For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

క్యాష్ లెస్ గా మారుతున్న దేశాలు..!!

300 ఏళ్ల క్రితం పేపర్ మనీ అందుబాటులోకి వచ్చింది. అయితే.. కొన్ని దేశాలు క్యాష్ లెష్ గా మారాయి అంటే నమ్ముతారా ? అసలు ఊహించుకోగలరా ? చేతిలో డబ్బు లేకుండా దేశాలే నడుస్తున్నాయంటే.. చాలా ఆశ్చర్యపరిచే విషయం.

By Swathi
|

డబ్బు అనేది ఎప్పటికీ కింగే. నోట్ల రద్దుతో.. ప్రపంచమంతా.. తలకిందులైంది. డబ్బులు కొరతగా ఉన్నప్పుడు, పాతనోట్లను రద్దు చేసినప్పుడు వస్తువులు కొనడం, అమ్మడం ఎలా అనేది.. ఆసక్తికర విషయంగా మారింది.

cashless

300 ఏళ్ల క్రితం పేపర్ మనీ అందుబాటులోకి వచ్చింది. అయితే.. కొన్ని దేశాలు క్యాష్ లెష్ గా మారాయి అంటే నమ్ముతారా ? అసలు ఊహించుకోగలరా ? చేతిలో డబ్బు లేకుండా దేశాలే నడుస్తున్నాయంటే.. చాలా ఆశ్చర్యపరిచే విషయం.

క్యాష్ లెస్ కంట్రీ అంటే.. చేతులతో డబ్బు మార్పిడి లేకుండా.. కేవలం ఆన్ లైన్ ట్రాన్సాక్షన్స్, ఆన్ లైన్ చెల్లింపులు, ఆన్ లైన్ లోనే వ్యాపారాలు చేయడం. డబ్బు రూపంలో ఏ వస్తువు కొనాల్సిన అవసరం లేదు. అసలు చేతిలో డబ్బే ఉండాల్సి అవసరం లేదు. మార్కెట్ లో, బట్టల కొట్టులో ఎక్కడైనా.. కార్డ్ లతో కొనేయడమన్నమాట.

ఏమాత్రం లిక్విడ్ క్యాష్ ఉపయోగించకుండా.. ప్రభుత్వాలు, బ్యాంక్ లు, వ్యాపారులు కూడా.. క్యాష్ లెస్ గా మారడానికి ప్రోత్సహించారు. మరి అలాంటి దేశాల లిస్ట్ ఏంటో మీరే చూడండి.

స్వీడెన్

స్వీడెన్

క్యాష్ ట్రాన్సాక్షన్స్ స్వీడన్ లో కేవలం 3 శాతం మాత్రమే జరుగుతాయి. క్యాష్ లెస్ గా మారడంలో.. ఈ దేశం చాలా డెవలప్ అయింది కదూ. ఇక్కడ ప్రతి దగ్గరా కార్డ్ రీడర్ ఉంటుంది. ఆఖరికి.. డొనేషన్స్ ఇవ్వడానికి కూడా.. కార్డ్ రీడర్ నే ఉపయోగిస్తారు.

సోమాలిలాండ్

సోమాలిలాండ్

ఆఫ్రీకాలోని ఇదొక పేదరిక దేశం. కానీ.. ఈ దేశం క్యాష్ లెస్ గా మారుతోంది. క్యాష్ అనేది కనిపించదు. క్రెడిట్ కార్డ్స్ అవసరం లేదు. వీధుల్లో అమ్ముకునేవాళ్లు కూడా.. మొబైల్ ఫోన్లలో డబ్బు చెల్లించడానికి అంగీకరిస్తారు.

కెన్యా

కెన్యా

కెన్యాలో చాలా ఎక్కువగా మొబైల్ ని ఉపయోగిస్తారు. ఈ దేశంలో.. బ్యాంకింగ్ వ్యాలెట్స్ కీలకపాత్ర పోషిస్తాయి. జీతాలు తీసుకోవడం దగ్గర నుంచి బిల్లులు జమ చేయడం, స్కూల్ ఫీజులు కట్టడం వల్ల.. అన్నీ కార్డ్ పేమెంట్సే. ఇక్కడ నెమ్మదిగా లిక్విడ్ క్యాష్ కనుమరుగవుతోంది.

కెనడా

కెనడా

కెనడియన్ కరెన్సీ ఇక ఎంతోకాలం ప్రింట్ అవదు. ఇక్కడ లిక్విడ్ క్యాష్ కి డిమాండ్ రోజు రోజుకీ తగ్గుతోంది. అందుకే.. ఇక్కడ కూడా ఆన్ లైన్ ట్రాన్సాక్షన్సే ఎక్కువగా నడుస్తున్నాయి.

బెల్జియం

బెల్జియం

క్యాష్ లెస్ వరల్డ్ లో బెల్జియం చాలా అడ్వాన్స్డ్ గా ఉంది. ఈ దేశ ప్రజలంతా.. డిజిటల్ పేమెంట్స్ కే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారు. క్యాష్ పేమెంట్స్ కి ఈ ప్రభుత్వం పరిమితి పెట్టడం వల్ల ఎక్కువమంది డిజిటల్ పేమెంట్స్ పై ఆసక్తి చూపుతున్నారు.

ఫ్రాన్స్

ఫ్రాన్స్

ఫ్రాన్స్ లో కూడా క్యాష్ లెస్ పేమెంట్స్ పైనా ఫోకస్ పెరిగింది. మొబైల్ పేమెంట్స్, కార్డ్స్ ద్వారా డబ్బు చెల్లించే ఐడియాలపై మార్కెట్స్ లో ప్రపోజల్ నడుస్తున్నాయి.

యూకే

యూకే

యునైటెడ్ కింగ్ డమ్ లో కొన్ని ప్రాంతాల్లో మాత్రమే లిక్విడ్ క్యాష్ పేమెంట్స్ జరుగుతున్నాయి. క్యాష్ లెస్ గా ఈ దేశం కూడా.. ముందంజలో ఉంది. సగంలో మూడోవంతు మందికి మొబైల్ పేమెంట్స్ గురించి అవగాహన ఉంది. దీనివల్ల క్యాష్ లెస్ కంట్రీగా మారడానికి ఇది బాగా ఉపయోగపడుతుంది.

మరి ఇండియా కూడా.. ఈ కంట్రీల లిస్ట్ లో చేరితే బావుంటుంది కదూ.

English summary

Countries That Have Almost Gone Cashless

Countries That Have Almost Gone Cashless. These are the nations that have almost gone cashless; and they are doing absolutely fine. Read on to know more!
Story first published: Thursday, November 24, 2016, 16:00 [IST]
Desktop Bottom Promotion