీరం మీద ప్రభావాన్ని చూపిస్తుంది.మీకు ఒక బ్రా పట్ల ఎంత మక్కువ ఉన్నా కానీ దానిని పారేసి కొత్తది కొనుక్కోవాలి.పాత బ్రా మీకు సరైన ఫిట్టింగ్ ఇవ్వదు.అందువల్ల కొత్త బ్రా కొనుక్కుంటే అది మీ వక్షోజాలని సరైన ఆకృతిలో ఉంచుతుంది.

అసిస్టెంటు సలహా తీసుకోండి:

అసిస్టెంటు సలహా తీసుకోండి:

షాపులో బ్రా కొనుక్కునేటప్పుడు మీకు సహాయం చెయ్యడానికి అసిస్టెంటు ఉంటారు, వారి సహాయం తీసుకోండి.వారిచ్చిన సలహాని పెడచెవిన పెట్టడం చాలా పెద్ద తప్పు.ఎందువల్ల అంటే వారికి ఉన్న నాలెడ్జితో మీకు నప్పే సరైన బ్రాని సూచిస్తారు.వారు అక్కడ మీకు సహాయం చెయ్యడానికే ఉన్నారనీ, వారికి బ్రా ఎంపికలో మంచి పరిఙానం ఉందనీ గుర్తు పెట్టుకోండి.అందువల్ల అక్కడ ఉన్న అసిస్టెంటు ఇచ్చే సలహా వినడం వల్ల మంచి బ్రాని ఎంపిక చేసుకోగలరు.

ఒకే బ్రాని రెండు రోజులపాటు వరుసగా ధరించ్డం:

ఒకే బ్రాని రెండు రోజులపాటు వరుసగా ధరించ్డం:

కొంత మంది ఆడవారు ఒకే బ్రాని రెండు రోజులపాటు వరుసగా ధరిస్తారు.ఇది చాలా పొరపాటు.అది ధరించినప్పుడు సాగి ఉంటుంది,బ్రాని విప్పి పక్కన పెట్టడంవల్ల పూర్వ స్థితికి వస్తుంది.బ్రాని ఎపుడూ చల్లని నీటిలోనే ఉతకాలి . దెని వల్ల బ్రా ఎలాస్టిక్ తాజాగా టైటుగా ఉంటుంది.

బ్రా సెట్టింగ్ సరిగ్గా లేకపోవడం:

బ్రా సెట్టింగ్ సరిగ్గా లేకపోవడం:

ఒక బ్రా తమకి పట్టదు అని ఒప్పుకోవడానికి స్త్రీల మనసొప్పదు.వారి బ్రా సైజు గురించి బహిరంగంగా మాట్లాడటానికి సంకోచిస్తారు.మీకు మీ బ్రా సైజు పట్ల అవగాహన లేకపోతేకనుక అక్కడ ఉన్న అసిస్టెంటుని మీ కొలతలు తీసుకోమని అడిగి సరైన బ్రా ఎంపిక చేసుకోవాలి.

English summary

Bra Mistakes Every Girl Makes

We women take special care and precaution while selecting clothes, but do we take the special care while purchasing a bra? Yup, now that's what this article is all about and these are the bra mistakes that girls make often.
Desktop Bottom Promotion