For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

  చేతబడి అంటే ఏమిటి ? దీన్ని ఎంతవరకు నమ్మవచ్చు ?

  |

  చేతబడితో ఒక మనిషి తలరాతే మార్చడం ఏంటని కొందరు ప్రశ్నిస్తూ ఉంటారు. ఎదుటివ్యక్తి జీవితకాలాన్నే మార్చేసే శక్తి చేతబడికి ఉంటుందా అని ప్రశ్నిస్తుంటారు. కొందరు చేతబడి చేస్తుంటారు, మరికొందరు చేతబడికి గురయినవాళ్లు ఉన్నారని నమ్ముతారు. అసలు ఈ చేతబడి అంటే ఏమిటి ? ఇవన్నీ నమ్మసక్యమేనా ? నిజంగానే చేతబడి ఫలిస్తుందా ? చేతబడితో ఓ వ్యక్తిని పూర్తీగా మార్చేయవచ్చా ? చేతబడి ఓ వ్యక్తి జీవితాన్నే అఘాతంలోకి తొక్కేస్తుందా ? అనేది నేటితరాన్ని వేధించే సందేహాలు.

  Can someone do black magic ? Is it Real

  చేతబడి..!! ఒకప్పుడు అమ్మమ్మలు, తాతయ్యలు ఎక్కువగా చెప్పేమాట. ఆ కాలంలో చేతబడి అనేది ఎక్కువగా వినిపించేది. అంతేకాదు వాళ్లు ప్రత్యక్షంగా చూశామని చెబుతుంటారు. చేతబడికి గురయైనవాళ్లను, చేతబడి చేయించేవాళ్లను గుర్తించామని చెబుతుండేవారు. కానీ ఈ టెక్నికల్ యుగంలో కూడా చేతబడిని నమ్మేవాళ్లు ఉన్నారంటే.. అతిశయోక్తి కాదు. మరి ఇదంతా ఎంతవరకు నిజం. చేతబడిపై హేతువాదులు ఏమంటున్నారు ? తత్వ వేత్తలు ఏం చెబుతున్నారు ?

  MOST READ:చేతబడుల్లో నిమ్మకాయల్ని ఎందుకు ఉపయోగిస్తారు??

  చేతబడి

  చేతబడి

  చేతబడి అనేది ఒట్టి మూఢ నమ్మకం అని కొట్టిపడేసే హేతువాదులున్నారు. అలాగే ఇది ఖచ్చితంగా జరుగుతుందని, స్వయంగా అనుభవించామని నమ్మి, భయాందోళనకు గురయ్యే వాళ్లూ ఉన్నారు.

  చేతబడికి పేర్లు

  చేతబడికి పేర్లు

  చేతబడిని ప్రాంతాలను బట్టి విచ్ క్రాఫ్ట్, వూడూ, బ్లాక్ మ్యాజిక్, బాణామతి, చిల్లంగి అని పిలుస్తారు.

  MOST READ:అబ్బాయిల్లో హెయిర్ ఫాల్ నివారించే ఎఫెక్టివ్ హోం రెమిడీస్

  అన్ని కాలాల్లో

  అన్ని కాలాల్లో

  చేతబడి ఖచ్చితంగా ఏ కాలంలో ప్రారంభం అయిందో తెలియనప్పటికీ దాదాపు అన్ని కాలాల్లోనూ, అన్ని ప్రాంతాల్లోనూ ఇది ఉన్నట్లు పరిశోధనల ద్వారా తెలుస్తోంది.

  అధ్యయనాలు

  అధ్యయనాలు

  ఆస్ట్రేలియా పాతకాలపు తెగల్లో, ఆమెరికాలోని రెడ్‌ ఇండియన్స్‌లో, ఆఫ్రీకా తెగల్లో, ఈజిప్టు, ఇరాన్‌, గ్రీకు, రోము, భారత్, చైనా, నైనోవా, ఇటలీ, జర్మన్‌, జపాన్‌ దేశాల్లో పూర్వమే కాదు, ఇప్పటికీ చేతబడి, క్షుద్ర విద్య అనేది ఏదోక రూపంలో ఉన్నట్లు అధ్యయనాలు చెబుతున్నాయి.

  ఇరాన్

  ఇరాన్

  అయితే ముందుగా ఇరాన్ లో మొదలై, తర్వాత అన్ని దేశాలకు వ్యాపించినట్లు ఓ కథనం చెబుతోంది.

  స్మశానంలో

  స్మశానంలో

  అర్థరాత్రిళ్లు మంత్ర తంత్రాలతో క్షుద్ర పూజలు చేస్తూ.. ఆవాహయామీ అంటూ.. జపిస్తూ.. రహస్యంగా పెద్ద పెద్ద హోమాలు చేస్తూ.. ఈ తంతుకి స్మశానాన్నే వేధికగా చేసుకుంటారు.

  క్షుద్రపూజలు

  క్షుద్రపూజలు

  తమ శత్రువులకు హాని జరగాలని, వాళ్లను ఈ లోకం నుంచి పంపించేయాలనే దురాలోచనతో ఈ క్షుద్రపూజలు, చేతబడి నిర్వహిస్తారు.

  చేతబడి రకాలు

  చేతబడి రకాలు

  ఈ చేతబడిని రకరకాలుగా నిర్వహిస్తారు. షైతానులు, జిన్నాతుల ద్వారా సహాయం పొంది ఎదుటి వారికి హాని తలపెట్టే పద్ధతి ఒకటి ఉంది.

  చేతబడి రకాలు

  చేతబడి రకాలు

  మందుల ద్వారా లేదా మాటల ద్వారా బాధితులని తన వైపు తిప్పుకుని అతని ఆలోచనలపై, ఆచరణలపై పట్టు సాధించి, అతన్ని తనకు అనుకూలంగా మలచుకునేది మరో పద్ధతి.

  చేతబడి రకాలు

  చేతబడి రకాలు

  ఈ రెండు పద్ధతులను వేర్వురుగా చేసేవాళ్లూ ఉంటారు. ఈ రెండింటిని కలిపి చేసే వాళ్లు కూడా ఉంటారు. మంత్రంతోపాటు తంత్రం కూడా ఉపయోగిస్తారన్నమాట.

  వస్తువు

  వస్తువు

  చేతబడి చేయడానికి వాళ్లు టార్గెట్ చేసిన వ్యక్తికి సంబంధించిన ఏ వస్తువైనా తీసుకెళ్తారట. అంటే వెంట్రుకలు లేదా బట్టలు లేదా వాళ్లకు సంబంధించిన ఏదైనా ఒక వస్తువుతో పూజలు క్షుద్రపూజలు చేసి.. మొత్తం మనిషిపై ప్రభావం చూపిస్తారని సాధారణంగా చెబుతుంటారు.

  ముస్లింలు కూడా

  ముస్లింలు కూడా

  హిందువులు మాత్రమే కాదు.. ముస్లింలు కూడా చేతబడిని నమ్ముతారు. వాళ్లు దీన్ని సిహ్ర్, తావీజ్ అని పిలుస్తారు. దీని అర్థం బ్లాక్ మ్యాజిక్. జీనీలు అంటే భూతమని అర్థం.

  నిషిద్ధిమంటున్న ఇస్తాం

  నిషిద్ధిమంటున్న ఇస్తాం

  జీనీల సహాయంతో మాయలు చేయవచ్చని కొందరు ముస్లింలు నమ్ముతారు. జీనీలు ఒక మనిషిని ఆవహించవచ్చని.. వీటిని వదిలించడానికి ఖురాన్ లోని కొన్ని పదాలు చదువుతారు. కానీ జీనీల సహాయం కోరడం నిషిద్ధమని ఇస్లాం ఖండిస్తుంది.

  నమ్మకం

  నమ్మకం

  కొన్ని మారుమూల ప్రాంతాల్లో ఇప్పటికీ చేతబడి జరుగుతోందని ప్రజలు బలంగా నమ్ముతారు. తమకు ఏదైనా కీడు జరిగినా.. ఉన్నట్టుండి అనారోగ్యం పాలైనా దానికి కారణం గిట్టనివాళ్లు చేసిన చేతబడి ప్రభావమే అని భావిస్తారు.

  హేతువాదులు

  హేతువాదులు

  అయితే చేతబడి అనేది నిజంగా జరిగిందనడానికి ఆధారాలున్నాయని చాలా మంది చెబుతూ ఉంటారు. కానీ ఈ మూఢ నమ్మకం పేరుతో గ్రామాల్లో అనేక మంది అమాయకులు బలవుతున్నారని హేతువాదులు వాదిస్తున్నారు.

  చిత్రహింసలు

  చిత్రహింసలు

  ఇలాంటి భ్రమలోనే ఇప్పటికీ అనుమానం వచ్చినవాళ్లను చితకబాదటం, రాళ్లతో కొట్టడం, చెట్టుకి కట్టేసి చిత్రహింసలు పట్టడం వంటివి చేస్తూనే ఉన్నారు.

  మహిళలే ఎక్కువ

  మహిళలే ఎక్కువ

  మనదేశంలో చేతబడి అనుమానంతో హత్యకు గురవుతున్నవాళ్లలో మహిళలే ఎక్కువగా ఉంటున్నారు. అది కూడా ఒంటరి మహిళలే ఎక్కువమంది బాధితులున్నారు.

  తత్వవేత్తలు

  తత్వవేత్తలు

  కానీ.. చేతబడి నమ్మాలా ? అంటే తత్వవేత్తలు ఇదంతా.. భ్రమ మాత్రమే అని కొట్టిపారేస్తున్నారు. ఇదంతా మనసులో జరిగే హీనమైన చర్యగా వివరిస్తున్నారు. ఇతరులు చేసే మాయ, చెడు, మంచి ఏదైనా మనపై అంతగా పనిచేయదంటున్నారు. ఒకవేళ ప్రభావం చూపినా.. జీవితాన్ని మార్చేసే విధంగా జరగదని తేల్చిచెబుతున్నారు.

  చెడు పనులకు

  చెడు పనులకు

  చేతబడి శాస్త్రం ప్రస్తుత కాలంలో దాదాపు అంతరించిపోయింది. వాస్తవానికి చేతబడి శాస్త్రాన్ని మంచి ఉద్దేశ్యం కోసం వాడుకోవచ్చు.

  అంతరంగిక శక్తి

  అంతరంగిక శక్తి

  చేతబడి అనేది మనిషి తన ఆంతరంగిక శక్తులనో, బాహ్య శక్తులనో ఉపయోగించుకునే ఒక సాంకేతిక పరిజ్ఞానం. కానీ దురదృష్టవశాత్తూ మనుషులు దాన్ని దుర్వినియోగం చేసుకుంటున్నారు. మంచి పనుల కన్నా.. చెడు పనులకే చేతబడిని ఎక్కువగా ఉపయోగిస్తున్నారు.

  English summary

  Can someone do black magic ? Is it Real ?

  Can someone do black magic ? Is it Real ? Black Magic has long been practiced in different part of the country by specific persons known as Tantriks. Many people are faced with the effects of black magic without knowing that it is actually black magic that is affecting them.
  We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Boldsky sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Boldsky website. However, you can change your cookie settings at any time. Learn more