For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

అత్యంత ఎక్కువగా ఆత్మహత్యలు చేసుకునే దేశాలు..!!

By Swathi
|

ఒక వ్యక్తి.. బాగా డిప్రెషన్ కి లోనయినప్పుడు.. సమస్యకు పరిష్కారం లభించనప్పుడు.. తమకు ఏం చేయాలో, సమస్య నుంచి ఎలా బయటపడాలో తెలియక, దిక్కుతోచని స్థితిలో ఉన్నప్పుడు.. ఆత్మహత్యకు పాల్పడతారు.

కొన్నిసార్లు డిప్రెషన్ నుంచి బయటపడే ప్రయత్నం చేసినా..కోలేకోలేని పరిస్థితుల్లో తమ జీవితాన్నే కోల్పోవాలనే ఆలోచన వస్తుంది. అయితే చాలామంది ఆత్మహత్య చేసుకోవడానికి ముందు కొన్ని నిమిషాలు తమ గురించి, తమ కుటుంబం గురించి ఆలోచిస్తే.. ఆత్మహత్యకు పాల్పడాల్సిన అవసరం కనిపించదు.

ప్రపంచంలో ప్రతి 40 సెకన్లకు ఏదో ఒక ప్రాంతంలో ఒక వ్యక్తి ఆత్మహత్య చేసుకుంటున్నారు. అంటే.. ఎంతమంది తమలో మానసిన స్థైర్యాన్ని కోల్పోతున్నారో అర్థమవుతోంది. అలాగే రోజురోజుకీ ఆత్మహత్య చేసుకునేవాళ్ల సంఖ్య పెరుగుతూనే ఉంది. అయితే.. ఇప్పుడు ప్రపంచంలోనే అత్యంత ఎక్కువ సూసైడ్స్ జరిగే దేశాలేంటో చూద్దాం..

గుయానా

గుయానా

ఇది అత్యంత పెద్ద గ్రామీణ ప్రాంతం. ఇక్కడ పేదరికంతో బాధపడేవాళ్ల సంఖ్య ఎక్కువ. ఇక్కడ 44.2 శాతం సూసైడ్ రేట్ ఉంది. ఇక్కడ చాలా సులభంగా ప్రాణాంతకమైన కెమికల్స్ దొరుకుతాయి. దీంతో.. ఏ చిన్న సమస్య వచ్చినా.. వెనకా ముందు ఆలోచించకుండా.. ఆత్మహత్యకు పాల్పడుతున్నారు.

కొరియా

కొరియా

ఆత్మహత్యలు ఎక్కువగా చేసుకునే దేశాల్లో రెండో స్థానంలో ఉంది కొరియా. ఇక్కడ డెత్ రేట్ 38.5 శాతం ఉంది. మానవ హక్కులపై హింస, ఆర్థిక పరిస్థితులు, ఒత్తిడి వంటి కారణాల వల్ల ఎక్కువగా ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని రిపోర్ట్స్ చెబుతున్నాయి.

సౌత్ కొరియా

సౌత్ కొరియా

ఆత్మహత్యలు ఎక్కువగా చేసుకునే దేశాల్లో మూడో స్థానంలో ఉంది.. సౌత్ కొరియా. ఇక్కడ డెత్ రేట్ 28.9 శాతం ఉంది. ఈ దేశంలో విద్యా వ్యవస్థ, హెల్త్ కేర్ చాలా గొప్పగా ఉంటుంది. కానీ.. సూసైడ్ రేట్ మాత్రం చాలా ఎక్కువగా ఉంటుంది.

శ్రీలంక

శ్రీలంక

శ్రీలంకలో ఆత్మహత్య రేటు 28.8 శాతంగా ఉంది. ప్రపంచంలో డెవలప్ అయిన దేశాల్లో ఇది ఒకటి. కానీ.. ఉరి వేసుకోవడం, విషం తీసుకోవడం ద్వారా.. ఇక్కడ చాలా మంది ఆత్మహత్యకు పాల్పడతారు.

లిథునియా

లిథునియా

లిథునియాలో డెత్ రేట్ 28.2 శాతం ఉంది. ఇక్కడ రోజు రోజుకీ.. ఆత్మహత్యల సంఖ్య పెరుగుతూ వస్తోంది. సామాజిక, ఆర్థిక సమస్యల కారణంగా.. ఈ దేశంలో ఎక్కువగా ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు.

సురినేమ్

సురినేమ్

సౌత్ అమెరికన్ కంట్రీ ఇది. ఇక్కడ మరణాలు 27.8 శాతం ఉంటోంది. ఇది చిన్న దేశమే అయినా.. ఆత్మహత్యలు మాత్రం చాలా ఎక్కువగా జరుగుతాయి. దీనికి ముఖ్యకారణం పేదరికం, రాజకీయ హింసలు, ఆల్కహాల్, అత్యంత ఎక్కువ నిరుద్యోగం ప్రధాన కారణాలు.

మొజాంబిక్యూ

మొజాంబిక్యూ

సౌతీస్ట్ ఆఫ్రికన్ దేశం ఇది. ఇక్కడ డెత్ రేట్ 27.4 శాతం ఉంది. ఈ దేశంలో ఎక్కువగా హెఐవీ, ఎయిడ్స్, సరైన మెడికల్ కేర్ లో సరైన జాగ్రత్తలు లేకపోవడం, రకరకాల అనారోగ్య సమస్యల కారణంగా.. ఈ దేశంలో సూసైడ్స్ ఎక్కువ అవుతున్నాయి.

English summary

Countries With Highest Suicide Rate

Countries With Highest Suicide Rate. When a person is depressed, he/she should find ways to get a solution to resolve the problem.
Desktop Bottom Promotion